రైలు పట్టాలు దాటుతున్న ఏనుగులు(ఫైల్)
కోల్కతా: ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా వన్యమృగ్యాలను మృత్యువు వెంటాడుతూనే ఉంది. తాజాగా పశ్చిమబెంగాల్ లోని బాంకురా జిల్లాలో రైలు ఢీకొని ఓ ఏనుగు మృతి చెందింది. బిష్ణుపూర్ అటవీ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఏనుగు తలపై నుంచి రైలు వెళ్లడంతో అది చనిపోయిందని వెల్లడించారు.
ఉత్తర బెంగాల్ లో ఏనుగులు రైళ్ల కింద పడిపోవడం తరచుగా జరుగుతున్నాయి. 2004 నుంచి ఇప్పటివరకు 50పైగా ఏనుగులు ఈవిధంగా మృత్యువాత పడ్డాయి. దక్షిణ బెంగాల్ లో ఇటీవల కాలంలో జరిగిన మొదటి ఘటన ఇదని అధికారులు తెలిపారు.