కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల వాతావరణం వేడివేడిగా ఉంది. ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై దాడి జరిగిందనే ఘటనతో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ప్రస్తుతం ఆ దాడి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. మమతా బెనర్జీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జయినా వీల్ చైర్‌లోనే ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే తొలిసారి మమతపై జరిగిన దాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ‘మీ కోలుకోవాలని ప్రార్థిస్తా.. మరీ మావాళ్ల వారి సంగతి ఏంటి?’ అని అమిత్ షా ప్రశ్నించారు.
దాడి జరిగిందనే మమతా ఆరోపణలపై అమిత్‌షా గతంలో తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని వాటిని గుర్తుచేశారు. పశ్చిమ బెంగాల్లోని బంకూరలో సోమవారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడారు. ఎన్నికల సంఘం కూడా చెప్పింది మీపై దాడి జరగలేదని చెప్పారు. మీ కాలి గాయంపై మాకు బాధ ఉంది. కానీ మా 130 మంది కార్యకర్తల తల్లుల బాధ మీకు లేదా అని అమిత్ షా ప్రశ్నించారు.
రాజకీయ దాడుల్లో తమ కార్యకర్తలను కోల్పోయామని.. వారి తల్లుల బాధ కనిపించదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఒక స్టంట్ చేస్తున్నారని తృణమూల్ పార్టీపై అమిత్ షా మండిపడ్డారు. కాగా పశ్చిమ బెంగాల్‌లో 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ మార్చి 27వ తేదీన జరగనుంది. మొత్తం ఫలితాలు మే 2వ తేదీన వెల్లడి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment