Mamta Banerjee
-
అనంత్ అంబానీ పెళ్లికి మమతా బెనర్జీ.. మహారాష్ట్ర నేతలతో భేటీ
ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి హాజరయ్యేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు (జూలై 12) ముంబైకి రానున్నారు. ఈ సందర్భంగా ఆమె మహారాష్ట్ర నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలను కలుసుకోనున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆమె ఈ దిగ్గజ నేతలను కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది.సీఎం మమతా బెనర్జీ ఈరోజు మధ్యాహ్నం ముంబైకి చేరుకోనున్నారు. అనంతరం అమె పలు సమావేశాలలో పాల్గొననున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మమతా బెనర్జీ ఈరోజు మహారాష్ట్ర నేతలు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లతో విడివిడిగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య జాతీయ రాజకీయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.ఈ ఏడాది చివర్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఈ భేటీ కీలకం కానుంది. అలాగే మరికొద్ది వారాల్లో పార్లమెంట్ హౌస్‌లో బడ్జెట్ సమావేశాలు కూడా జరగనున్నాయి. దీనిపై కూడా మమత, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ మధ్య చర్చ జరగనున్నదని తెలుస్తోంది. ఇదిలావుండగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇటీవల ఢిల్లీలో సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్‌ను కలిశారు. అనంతరం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ముంబైలో కలుసుకున్నారు. -
మోదీ Vs దీదీ: ప్రధానిపై మమత అసహనం.. మళ్లీ రాజుకున్న రాజకీయ రగడ!
PM Modi Vs CM Mamata న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య వివాదం మళ్లీ రాజుకుంది. బుధవారం ప్రధాని మోదీతో జరిగిన డిజిటల్ మీటింగ్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో దీదీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రిషి అరవింద్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం జరగనున్న మీటింగ్‌కు హాజరు కావడం లేదని మమతా బెనర్జీ నేడు ప్రకటించారు. అమృత్ ఫెస్టివల్ ఆఫ్ ఇండిపెండెన్స్‌కు సంబంధించి ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. ఐతే సుమారు రెండు గంటల పాటు వేచి చూసినా ఆమెకు మాట్లాడే అవకాశం రాలేదు. దీనికి సంబంధించి స్పీకర్ల జాబితాలో మమత పేరును చేర్చలేదని రాష్ట్ర సచివాలయం చెబుతోంది. దీనిపై మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలోకూడా కరోనాకు సంబంధించి 10 రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆమెకు మాట్లాడే అవకాశం లభించలేదు. ఐతే స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా నబన్లోని రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు (గురువారం) సీఎం మమతా బెనర్జీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం నాటి సమావేశంలో తాను పాల్గొనబోవడంలేదని తెలిపారు. అంతేకాకుండాప్రధాని మీటింగ్‌లో యోగేన్ చౌదరి, జై గోస్వామి మాట్లాడటానికి అనుమతించకపోవడాన్ని సీఎం మమతా తీవ్రంగా ఖండించారు. భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో జనవరి 26, ఆగస్టు 15 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. జనవరి 23 నుంచి జనవరి 30 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈ సమావేశంలో తెలిపారు. కాగా ఆధ్యాత్మిక గురువు రిషి అరవింద్ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 53 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఇద్దరు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డి దేవెగౌడ, మమతా బెనర్జీలతో సహా పలువురు కేబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. ఈ కమిటీ సమావేశం శుక్రవారం జరగాల్సి ఉండగా, సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశంలో పాల్గొనడం లేదని ఈ మేరకు ప్రకటించారు. చదవండి: ఐదేళ్లుగా ఈ హాస్పిటల్లో రోజూ 37 మంది శిశువుల మృతి.. అసలేం జరుగుతోందక్కడ? -
నేడు ప్రధాని మోదీ తో బెంగాల్ సీఎం మమత భేటీ
-
నందిగ్రామ్ లో హై వోల్టేజ్ పొలిటికల్ వార్
-
మీకోసం ప్రార్థిస్తా.. మరీ ఆ తల్లుల బాధేంటి.. దీదీ?
కోల్కత్తా: పశ్చిమబెంగాల్లో ఎన్నికల వాతావరణం వేడివేడిగా ఉంది. ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై దాడి జరిగిందనే ఘటనతో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ప్రస్తుతం ఆ దాడి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. మమతా బెనర్జీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జయినా వీల్ చైర్లోనే ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే తొలిసారి మమతపై జరిగిన దాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ‘మీ కోలుకోవాలని ప్రార్థిస్తా.. మరీ మావాళ్ల వారి సంగతి ఏంటి?’ అని అమిత్ షా ప్రశ్నించారు. దాడి జరిగిందనే మమతా ఆరోపణలపై అమిత్‌షా గతంలో తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని వాటిని గుర్తుచేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బంకూరలో సోమవారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడారు. ఎన్నికల సంఘం కూడా చెప్పింది మీపై దాడి జరగలేదని చెప్పారు. మీ కాలి గాయంపై మాకు బాధ ఉంది. కానీ మా 130 మంది కార్యకర్తల తల్లుల బాధ మీకు లేదా అని అమిత్ షా ప్రశ్నించారు. రాజకీయ దాడుల్లో తమ కార్యకర్తలను కోల్పోయామని.. వారి తల్లుల బాధ కనిపించదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఒక స్టంట్ చేస్తున్నారని తృణమూల్ పార్టీపై అమిత్ షా మండిపడ్డారు. కాగా పశ్చిమ బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ మార్చి 27వ తేదీన జరగనుంది. మొత్తం ఫలితాలు మే 2వ తేదీన వెల్లడి కానున్నాయి. -
మెట్రోసేవల పునరుద్దరణకు సిద్ధంగా ఉన్నాం
కోల్‌కతా : అన్‌లాక్‌లో భాగంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మెట్రో సర్వీసులకు అనుమతివ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రైల్వే బోర్డుకు లేఖ రాశారు. అన్ని భద్రతా ప్రమాణాల మధ్య పరిమిత సంఖ్యలో మెట్రో సేవలను తిరిగి ప్రారంభించేలా అనుమతివ్వాలని కోరారు. ఈ విషయంపై రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అలపన్ బండియోపాధ్యాయ మాట్లాడుతూ పూర్తి భద్రతా ప్రమాణాల మధ్య నాలుగోవంతు సబర్బన్ రైళ్ల సర్వీసులను, మెట్రో సేవలను ప్రారంభించేందుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. (కోవిడ్ నిబంధనలను పాటించకపోతే భారీ జరిమానాలు) ఇప్పటికే బస్సు సర్వీసులకు అనుమతి కల్పించిన నేపథ్యంలో మెట్రో సేవలను కూడా పునః ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అయితే ఈ సేవలను ఎప్పటినుంచి తిరిగి ప్రారంభించాలన్నదానిపై బెంగాల్ ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ఇక కరోనా వ్యాప్తిని నివారించే ప్రయత్నంలో భాగంగా బెంగాల్లో మరో రెండు వారాల పాటు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించింది. అంతేకాకుండా జూలై 23 నుంచి ప్రతీవారం కంప్లీట్ లాక్‌డౌన్‌ను ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే రాష్ర్ట ఆర్థిక పరిస్థితి క్రమంగా క్షీణిస్తున్నందున మెట్రో సేవలు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రైల్వే బోర్డుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. (స్వీయ నిర్బంధంలోకి పంజాబ్ ముఖ్యమంత్రి) -
బీసీసీఐ-పీసీబీలకు సీఎం మమత ఆహ్వానం!
కోల్ కతా: డిసెంబర్ లో యూఏఈలో టీమిండియా-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ కు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో చర్చలను తమ రాష్ట్రంలో జరుపుకోవచ్చంటూ భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కు పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆహ్వానం పలికారు. మరో రెండు నెలల్లో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ అంశంపై పాకిస్థాన్ తో క్రికెట్ బోర్డుతో చర్చలకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయడంతో సోమవారం ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ముట్టడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలో చర్చలకు ఆయా బోర్డులకు విఘాతం కలిగితే.. కోల్ కతా నగరంలో భేటి కావొచ్చంటూ ఇరు క్రికెట్ బోర్డు పెద్దలకు మమత ట్విట్టర్ ద్వారా ఆహ్వనం పలికారు. ఈ రోజు ఉదయం ఇండో - పాక్ సిరీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శివసేన కార్యకర్తలు బీసీసీఐ కార్యాలయంలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. బీసీసీఐ ప్రెసిడెంట్ శశాంక్ మనోహర్ ఛాంబర్లోకి చొరబడిన శివసేన కార్యకర్తలు ఆయనతో వాగ్వాదానికి దిగి సిరీస్ పై చర్చలు వద్దంటూ ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా ఇరు క్రికెట్ బోర్డుల మధ్య జరగాల్సిన సమావేశం తాత్కాలికంగా రద్దయ్యింది. ఇరుదేశాల క్రికెట్ బోర్డుల ఒప్పందం ప్రకారం 2015 నుంచి 2023 వరకూ ఆరు సిరీస్ లు జరగాల్సి ఉంది. 2007 తరువాత ఓ సిరీస్ లో భాగంగా 2012-13 వ సంవత్సరంలో భారత పర్యటనకు పాకిస్థాన్ వచ్చింది. ఆ తరువాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగలేదు.