ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి హాజరయ్యేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు (జూలై 12) ముంబైకి రానున్నారు. ఈ సందర్భంగా ఆమె మహారాష్ట్ర నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలను కలుసుకోనున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆమె ఈ దిగ్గజ నేతలను కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది.
సీఎం మమతా బెనర్జీ ఈరోజు మధ్యాహ్నం ముంబైకి చేరుకోనున్నారు. అనంతరం అమె పలు సమావేశాలలో పాల్గొననున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మమతా బెనర్జీ ఈరోజు మహారాష్ట్ర నేతలు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లతో విడివిడిగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య జాతీయ రాజకీయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఈ ఏడాది చివర్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఈ భేటీ కీలకం కానుంది. అలాగే మరికొద్ది వారాల్లో పార్లమెంట్ హౌస్‌లో బడ్జెట్ సమావేశాలు కూడా జరగనున్నాయి. దీనిపై కూడా మమత, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ మధ్య చర్చ జరగనున్నదని తెలుస్తోంది. ఇదిలావుండగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇటీవల ఢిల్లీలో సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్‌ను కలిశారు. అనంతరం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ముంబైలో కలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment