
దివ్యాంగుల హక్కుల కార్యకర్త, మోడల్ విరాళీ మోదీ ఇటీవల ముంబైలో పెళ్లి చేసుకుంది. వీల్‌చైర్ యూజర్ అయిన తనకు రిజిస్ట్రార్ ఆఫీసులో ఎదురైన ఇబ్బందుల గురించి ఆమె ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
‘రిజిస్ట్రార్ ఆఫీసు రెండో ఫ్లోర్‌లో ఉంది. లిఫ్ట్ సౌకర్యం లేదు. మెట్లు ఎక్కడం తప్ప మరో దారి లేదు. మరి వీల్‌చైర్ యూజర్ అయిన నా పరిస్థితి ఏమిటి? నా పరిస్థితి గురించి ఏజెంట్‌తో చెప్పి పంపాను. అధికారులు కిందికి రాలేదు. అలా అని నాకు ప్రత్యేక సౌకర్యాలేవీ కల్పించలేదు. ఇక మెట్ల మార్గం ఎలా ఉందంటే... మెట్లు పగుళ్లు బారి ఉన్నాయి. రెయిలింగ్ వదులుగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. దివ్యాంగులకు పెళ్లి చేసుకునే హక్కులేదా?’ అని తన మనసులోని ఆవేదనను నెటిజనులతో పంచుకుంది విరాళీ.
‘పబ్లిక్ స్పేస్, ప్రభుత్వ కార్యాలయాలలో దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలనే మాట నా చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను. కాని అది ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు. దివ్యాంగుల కార్యకర్త పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి?’ అని ఒక యూజర్ స్పందించాడు.
Comments
Please login to add a commentAdd a comment