Disability
-
రోడ్డెక్కిన దివ్యాంగులు
మహారాణిపేట: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.15 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో దివ్యాంగులు తరలివచ్చారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా ఇంకా ఈ హామీ అమలుకు నోచుకోలేదని, ఇప్పుడు కుంటిసాకులు చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. 85 శాతం అంగవైకల్యం ఉన్నవారికి కూడా పెంచిన పెన్షన్ అమలు చేయడంలేదని ఆక్షేపించారు.వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తుల డేవిడ్‌రాజు, జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు, మహిళా ఉపాధ్యక్షురాలు ఎస్.మల్లేశ్వరి ఆధ్వర్యాన సోమవారం పెద్ద సంఖ్యలో దివ్యాంగులు ఇక్కడికి తరలివచ్చారు. తాము వివిధ సమస్యలతో సతమతమవుతున్నామని, వాటి గురించి ఎవరూ పట్టించుకోవట్లేదని అక్కిరెడ్డి అప్పారావు అన్నారు. పెంచిన పెన్షన్ అమలుకోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని.. పలు జిల్లాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి దివ్యాంగులను అర్హులుగా గుర్తిస్తున్నారని.. కానీ, విశాఖలో ఎలాంటి క్యాంపులు నిర్వహించడం లేదన్నారు. సాంకేతిక కారణాలు చూపుతూ పెన్షన్లను నిలుపుదల చేయడం తగదన్నారు. తండ్రికి ఇల్లు ఉందంటూ పిల్లలకు పెన్షన్ నిలిపేయడం సరికాదన్నారు. ఇలా జిల్లాలో దాదాపు 100 మందికి పింఛన్లు నిలిచిపోయాయన్నారు. సదరం సర్టిఫికెట్ ఆధారంగా పింఛను ఇవ్వాలని.. ఒంటరి దివ్యాంగులకు కూడా రేషన్ కార్డులివ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వారు వినతిపత్రం సమర్పించారు. జిల్లా నలుమూలల నుంచి ట్రై సైకిళ్లు, దివ్యాంగుల స్కూటర్లు, ఇతర వాహనాల మీద దివ్యాంగులు భారీగా తరలివచ్చారు. -
నిలదొక్కుకోనివ్వని సమస్యను నిలువరించి..స్ఫూర్తిగా నిలిచింది దీపా..!
కొన్ని సమస్యలు మనిషిని మాములుగా కుంగదీయవు. ఒక పట్టాన నిలువనివ్వవు. ఏం చేయాలో ఎలా పరిష్కరించాలో అర్థకానీ విధంగా ఉంటాయి. కానీ ఇక్కడే అసలు పరిష్కారం దాగుంటుంది. మనకు ఎదురై పది శాతం సమస్యకు తొంభై శాతం నీవెలా స్పందిస్తావు అనే దానిపైనే పరిష్కారం దొరకడం అనేది ఆధారపడి ఉంటుందని చెబుతోంది పారా ఒలింపియన్ దీపా. నిలదొక్కుకోనివ్వకుండా పగబట్టి వెంటాడిని సమస్యను తనదైన శైలిలో నిలువరించి తానేంటన్నది ప్రపంచానికి చాటి చెప్పి స్ఫూర్తిగా నిలించింది. ఎవరీ దీపా..? అంటే..ఉక్కులాంటి ధృఢ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం పారాలింపియన్ దీపా మాలిక్. ఆమె తండ్రి ఆర్మీ, తల్లి ఎన్సీపీ క్యాడెట్లో షూటర్. ఆమెకు మూడేళ్ల ప్రాయంలోనే వెనుముక కణితి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. దీని కారణంగా కోలుకోవడానికి మూడేళ్లు పట్టేంది. అంటే ఆమె ఐదు నుంచి ఎనిమిదేళ్ల ప్రాయం వరకు ఆస్పత్రల్లోనే గడిపింది. అంత పెద్ద భయానక పరిస్థిని నుంచి బయటపడిందని జాలి, సానుభూతులతో పెంచలేదు దీపను ఆమె తల్లిదండ్రులు. మన వద్ద ఉన్న వనరులతో సంబంధం లేకుండా సామార్థ్యం మెరుగుపరుచుకోవడం పైనే దృష్టి సారిస్తే విజయం తధ్యం అనే రీతిగా పెంచారు దీపాని. అంతేగాదు తనకెదురైన సమస్యను పక్కన పెట్టి ఇంకా నువ్వు ఏం చేయగలవు, నీలో ఉన్న శక్తి ఏంటి అన్నదానిపై దృష్టి పెట్టాలని పదే పదే చెప్పేవారు. అదే నినాదంతో పెరిగిన దీపాలో సంకల్పం మెండుగా ఉండేది. అలానే పెరిగింది. సరిగ్గా 19 ఏళ్ల వచ్చేటప్పటికీ తనలానే బైకింగ్ సాహసాల పట్ల ఇష్టం ఉన్న ఆర్మీ అధికారిని వివాహం చేసుకుంది. ఆమె జీవితం హాయిగా సాగిపోతుంది. సరిగ్గా 29 ఏళ్ల వయసులో మళ్లి కణితి వచ్చి ప్రతికారం తీర్చుకుంది. ఈసారి పరిస్థితి సివియర్ అయ్యి తనంతట తాను నడవడానికి ఏడు రోజుల మాత్రమే సమయం ఉందని వైద్యులు తేల్చి చెప్పేశారు వైద్యులు. దీపా ఇక వీల్‌చైర్‌కి పరిమితం అయిపోతుందని, తనకి సేవ చూస్తున్న వాళ్లను చూసి విసుగుపుట్టి చనిపోతుందని అంతా అనుకునేవారు. తన వైకల్యం భర్తతో మానసిక, శారీరక సాన్నిహిత్యాన్ని దెబ్బతీసింది. ఈ పరిస్థితి ఆమె మల మూత్రాదులపై నియంత్రణ లేకుండా చేసి ఇబ్బందుకులకు గురి చేసింది. ఇలా వీల్‌చైర్‌తో గదికే పరిమితం కావడాన్ని ఇష్టపడక అహ్మద్‌నగర్‌లో రెస్టారెంట్ ప్రారంభించింది. అక్కడకు వచ్చే లాయర్లు, ఆఫీసర్లు, ఇంజీనర్లును కారణంగా తనలాంటి వారు ఎలా పైకి ఎదగొచ్చు అనే విషయాలు తెలుసుకుంది. అలా ఆమెకు ప్రత్యేక సామర్థ్యం ఉన్న వ్యక్తుల కోసం వచ్చే మోడిఫైడ్ బైక్‌ల గురించి తెలుసుకుని నడపడం నేర్చుకుంది. అలా బైక్‌పై తనకున్న ఇష్టం క్రీడాకారిణిగా ఎదిగేలా చేసింది. అంతేగాదు బైక్ నడిపేలా ఎగువ శరీరాన్ని బలోపేతం చేసేందుకు హైడ్రోథెరపీ తీసుకుంది. అంటే ఇక్కడ దీపా ఈత కొట్టడం ప్రాక్టీస్ చేయాలి. అలా ఆమె వివిద క్రీడల కోసం శిక్షణ పొందింది. చెప్పాలంటే ఇక్కడ దీపా 30 ఏళ్ల వయసులో క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. తన కుమార్తెతో కలిసి ఢిల్లీకి వచ్చి జేఎల్ఎన్ స్టేడియం సమీపంలో చిన్నఅపార్టెమెంట్లో నివశించడం ప్రారంభించింది. అక్కడ అయితే ఆటలకు సంబంధించిన ప్రాక్టీస్ చేసేది. చాలామంది ఈ వయసులో ఆడుకుంటుందేంటీ?..టైం వేస్ట్ అనేవారు. అయితే అవేమి ఆమె పట్టించుకోలేదు దీపా. ఏదో ఒకరోజు నేనెంటీ అనేది తెలుసుకుంటారనే కసి దీపాలో అంతకంతకు పెరిగిపోయింది. చివరికీ తాను అనుకున్నట్లే పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి మహిళగా నిలిచింది. అంతేగాదు 42 ఏళ్ల వయసులో ప్రతిష్టాత్మక అర్జున అవార్డును గెలుచుకుంది. పద్మశ్రీ అవార్డు కూడా అందుకుంది. అంతేగాదు షాట్‌పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో వంటి అనేక విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. నాడు ఎవరైతే ఆమెకు చికిత్స ఇవ్వడం వ్యర్థం అంటూ తన కుటుంబానికి సలహాలు ఇచ్చారు వాళ్లే..మా పిల్లలకు నువ్వే స్ఫూర్తి అంటూ ప్రశంసించారని గర్వంగా చెబుతోంది. చివరగా దీపా దయచేసి ఆగస్టు 28, 2024లో జరిగే పారా ఒలింపిక్స్ వీక్షించండి అని ప్రజలను కోరింది. (చదవండి: వందేళ్లు బతకాలనుకుంటే..ఈ అలవాట్లు తప్పనిసరి అంటున్న పరిశోధకులు!) -
Tanisha Bajia: జేబులో దాగిన స్థైర్యం.. చెయ్యెత్తి జై కొట్టింది
ఆ అమ్మాయి స్కూల్‌కు వచ్చినన్ని రోజులు ఎడమ చేతిని ఎవరూ చూళ్లేదు. దానిని స్కర్ట్ జేబులో పెట్టుకుని ఉంటే అదామె అలవాటనుకున్నారు. కాని అసలు రహస్యం ఏమిటంటే ఎడమ అర చెయ్యి లేకుండా పుట్టింది తనీషా. స్కూల్లో ఎగతాళి చేయకుండా ఉండడానికి మణికట్టుకు దుపట్టా చుట్టి జేబులో దాచేది. కాని ఇప్పుడు దాచడం లేదు. గత నెల బెంగళూరులో జరిగిన 13వ జాతీయ సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో గెలిచిన రజత పతకం ఆమె చేతికి గౌరవాన్ని ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టింది.ఆరావళి పర్వతాలు చుట్టుముట్టిన రాజస్థాన్‌లోని సికార్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్లోయి తనీషా సొంత గ్రామం. తన వైకల్యాన్ని చూసి ఇతర పిల్లలు ఆట పట్టించడంతో స్కూల్‌కు వెళ్లకుండా తనీషా ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోయేది. దీంతో ఆమెను గ్రామానికి దూరంగా ఉన్న వేరే పాఠశాలలో చేర్పించారు. అక్కడ కూడా వెక్కిరింపులు ఎదురు కాకుండా ఉండడానికి ఉపాధ్యాయులకు, తోటిపిల్లలకు తెలియకుండా తన అంగవైకల్యాన్ని జేబులో దాచిపెట్టింది. అంగవైకల్యాన్ని దాచి పెట్టడం అంటే... ఒంటరితననానికి దగ్గర కావడమే.గెలుపుతో విముక్తి‘ఇప్పుడు నా ఎడమ చెయ్యిని దాచాల్సిన అవసరం లేదు’ అంటోంది తనీషా. అద్భుతమైన బెంగళూరు విజయంతో ఆమె ఎడమ చేయి జేబు నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అది అంగవైకల్యంలా అనిపించడం లేదు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది. ఒకప్పుడు తనీషాకు నలుగురితో కలవడం తెలియదు. నలుగురితో కలిసి నవ్వడం తెలియదు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. స్వేచ్ఛా జీవితపు మాధుర్యాన్ని రుచి చూస్తోంది. ‘ఇప్పుడు నన్ను ఎవరూ ఎగతాళిగా కామెంట్ చేయడం లేదు’ చిరునవ్వుతో అంది తనీషా. గత ఏడాదిలో రాష్ట్ర, జాతీయ చాంపియన్‌షిప్‌లలో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో సహా అయిదు పతకాలు సాధించింది. ‘ఈ పతకాలు నా జీవితాన్ని మార్చేసాయి. ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నా ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది’ అంటుంది తనీషా.తొలిసారి పట్టుదల‘నాకు 1,500 మీటర్ల తొలి పరుగు పందెం గుర్తుంది. పోటీలో నన్ను చూసి ఇతర పోటీదారులు నవ్వుతున్నారు. దాంతో పోటీలో పాల్గొనడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. మా నాన్నమాత్రం ఎలాగైనా సరే, పాల్గొనాల్సిందే అన్నాడు. దాంతో సర్వశక్తులు ఒడ్డి పరుగెత్తాను.నాలుగోస్థానంలో నిలిచినప్పుడు అందరూ వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక ఇప్పటినుంచి నేను కూడా ఏదైనా చేయగలను అనే నమ్మకం కలిగింది’ అని ఆ రోజును గుర్తు చేసుకుంది తనీషా.జూలైలో పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియానికి వెళ్లిన తనీషా వందలాది మంది ప్రేక్షకులను చూసి కంగారు పడింది. ‘ఇప్పుడు సాధించకపోతే సంవత్సరం శ్రమ వృథా అయిపోతుంది’ అనుకుంది మనసులో. అనుకోవడమే కాదు 400 మీటర్ల రేసును విజయవంతంగా పూర్తి చేసి రజత పతకం గెలుచుకుంది. ‘ఇప్పుడు ఉన్నంత సంతోషంగా నా కూతురు ఎప్పుడూ లేదు. ఆటలు ఆమెను పూర్తిగా మార్చివేసాయి’ అంటోంది తల్లి భన్వారీదేవి. నాన్న నిలబడ్డాడుపుట్టినప్పుడు ఎడమ అర చెయ్యి లేకపోవడంతో తనీషాను తండ్రి ఇంద్రజ్ బాజియా ఓ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు. ఈ అమ్మాయి మీకు దేవుడు ఇచ్చిన వరం. ప్రేమగా చూసుకోండి... అన్నాడు ఆ డాక్టర్. ఆయన మాటలు తండ్రిలోని దిగులును మాయం చేశాయి. ఇక అప్పటి నుంచి ఎలాంటి వివక్షత చూపకుండా ఆమెను ఆటల్లో ప్రోత్సహించాడు తండ్రి. ‘తనీషా బాగా పరుగెడుతుంది. ఇంకా ఎన్నో విజయాలు సాధించే సామర్థ్యం ఆమెలో ఉంది. తనీషాకు శిక్షణ ఇవ్వడానికి ప్రతివారం ఆమె గ్రామానికి వెళుతుంటాను’ అంటుంది తనీషా కోచ్ సరితా బవేరియా. నేషనల్ లెవల్ ప్లేయర్ అయిన సరిత బవేరియా దివ్యాంగులైన పిల్లలకు ఆటల్లో శిక్షణ ఇస్తుంటుంది. -
యంగ్ స్ట్రోక్
విజయవాడకు సమీపంలోని పెనమలూరుకు చెందిన ఆటోడ్రైవర్ వెంకట్ (38)కు ఇటీవల ఆకస్మికంగా కాలు, చేయి చచ్చుబడిపోయాయి. విజయవాడలోని యనమలకుదురుకు చెందిన నగరపాలక సంస్థ డ్రెయినేజీ విభాగ ఉద్యోగి రాజేష్ (42) విధుల్లో ఉండగా.. చేయి చచ్చుబడింది. క్షణాల్లోనే గుర్తించిన స్థానికులు వెంకట్, రాజేష్‌లను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తక్షణమే సీటీ స్కాన్ చేసిన వైద్యులు వారు బ్రెయిన్ స్ట్రోక్ బారినపడినట్టు గుర్తించారు. వెంటనే త్రోంబొలైసిస్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. వైకల్యం రాకుండా ఇద్దరినీ కాపాడగలిగారు. సాధారణంగా 55–60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) సంభవించేది. ఇటీవల కాలంలో 45 ఏళ్లలోపు వారిలో ఈ కేసులు అధికమవుతున్నాయి. లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఇటీవల కాలంలో స్ట్రోకింగ్ యంగ్ (45 ఏళ్లలోపు వారిలో బ్రెయిన్ స్ట్రోక్) కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిపై వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలకు వస్తున్న వారిలో స్ట్రోకింగ్ యంగ్ కేసులు ఎక్కువగా ఉంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కదలిక లేని జీవన విధానం.. తీవ్రమైన వత్తిళ్లు.. రక్తం, రక్తనాళాల్లో లోపాలు.. ధూమపానం.. హెరాయిన్ లాంటి మత్తు పదార్థాల వినియోగం.. వంశపారంపర్య కారణాలు 30 ఏళ్లకే బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణమవుతున్నాయి. 25% ‘స్ట్రోకింగ్ యంగ్’ కేసులే ఒకప్పుడు వయస్సు 55, 60 ఏళ్ల వారు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యేవారు. కానీ.. ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్న వారిలో 25 నుంచి 30 శాతం మంది 30–45 ఏళ్లలోపు యువతే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వాస్పత్రిలో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురు బ్రెయిన్ స్ట్రోక్‌తో వస్తున్నారు. స్ట్రోక్ తీవ్రతను బట్టి జనరల్ మెడిసిన్, ఏఎంసీ, న్యూరాలజీ విభాగాల్లో చికిత్స అందిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో వస్తున్న వారిలో రక్తంలో గడ్డలు ఏర్పడి మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగకపోవడం వలన వచ్చే స్ట్రోక్ (ఇస్కిమిక్) 80 శాతం మంది, రక్తనాళాలు చిట్లిపోయి (హెమరైజ్డ్) 20 శాతం మంది ఉంటున్నారు. గోల్డెన్ అవర్‌లో గుర్తించడం ముఖ్యం ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్‌కు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. లక్షణాలను గుర్తించి.. నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే స్ట్రోక్ కారణంగా వైకల్యం బారినపడకుంటా వైద్యులు కాపాడగలుగుతున్నారు. ఇస్కిమిక్ స్ట్రోక్ వచి్చన వారికి త్రోం»ొలైసిస్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా రక్తంలోని పూడికలు కరిగేలా చేస్తున్నారు. ముఖం, చేయి, కాలు ముఖ్యంగా శరీరం ఒకవైపున ఆకస్మిక తిమ్మిరి, బలహీనత ఏర్పడటం, అకస్మికంగా గందరగోళం ఏర్పడటం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, కంటిచూపు మందగించడం, తల తిరగడం, బ్యాలెన్స్ తప్పడం, ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి వంటివి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. స్ట్రోక్‌కు కారణాలివీ పెద్ద వయసుల వారిలో రక్తపోటు, మధుమేహం స్ట్రోక్‌కు కారణమవుతోంది. అయితే.. 45 ఏళ్లలోపు వారిలో హోమోసిస్టీన్, సికిల్ సెల్ అనీమియా, రక్తంలో జన్యుపరమైన లోపాలు, హెరాయిన్ వంటి డ్రగ్స్ వినియోగం, మితిమీరిన మద్యపానం, ధూమపానం, ప్రమాదాల్లో తలకు గాయాలైన వారిలో ఎక్కువగా స్ట్రోక్ వస్తున్నట్టు వైద్యులు చెపుతున్నారు. వీరితో పాటు కదలిక లేని జీవన విధానం కారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి స్ట్రోక్‌కు గురవుతున్న కేసులూ ఉంటున్నాయి. మహిళల్లో హార్మోన్స్ ఇబ్బందులు, రక్తనాళాల్లో లోపాల కారణంగా స్ట్రోక్ రావచ్చంటున్నారు. గుండె లోపాలు ఉన్న వారిలోనూ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. యువకుల్లోనూ కేసులు ఇటీవల 45 ఏళ్లలోపు యువత బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతోంది. స్ట్రోక్ కేసుల్లో 25% యువతే ఉండటం గమనార్హం. బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడినవారు 4 గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే వైకల్యం లేకుండా కాపాడవచ్చు. – డాక్టర్ దారా వెంకట రమణ, న్యూరాలజిస్ట్, జీజీహెచ్ -
ఇలా అయితే ఎలా..?
దివ్యాంగుల హక్కుల కార్యకర్త, మోడల్ విరాళీ మోదీ ఇటీవల ముంబైలో పెళ్లి చేసుకుంది. వీల్‌చైర్ యూజర్ అయిన తనకు రిజిస్ట్రార్ ఆఫీసులో ఎదురైన ఇబ్బందుల గురించి ఆమె ట్విట్టర్లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘రిజిస్ట్రార్ ఆఫీసు రెండో ఫ్లోర్లో ఉంది. లిఫ్ట్ సౌకర్యం లేదు. మెట్లు ఎక్కడం తప్ప మరో దారి లేదు. మరి వీల్‌చైర్ యూజర్ అయిన నా పరిస్థితి ఏమిటి? నా పరిస్థితి గురించి ఏజెంట్‌తో చెప్పి పంపాను. అధికారులు కిందికి రాలేదు. అలా అని నాకు ప్రత్యేక సౌకర్యాలేవీ కల్పించలేదు. ఇక మెట్ల మార్గం ఎలా ఉందంటే... మెట్లు పగుళ్లు బారి ఉన్నాయి. రెయిలింగ్ వదులుగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. దివ్యాంగులకు పెళ్లి చేసుకునే హక్కులేదా?’ అని తన మనసులోని ఆవేదనను నెటిజనులతో పంచుకుంది విరాళీ. ‘పబ్లిక్ స్పేస్, ప్రభుత్వ కార్యాలయాలలో దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలనే మాట నా చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను. కాని అది ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు. దివ్యాంగుల కార్యకర్త పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి?’ అని ఒక యూజర్ స్పందించాడు. -
సదరం స్లాట్ల విడుదల
సాక్షి, అమరావతి: దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు పొందేందుకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్లు బుక్ చేసుకున్న వారికి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యాన 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ధ్రువీకరణపత్రాలు అందజేస్తారు. గతేడాది జూలై నుంచి స్థానికతతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలో అయిన స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. అందువల్ల అభ్యర్థులు ఏ జిల్లాలో అయినా స్క్రీనింగ్ పరీక్షలకు హాజరుకావొచ్చు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సులభతరం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా 56 ఆస్పత్రుల్లోనే సదరం క్యాంపులు నిర్వహించేవారు. అప్పట్లో సర్టిఫికెట్లు పొందడానికి దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే స్లాట్ బుకింగ్‌లకు అవకాశం కల్పించింది. ఆస్పత్రుల సంఖ్యను 173కి పెంచింది. దీంతో టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రజలకు ఇప్పుడు సులభంగా సదరం సేవలు లభిస్తున్నాయి. నాడు ఏడాదికి 25వేల నుంచి 30 వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా, ప్రస్తుతం ఏడాదికి అంతకన్నా మూడు రెట్లు అధికంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. 2022–23 సంవత్సరంలో 2.99 లక్షల స్లాట్లను ప్రభుత్వం విడుదల చేయగా, 2.25 లక్షల స్లాట్లు బుక్ అయ్యాయి. సందరం క్యాంప్‌లకు హాజరైన వారికి స్క్రీనింగ్ నిర్వహించి 96,439 సర్టిఫికెట్లను మంజూరు చేశారు. -
సదరం ‘స్లాట్స్’ తిప్పలు!
దివ్యాంగులకు సదరం ‘స్లాట్స్’ తిప్పలు తప్పడం లేదు. వైకల్యం నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సదరం శిబిరాలకు స్లాట్స్ అందని ద్రాక్షగా మారాయి. 15 రోజులకు ఒకసారి విడుదల చేస్తున్న స్లాట్స్ ఏ మూలకూ సరిపోని పరిస్థితి నెలకొంది. సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐదు సదరం శిబిరాల కేంద్రాలు ఉన్నాయి. వివిధ కేటగిరీ వైకల్యాల నిర్ధారణ శిబిరాలు వారానికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తుండటంతో దివ్యాంగులకు నిరీక్షణ తప్పడం లేదు. వాస్తవంగా శారీరక వైకల్యం, మానసిక రుగత్మ, వినికిడి లోపం, కంటి రుగత్మల లాంటి నాలుగు వైకల్యం నిర్ధారణ పరీక్షలు ప్రత్యేక శిబిరాల ద్వారా నిర్వహిస్తోంది. ఒక్కో వైకల్యానికి ఒక్కో కేంద్రాన్ని ప్రత్యేకంగా కేటాయించి వారంవారం శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. వికలత్వ నిర్ధారణ కోసం నాలుగు మెడికల్ బోర్డులు ఏర్పాటు చేసి శాశ్వత, తాత్కాలిక ప్రాతిపధికన సర్టిఫికెట్ జారీ చేస్తోంది. మానసిక వైక్యలం పరీక్షలకు రెండు కేంద్రాలు మాత్రమే నిర్వహిస్తోంది. నిలోఫర్ ఆస్పత్రిలో 18 సంవత్సరాల లోపు, ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో 18 సంవత్సరాల పై బడిన వారికి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్... కొత్తగా వైకల్య నిర్ధారణ పరీక్షలు కోసం మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సదరం వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఆధార్ నెంబర్, వివరాలు నమోదుతో దరఖాస్తు చేసుకుంటే తేదీ, సమయం, కేంద్రంతో కూడిన స్లాట్ లభిస్తోంది. స్లాట్ ప్రకారం దరఖాస్తుదారులైన దివ్యాంగులు మీ సేవ కేంద్రం రసీదు, ఆధార్ జిరాక్స్, పాస్‌పోర్టు సైజు ఫొటో, మెడికల్ రిపోర్ట్స్‌తో సదరం కేంద్రానికి హాజరు కావాల్సి ఉంటుంది. స్లాట్ ప్రకారం సదరం క్యాంపునకు హాజరు కాకపోతే రెండు రోజుల తర్వాత తిరిగి మీ సేవా ద్వారా స్లాట్ బుక్ చేసు కోవచ్చు. సదరం కేంద్రంలో సంబంధిత వైద్య బందం పరీక్షలు నిర్వహించి వైకల్యాన్ని నమోదు చేస్తోంది. వైకల్యంపైనే... మెడికల్ బోర్టు ఆన్లైన్ వివరాలను పరిశీలించి వైకల్యాన్ని నిర్ణారించిన తర్వాతనే తాత్కాలిక, శాశ్వత ధ్రువీకరణ పత్రాల జారీపై నిర్ణయం తీసుకుంటారు. తాత్కాలిక ధ్రువీకరణ పత్రాలను ఒకటి, రెండు, మూ డు, నాలుగు సంవత్సరాల వరకు వర్తించేలా ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. తాత్కాలిక సదరం సర్టిఫికెట్ రెన్యువల్ కోసం కూడా తిరిగి స్లాట్ బుకింగ్ చేసుకొని వైకల్య నిర్ణారణ పరీక్షలు హాజరు కావాల్సి ఉంటుంది. రిజక్ట్ అయితే అంతేనా? క్యాంపులో సదరం సర్టిఫికెట్ జారీ చేయటంలో అప్లికేషన్ రిజక్ట్ అయితే మళ్లీ స్లాట్ సమస్యగా తయారైంది. మానసిక, ఇతర ఇబ్బందులున్న చిన్న పిల్లలు, సర్టిఫికెట్ టెస్టులు టైంలో సహకరించకపోవడంతో డాక్టర్ల టీమ్ రిజక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. -
దివ్యమైన ప్రతిభ
సత్యభామ.. శ్రీ కృష్ణుడు.. వేంకటేశ్వరుడు.. పద్మావతి.. దివ్యమైన పాత్రలన్నింటినీ ఆమె ఆహార్యంతో అందంగా రూపుకడుతుంది.వైకల్యం ఆమె అభిలాషను అడ్డుకోలేకపో యింది. అడుగు కదపలేదు అనుకున్నవారి అంచనాలను ఆవలకు నెట్టి పట్టుదలతో అవరోధాల మెట్లను అధిరోహించింది. రంగస్థల నటిగా గుర్తింపుతో పాటు స్వరమాధురిగానూ పేరొందింది. కళారంగంలో రాణిస్తూనే దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సేవా పెన్నిధిగానూ ప్రశంసలు అందుకుంటోంది.ఆమెప్రతిభకు గుర్తింపుగా మూడుసార్లు రాష్ట్రపతి పురస్కారం వరించింది.ఖమ్మం జిల్లావాసి అయిన డాక్టర్ పొట్టబత్తిని పద్మావతి కృషి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. హైదరాబాద్‌లోని తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని మునుగనూరులో ఉంటున్నారు డాక్టర్ పద్మావతి. ఆమెకు ఏడాది వయస్సులో పో లియో సోకడంతో రెండు కాళ్ళు చచ్చుబడి పో యాయి. తన పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులు ఆమె భవిష్యత్తుపై ఆందోళనకు గురయ్యేవారు. అయితే పద్మావతి ఐదేళ్ల వయస్సులో సెయింట్ మేరీస్ పో లియో పునరావాసం పర్యవేక్షకురాలు ఆస్ట్రేలియాకు చెందిన క్లారా హీటన్ కు పరిచయం అయ్యారు. క్లారా దత్తత తీసుకోవడంతో పద్మావతి జీవితం కొత్త మలుపు తిరిగింది. క్లారా పర్యవేక్షణలో పద్మావతికి పలు మార్లు శస్త్ర చికిత్స జరిగింది. పాదాలు, నడుము.. భాగాలు శస్త్ర చికిత్సతో సరి చేశారు. అప్పటి వరకు మంచానికే పరిమితమైన ఆమె క్యాలిపర్సు, కర్రలు సహాయంతో క్రమంగా అడుగులు వేయడం మొదలు పెట్టింది. కాలు కదల్చలేని స్థితిలో మంచం మీద ఉండి చదువులో ప్రతిభ కనబరుస్తూ ఎదిగిన తీరు పద్మావతి మాటల్లో మన కళ్ల ముందు కదలాడుతుంది. సేవాభిలాష గానం, నాటక రంగంలో ఉన్న ఆసక్తితో పద్మావతి క్యాలిపర్సు సహాయంతోనే ప్రతిభ కనబరుస్తూ వచ్చారు. సత్యభామ, శ్రీకృష్ణుడు, వేంకటేశ్వరుడు తదితర పాత్రలను సమర్ధంగా పో షించి దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చి, ఎన్నో అవార్డులను పొందారు. వేగేశ్న ఫౌండేషన్ ద్వారా సంగీతంలో శిక్షణపొందడంతో పాటు, డిగ్రీ పూర్తి చేసి, ఆ సంస్థలోనే సంగీత ఉపాధ్యాయురాలుగా దివ్యాంగులకు శిక్షణ ఇస్తున్నారు. దివ్యాంగులకు సాయపడాలనే సంకల్పంతో మునుగనూరులో పద్మావతి ఇ న్ స్టిట్యూట్ ఫర్ ద (డిజ్) ఏబుల్డ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా దివ్యాంగులకు కంప్యూటర్, నృత్యం, సంగీతం, టైలరింగ్.. వంటి వృత్తి విద్యా కోర్స్‌లలో శిక్షణ ఇప్పించి, ఉపాధి కల్పిస్తున్నారు. ప్రశంసలు.. పురస్కారాలు పద్మావతి ప్రతిభకు ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి. మూడుసార్లు రాష్ట్రపతి అవార్డులు అందుకున్నారు. ఓ వైపు కళలు, మరోవైపు సామాజిక సేవారంగంలో ప్రతిభ చూపుతున్న ఆమెను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. సెన్సార్ బోర్డు సభ్యురాలుగా, నంది అవార్డు జ్యూరీ కమిటీ మెంబర్‌గా సేవలందించిన పద్మావతి 2017లో రాష్ట్ర ప్రభుత్వం రోల్ మోడల్ అవార్డును అందుకున్నారు.. కళాకారిణిగా ప్రతిభ చూపినందుకు 2009లో రాష్ట్రపతి అవార్డు లభించింది. వైకల్యంతో బాధపడుతున్నా పలు రంగాలలో రాణించినందుకు గాను 2011లో రాష్ట్రపతి చేతులు మీదుగా స్త్రీ శక్తి పురస్కారాన్ని అందుకున్నారు ఆమె. దివ్యాంగులకు చేస్తున్న సేవను గుర్తించి 2022లో రాష్ట్రపతి సర్వశ్రేష్ట దివ్యాంగ న్ అవార్డుతో సత్కరించారు. దివ్యాంగులకు సేవచేయాలనే సదాశయంతో నడుపుతున్న ఇన్స్టిట్యూట్కు చేయూతనందిస్తే మరిన్నో ప్రయోజన కరమైన పనులను చేయగలననే ఆశాభావాన్ని పద్మావతి వ్యక్తపరుస్తు న్నారు. తన గమనమే ప్రశ్నార్ధకం అవుతుందనుకున్నవారి మాటలను పక్కనపెట్టి, పట్టదలతో ప్రయత్నించి, గెలుస్తున్న ఆమె జీవితం ఎందరికో ఆదర్శమవుతుంది. – శ్రీరాం యాదయ్య, హయత్‌నగర్, హైదరాబాద్, సాక్షి -
మానసిక, శారీరక వైకల్యం ఉన్న వారికి బీమా
న్యూఢిల్లీ: సాధారణ, స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు వైకల్యం ఉన్న వారు, హెచ్ఐవీ బాధితులు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా బీమా ఉత్పత్తులను తీసుకు రావాలని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశించింది. ఐఆర్డీఏఐ హెల్త్ ఇన్సూరెన్స్ మార్గదర్శకాలకు (2016) అనుగుణంగా ఈ ఉత్పత్తుల ప్రీమియం ధరలను నిర్ణయించాలని తన తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ తరహా వ్యక్తులకు సంబంధించి పాలసీల క్లెయిమ్‌లు తిరస్కరించకుండా బోర్డు స్థాయిలో ఆమోదం పొందిన అండర్‌రైటింగ్ పాలసీని అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఆదేశించింది. ఏడాది కాల వ్యవధితో బీమా ఉత్పత్తి ఉండాలని, దాన్ని ఏటా పునరుద్ధరించుకునే అవకాశం కల్పించాలని కోరింది. -
సర్పంచ్ అంటే అట్లుండాలి! తొలిసారిగా నగదు డెలివరీ చేసే డ్రోన్!
ఇంకా చాలా మూరుమూల ప్రాంతాల్లోని వారు రాష్ట్ర పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను అందుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందులోనూ దివ్యాంగుల పరిస్థితి గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చం అలానే ఇబ్బంది పడుతున్న ఒక దివ్యాంగుడి కోసం స్వయంగా డ్రోన్ కొనుగోలు చేసి మరీ పెన్షన్ అందించి.. తన గొప్ప మనుసును చాటుకుంది ఓ మహిళా సర్పంచ్. వివరాల్లోకెళ్తే.. ఒడిశాలోని నువాపాడా జిల్లాలోని మారుమూల గ్రామంలో హెతారం సత్నామీ అనే శారీరక వికలాంగుడు నివశిస్తున్నాడు. ప్రభుత్వ ఫించను కోసం ప్రతి నెల దట్టమైన అడవి గుండా రెండు కి.మీ పైగా దూరంలో ఉన్న పంచాయతీ వద్దకు వచ్చేందుకు నానాతంటాలు పడుతున్నాడు. ఈసారి సర్పంచ్ చొరవతో అతను ఫించన్‌ను నేరుగా ఇంటి వద్ద తీసుకున్నాడు. ఆ గ్రామ సర్పంచ్ సరోజ్ అగర్వాల దివ్యాంగుడు సత్నామీ పరిస్థితితి గురించి తెలుసుకుని అతని సమస్యను పరష్కరించాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఆన్లైన్లో డ్రోన్‌ని కొనుగోలు చేశారు అగర్వాల్. ఈ మేరకు సర్పంచ్ అగర్వాల్ మాట్లాడుతూ..సత్నామీ పుట్టుకతోనే వికలాంగు, కదలలేడు. దీంతో అతని పేరును రాష్ట్ర ఫించన్ పథకంలో నమోదు చేశాం. ఐతే ఫించన్ కోసం ఆ అడవిని దాటి పంచాయతీ వద్దకు రావడానికి చాల కష్టపడుతున్నాడు. ఇతర దేశాలలో డ్రోన్లను ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకుని వెంటనే కొనుగోలు చేసి అతడికి ఫించన్ పంపేందుకు వినియోగించాలని నిర్ణయించుకున్నా. ఐతే సదరు వ్యక్తికి విజయవంతంగా డ్రోన్ సాయంతో డబ్బు డెలివరీ చేయగలిగాం అని సర్పంచ్ చెప్పుకొచ్చారు. డ్రోన్లను కొనుగోలు చేసే సదుపాయం ప్రభుత్వం వద్ద లేనందును సర్పంచే స్వయంగా కొనుగోలు చేయడంతో ఇది సాధ్యమైందని నువాపాడా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ సుబదార్ ప్రధాన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మందులు, కిరాణ సామాగ్రి, ఆహారం, ఇతర వస్తువులను డ్రోన్ల సాయంతో డెలివరీ చేయండ చూశాం. గానీ ఇలా డ్రోన్‌తో నగదు డెలవరీ చేయండం భారత్‌లోనే ప్రపథమం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?.. నా నుంచి అది మాత్రం లాక్కోలేరు: ఉద్దవ్ థాక్రే) -
రెండు చేతులు లేవు.. కుంగిపోలేదు.. ఆత్మవిశ్వాసంతో..
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. శరీరంలోని అన్ని అవయవాలు బాగున్నా కొందరు నిర్లక్ష్యంగా, బాధ్యత లేకుండా ఉంటారు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి రెండు చేతుల్లేవు. అయినా ఏ మాత్రం కుంగిపోలేదు. తనకు జీవితం లేదని భావించలేదు. కష్టపడి పనిచేస్తూ తల్లిని పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. చదవండి: టీడీపీ నేత లైంగిక వేధింపులు: బాలిక సెల్ఫీ వీడియో.. బయటపడ్డ షాకింగ్ నిజాలు నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ జనార్దనరెడ్డి కాలనీకి చెందిన పందిళ్లపల్లి శేషయ్య, రమణమ్మ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు పిల్లలు. రెండో సంతానమైన మల్లికార్జున రెండు చేతులు లేకుండా జన్మించాడు. దీంతో తల్లిదండ్రులు కుంగిపోయారు. ఎలా బతుకుతాడో?, ఎలాంటి అవమానాలను భరించాల్సి వస్తుందోనని ఆందోళన చెందారు. మల్లికార్జున చిన్నతనంలో ఉండగా తండ్రి అనారోగ్యంతో మరణించాడు. దీంతో అతను ఎవరికీ భారం కాకుండా కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. చదువుకు స్వస్తి పలికి పనులు చేయడం ప్రారంభించాడు. సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనుగోలు చేసి విక్రయిస్తున్నాడు. అలాగే ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ అందజేస్తోంది. వీటితో తల్లి రమణమ్మను పోషిస్తున్నాడు. మల్లికార్జున తన పనులు తానే చేసుకుంటాడు. కష్టమైన పనులకు మాత్రం తల్లి సాయం తీసుకుంటాడు. తల్లి రమణమ్మతో మల్లికార్జున.. సాయం చేస్తే అంగడి పెట్టుకుంటా సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుగోలు చేసి విక్రయిస్తుంటా. అలాగే నాకు, మా అమ్మకు వచ్చే పింఛన్‌తో జీవిస్తున్నాం. జీవనభృతి కోసం శాశ్వతంగా ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి భావిస్తున్నా. ప్రభుత్వం లేదా దాతలు ఆర్థిక సాయం చేస్తే చిల్లర దుకాణాన్ని ప్రారంభించి జీవితాన్ని మరింత మెరుగుపరుచుకుంటా. – పందిళ్లపల్లి మల్లికార్జున, దివ్యాంగుడు -
Ayushi: చీకటిని చీల్చి సివిల్ ర్యాంకర్‌గా..
నిమిషంపాటు కళ్లుమూసుకుని నడవాలంటేనే కష్టం. అటువంటిది పుట్టినప్పటినుంచే కారు చీకటి కమ్మేసిన కళ్లు అవి. జీవితంమొత్తం అంధకారమే అని తెలిసినప్పటికీ, బ్రెయిలీ లిపి సాయంతో అరకొర చదువుకాకుండా ఉన్నత చదువు చదివింది. అక్కడితో అగకుండా ప్రభుత్వ స్కూలు టీచర్ అయ్యింది. ఇక చాలు అనుకోకుండా .. దేశవ్యాప్తంగా పోటీపడే యూపీఎస్సీ పరీక్ష రాసి 48వ ర్యాంకు సాధించి, చరిత్ర సృష్టించింది.. చరిత్ర చెప్పే టీచర్ ఆయుషి. ఢిల్లీలోని రాణిఖేడా గ్రామంలోని ఓ సాధారణ కుటుంబం లో పుట్టింది ఆయుషి. పుట్టుకలోనే విధికన్నెర్ర చేసి తన రెండు కళ్లనూ చీకటిమయం చేసింది. రెండు కళ్లకు చీకటి తప్ప మరేం కనిపించదు. అయినా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుకుంది. ఆ తరువాత శ్యాంప్రసాద్ ముఖర్జీ కాలేజీలో బి.ఏ, ఇగ్నో యూనివర్శిటీలో చరిత్ర ప్రధాన సబ్జెక్టుగా ఎంఏ (హిస్టరీ), జామియా మిల్లియా ఇస్లామియా నుంచి బి.ఈడీ. చేసింది. ఆ తరువాత 2012లో మున్సిపల్ కార్పొరేషన్∙స్కూల్లో కాంట్రాక్ట్ టీచర్‌గా చేరింది. 2016లో ప్రైమరీ టీచర్ అయ్యింది. 2019లో ‘ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు’ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో హిస్టరీ టీచర్ అయ్యింది. పదేళ్లుగా టీచర్‌గా సేవలందిస్తోన్న ఆయుషి ప్రస్తుతం ముబారఖ్‌పూర్ దబాస్ గవర్నమెంట్ గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్లో.. పదకొండు, పన్నెండు తరగతుల విద్యార్థులకు హిస్టరీని బోధిస్తోంది. సివిల్స్‌కు ఎందుకంటే.. ‘‘స్కూల్లో పాఠాలు చెబుతూ ఎంతోమంది భవిష్యత్‌ను చక్కగా తీర్చిదిద్దగలుగుతున్నాను. యూపీఎస్సీలో సెలక్ట్ అయితే మరెంతోమంది జీవితాలను తీర్చిదిద్దే అపారమైన అవకాశం లభిస్తుంది. తనలాంటి వైకల్యం కలవారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు’’ అని ఆయుషికి అనిపించింది. దీంతో 2016 నుంచి సివిల్స్ రాయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. టీచర్‌గా బిజీగా ఉన్నప్పటికీ తన ప్రిపరేషన్‌ను మాత్రం వదల్లేదు. వలంటరీ రిటైర్మెంట్ తీసుకుని... ఆయుషి పుట్టుకతోనే అంధురాలైనప్పటికీ సివిల్స్ దాక రాణించడానికి కారణం కుటుంబం వెన్నుతట్టి ప్రోత్సహించడమే. కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా ఆయుషి తల్లి... ప్రిపరేషన్‌కు చాలా బాగా సాయం చేశారు. సీనియర్ నర్సింగ్ అధికారిగా పనిచేస్తోన్న ఆయుషి తల్లి ఆశా రాణి 2020లో వలంటరీగా పదవి విరమణ చేసి ఆయుషి ప్రిపరేషన్‌కు పూర్తి సమయాన్ని కేటాయించారు. ఆయుషికి కావాల్సిన స్టడీ మెటిరీయల్‌ను ఆయుషి భర్తతో కలిసి ఆడియో రూపంలో రికార్డు చేసి ఇచ్చేవారు. ఇవి ఆమె ప్రిపరేషన్‌కు బాగా ఉపయోగపడ్డాయి. వరుసగా నాలుగు ప్రయత్నాల్లో విఫలమైంది. వీటిలో ఒక్కసారి కూడా కనీసం మెయిన్స్ కూడా క్లియర్ చేయని 29 ఏళ్ల ఆయుషి.. తాజాగా ఐదో ప్రయత్నంలో దేశంలోనే 48వ సివిల్ ర్యాంకర్‌గా నిలిచింది. రాతపరీక్షకు ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా, మాక్ టెస్ట్‌కు మాత్రమే కోచింగ్ తీసుకుని ర్యాంక్ సాధించింది. కేంద్రపాలిత ప్రాంతాలు (డ్యానిక్స్) లేదా హర్యాణా క్యాడర్లో బాలికలు, వికలాంగుల విద్యారంగంలో సేవలందించడానికి ఆయుషి ఆసక్తి చూపుతోంది. వైకల్యం కళంకం కాకూడదు అంధురాలిగా విద్యార్థులకు పాఠాలు బోధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే టీచింగ్‌ను నేను ఎప్పుడు ఒక ఉద్యోగంగా చూడలేదు. అభిరుచిగా భావించాను. అందుకే విద్యార్థులు నా టీచింగ్‌ను ఇష్టపడేంతగా వారిని ఆకట్టుకోగలిగాను. ఆసక్తిగా పాఠాలు చెబుతూనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. ఈసారి కచ్చితంగా సివిల్స్ క్లియర్ చేస్తానని నమ్మకం ఉంది. కానీ యాభైలోపు ర్యాంకు రావడం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇన్నాళ్లకు నా కల నిజమైంది. టాప్–50 జాబితాలో నా పేరు ఉందని తెలియడం మాటల్లో్ల వర్ణించలేని ఆనందాన్ని కలిగించింది. పుట్టినప్పటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటూ పెరిగాను. కుటుంబ సభ్యులు ముఖ్యంగా అమ్మ సాయంతో అన్నింటిని జయిస్తూ నేడు ఈ స్థాయికి చేరుకోగలిగాను. విద్య అనేది సాధికారతా సాధనం. బాలికలు, వికలాంగుల విద్యా రంగంలో పనిచేస్తూ వారికి రోల్‌మోడల్‌గా నిలవాలనుకుంటున్నాను. వికలాంగుల జీవితాల్లో వైకల్యం ఒక కళంకంగా ఉండకూడదు. వైకల్యంపట్ల సమాజ దృక్పథాన్ని మార్చుకోవాలి. వికలాంగులు కూడా అన్ని లక్ష్యాలను సాధించగలరు. – ఆయుషి దేవుడు ఆయుషి రెండు కళ్లు తీసుకున్నప్పటికీ, ఆమె బంగారు భవిష్యత్‌కు చక్కని దారి చూపాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొంది. స్కూలుకెళ్లడానికి నలభై నిమిషాలు పడుతుంది. ఆ సమయాన్ని కూడా తన ప్రిపరేషన్‌కు కేటాయించి, ఈ స్థాయికి చేరుకున్నందుకు ఆయుషి తల్లిగా ఎంతో గర్వపడుతున్నాను. – ఆశారాణి (ఆయుషి తల్లి) -
మంచి మాట: అభిప్రాయం కాదు... అవగాహన
వ్యక్తి తన వ్యక్తిత్వానికి అతీతంగా వస్తుతత్త్వానికి, ఉన్న విషయానికి మాలిమి అవాలి. అనుకోవడం నుంచి తెలుసుకోవడానికి పయనించాలి. అభిప్రాయం నుండి అవగాహనలోకీ చేరాలి. అనుకోవడం అంటేనే తెలివిడిలేనితనం. ‘ఇది నా అభిప్రాయం‘ అనడం ఒక మనిషి అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తూంటుంది. విషయం, వాస్తవం, సత్యం ఇవి మనిషి మనిషికీ మారవు. అభిప్రాయాలే వేర్వేరుగానూ, రకరకాలుగానూ ఉంటాయి. ఒక విషయం గురించి ఏదో అనుకోవడం ఏమిటి? విషయాల్ని తెలుసుకోవడం లేదా తటస్థంగా ఉండడం అన్నదే సరైనది. లోకంలో ప్రతి ఒక్కరూ అభిప్రాయపడడం గొప్ప అనుకుంటూంటారు. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న 67% మధ్యతరగతి వ్యక్తులు అభిప్రాయపడుతూ బతుకుతూంటారు. అభిప్రాయాలు మనిషి అశక్తతకు, తెలివిడిలేనితనానికి వ్యక్తీకరణలు. అభిప్రాయపడడం అన్నది మధ్యతరగతి మాంద్యంగానూ, జాడ్యంగానూ ఉంది. అందువల్ల గందరగోళం తప్పితే మరొకటి ఉండదు. ఉపిరి పీల్చుకోవడం తరువాత ఒక వ్యక్తి తప్పకుండా చేసే పని అభిప్రాయపడడమే. మనుషులకు తప్పితే ఏ జంతువుకూ అభిప్రాయాలుండవు. అందుకే జంతువుల్లో లేని అశాంతి మనుషుల్లో మాత్రమే ఉంది. ‘ఇది నా అభిప్రాయం’, ‘నేను ఏమనుకుంటున్నానంటే‘, ‘నేను చెప్పేదేమిటంటే’... అనే స్థితి నుండీ, స్థాయి నుండీ మధ్య తరగతి మనిషి ఇంకా ఎదగలేదు. మనిషి అవగాహనకూ అతీతంగా తన అభిప్రాయాల వల్లా, ఏదో అనుకోవడం వల్లా తన ఎదుగుదలకు తానే అడ్డుపడుతున్నాడు. ఒక కుటుంబంలోని వ్యక్తుల అభిప్రాయాల వల్లా, ఏదేదో అనుకోవడం వల్లా ఆ కుటుంబాలు ఛిద్రమైన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. అభిప్రాయపడడం, అనుకోవడం ఒక మానసిక బలహీనత. హిట్లర్ అభిప్రాయాల వల్ల రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి మొత్తం మానవాళికి పెనుహాని జరిగింది. అభిప్రాయపడడం కూడా మూర్ఖత్వంలాగే అపాయకరమైనదే! కొన్ని సందర్భాల్లో మూఢనమ్మకంలాగా కీడు చేసేదే! నా అభిప్రాయం మేరకు అనేది ప్రపంచానికి మేలు చేసినది కాకపోగా అనర్థాల్ని కలిగించింది, మనుషుల మధ్య అంతరాల్ని పెంచింది. మనస్పర్థలను సృష్టించింది. ఈ చింతనతో ఎన్నో దశాబ్దుల క్రితం నుండీ అంతర్జాతీయ సంస్థలు ప్రపంచానికీ, మానవాళికీ అత్యవసరమయ్యే ఎన్నో ఉత్పాదనల్ని ఉత్పత్తి చేసి అందుబాటులోకి తెచ్చాయి, సగటు మనిషికి హితాన్ని చేకూర్చాయి. చూడడం, వినడం, అవగతం చేసుకోవడం, చెప్పడం ఇవి మనిషికి సరిగ్గా అలవడలేదు. వ్యక్తిగత అభిప్రాయాలూ, ఉద్దేశాల వల్ల సాటి మనిషికీ, సమాజానికీ ప్రయోజనం ఉండదు. అభిప్రాయాలు, ఉద్దేశాలు, అనుకోవడం ఇవి కాదు ఎరుక, అవగాహన, విజ్ఞతలే కావాలి. ఒకరి ఎరుక, అవగాహన మరొకరికీ, సమాజానికీ ఉపయోగపడతాయి. ఈ ప్రపంచానికి మేలు చేసినవన్నీ అవగాహనలే, వాస్తవాలే, సత్యాలే. ఒక వైద్యుడి చదువు లేదా ఎరుక మాత్రమే రోగికి అవసరమవుతుంది. ఒక అధ్యాపకుడికి ఎరుక ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థికి సరైన విద్య వస్తుంది. ’రెండు రెళ్లు నాలుగు’ అన్న ఎఱుకను మాత్రమే ఉపాధ్యాయుడు విద్యార్థికి అందజెయ్యాలి. అదే విద్యార్థికి కావాల్సింది. ఆ రెండురెళ్లు నాలుగు అన్నది అవగాహన. ఆ అవగాహనే ఒక వ్యక్తి జీవనానికి తోడ్పడేది. ఇలా ఏ విషయంలోనైనా ఎరుకవల్ల వచ్చే లేదా వచ్చిన అవగాహన మాత్రమే మేలు చేస్తుంది. అభిప్రాయం అనేది పూర్తిగా వ్యక్తిగతం. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. అభిప్రాయాలు సార్వత్రికమైనవి కావు అపై సార్వజనీనమైనవీ కావు. మనం సరిగ్గా ఉండాలంటే మనకు ఉండాల్సింది అభిప్రాయాలు కాదు అవగాహనలు. బతకడం అంటే అభిప్రాయాల్ని మోసుకుంటూ ఉండిపోవడమా? కాదు. బతకడం అంటే తెలుసుకుని అవగాహనతో సాగడం. అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి. తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒక గాయకుడు గొప్ప గాయకుడు అన్న అభిప్రాయం ఉంటే ఆ గాయకుడి సామర్థ్యాన్ని, గాయకుడి వ్యాప్తిని, తరువాతి తరం వాళ్లపై ఆ గాయకుడి ప్రభావాన్ని, పరిశీలించగలిగితే ఆ గాయకుడు గొప్ప గాయకుడు అన్న అభిప్రాయం సరైనదా కాదా అనేది తెలిసిపోతుంది. విజ్ఞానశాస్త్రవేత్తల ఆవిష్కరణలను పరిశీలిస్తే మనకు అవగాహన అన్నది ఏమిటో అర్థమై పోతుంది. విజ్ఞాన శాస్త్రవేత్తలు ఒక అభిప్రాయంతోనో, ఏదో ఒకటనుకునో మొదలుపెడతారు. ప్రయోగాలు, ఆలోచనలు, పరిశీలనలు చేస్తూ, చేస్తూ తమను తాము మార్చుకుంటూ, సరిచేసుకుంటూ ఒక దశలో వాళ్లు సరైన ఆవిష్కరణలు చెయ్యగలుతారు. ఆ ఆవిష్కరణ జరిగాక అది అవగాహన అవుతుంది. ఆ అవగాహనే లోకానికి ఉపయోగ పడేదవుతుంది. అవగాహన మనిషికి స్వేచ్ఛను ఇస్తుంది. సాటి మనిషికి, సమాజానికి మేలు చేస్తుంది. శాంతిని ఇస్తుంది. ఈ సత్యాన్ని బుద్ధిలోకి తీసుకుందాం. అభిప్రాయాలకు అతీతంగా ‘బతకడం’ నేర్చుకుందాం. అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి. తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి. – రోచిష్మాన్ -
వైకల్యంతో పుట్టాడని వదిలేశారు!
నాంపల్లి: నిలోఫర్ ఆస్పత్రి ఎదుట రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన ఓ ఆటోలో మూడ్రోజుల మగ శిశువు లభ్యమైంది. నాంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దుస్తుల్లో చుట్టిన శిశువు ఏడుపులు విన్న ఆటో డ్రైవర్ నిలోఫర్ ఆస్పత్రికి, పోలీసు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు శిశువును వదిలి వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. వైకల్యంతో పుట్టిన కారణంగానే పసికందును ఆటోలో వదిలివెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. శిశువిహార్ సిబ్బందికి సమాచారం అందించి చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: భార్యను సంతోష పెట్టడం కోసం రాజస్థాన్ నుంచి బెంగళూరుకు వచ్చి..) -
వీల్‌చైర్‌లో వకీల్ సాహెబా..
కొత్తగూడెం టౌన్: చదువుకు అంగవైకల్యం అడ్డుకాదని నిరూపించిన ఓమహిళ తన లక్ష్యం నెరవేర్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన దివ్యాంగురాలు మౌనిక ఎల్ఎల్బీ పూర్తిచేసి న్యాయవాదిగా మంగళవారం తన ప్రాక్టీస్ ప్రారంభించారు. వీల్‌చైర్‌లో జిల్లా కోర్టుకు వచ్చిన ఆమెకు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు ఘనస్వాగతం పలికారు. సవాళ్లను అధిగమించి విజయం సాధించిన మౌనిక అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు. -
అతడికి చేతులు లేవు కానీ.. రాయడం ఆపలేదు
లక్నో: తుషార్ విష్వకర్మకు పుట్టుకతోనే రెండు చేతులూ లేవు కానీ అతడికి తన ఇద్దరు సోదరులతో కలిసి బడికి వెళ్లి చదువుకోవాలని ఉండేది. కసితో కాళ్లతో రాయడం ప్రాక్టీస్ చేశాడు. రాయడం నేర్చుకుని స్కూల్లోనూ చేరాడు. అలా రాస్తూనే అన్ని తరగతులూ పాసయ్యాడు. వివరాల్లోకెళ్తే.. లక్నోకి చెందిన తుషార్ క్రియేటివ్ కాన్వెంట్లో 12వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం అతను సీబీఎస్ఈ విడుదల చేసిన ఫలితాల్లో 70 శాతం మార్కులతో పాసయ్యాడు. ఏ లోపం లేని ఎంతో మంది విద్యార్ధులు పాసైతే చాలు అనుకుంటుంటే తుషార్ మాత్రం 70 శాతం మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అంతే కాదు పరీక్షల సమయంలో ప్రభుత్వం అంగవైకల్యంతో బాధపడే విద్యార్ధులకు కల్పించే రైటర్ సహాయం తీసుకోవడం లేదా అధిక సమయం తీసుకోవడం వంటి బెనిఫిట్స్‌ను కూడా ఏనాడూ వినియోగించుకోలేదు. అడిగితే నేను అందరిలాంటి సాధారణ వ్యక్తినని అందుకే నేను అందరిలానే పరీక్ష రాస్తానని అంటున్నాడు తుషార్. తుషార్ మాట్లాడుతూ: చిన్నప్పుడు మా అన్నలు ఇద్దరూ స్కూల్‌కి వెళ్తుంటే నేనూ వారితో వెళ్తానని తల్లిదండ్రులను అడిగే వాడిననీ అన్నారు. అయితే తన లోపం వల్ల రాయడం ఇబ్బందిగా ఉండేదని అయితే తన అన్నల పుస్తకాల సాయంతో కాళ్లతో రాయడం ప్రాక్టీస్ చేసి తను దానిని అధిగమించడానికి తనకు ప్రతి రోజూ ఆరు గంటల సమయం పట్టేదని చెప్తున్నాడు. అలాగే తను ఈ స్థాయికి చేరుకునేలా ప్రోత్సహించిన తన తల్లిదండ్రులకు, అన్నలకు, ముఖ్యంగా టీచర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. -
విరాళి మోది.. కూర్చుని ఎగిరింది!
పులిని ఎదిరించిన మేకపిల్ల కథ ప్రేరణ. కరువున కురిసిన వాన కథ ప్రేరణ. పేగు అడ్డుపడినా జన్మించి కేర్మనడం ప్రేరణ. ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు జవాబుగా మారడం ప్రేరణ. ప్రేరణ అందరూ కలిగించలేరు. అందుకు అర్హత కలిగిన వారు పలికిన మాట నుంచే అది జనిస్తుంది. విరాళి మోది డిజెబిలిటి యాక్టివిస్ట్. మోటివేషనల్ స్పీకర్. ప్రయోజనకరమైన చలనం మనిషికి అవసరం అని ఆమె చెబుతుంది. ఆమె తన వీల్‌చైర్‌లో నుంచి లేచి నిలబడలేదు. కూర్చుని నేను ఎగర గలుగుతున్నప్పుడు మీకేం తక్కువ? అని సూటిగా అడిగి దమ్మునింపుతుంది. ఆమె పరిచయం... విరాళి మోది వయసు ఇప్పుడు 30 ఏళ్లు. 2006 లో ఆమె తన కాళ్లలో చలనం పోగొట్టుకుంది. అప్పటి నుంచి ఆమె వీల్‌చైర్‌కే పరిమితం అయ్యింది. అయితే ఆ తర్వాతి నుంచి ఆమె ఎలా ఎగిరిందో చూద్దాం. ► 2014లో ‘మిస్ వీల్‌చైర్ ఇండియా’ టైటిల్ గెలుచుకుంది. ► భారతీయ రైల్వేలలో దివ్యాంగుల సౌకర్యాలు కల్పించేలా ఉద్యమం లేవదీసి గెలిచింది. ► 2017లో ‘ప్రభావవంతమైన 100 మంది స్త్రీలు’ బిబిసి జాబితాలో నిలిచింది. ► ఆమె చేసిన ‘మై ట్రైన్ టూ’ ప్రచారం ప్రాముఖ్యం పొందింది. ► ‘ర్యాంప్ మై రెస్టరెంట్’ కాంపెయిన్ రెస్టరెంట్లలో దివ్యాంగుల ప్రవేశపు వీలును గుర్తించేలా చేసింది. ► గొప్ప మోటివేషనల్ స్పీకర్‌గా గుర్తింపు పొందింది. ► వీల్ చైర్ మీద కూచునే ఫ్యాషన్ షోలలో పాల్గొంది. ► స్కూబా డైవింగ్ చేసింది. నిజానికి విరాళి మోదికి ‘దివ్యాంగులు’, ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ అనే మాటలు నచ్చవు. ‘మనందరం ఒకటే. మాకు ఏవేవో పేర్లు పెట్టి బుజ్జగించే పనులు చేయకండి. మీరు కాళ్ల మీద ఆధారపడతారు. మేము వీల్‌చైర్ మీద ఆధారపడతాం. మిగిలిన అన్ని పనుల్లో మేము సమానమే కదా’ అంటుందామె. విరాళి మోది ముంబై లో ఉంటుంది. దివ్యాంగుల హక్కుల సాధన విషయంలో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇవాళ ఆమె మోటివేషనల్ స్పీచెస్ వినడానికి వందలాదిగా తరలి వస్తారు. ఆమె కథ ఎందుకు అంత ప్రేరణ కలిగిస్తోంది? అమెరికా అమ్మాయి విరాళి మోది ఇండియాలో జన్మించినా హైస్కూలు వయసు వరకూ అమెరికాలోనే పెరిగింది. ఆమె తల్లిదండ్రులు పల్లవి, జితేష్ మోదీలు ‘మజూరి’లో స్థిరపడ్డారు. 2006లో విరాళికి పదహారు పదిహేడు సంవత్సరాలున్నప్పుడు ఆమె ఇండియా పర్యటనకు వచ్చి తిరిగి అమెరికా వెళ్లింది. వెళ్లినప్పటి నుంచి ఆమెకు తలనొప్పి పట్టుకుంది. ఆ తర్వాత తీవ్రమైన జ్వరం. డాక్టర్లు పరీక్ష చేస్తే టెస్టుల్లో ఏమీ తేలలేదు. విరాళి ఇండియా వచ్చింది వానాకాలం కనుక మలేరియా వచ్చి ఉంటుందని తల్లిదండ్రులు చెప్పినా టెస్టుల్లో తేల్లేదు కనుక మందులు ఇవ్వం అని డాక్టర్లు చెప్పారు. ఆ జ్వరంలోనే ఒక ఉదయం ఆమె కాళ్లు చచ్చుబడ్డాయి. ఆ తర్వాత ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చింది. 7 నిమిషాలు ఆమెలో చలనం లేదు. డాక్టర్లు చనిపోయిందనే అన్నారు. కాని ఆమె గుండె తిరిగి కొట్టుకుంది. ఆ తర్వాత కోమాలోకి వెళ్లిపోయింది. వెంటిలేటర్ మీద ఉన్న విరాళిని తల్లి మరికొన్ని రోజుల్లో రానున్న విరాళి పుట్టినరోజు వరకూ బతికించమని, ఆ తర్వాత వెంటిలేటర్ తీసేద్దామని కోరింది. డాక్టర్లు తల్లికోరిక కదా అని మన్నించారు. పుట్టినరోజు అందరూ చివరి చూపులకు వచ్చారు. కేక్ కోశారు. ఐసియులో సందడి చేశారు. ఆ సందడిలోనే విరాళి కోమా నుంచి బయటపడి కళ్లు తెరిచింది. అచలనం నుంచి చలనానికి విరాళి బతికింది కాని మెడ కింద నుంచి పూర్తి శరీరం చచ్చుబడింది. చేతులు కాళ్లు ఏవీ కదల్చలేని స్థితి. తల్లి కొన్నిరోజులు సేవ చేసింది. కాని ఇలాగే ఉంటే అమ్మాయి ఏం కాను? ఒకరోజు విరాళికి చాలా ఆకలి వేసింది. తల్లిని భోజనం అడిగితే ఎదురుగా తెచ్చి పెట్టి ‘నీకు కావాలంటే తిను. నేను నీ పనిమనిషిని కాను’ అని కావాలని విసుక్కుంది. విరాళికి పట్టుదల వచ్చింది. నా తిండి నేను తినగలను అనుకుంది. పట్టుదలగా ముందు వేళ్లు కదిలించింది. తర్వాత చేతులు కదిలించింది. ఆ తర్వాత చేయి సాచి ఆహారాన్ని తినగలింది. ‘ఆ రోజు నా జీవితం మారింది. నేను అనుకున్నది గట్టిగా అనుకుంటే సాధించగలను అని అర్థమైంది. అంతా మన మైండ్‌లో ఉంటుంది. దానికి బలం ఇవ్వాలి అని తెలుసుకున్నాను’ అని చెప్పింది. ఆ తర్వాత ఆమె చేతులు ఆమె స్వాధీనానికి వచ్చాయి. కాళ్ల సమస్య? వీల్‌చైర్ ఉందిగా అనుకుంది. ఎందుకు చేయరు? ‘ఈ పని నా వల్ల కాదు.. ఆ పని నేను చేయలేను అని అందరూ అనుకుంటూ ఉంటారు. బద్దకిస్తుంటారు. భయపడుతుంటారు. కాని ఇందుకా మనం పుట్టింది. చేయాలి. సాధించాలి. ముందుకు వెళ్లాలి. జన్మను సార్థకం చేసుకోవాలి’ అంటుంది విరాళి. ఆమె తన సమూహానికే కాదు ప్రతి ఒక్కరికీ ‘లే.. నడు.. పరిగెత్తు.. ఎగురు’ అని ప్రేరణనిస్తుంది. నిరాశ చుట్టుముట్టినవారికి తన జీవితాన్నే అద్దంలా చూపి మనిషికి సమస్యలను దాటే శక్తి ఉంటుందని చెప్పింది. అదే కాదు... న్యాయమైన హక్కులను సాధించుకోలేకపోవడం కూడా ‘అచేతన చైతన్యాన్ని’ కలిగి ఉండటమే అని చెబుతుంది. పోరాడాలి.. సాధించాలి... జీవించాలి... జీవితాన్ని ఇవ్వాలి... ఇదే విరాళి ఇస్తున్న సందేశం. – సాక్షి ఫ్యామిలీ -
కుంగిపోలేదు..స్ఫూర్తిగా నిలిచాడు..
పలాస: ఒకవైపు పేదరికం.. మరోవైపు అంగవైకల్యం.. అయినా అతడు కుంగిపోలేదు.. బాలారిష్టాలను ఎన్నో ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించి స్వయం ఉపాధి పొందుతున్నాడు. తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఆయనే పలాస మండలం మాకన్నపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు సైన కాంతారావు(36). నిరుపేద కుటుంబానికి చెందిన కామేశ్వరరావు, లక్ష్మీదంపతులకు కాంతారావుతో పాటు అన్న, తమ్ముడు, చెల్లెమ్మలు ఉన్నారు. పెద్దవాడు జగదీష్ మూగవాడు. కాంతారావుకి రెండు చేతులు లేవు. అయినా తోటి పిల్లలతో ఆడుకుంటూ చదువుకోవాలని కోరిక బలంగా ఉండేది. కాలి వేళ్లతో పలకమీద అక్షరాలు దిద్దడం ప్రారంభించాడు అకుంఠిత దీక్షతో విద్యాభ్యాసం బొడ్డపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లి పదో తరగతి పూర్తి చేశాడు. పాఠశాలలో క్రికెట్, చెస్, క్యారం ఆటలు కూడా ఆడేవాడు. కాశీబుగ్గలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్, బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బి.ఎ, స్థానికంగా బీఈడీ సైతం పూర్తి చేశాడు. కాశీబుగ్గలో కంప్యూటరు కోర్సు చదివి ఓవైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూనే మరోవైపు కాశీబుగ్గలో ఇంటర్నెట్ సెంటర్ పెట్టి స్వయం ఉపాధి పొందుతున్నాడు. తన కుటుంబాన్ని పోషించడమే కాకుండా మరో నలుగురికి తన నెట్ సెంటర్లోనే ఉపాధి చూపిస్తూ ఆదర్శంగా నిలిచాడు. ప్రస్తుతం కాశీబుగ్గలో భార్య, పాపతో కలిసి ఒక అద్దె ఇంటిలో జీవనం సాగిస్తున్నాడు. -
మే'నరకం'
వాళ్లు మద్యం ముట్టరు, మాంసం తినరు, ఎన్నో ఏళ్లుగా ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. బయటి కులానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటే ఈ కట్టుబాట్లు పాటిస్తారో లేదోనన్న భయంతో మేనరికపు పెళ్లిళ్లతో తమ పిల్లల జీవితాల్లో చీకట్లు నింపుతున్నారు. మేనరికపు పెళ్లిళ్లు పిల్లల బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్నా.. వైఎస్సార్ కడప జిల్లా తొండూరు మండలం మడూరుకు చెందిన ‘సాతాను’ కులస్తులు మాత్రం కట్టుబాట్లను వీడడం లేదు. పిల్లల్లో బుద్ధిమాంద్యం, అంధత్వం, వైకల్యాలకు మేనరికపు వివాహాలే కారణమని వైద్య ఆరోగ్య శాఖ ఎంత అవగాహన కల్పించినా మార్పు శూన్యం. ఇటీవల చదువుకున్న యువత కులాంతర వివాహాలు చేసుకుంటూ మార్పు దిశగా పయనిస్తోంది. మడూరు గ్రామంలోని ‘సాతానుల’ బతుకు చిత్రంపై సాక్షి ప్రత్యేక కథనం. –సాక్షి ప్రతినిధి, కడప ఈ చిన్నారి పేరు ఐశ్వర్య, వయసు ఐదు సంవత్సరాలు. తన తోటి పిల్లలతో ఆడుకునే, బడికెళ్లే వయసు.. ముద్దులొలికించే ఐశ్వర్య పుట్టుకతోనే మంచానికి పరిమితమైంది. లేవలేదు, కూర్చోలేదు. ఎవరో ఒకరు పక్కనుండి అన్నీ చూసుకోవాల్సిందే. వైద్యం కోసం ఆస్పత్రులకు తిరిగినా చిన్న మార్పు కూడా లేదు. తల్లి శోభారాణి, తండ్రి నరేష్లది మేనరికపు పెళ్లి. మేనరికం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసినా.. ఎందుకు చేసుకున్నారని శోభారాణిని సాక్షి ప్రశ్నిస్తే.. ‘ ఆ సమయంలో నాకంత అవగాహన లేదు. తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. ఇలాంటి జీవితం ఎవరికీ రాకూడదు. మేనరికం పెళ్లిళ్లు ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలిసొచ్చింది. అయినా ఏం లాభం’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పల్లెలో ఏ ఇంటిని పలకరించినా ఇలాంటి కన్నీటి గాథలెన్నో మనసును చివుక్కుమనేలా చేస్తాయి. 22 ఏళ్ల వయసులో నిర్జీవంగా పడిఉన్న ప్రశాంత్, పుట్టుకతోనే చూపు కోల్పోయిన స్వర్ణలత, వరలక్ష్మి, వెంకటశేషయ్యలు.. బధిరులుగా బతుకీడుస్తున్న సంతోష్, కళ్యాణిలు.. అంగవైకల్యంతో బాధపడుతున్న బీటెక్ స్టూడెంట్ అరుణ్.. ఇలా ఎందరో... ఎన్నో తరాలుగా కట్టుబాటు వైఎస్సార్ కడప జిల్లా తొండూరు మండలం మడూరు గ్రామంలో మొత్తం 200 గడపలు ఉంటాయి. జనాభా 1200 మందికి మించదు. అయితే ప్రతి ఇంట్లో శారీరక, మానసిన లోపాలతో పుట్టే పిల్లలు కన్పిస్తారు. మద్యం, మాంసం ముట్టకపోవడం తమ పూర్వీకుల నుంచి వస్తుందని సాతానులు చెబుతున్నారు. తరాలుగా వస్తున్న కట్టుబాటు తప్పితే కీడు జరుగుతుందని, వారి నమ్మకం. మాంసం తినే ఇతర సామాజిక వర్గాలవారు గ్రామంలోకి వచ్చినా వారిని మంచాలమీద కూర్చోనివ్వరు. బయటనుంచే మాట్లాడి పంపేస్తారు. తమ పిల్లలను ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడ ఉన్న తమ కులస్తులకు కూడా ఇచ్చేందుకు అంగీకరించరు. దీంతో ప్రతి ఇంట్లో మేనరికపు వివాహాలే. 200 కుటుంబాల్లో 90 శాతం ఇదే గ్రామంలోనే వివాహం చేసుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇది పూడ్చలేని నష్టం... తాము చేస్తున్న పనివల్ల పిల్లల భవిష్యత్తు బుగ్గిపాలవుతుందని తెలిసినా.. వారిలో మార్పు లేదు. పిల్లల ఆరోగ్యం కోసం ఎన్నో ఆస్పత్రులు తిరిగి ఆర్థికంగా చితికిపోయారు. కొందరు మేనరికం పెళ్లిళ్లు చేసుకోకపోయినా వారి పిల్లలకు అంగవైకల్యం వచ్చిందని.. మేనరికం కొంత కారణమైనా.. పూర్తిగా అదే కాదనేది మండూరు గ్రామస్తుల వాదన. మాజీ సర్పంచ్ ప్రకాశరావు మాట్లాడుతూ.. ‘ మా ఆచారం ఎవరికీ నష్టం కలిగించదు. ఇప్పటికీ మా గ్రామంలో ఏ ఇంటిలోనూ మాంసం వండరు. బయట మా సామాజిక వర్గం తక్కువగా ఉండడంతో అందరూ ఈ గ్రామంలోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే ఈ మేనరికం వివాహాలవల్లే వందలాది మంది భవిష్యత్తు నాశనమైంది. ఇది పూడ్చలేని నష్టం. ఇప్పుడు మేం ఎవరిపైనా ఆంక్షలు పెట్టడంలేదు. కులాంతర వివాహాలు అనుమతిస్తున్నాం. ఇప్పుడిప్పుడు చదువుకున్న పిల్లల్లో మార్పు వచ్చింది. కొన్ని కులాంతర వివాహాలు జరుగుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు. మాటలు రాని సంతోష్‌తో అంధురాలైన తల్లి స్వర్ణలత అధికారులు, వైద్యసిబ్బంది ప్రయత్నాలు వృథా ఈ గ్రామస్తుల నమ్మకాన్ని మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కడప జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన చంద్రమౌళి, జాయింట్ కలెక్టర్ విజయలక్ష్మి లాంటి అధికారులు చైతన్య కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. మేనరికపు పెళ్లిళ్లు వద్దనే విషయాన్ని అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, జనవిజ్ఞాన వేదిక సభ్యులు పలుమార్లు వివరించారు. ఈ గ్రామంలో సుదీర్ఘ కాలంగా అవగాహన కల్పిస్తున్న హెల్త్ ఎడ్యుకేటర్ దేవిరెడ్డి రమణమ్మ పలు విషయాలు సాక్షితో పంచుకుంది. ‘అంగవైకల్యంతో పిల్లల జీవితాలు నాశనమవుతున్నా.. ఆచారానికే వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఎంత అవగాహన కల్పించినా మడూరులో ఇప్పటికీ పెద్దగా మార్పు లేదు’ అని చెప్పుకొచ్చింది. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న ప్రశాంత్ ఆ భయంతోనే మేనరికం మా సాతాను కులపోళ్లు చాలా తక్కువగా ఉంటారు. బయట మా కులపోళ్లు అందుబాటులో ఉండకపోవడంతో ఈ గ్రామంలోనే పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తోంది. పైగా బయట ఉన్న వారు మాంసం, మద్యం ముట్టుకుంటారనే భయం. దీంతో మా పిల్లలకు ఈ గ్రామంలోనే పెళ్లిళ్లు చేస్తున్నాం. మేనరికం పెళ్లిళ్ల వల్లే అంగవైకల్యం, బుద్ధిమాంద్యం అని డాక్టర్లు చెబుతున్నారు. దాంతో మావారిలోనూ మార్పు వస్తోంది –పి.రామానాయుడు, మడూరు మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం మడూరులో చాలా కుటుంబాల్లో మేనరికపు పెళ్లిళ్లే.. దీనివల్లే పిల్లల్లో అనారోగ్యమని చెబుతూనే ఉన్నాం. ప్రస్తుతం కొంతమార్పు వచ్చి ంది. నాలుగైదేళ్లుగా గ్రామస్తులు బయట వివాహాలు చేసుకుంటున్నారు. – ఎం.రాజేశ్వరి, ఆశా వర్కర్ ఇటీవలి కాలంలో యువతలో మార్పు నాలుగైదేళ్లుగా గ్రామంలో కొంత మార్పు చోటుచేసుకుంది. యువతరంలో వస్తున్న అవగాహన వల్ల చదువుకున్న యువత కులాంతర వివాహాలకు మొగ్గు చూపుతున్నారు. గ్రామానికి చెందిన వెంకట నారాయణ, పల్లె ఎద్దుల కొండయ్య, పల్లె సూర్యనారాయణ, జి.రామానాయుడు, ఎ.రమేష్, పల్లె నవీన్, పల్లె శ్రేష్ఠ, ఎం.నాగలక్ష్మి తదితరులు ఉన్నత చదువులు చదివి డాక్టర్లయ్యారు. వీరు బయటి వారిని పెళ్లిళ్లు చేసుకున్నారు. చదువుకున్న యువత కులాంతర వివాహాలు చేసుకోవడంతో మేనరికపు పెళ్లిళ్లు తగ్గాయని గ్రామస్తులు చెబుతున్నారు. -
మిస్ ఎబిలిటీ
డిజ్ఎబిలిటీని ‘మిస్ ఎబిలిటీ’గా మార్చిన వసుంధర అనే యువతి మహా సంకల్ప బలం ఇది. జీవితమంతా పోరాటంతోనే గడిపి, చదువు పూర్తి చేసి, ఉద్యోగంలో పడలేక రాజీనామా చేసి, సొంతంగా ఒక సంస్థను నెలకొల్పి దివ్యాంగుల సంక్షేమం కోసం తన వంతుగా కృషి చేస్తున్న వసుంధర.. అందాల పోటీలను కూడా నిర్వహించి.. అందం కేవలం దేహ సౌందర్యానికే పరిమితం కాదనీ, ప్రతిభలోనూ అందం ఉంటుందని చాటి చెప్పారు. హెచ్ఎస్బిసిలో పనిచేస్తున్న రేఖారాణి ప్రత్యేకమైన హెయిర్ స్టయిల్‌తో లేరు. వేదిక మీద ఆమె తన శరీరం గురించి, తనకున్న లోపాల గురించి పట్టించుకోలేదు. గ్లామరస్‌గా లేరు, జీరో సైజు కూడా కాదు, కాని ప్రత్యేకమైన అందం కలిగిన అమ్మాయి. ర్యాంపు మీద వీల్ ఛెయిర్‌లోనే తన గాంభీర్యాన్ని, తన ప్రతిభను ప్రదర్శించి, పోటీలో పాల్గొన్న పదహారు మందిలో ‘మిస్ ఎబిలిటీ’ టైటిల్ గెలిచారు. గతంలో ‘కాగ్నిజెంట్’లో పనిచేసిన లక్ష్మీ సుందరి కూడా ఈ పోటీలో పాల్గొన్నారు. 2011లో అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదంలో లక్ష్మీ సుందరి వీల్ చైర్‌కే పరిమితమైపోయినా, ఈ ‘మిస్ ఎబిలిటీ’ పోటీలో రన్నరప్‌గా నిలిచారు. ‘‘మేం ఎంత ప్రత్యేకమో ప్రపంచానికి తెలియజేయడానికే మా ప్రయత్నం’’ అంటారు ఈ ఈవెంట్‌ను నిర్వహించిన ‘వేవ్ మీడియా’ సంస్థ సిఈవో వసుంధర కొప్పుల. ఈ ఏడాది ఏప్రిల్ 1న ‘వేవ్ మీడియా’ అందాల పోటీలు జరిగాయి. దివ్యాంగురాలైన వసుంధర, దివ్యాంగుల కోసం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో వున్నారు. తమ్ముడు మోసుకెళ్లేవాడు వసుంధర స్వగ్రామం అనంతపురం జిల్లా సెట్టూరు. తల్లి ప్రమీల, తండ్రి ఆనందరావు, తమ్ముడు రాజేంద్రప్రసాద్. వసుంధర చిన్నపిల్లగా ఉన్నప్పుడే తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయారు. తల్లి గార్మెంట్స్ బిజినెస్ చేస్తూ, ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫారమ్స్ తయారుచేసి సప్లయి చేస్తున్నారు. వసుంధరకు రెండేళ్ల వయసులో వేసిన పోలియో వ్యాక్సిన్ వికటించి ఆమె రెండు కాళ్లూ బలహీనమయ్యాయి. వసుంధరకు ఏడు సంవత్సరాలు వచ్చేవరకు ఎంతోమంది వైద్యులకి చూపించింది తల్లి. నయం కాలేదు. చందమామ వంటి పుస్తకాలు చదవడానికైనా ఉంటుందని వసుంధరను స్కూల్లో వేశారు. స్కూల్లో టీచర్లు, స్నేహితులు అందరూ వసుంధరను తమతో సమానంగానే చూశారు. స్పెషల్ కిడ్లాగ ఏ ఒక్కరూ చూడలేదు. వసుంధర తమ్ముడు కూడా అదే స్కూల్లో చదువుకుంటూ, అక్కను ఒక క్లాసు నుంచి మరొక క్లాసుకి ఎత్తుకుని తీసుకువెళ్లేవాడు.‘అమ్మ వద్దన్నా.. బయటికొచ్చేశాను’ వసుంధర చక్రాల బండికే పరిమితమైపోయినా, మానసికంగా కుంగిపోలేదు. పట్టుపట్టి బికామ్ పూర్తి చేశారు. సి.ఏ. చేస్తూ మధ్యలో వదిలేసి, ఎం.ఏ. మాస్ కమ్యూనికేషన్ చదివారు. ‘‘మీడియాలో ఉద్యోగం వచ్చినప్పుడు నేను ఒక్కర్తినే ఉంటానంటే అమ్మ వద్దన్నా, ఆమె మాటను కాదని, బయటకు వచ్చేశాను’’ అంటున్న వసుంధర, తనకు అమ్మ వల్లే ఇంత శక్తి వచ్చిందంటున్నారు. తనలాంటి వందమందిని కలిసి వారి సమస్యల గురించి వినతి పత్రం తయారుచేసి, అబ్దుల్ కలామ్‌కి అందచేశారు వసుంధర. ఆయన తక్షణమే దివ్యాంగులకు అవసరమైన ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటయ్యేలా అధికారులను ఆదేశించారు. వసుంధర నిర్వహించిన అందాల పోటీలో ‘మిస్ ఎబిలిటీ’ టైటిల్ విన్నర్ రేఖారాణి, రన్నరప్ లక్ష్మీ సుందరిలతో వసుంధర ఆత్మాభిమానంతో రాజీనామా! చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాదు వెళ్లడానికి తల్లి అంగీకరించనప్పుడు.. ‘‘నేనేమీ అడవిలోకి వెళ్లట్లేదు’’ అని ఆమెను ఒప్పించిన వసుంధర ఒక సంవత్సరం పాటు ఒక టీవీ చానెల్లో ఉద్యోగం చేశారు. అక్కడ వివక్షకు గురయ్యారు. ఆమె పనిచేసినా పనిచేయకపోయినా జీతం ఇచ్చేయమని మేనేజ్మెంట్ అన్నట్లు తెలిసి ఆమె ఆత్మాభిమానం దెబ్బతింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి 2014లో తన సొంత సంస్థ ‘వేవ్ మీడియా’ ప్రారంభించారు. ఆ తర్వాత ‘అంధుల క్రికెట్’ నిర్వహించారు. వారి సంస్థ తరఫున 2015లో ‘మిస్ ఎబిలిటీ’ కార్యక్రమం ఏర్పాటు చేద్దామనుకుంటే, 2018 ఏప్రిల్ నాటికి కార్యరూపం దాల్చింది. ‘‘మాతో పనిచేయాలంటే సెన్సిబుల్‌గా ఉండాలి. అది నాలాంటి వాళ్లకి మాత్రమే తెలుస్తుంది’’ అంటారు వసుంధర. తలా ఒక చెయ్యేస్తే చాలు చిన్నప్పటి నుంచి ఒంటరిగానే పోరాడుతున్నారు వసుంధర. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అన్నిటినీ ఒంటరిగానే అధిగమిస్తున్నారు. అంతేకాదు, తనలాంటివారికి అండగా నిలుస్తున్నారు, వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు వసుంధర. ‘‘దివ్యాంగులకు బ్యాంకులు లోన్లు ఇవ్వాలంటే వారిని నమ్మి గ్యారంటీ ఇచ్చేవారు ఉండరు. చదువుకోనివారు సైతం లోన్ తీసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు వీరికి ఎందుకు ఇవ్వకూడదు? ప్రభుత్వం వీరి తరఫున నిలబడి లోన్లు ఇప్పించాలి’’ అంటున్నారు వసుంధర. వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేవారు, వీరి గురించి ఆలోచించి, వీరు చేసేవాటికి కూడా పెట్టుబడులు పెట్టవచ్చు కదా అంటారు వసుంధర. ‘‘పెద్ద పెద్ద కంపెనీలు మా తరఫున ప్రచారం చేయొచ్చు కదా’’ అని ప్రశ్నిస్తున్నారు. అలాగే, దివ్యాంగులు అన్నిరకాల వస్త్రాలు ధరించలేరు కనుక వారికి అనుగుణంగా అందమైన వస్త్రాల ను ప్రత్యేకంగా బొటిక్వారు చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు చేసే మొత్తంలో ఐదు శాతం దివ్యాంగుల సంక్షేమానికి వినియోగించాలని, ఏడాదికి వందమందినైనా ఉద్యోగాలకు ఆహ్వానించాలని కోరుతున్నారు. అవార్డులు.. పురస్కారాలు ►లేడీ లెజెండ్ అవార్డు – 2018 (ట్యూటర్స్ ప్రైడ్ ఆర్గనైజేషన్) ►విశిష్ట సేవా పురస్కార్ 2018 (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి) ►ఇండియన్ అడ్వాంటేజ్ ఉమెన్ అవార్డు 2018 (దేశవ్యాప్తంగా వచ్చిన 19,300 అప్లికేషన్లలో 25 మందిని ఎంపిక చేయగా వారిలో ఒకరు). ►2013లో జరిగిన ‘మిస్ వీల్ చెయిర్’ ప్రోగ్రామ్‌లో ‘మోస్ట్ వోటెడ్ గర్ల్ ఆఫ్ ద నేషన్’ అవార్డు (ఆంధ్రప్రదేశ్ నుంచి) ►తెలుగు రక్షణ సమితి, హైదరాబాద్ వారి నుంచి 2013 ఉత్తమ కవయిత్రి బహుమతి. – వైజయంతి పురాణపండ వసుంధర మెయిల్ ఐడీ:koppulavasundhara@gmail.com -
అప్పుడే చేయి ఆరోగ్యంగా ఉన్నట్టు!
ఆయన దాన్ని మనసులో పెట్టుకుని, గుప్పిట మూసుకుని సాయంత్రం ఇంటికి వెళ్లాడు. భార్య గమనించి, ‘ఏమైంది?’ అని ఆశ్చర్యంగా అడిగింది. ఒక ఊళ్లో ఒకాయన ఉండేవాడు. ఎవరికి ఏమైనా అవసరమొచ్చినప్పుడు సాయం చేయడానికి వెనుకాడేవాడు కాదు. వీధిలో ఎదురుపడి తమ కష్టం చెప్పుకున్నా కూడా, ‘మా ఇంటికెళ్లి నా భార్యతో చెప్పి తీసుకో’ అని వాళ్లకు కావాల్సింది అందేట్టు చూసేవాడు. అయితే, ఈ «ధోరణి ఆయన భార్యకు నచ్చేది కాదు. కొన్నిసార్లు ఆ సాయం చేయడానికి నిరాకరించేది కూడా. ఒకరోజు అలా తిరగ్గొట్టిన విషయం ఆయనకు తెలిసింది. ఆయన దాన్ని మనసులో పెట్టుకుని, గుప్పిట మూసుకుని సాయంత్రం ఇంటికి వెళ్లాడు. భార్య గమనించి, ‘ఏమైంది?’ అని ఆశ్చర్యంగా అడిగింది. ‘ఇది ఎప్పుడూ ఇలాగే వుందనుకో, దాన్నేమంటావ్?’ అని ప్రశ్నించాడు. ‘ఏదో వైకల్యం ఉన్నట్టు’ అని జవాబిచ్చింది. మళ్లీ పూర్తిగా అరచేయిని చాచి చూపిస్తూ, ‘ఎప్పుడూ ఈ చేయి ఇలాగే ఉండిపోయిందనుకో, దాన్నేమంటావ్?’ అన్నాడు.ఏం చెప్పబోతున్నాడో అర్థం చేసుకుంటున్నట్టుగా, ‘ఇది కూడా ఇంకో రకం వైకల్యమే’ అని జవాబిచ్చింది.‘అదీ, అందుకే నువ్వు నా మంచి భార్యవు’ అని నవ్వుతూ తన పనిలో పడిపోయాడు. సంపద వచ్చినప్పుడు కాపాడాలి. వచ్చినదాన్ని పంచుతూవుండాలి. అప్పుడే చేయి ఆరోగ్యంగా ఉన్నట్టు! ఆ పైన ఎప్పుడూ ఆమె సాయం చేయడానికి వెనుకాడలేదు. -
అమ్మ
అనగనగా సూర్యుడికో కూతురుండేది. తండ్రిలాగే ఆమె కూడా ప్రచండ తేజస్విని. సూర్యుడు తన వెలుగంతా ఆమెకే ఇవ్వాలనుకున్నాడు. వేళ్లకు నక్షత్రాల వుంగరాలతో, కాళ్లకు, నడుముకు, మెడకు వివిధ కాంతిపుంజాల ఆభరణాలతో, ధూమకేతు చేలాంచలాలతో దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతూ ఆకాశంలో ఆడుకునేది, వెలుగు ప్రసరించిన విశ్వాంతరాళం ఆమె సామ్రాజ్యం. గులకరాళ్లలా అంతటా విస్తరించిన గ్రహాలను దాటి దారితప్పి దూరంగావున్న మరో గ్రహంవైపు పయనించింది. అది ఆకుపచ్చగానూ, నీలం రంగులోనూ కనిపించింది. ‘‘ఆహా! ఎంత అందమైన ప్రదేశం. ఆ నీల, హరిత లోకంలో నక్షత్ర ఖచితసింహాసనం అధిష్ఠిస్తాను. అక్కడే కలకాలం వుండిపోవాలని వుంది’’ అని చెప్పింది తండ్రితో. సూర్యుడు నిట్టూర్చాడు. తన కూతురి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అతనూహించగలడు. ‘‘నా ఆధీనంలో ఉన్న అన్ని గ్రహాలూ నీవే. ఎక్కడికైనా నువ్వు నిరభ్యంతరంగా వెళ్లొచ్చు. కానీ ఆ గ్రహం మీద ఉండాలంటే నీ కాంతి, వేడి బాగా తగ్గించుకోవాలి. నీ ఉంగరాలూ, ఆభరణాలూ, దుస్తులు ఆ గ్రహం భరించలేదు. ఆ హరిత వాతావరణం చాలా సుకుమారమైనది. నీ శరీర ఉష్ణానికి నీలిగా కనిపించేదంతా ఆవిరైపోతుంది. అందువల్ల ప్రస్తుతమున్న నీ అలంకరణలకు బదులు మరో మూడు వరాలు కోరుకో తక్షణమే ఇస్తాను’’ అన్నాడు సూర్యుడు దిగులుగా. ‘‘నన్నాలోచించుకోనీ’’ అన్నది పిల్ల. ఏళ్లు గడిచాయి. అనంతకాలంలో లక్షసంవత్సరాలన్నా ఓ క్షణంతో సమానమే గద. మరికాసేపాలోచించి, ‘‘నాకా గ్రహాన్ని తల్లిలా చేరదీయాలనిపిస్తున్నది, ఇదే నా కోరిక’’ అంది. ‘‘నా ముద్దుల తల్లీ, నీ యిష్టానికి నేనెప్పుడూ అడ్డుచెప్పను. ఎప్పుడు నీకు తిరిగి రావాలనిపిస్తే అప్పుడేరా. నీకోసం నేను నిరీక్షించని రోజుండదు. అక్కడికి వెళ్లాక నా కాంతికి నీ కళ్లు మూసుకోవచ్చు జాగ్రత్త’’ అన్నాడు సూర్యుడు ఆప్యాయంగా. అలా, ఆ పిల్ల వదిలేసిన వుంగరాలు, కాళ్ల కడియాలు, నక్షత్రహారాలు, ధూమకేతువులు సూర్యుడి చుట్టూ పాలపుంతలా పరచుకున్నాయి. అవి గుర్తులుగా ఆమె తన తండ్రి దగ్గరకి ఎప్పుడైనా తిరిగిరావచ్చు. ఒక పార, రోలు, రుబ్బురాయి, గంప, నీళ్లకుంట, గొడ్డలి, చాప, కప్పుకోవటానికో దుప్పటి, తినటానికి వెదురు బొంగులతో అల్లిన కంచాలు తీసుకుని అటుగా పయనించిన ఒక నక్షత్రం మీద ఎక్కి తన కొత్త నివాసానికి ప్రయాణమైందామె. మరెంతో కాలం విశ్వాంతరాళంలో విహరించి, హరిత గ్రహానికి చేరుకుంది. అక్కడ విస్తారంగా పెరిగిన అరణ్యాలు, పచ్చిక మైదానాలు, వివిధ జాతుల మొక్కలు చూసి ఆమె మనసు ఆనందంతో నాట్యం చేసింది. రంగురంగుల పువ్వులు – పసువు, నారింజ, ఎరుపు, తెలుపు, నిమ్మరంగు, నీలి, వూదా– వాటి కలయికతో ఏర్పడిన మరెన్నో రంగులు ఆమె అదివరకెప్పుడూ చూడలేదు. ‘‘ఇంత సంతోషాన్ని నేనొక్కదాన్ని భరించలేను. నాకు పిల్లలు కావాలి. చాలామంది పిల్లలు. అందర్నీ నేను పోషించగలను. కేరింతలు కొడుతూ, పాటలు పాడుతూ, నవ్వుతూ, తుళ్లుతూ, ఈ పర్వతాలు ప్రతిధ్వనించేలా కేకలు పెడుతూ ఆడుకుని, సేవచేసి, ప్రశాంతంగా నా కళ్లు మూసే పిల్లలు’’. ఆ క్షణమే ఆమె కోరిక తీరింది. వందలు, వేలు, లక్షల్లో పిల్లలు నలుదెసలా తిరుగాడారు. మగ, ఆడ, పొడుగు, పొట్టి, నలుపు, తెలుపు, లావు, సన్నం అన్ని రకాల పిల్లలు వచ్చి ఆ తల్లిని ఆలింగనం చేసుకున్నారు. అలాగ, అన్నాళ్లు ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశించిన ఆ నక్షతం మరోగ్రహం మీద జీవరాసులన్నింటికీ తల్లిగా మారింది. తారతమ్యం లేకుండా ఆమె అందర్నీ ఒక్కలాగే ప్రేమించింది. బలవంతులు, బలహీనులు, అందగాళ్లు, కురూపులు, చతురులు, మూర్ఖులు అన్న తేడా ఆమెకు లేదు. పిల్లలు నడిచారు. పరిగెత్తారు. రకరకాల కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. కొందరు అంతా తమకే కావాలన్నారు. కొందరు రోజుగడిస్తే చాలన్నారు. కొందరు తప్పులు చేసి చెయ్యలేదన్నారు. కొందరు అందరి తప్పులు తమమీద వేసుకున్నారు. కొందరు అంతా తమకే తెలుసన్నారు. కొందరు ఏమీ తెలియదన్నారు. కొందరి పనులు పక్కవాళ్లకు ప్రాణాంతకంగా మారాయి. కొందరు ఆత్మరక్షణ కోసం తండ్రి ప్రేమతో పంపిన ఎండ, తన పిల్లల్ని చలినుండి రక్షించింది. వర్షాలు కురిసి పంటలు బాగా పండాయి. శిశిరమూ, చలికాలమూ వచ్చి మొక్కల్ని కూడా నిద్రపుచ్చాయి. తన పారతో నేలను గుల్లగా చేసింది. పిల్లలు ఎంత తిన్నా తరగనంత భోజనం సమకూర్చింది. ఈ పిల్లల తల్లి తన సంతానం కోసం చెయ్యనిదంటూ లేదు. ఏళ్లు గడిచాయి. పిల్లల్లో మార్పు వచ్చింది. ‘‘నా గురించి ఇప్పుడెవరూ ఆలోచించరు. తమస్వార్ధమే తప్ప తల్లి అవసరమేమిటో ఎవరికీ పట్టదు’’ అని తండ్రితో చెప్పుకుని విలపించిందామె. ‘‘వాళ్లు నీ పిల్లలు. నీ ఇష్టంతో నువ్వు వాళ్లనీలోకంలో సృష్టించావు. విద్యాబుద్ధులు నేర్పించి, బాధ్యతల గురించి కూడా కాస్త చెప్పాలి మరి’’ అన్నాడు సూర్యుడు. కానీ వాళ్లు తన మాట వినరు. అస్తమానమూ తమలో తాము కీచులాడుకుంటారు. ఎంతిచ్చినా ఇంకా కావాలి అనే దురాశ బాగా పేరుకుపోయింది. ‘‘నాకు ఆకలేస్తోంది. నాకు నీళ్లు కావాలి. ఇన్ని కష్టాలా? మరింత సుఖం కావాలి’’ అంటూ వాళ్లు ఆమెను సతాయించని క్షణంలేదు. తన సంతానంలో ఎవరికే బాధకలిగినా పిల్లల తల్లి మనసు చివుక్కుమంటుంది. గాయమైందంటే లేపనం రాస్తుంది. ఆకలికి కొత్త పంటలు, దాహానికి కొత్త కాలవలు. కానీ వాళ్ల ఆశకు అంతులేదు. గిల్లి, రక్కి తనను వాళ్లు గాటుపెట్టని చోటులేదు. తల్లి ఇచ్చిన దానితో తృప్తిపడక ఒకర్నొకరు చంపుకుని ‘ఇదే మా విజయం’ అనుకున్నారు. తల్లి హృదయం క్షోభించింది. ఆమె ఆత్మ విశ్వాసం సన్నగిల్లింది. తమ కష్టాలన్నింటికీ పిల్లలు తల్లినే నిందించడం ఆనవాయితీగా మారింది. తనలో మొదటి ఉత్సాహం లేదు. తల్లిమీద కనికరంలేని పిల్లలు. తన పాలు కాదు. నెత్తురు తాగుతున్నారు. తనను కోసుకుని తిని అదే రుచికరమైన ఆహారమనుకుంటున్నారు. ఆమెకు విసుగొచ్చిన క్షణాన మహోధృతంగా గాలివీచి, చెట్లను కూకటివేళ్లతో పెకలిస్తుంది. కన్నీరు కార్చినప్పుడు సముద్రాలు పొంగుతాయి. పక్షుల కిలకిలా రావాలకు బదులు భీకర శబ్దాలతో కంపిస్తుంది. పర్వతాల మీద మంచు తుంపరలకు బదులు చల్లగాలి కంబళీ కప్పుకుంటుంది.ఆమె కుంచించుకుపోయిన తన అరణ్యాలను చూసి విలపించింది. తల్లిని వివస్త్రను చేసిన పిల్లలు ఎక్కడ తలదాచుకుంటారు. ఈ మారణ హోమాన్ని ఆపేదెట్లా? తల్లికి పిల్లల గురించి తప్ప మరో ధ్యాస లేదు. కానీ వాళ్లు ఆమె గుండెల్ని గునపాలతో తవ్వారు. విలువైన ఖనిజాలు, లోహాలు కావాలట. కండల్ని పీకి ఆనందించారు. నెత్తురు వరదలై కారింది. ఒకప్పుడు తల్లి జోలపాటలతో నిద్రపుచ్చింది. ఇప్పుడామె హాహాకారాలు కూడా వాళ్లకు వినిపించవు. ఒకప్పుడు తన ఒడిలో ఆడుకున్న పాపాయి ఇనప గోళ్లతో ఇప్పుడు తనను చిత్రహింసల పాలు చేస్తున్నాడు. తిరగగలిగినంత భూమి ఉంది అందరికీ. కానీ బలవంతుడు వచ్చి బలహీనుల భూమిని కబ్జాచేసి ‘ఇదినాదే’ అంటూ నిత్యం కలహించుకుంటే తనెన్ని తగువులని తీర్చగలదు? భూమి మాత్రమే కాదు. రాళ్లు రప్పల గురించి తలలు పగల కొట్టుకుంటున్నారు. స్వేచ్ఛగా విహరించే పక్షుల్ని, జంతువుల్ని పంజరాలలో బోనులలో బంధించారు. నదిలోని చేపల్ని ఇళ్లలో నీటి తొట్లలో వేశారు. అలా, అంతులేని మనోవ్యధతో కృంగి కృశించి ఒకనాడు కన్ను మూసింది పిల్లలతల్లి. కానీ పిల్లలకా విషయం కూడా తెలియదు. మరణం తర్వాత ఆమె రెండో కోరిక తీరింది. తన అవశేషాలను ఒక నల్లటి గుడ్డలోకట్టి పిల్లల అవసరాలకోసం తిరిగి వచ్చింది. అయితే ఇప్పుడామె ఒక ప్రేతంలాగున్నది. ఎవరూ గుర్తుపట్టలేదు. అయినా, తల్లి గురించి ఆలోచించటం పిల్లలెప్పుడో మానేశారు. అప్పుడప్పుడూ పర్వతాలలో, అరణ్యాలలో, సముద్రంమీద తుపానులాగ ఆమె రోదించింది. ఇంత మందిని కన్నా, ఒకే పిల్లకు మాత్రం తనంటే ప్రేమ, నల్లటి జుత్తు, అందమైన కళ్లతో చక్కగా పెరిగిందా అమ్మాయి. ఆమెను చూస్తే తల్లి హృదయం పొంగుతుంది. ఇన్ని కోట్ల మందిలో ఒక్కరైనా తనగురించి ఆలోచిస్తున్నందుకు తల్లికి తన ప్రయత్నం వృ«థా కాలేదనిపించింది. తన తర్వాత తన పని కొనసాగించటానికి ఈ పిల్ల చాలు. ఒక వాయు ప్రళయం వచ్చి ఆమెను రజనుగా మార్చి ఆకాశంలోకి తీసుకెళ్లింది. అక్కడ ఘనీభవించిన ఆ రజనే మనం చూసే చంద్రుడు. తండ్రి ప్రకాశాన్ని తనలో జీర్ణించుకొని, చల్లని చూపులతో భూమి మీద తన పిల్లల్ని ఆశీర్వదిస్తున్నదా తల్లి. ఆమె చలువ వల్లనే మన గ్రహం ఇంత పచ్చగా, చల్లగా ఉన్నది. నిత్యం పోట్లాడుకుంటున్న పిల్లల్ని చూసి కన్నీరు కారుస్తున్నదా తల్లి. ఈ ఘోరాలు చూడలేక ఆమె కనుమరుగై, సన్నటి వంకలా మారుతుంది. పిల్లల్లో మార్పు వస్తుందేమోనని ప్రతినెలా వెన్నెల కురిపిస్తుంది. తల్లిని ప్రేమించటం ఎప్పుడు నేర్చుకుంటారీ పిల్లలు!? -
విధిరాతను తిరగరాసి..
చిన్నపాటి సమస్యకే డీలా పడిపోతారు..జీవితమే ముగిసిపోయినట్లు కుంగిపోతారు. నిరాశలో కాలం వెళ్లదీస్తారు. కానీ శిరీషను చూస్తే నిరాశకే నిరాశ పుట్టకమానదు..విధిరాతను తిరగరాసింది. పుట్టుకతో వచ్చిన శారీరక వైకల్యానికి మనోధైర్యంతో ..పట్టుదలతో సమాధానం చెప్పింది. లక్షమందిలో ఒకరికి వచ్చే జబ్బు తనకే వచ్చినా అమ్మానాన్నల ప్రోత్సాహం శిరీషలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఈ లక్షణాలే ఆదివారం బెంగళూరులో రాష్ట్రపతి చేతుల మీదుగా మూడు చక్రాల కుర్చీలో కూర్చుని పురస్కామందుకునేలా చేస్తున్నాయి. చిత్తూరు అర్బన్: ఎప్పుడైనా కాస్త నిరాశ కలిగితే చిత్తూరులోని కొంగారెడ్డిపల్లెకు చెందిన శిరీష గురించి తెలుసుకోండి.. నిరాశ పటాపంచలవుతుంది. విజయకుమార్, సుజాత రెండో సంతా నంగా శిరీష 1987లో పుట్టింది. పుట్టుకతోనే అస్టోజెనిసిస్ ఇంపెర్ఫెక్టా జెనటిక్ డిజార్డర్ అనే వ్యాధి సోకింది. దీనికారణంగా శరీరంలోని కాళ్లు, చేతులు, వెన్నెముకతో పాటు అన్ని అవయవాలు సరిగా పనిచేయటం మానేశాయి. ఈ బిడ్డ పుట్టిన నాలుగేళ్లకు వైమానికదళంలో ఉద్యోగం మానేసిన విజయకుమార్ ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితంలేదు. లక్ష మందిలో చాలా కొద్ది మందికి మాత్రమే వచ్చే లోపమని వైద్యులు చేతులెత్తేశారు. నడవలేని చిన్నారికి తామే కాళ్లయ్యారు విజయకుమార్, సుజాత దంపతులు. విజయకుమార్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో చేస్తున్నారు. తల్లి ఇంట్లో శిరీషకు అన్నీ తానై చేదోడుగా నిలిచారు. ఇంట్లోనే ట్యూటర్‌ను పెట్టి పాఠాలు చెప్పించారు. ఎక్కడికి కదలాలన్నా మూ డు చక్రాల సైకిలే ఆధారం. ఏం చేయాలన్నా ఎవరో ఒకరు సాయపడేవారు. ఏడో తరగతి పాసైన తరువాత చిత్తూరు షర్మన్ బాలికల పాఠశాలలో రెగ్యులర్‌గా చదివి పదో తరగతి, విజేత కళాశాలలో ఇంటర్, ఎస్వీ రాజు కళాశాలలో బీకాం కంప్యూటర్స్ ఉత్తీర్ణత సాధించారు. ఆశావాదంతో అడుగులు డిగ్రీ పూర్తయిన తర్వాత బ్యాంకు ఉద్యోగాలపై శిరీష దృష్టి సారించారు. తండ్రి నేర్పిన మెలకువలతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) పరీక్షలకు ప్రిపేరయ్యారు. తొలిసారే శిరీష ఈ పరీక్షల్లో అర్హత సాధించినా వైకల్యం కారణంగా ఉద్యోగం రాలేదు. తరువాత గ్రామీణ బ్యాంకు పరీక్షల్లో రాణించి అర్హత సాధించారు. ఇక్కడా అదే కారణం చూపారు.. కానీ ఉద్యోగం చేయాలనే ఆశయం ఈమెను బెంగళూరు వరకు తీసుకెళ్లింది. అక్కడ తొలుత డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా చేరింది. మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. నెలకు రూ.7 వేలు జీతం. సహాయకురాలికి, ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు రూ.15 వేలయ్యేవి. తండ్రి సహకరించడంతో ఆర్థిక ఇబ్బందులుండేవి కావు. అనంతరం వీడియోకాన్ సంస్థలో కస్టమర్‌కేర్‌లో పనిచేస్తూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బ్యాంకు పరీక్షల్లో ప్రతిభ చాటి జూనియర్ ఆఫీసర్‌గా ఉద్యోగం సం పాదించారు శిరీష. అయినా చదువుపై మక్కువతో ఎంబీఏ చేస్తున్నారు. నేడు కోవింద్ చేతుల మీదుగా పురస్కారం.. ఏటా ప్రత్యేక ప్రతిభావంతులుగా స్ఫూర్తిదాయకంగా నిలిచేవారికి భారత ప్రభుత్వం పురస్కారాలు అందజేస్తుంది. వైకల్యం వెక్కిరించినా తన కెరీర్‌ను చక్కగా మలుచుకుని రాణిస్తున్న శిరీష ఈ ఏడాది ఇలా ఎంపికైన జాబితాలో చోటు సంపాదించింది. మన జిల్లా నుంచి ఇలా ఎంపికైంది ఈమె ఒక్కరే. ఆదివారం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఇప్పటికే శిరీష కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. -
బలాంగులు
నేడు ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్’ సందర్భంగా అంగ వైకల్యం ఆశయ సాధనకు అవరోధం కాదు. మానసిక వైకల్యం మనిషి పురోగతికి లోపం కాదు. జనాభాలో చాలామందికి ఎలాంటి శారీరక వైకల్యాలూ, మానసిక వైకల్యాలూ ఉండవు. మనశ్శరీరాలను బాధించే సమస్యలు ఏవీ లేకున్నా, జీవితం గడవటానికి ఏ లోటూ లేకున్నా పుట్టినది మొదలు పోయేలోగా జీవితంలో అలాంటి వాళ్లు సాధించేదేమీ ఉండదు. దృక్పథంలోని వైకల్యాల కారణంగానే చాలామంది నిరర్థకంగా బతుకులు లాగించేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ల కంటే జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన గల వికలాంగులే మెరుగైన వాళ్లు. కుంగదీసే వైకల్యాలు ఉన్నా, వివిధ రంగాల్లో ఎవరికీ తీసిపోని ఘనవిజయాలు సాధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో కొందరు ప్రముఖుల గురించి... స్టీఫెన్ హాకింగ్ సమకాలీన ప్రపంచంలో సాటిలేని మేటి మేధావిగా గుర్తింపు పొందిన మనతరం మహా శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. భౌతికశాస్త్రంలోను, అంతరిక్ష శాస్త్రంలోను ఆయన సాధించిన విజయాలు సామాన్యమైనవి కావు. స్టీఫెన్ హాకింగ్ 1942 జనవరి 8న ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్ నగరంలో పుట్టాడు. తండ్రి ఫ్రాంక్, తల్లి ఇసోబెల్. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో ఫ్రాంక్, ఇసోబెల్ ఒక మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేవారు. ఫ్రాంక్ పరాన్నజీవుల మీద పరిశోధనలు సాగించేవాడు. ఇసోబెల్ అక్కడే సెక్రటరీగా పనిచేసేది. అక్కడి పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకు స్టీఫెన్ పుట్టాడు. పుట్టినప్పుడు సాధారణంగానే ఉన్నాడు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. కాలేజీలో ఉన్న కాలంలోనే ఐన్‌స్టీన్‌కు సాటి వచ్చే మేధావిగా గుర్తింపు పొందాడు. సాటి విద్యార్థులే కాదు, అధ్యాపకులు సైతం స్టీఫెన్ మేధాశక్తికి అబ్బురపడేవారు. ఆక్స్ఫర్డ్ వర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న కాలంలో మోటార్ న్యూరాన్ డిసీజ్‌కు లోనయ్యాడు. క్రమక్రమంగా వ్యాధి శరీరాన్ని లొంగదీసుకుంటుండడంతో చాలా రోజులు డిప్రెషన్లో పడ్డాడు. ఇతరుల సాయం లేనిదే నడవలేని స్థితికి చేరుకున్నాడు. మాటల్లో స్పష్టత కోల్పోయాడు. అప్పట్లో స్టీఫెన్ హాకింగ్‌ను పరీక్షించిన వైద్యులు రెండేళ్లకు మించి బతకడం సాధ్యం కాదని పెదవి విరిచేశారు. అంతరిక్ష రహస్యాల అంతు తేల్చాలన్న హాకింగ్ సంకల్పం ముందు వైద్యుల అంచనాలు తల్లకిందులయ్యాయి. దాదాపు కదల్లేని స్థితిలో ఉన్నా, పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశాడు. పూర్తిగా వీల్‌చైర్‌కు పరిమితమైన స్థితిలో సైతం భౌతిక శాస్త్రంలో, అంతరిక్ష శాస్త్రంలో అద్భుతమైన పరిశోధనలు చేసి ‘ఆడమ్స్ అవార్డు’ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను, సత్కారాలను పొందాడు. శారీరక పరిస్థితి వల్ల హాకింగ్ నిమిషానికి పదిహేను పదాలను మాత్రమే మాట్లాడగలడు. అయినా, ఏమాత్రం సడలని పట్టుదలతో ప్రస్తుతం డెబ్బై అయిదేళ్ల వయసులోనూ తన కాలాన్ని శాస్త్ర పరిశోధనలకే వెచ్చిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎందరో యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. హెలెన్ కెల్లెర్ ఊహ తెలియని బాల్యంలోనే కంటిచూపును, వినికిడి శక్తిని కోల్పోయినా మొక్కవోని దీక్షతో రచయిత్రిగా, ఉద్యమకారిణిగా, సామాజిక సేవకురాలిగా ఎదిగిన గొప్ప మహిళ హెలెన్ కెల్లెర్. అమెరికాలో అలబామా రాష్ట్రంలోని టస్కంబియా పట్టణంలో 1880 జూన్ 27న పుట్టిందామె. ఆమె తండ్రి చార్లెస్ ఆడమ్స్ అమెరికన్ సివిల్ వార్‌లో సైనికాధికారిగా పనిచేశాడు. ఆ తర్వాత ఒక పత్రికకు సంపాదకుడయ్యాడు. తల్లి కేట్ ఆడమ్స్ సాధారణ గృహిణి. మాటలైనా సరిగా పలకడం రాని పంతొమ్మిది నెలల వయసులో హెలెన్ తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఫలితంగా కంటిచూపును, వినికిడి శక్తిని పూర్తిగా కోల్పోయింది. కాస్త ఎదుగుతున్న వయసులో తన మనసులోని మాటలను సైగల ద్వారా చెప్పడానికి ప్రయత్నించేది. మొదట్లో ఆమె సైగలను వాళ్ల ఇంట్లో పనిమనిషి కూతురు ఆరేళ్ల పసిపాప మార్తా వాషింగ్టన్ మాత్రమే అర్థం చేసుకోగలిగేది. హెలెన్ తనకు ఏడేళ్ల వయసు వచ్చేనాటికి కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి తనకు తానుగానే అరవై రకాల సైగలను రూపొందించుకుంది. అప్పట్లో లారా బ్రిడ్గ్మాన్ అనే బధిరాంధ మహిళ సాధించిన విజయాల గురించి ప్రఖ్యాత రచయిత చార్లెస్ డికెన్స్ రాసిన వ్యాసం హెలెన్ తల్లి కేట్‌పై ప్రభావం చూపింది. ప్రయత్నిస్తే తన కూతురు కూడా విజయాలు సాధించగలదని ఆమె విశ్వసించింది. తొలుత ఒక వైద్యుడిని సంప్రదించి, ఆయన సూచనపై టెలిఫోన్ ఆవిష్కర్త అలెగ్జాండర్ గ్రాహంబెల్ వద్దకు కూతురిని తీసుకువెళ్లింది. గ్రాహంబెల్ అప్పటికే బధిర బాలల విద్య కోసం కృషి కొనసాగిస్తున్నాడు. అతని సలహాపై పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్‌ను ఆశ్రయించింది. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ హెలెన్ కోసం ఏన్ సులివాన్ అనే టీచర్‌ను కుదిర్చాడు. హెలెన్‌కు ఏన్ ఇంటి వద్దనే పాఠాలు చెప్పేది. పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి పాఠశాల విద్య పూర్తి చేసుకున్నాక మసాచుసెట్స్‌లోని ర్యాడ్‌క్లిఫ్ కాలేజీ నుంచి బీఏ పూర్తి చేసి, అమెరికాలోనే డిగ్రీ సాధించిన తొలి బధిరాంధ మహిళగా గుర్తింపు పొందింది. డిగ్రీ పూర్తయ్యాక ఏదో ఉద్యోగం చూసుకుని స్థిరపడిపోకుండా, సాటి వికలాంగుల అభ్యున్నతి కోసం అహరహం పాటుపడింది. సామాజిక కార్యకర్త జార్జ్ ఏ కెస్లర్‌తో కలసి మూగ, బధిర, అంధ బాలల చికిత్స కోసం, అందుకు సంబంధించిన వైద్య పరిశోధనల కోసం హెలెన్ కెల్లెర్ ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించింది. అమెరికాలోని సోషలిస్టు పార్టీలో చేరి, మహిళలకు ఓటు హక్కు, పేదరిక నిర్మూలన వంటి పలు సామాజిక సమస్యలపై పోరాటం సాగించింది. వక్తగా, రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించింది. బీథోవెన్ పాశ్చాత్య శాస్త్రీయ సంగీత ప్రపంచంలో మైలురాయిగా నిలిచిన జర్మన్ సంగీత విద్వాంసుడు లుడ్విన్ వాన్ బీథోవెన్ ఎప్పుడు పుట్టాడో వివరాలు తెలియవు. అయితే, 1770 డిసెంబర్ 17న బాప్టిజం స్వీకరించాడు. అప్పట్లో జర్మనీ అధీనంలో ఉన్న మెషెలిన్ అనే పట్టణంలో బీథోవెన్ బాల్యం గడిచింది. ఆ పట్టణం ఇప్పుడు బెల్జియంలో ఉంది. బధిరుడైన తర్వాత కూడా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించిన విద్వాంసుడిగా బీథోవెన్ పేరు చరిత్రలో సుస్థిరంగా నిలిచి ఉంది. తాత పేరు పెట్టుకున్న బీథోవెన్కు సంగీతం వారసత్వంగా అబ్బింది. బాన్ నగరంలో తండ్రి జోహాన్ చిన్న చిన్న సంగీత నాటక సంస్థల్లో పనిచేసేవాడు. బీథోవెన్ తన తండ్రి దగ్గరే సంగీతంలో తొలి పాఠాలు నేర్చుకున్నాడు. ఐదారేళ్ల వయసులోనే బీథోవెన్ సంగీతంలో అపారమైన ప్రతిభ చూపేవాడు. పియానో ముందు గంటల కొద్దీ గడిపేవాడు. ఆ వయసులోనే అతడు చేసే స్వర విన్యాసాలకు సంగీత పాఠాలు చెప్పే పెద్దలు సైతం దిగ్భ్రమ చెందేవారు. పద్దెనిమిదేళ్ల ప్రాయంలోనే స్వయంగా మూడు సొనాటాలకు స్వరకల్పన చేశాడు. అప్పటికే సంగీత దిగ్గజంగా వెలుగుతున్న మోజార్ట్ను కలుసుకునేందుకు బీథోవెన్ వియన్నా బయలుదేరాడు. అయితే, కుటుంబ సమస్యల వల్ల రెండువారాలకే అక్కడి నుంచి వెనుదిరిగి రావాల్సి వచ్చింది. కొద్ది రోజులకే తల్లి మరణించింది. మానసికంగా కుంగిపోయిన తండ్రి తాగుడుకు బానిసయ్యాడు. చిన్న పిల్లలైన ఇద్దరు తమ్ముళ్ల బాధ్యత పూర్తిగా బీథోవెన్పై పడింది. వారి బాగోగులు చూసుకుంటూ ఐదేళ్లు బాన్లోనే ఉండిపోయాడు. బాధ్యతల నుంచి తేరుకున్నాక తిరిగి వియత్నాం చేరుకున్నాడు. మోజార్ట్ అప్పటికే కాలం చేయడంతో బీథోవెన్ తన జీవితకాలంలో మోజార్ట్ను కలుసుకోలేకపోయాడు. వియన్నాలో బీథోవెన్ జీవిక కోసం పిల్లలకు సంగీత పాఠాలు చెప్పేవాడు. కచేరీలు చేసేవాడు. మరోవైపు నిద్రాహారాలను పట్టించుకోకుండా సంగీతంలో ప్రయోగాలు కొనసాగించేవాడు. ఒకనాడు సంగీత సాధనలో ఉండగానే అకస్మాత్తుగా మూర్ఛపోయాడు. స్పృహవచ్చాక తాను వినికిడి శక్తి కోల్పోయినట్లు గ్రహించాడు. ఈ ఉపద్రవం 1798లో సంభవించింది. చికిత్స తీసుకుంటున్నా, వినికిడి శక్తి ఏమాత్రం మెరుగుపడకపోవడంతో బీథోవెన్ నిరాశలో కూరుకుపోయి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. వైద్యుల సలహాపై వియన్నా శివారు పట్టణం హీలిజెన్స్టాట్కు మకాం మార్చాడు. నెమ్మదిగా మళ్లీ సంగీత సాధనలో పడ్డాడు. బీథోవెన్ 1824లో తొమ్మిదో సింఫనీని ప్రదర్శిస్తుండగా అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న అతడి వినికిడి శక్తి పూర్తిగా పోయింది. అయినా బీథోవెన్ సంగీతానికి దూరం కాలేదు. పూర్తి బధిరుడుగా మారిన తర్వాత తన సంగీతాన్ని తానే వినలేని స్థితిలో సైతం శ్రోతలను ఉర్రూతలూగించే స్వరకల్పనలు చేశాడు. పాశ్చాత్య సంగీత ప్రపంచంలో మైలురాయిగా నిలిచిపోయాడు. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అమెరికా 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ పోలియో బాధితుడు. అధ్యక్ష పదవిని అధిష్ఠించడానికి అంగవైకల్యం ఆయనకు ఏమాత్రం అవరోధం కాలేదు. పైగా అమెరికా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్న నాయకుడిగా చరిత్రను సృష్టించడం విశేషం. అంతేకాదు, టీవీ తెరపై కనిపించిన తొలి అధ్యక్షుడు కూడా ఆయనే. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ 1882 జనవరి 30న న్యూయార్క్‌లో ఒక సంపన్న కుటుంబంలో పుట్టాడు. తండ్రి జేమ్స్, తల్లి సారా. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ నాయనమ్మ మేరీ రెబెక్కా అమెరికా ఐదో అధ్యక్షుడు జేమ్స్ మన్రో భార్య ఎలిజబెత్ మన్రోకు సోదరి వరుస. ఉన్నతస్థాయి రాజకీయ సంబంధాలు గల సంపన్న కుటుంబం కావడంతో ఫ్రాంక్లిన్ బాల్యం బాగానే గడిచింది. మసాచుసెట్స్‌లోని గ్రాటన్ బోర్డింగ్ స్కూల్లోను, అక్కడకు చేరువలోని హార్వర్డ్ కాలేజీలోను అతని చదువు సంధ్యలు సాగాయి. హార్వర్డ్ కాలేజీ నుంచి చరిత్రలో పట్టా పుచ్చుకున్నాడు. తర్వాత కొలంబియా లా కాలేజీలో చదువుకున్నాడు. చదువు పూర్తయ్యాక ఒక వాల్‌స్ట్రీట్ కంపెనీలో కొంతకాలం పనిచేశాడు. బంధువుల అమ్మాయి అయిన ఎలినార్‌ను 1905లో పెళ్లాడాడు. వారికి ఐదుగురు పిల్లలు. ఫ్రాంక్లిన్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనసాగాడు. యువ నాయకుడిగా దూసుకుపోతున్న రోజుల్లో 1921లో అకస్మాత్తుగా పోలియో బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కాళ్లు చచ్చుబడిపోయాయి. అప్పటి నుంచి వీల్‌చైర్‌కే పరిమితమయ్యాడు. నడవలేని పరిస్థితిలో ఇక ఇంటికి పరిమితం కావడమే మంచిదని ఫ్రాంక్లిన్ తల్లి సారా అభిప్రాయపడింది. అయితే, ఫ్రాంక్లిన్ భార్య ఎలినార్, స్నేహితురాలు లూయీ హోవె అతడికి ధైర్యం చెప్పారు. చికిత్స కోసం రకరకాల ప్రదేశాలకు తిరుగుతూనే డెమోక్రటిక్ పార్టీ నాయకులతో సంబంధాలు కొనసాగించేవాడు. అధ్యక్ష పదవికి 1928లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీపడ్డ స్మిత్‌కు మద్దతు పలికాడు. స్మిత్ ఇందుకు ప్రతిఫలంగా అదే ఏడాది న్యూయార్క్ గవర్నర్ ఎన్నికల్లో ఫ్రాంక్లిన్‌ను బరిలోకి దించాడు. అధ్యక్ష ఎన్నికల్లో స్మిత్ పరాజయం చెందినా, న్యూయార్క్ గవర్నర్ ఎన్నికల్లో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అతి స్వల్ప ఆధిక్యతతో గెలుపొందాడు. ఫ్రాంక్లిన్ గవర్నర్ అయిన ఏడాదిలోగానే ఆర్థికమాంద్యం దెబ్బకు వాల్‌స్ట్రీట్ కుదేలై, వేలాది మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. పరిస్థితి చక్కదిద్దడానికి ఆయన చరిత్రలోనే తొలిసారిగా నిరుద్యోగ బీమా ప్రవేశపెట్టారు. తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టి, 1932 నాటి అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి 1933లో అధ్యక్ష పదవి చేపట్టారు. ఆ తర్వాత మరో రెండుసార్లు జరిగిన ఎన్నికల్లోనూ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తాను 1945లో మరణించేంత వరకు ఈ పదవిలో కొనసాగారు. ఫ్రాంక్లిన్ హయాంలోనే రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. జపాన్ పెర్ల్ హార్బర్‌పై దాడి చేయడంతో అమెరికా జపాన్‌పై యుద్ధం ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో ఉన్నప్పుడు పదవిలో కొనసాగుతుండగానే 1945 ఏప్రిల్ 12న ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ కన్నుమూశారు. థామస్ అల్వా ఎడిసన్ ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగంలో అద్భుతమైన ఆవిష్కర్తగా, విజయవంతమైన వాణిజ్యవేత్తగా గుర్తింపు పొందిన థామస్ అల్వా ఎడిసన్ ప్రమాదవశాత్తు బాల్యంలోనే బధిరుడయ్యాడు. అతడు సాధించిన శాస్త్ర సాంకేతిక, వ్యాపార విజయాలకు బధిరత్వం అవరోధం కాలేదు. థామస్ ఎడిసన్ 1847 ఫిబ్రవరి 11న అమెరికా ఓహాయో రాష్ట్రంలోని మిలాన్ నగరంలో శామ్యూల్, నాన్సీ దంపతులకు పుట్టాడు. వారి ఏడుగురు సంతానంలో థామస్ చివరివాడు. డచ్ సంతతికి చెందిన శామ్యూల్ పూర్వీకులు కెనడా నుంచి బతుకుదెరువు వెదుక్కుంటూ అమెరికాకు వలస వచ్చారు. శామ్యూల్ చిన్నా చితకా వ్యాపారాలు చేసేవాడు. మిలాన్‌లో వ్యాపారం దెబ్బతినడంతో కుటుంబంతో పాటు మిషిగాన్ చేరుకున్నాడు. అక్కడే థామస్‌ను స్కూల్లో చేర్చారు. ఎంత చెప్పినా అతడు పాఠాలను ఏమాత్రం తలకెక్కించుకోవడం లేదని టీచర్లు ఫిర్యాదు చేశారు. దీంతో తల్లి నాన్సీ కొడుకును స్కూలు మాన్పించింది. ఇంట్లోనే అతడికి పాఠాలు బోధించడం ప్రారంభించింది. ఒకవైపు ఇంట్లో చదువుకుంటూనే ఇంటికి ఆసరాగా ఉండటానికి లోకల్ ట్రైన్లలో క్యాండీలు, న్యూస్‌పేపర్లు అమ్మేవాడు. పదహారేళ్ల వయసులో గ్రాండ్ ట్రంక్ రైల్వే సంస్థలో కొంతకాలం టెలిగ్రాఫ్ ఆపరేటర్‌గా పనిచేశాడు. ఆ పని మానేశాక మిషిగాన్‌లో వీధి పక్కన న్యూస్‌పేపర్లు అమ్మే హక్కులను సొంతం చేసుకున్నాడు. న్యూస్పేపర్ల అమ్మకాల కోసం నలుగురు అసిస్టెంట్లను నియమించుకున్నాడు. కాగితంపై టైప్‌రైటర్‌తో ముద్రించిన కథనాలతో ‘గ్రాండ్ ట్రంక్ హెరాల్డ్’ అనే స్థానిక పత్రికను తెచ్చాడు. ఒకవైపు వ్యాపారాలతో ఆర్థికంగా నిలదొక్కుకుంటూనే, మరోవైపు సొంతగా శాస్త్ర సాంకేతిక ప్రయోగాలను కొనసాగించేవాడు. కొన్నాళ్లకు న్యూజెర్సీలోని నెవార్క్‌కు మకాం మార్చి, శాస్త్ర పరిశోధనలను మరింత ముమ్మరం చేశాడు. ఏ విద్యాసంస్థలోనూ అధికారికంగా చదువుకోకున్నా, స్వయంకృషితోనే శాస్త్రవేత్తగా ఎదిగాడు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక పురోగతినే మలుపుతిప్పిన విద్యుత్తు బల్బు, ఫోనోగ్రాఫ్, మోషన్ పిక్చర్, విద్యుత్ సరఫరా వ్యవస్థ, బ్యాటరీ, రబ్బర్ టైర్లు వంటి ఆవిష్కరణలను అందించాడు. అమెరికాతో పాటు పలు యూరోప్ దేశాల్లో తాను రూపొందించిన వస్తువులకు వందలాది పేటెంట్లు పొందిన ఎడిసన్ 1931 అక్టోబర్ 18న డయాబెటిస్తో బాధపడుతూ కన్నుమూశాడు. – పన్యాల జగన్నాథదాసు -
ఆ... గంట అమూల్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు) : బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైనప్పుడు మొదటి గంట ఎంతో అమూల్యమని, ఆ సమయంలో కనీసం నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరితో ఎలాంటి వైకల్యం కలగకుండా చికిత్సలు అందుబాటులోకి వచ్చినట్లు సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ శశాంక్ తెలిపారు. ప్రపంచ పక్షవాత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వాస్పత్రి న్యూరాలజీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ శశాంక్ మాట్లాడుతూ ఒకప్పుడు పక్షవాతానికి గురైతే నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి రావడంతో వైకల్యాలకు గురికాకుండా చూడవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.చక్రధర్ మాట్లాడుతూ పక్షవాతం లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. మెదడులో ఏ భాగానికి రక్త ప్రసరణ ఆగిపోతుందో ఆ భాగం నియంత్రణలో ఉండే అవయవాలు పట్టు తప్పుతాయన్నారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎ.శ్రీనివాసులు మాట్లాడుతూ పక్షవాతం వచ్చిన రోగికి తొలుత సీటీ స్కాన్ చేసి, రక్తనాళాల్లో గడ్డలు కారణంగా స్ట్రోక్ వచ్చిందా. రక్తనాళాలు చిట్లడం వల్ల వచ్చిందో గర్తించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. రక్తపోటు అదుపులో పెట్టుకోవాలి.... జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కంచర్ల సుధాకర్ మాట్లాడుతూ పక్షవాతం రావడానికి ప్రధాన కారణాలు రక్తపోటును అదుపులో పెట్టుకోక పోవడం, రక్తంలో గ్లూకోజ్ అదుపులో లేకపోవడం, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, ఆల్కాహాల్ అధిక మోతాదులో తీసుకోవడం, గుండెవ్యాధులు కలిగి ఉండటం, ముఖ్యకారణాలుగా పేర్కొన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ ఎస్.బాబూలాల్, డాక్టర్ ఎవీ రావు, సర్జరీ విభాగాధిపతి డాక్టర్ కె.శివశంకర్‌రావు, డిప్యూటీ ఆర్ఎంవో డాక్టర్ నరసింహనాయక్, నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి, మెడికల్ పీజీలు, నర్శింగ్ విద్యార్ధినిలు పాల్గొన్నారు. ర్యాలీ రామవరప్పాడు రింగ్ వరకూ కొనసాగింది.