వైకల్యాన్ని ఎదురించి.. కరాటేలో రాణించి..
వైకల్యాన్ని ఎదురించి.. కరాటేలో రాణించి..
Published Mon, Sep 19 2016 6:18 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
–చేతులు లేకున్నా కరాటేలో పతకాలు
–జాతీయ స్థాయిలో ప్రతిభ
–వెక్కిరిస్తున్న పేదరికం
–దాతల సాయం కోసం ఎదురుచూపు
ఆరాటం ముందు ఆటంకం ఎంత..
సంకల్పం ముందు వైకల్యం ఎంత..
ధడచిత్తం ముందు దురదృష్టం ఎంత..
అన్నట్టుగా కృషి, పట్టుదల, దక్షతతో చేతులు లేకున్నా కరాటేలో రాణిస్తున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు పాలకొల్లు లక్ష్మీనగర్‌కు చెందిన ఆత్మకూరి సురేష్. సెల్ రిపేరింగ్ దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ 20 ఏళ్లుగా కరాటేలోనూ సత్తాచాటుతున్నాడు.
–పాలకొల్లు సెంట్రల్
విధి చిన్నచూపు చూసినా అతని ఆత్మసై ్థర్యం ముందు ఓడిపోయింది. పుట్టుకతో రెండు చేతులు లేకున్నా కరాటేలో కింగ్‌లా మారాడు పాలకొల్లు లక్ష్మీనగర్‌కు చెందిన ఆత్మకూరి సురేష్. అతని చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కష్టాలు, కన్నీళ్లు తోడయ్యాయి. సురేష్ తల్లి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. అతని నలుగురు తమ్ముళ్లు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కుటుంబ ఆసరా లేకపోయినా స్థానికంగా సెల్ మరమ్మతులు దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సురేష్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అద్దె ఇంట్లో నివాసముంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏదైనా ఓ కళలో రాణించాలని నిర్ణయించుకున్న సురేష్ 1995లో పట్టణానికి చెందిన జపాన్ షోటోకాన్ కరాటే డూ కనంజూకు ఆర్గనైజేషన్ శిక్షకుడు ధనాని సూర్యప్రకాష్ వద్ద కరాటే శిక్షణ మొదలుపెట్టాడు. సురేష్ పట్టుదల చూసిన శిక్షకుడు ప్రకాష్ ప్రత్యేక శ్రద్ధ కనబర్చి కరాటేలో మెళకువలు నేర్పించారు. అప్పటినుంచి సురేష్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నాడు. విశాఖ, విజయవాడ, ఏలూరు, రాజమండ్రిలో జరిగిన స్టేట్, నేషనల్ కరాటే పోటీల్లో కుమితే విభాగంలో (స్పారింVŠ ) బంగారు పతకాలు, కటా విభాగంలో రజత పతకాలు గెలుచుకున్నాడు. ఖాళీ సమయంలో విద్యార్థులకు కరాటే నేర్పుతున్నాడు. సుమారు 300 మంది విద్యార్థులు అతని వద్ద శిక్షణ పొందారు.
దాతల సహకారం ఉంటే..
దాతల సహకారం ఉంటే కాయ్ ఆధ్వర్యంలో వచ్చే నవంబర్‌లో లక్నోలో జరిగే నేషనల్ చాంపియన్ పోటీల్లో పాల్గొంటానని సురేష్ అంటున్నాడు. సర్వశిక్షా అభియాన్ త్వరలో పాఠశాల విద్యార్థులకు కరాటే శిక్షణ ఇప్పించాలనే ఆలోచనలో ఉందని, సురేష్‌కు ఇన్‌స్ట్రక్టర్‌గా అవకాశం ఇప్పించాలని శిక్షకుడు ప్రకాష్ కోరుతున్నారు. సురేష్‌కు స్పారింగ్, కుమితే కిక్‌లలో మంచి ప్రావీణ్యత ఉందంటున్నారు.
Advertisement
Advertisement