confidance
-
బంగారు తెలంగాణ సాధనే ధ్యేయం
గ్రూప్–2 అభ్యర్థులతో మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల: బంగారు తెలంగాణ సాధనే ద్యేయంగా తమ ప్రభుత్వం చిత్తశుద్దితో కషి చేస్తుందని,ఇందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక పత్తి మార్కెట్ యార్డు ఆవరణలో సీఎన్ఆర్ ఫౌండేషన్,హెటిరో ఫార్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రూప్–2 అభ్యర్థుల ఉచిత శిక్షణ కేంద్రం ముగింపు కార్యక్రమానికి మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితెందర్‌రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. మంత్రి లక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ అనేక అభివద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ముఖ్యంగా ప్రజలకు సాగు,తాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపాదికన చర్యలు తీసుకుంటుందన్నారు. మిషన్ భగీరథ ద్వార ఇంటింటికి తాగు నీటిని అందించేందుకు కషి చేస్తున్నామన్నారు. బీదలందరికీ మంచి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని,అందులో భాగంగానే ఒక్క ఏడాదిలోనే 200 పైగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామన్నారు. విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.అదేవిధంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తుందన్నారు. ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల భర్తీకి చర్యలు తమ ప్రభుత్వం ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఇటీవలనే కొన్ని ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామన్నారు. జడ్చర్లలో గ్రూప్–2 అభ్యర్థులకు మంచి శిక్షణను ఉచింతంగా అందజేయాలన్న సదుద్దేశ్యంతో తాము సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీజేఆర్ కోచింగ్ సెంటర్,హెటిరో ఫార్మ పరిశ్రమ సౌజన్యంతో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 62 రోజుల పాటు శిక్షణను పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఆయా పోటీ పరీక్షలలో లక్షసాధనకు కషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ జితెందర్‌రెడ్డి మాట్లాడుతు అభ్యర్థులు పోటీ పరీక్షలలో తమ ప్రతిభను కనబరిచి ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. ఉద్యోగాల భర్తీలో పైరవీలకు తావిచ్చే ప్రసక్తి లేదని,ప్రతిభను మాత్రమే నమ్ముకోవాలని ఆయన అభ్యర్థులకు సూచించారు. మెటీరియల్ పంపిణీ... గ్రూప్ సిలబస్ శిక్షణ పొందిన 500 మంది అభ్యర్థులకు దాదాపు రూ.12 లక్షల వ్యయంతో హెటిరో ఆధ్వర్యంలో సిలబస్ మెటీరియల్‌ను పంపిణీచేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు జయప్రద,ప్రబాకర్‌రెడ్డి,ఎంపీపీలు లక్ష్మి,దీప,శ్రీను,మార్కెట్ యార్డు చైర్పర్సన్ శోభ,టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శివకుమార్,హెటిరో హెచ్ఆర్ గ్రూప్స్ ఉపాధ్యక్షులు బాస్కర్‌రెడ్డి, హెటిరో ఫైనాన్స్ ఏజీఎం చంద్రారెడ్డి,తదితరులు పాల్గొన్నారు. 24జేసీఎల్01: జడ్చర్ల పత్తి మార్కెట్లో ప్రసంగిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి -
వైకల్యాన్ని ఎదురించి.. కరాటేలో రాణించి..
–చేతులు లేకున్నా కరాటేలో పతకాలు –జాతీయ స్థాయిలో ప్రతిభ –వెక్కిరిస్తున్న పేదరికం –దాతల సాయం కోసం ఎదురుచూపు ఆరాటం ముందు ఆటంకం ఎంత.. సంకల్పం ముందు వైకల్యం ఎంత.. ధడచిత్తం ముందు దురదృష్టం ఎంత.. అన్నట్టుగా కృషి, పట్టుదల, దక్షతతో చేతులు లేకున్నా కరాటేలో రాణిస్తున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు పాలకొల్లు లక్ష్మీనగర్‌కు చెందిన ఆత్మకూరి సురేష్. సెల్ రిపేరింగ్ దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ 20 ఏళ్లుగా కరాటేలోనూ సత్తాచాటుతున్నాడు. –పాలకొల్లు సెంట్రల్ విధి చిన్నచూపు చూసినా అతని ఆత్మసై ్థర్యం ముందు ఓడిపోయింది. పుట్టుకతో రెండు చేతులు లేకున్నా కరాటేలో కింగ్‌లా మారాడు పాలకొల్లు లక్ష్మీనగర్‌కు చెందిన ఆత్మకూరి సురేష్. అతని చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కష్టాలు, కన్నీళ్లు తోడయ్యాయి. సురేష్ తల్లి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. అతని నలుగురు తమ్ముళ్లు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కుటుంబ ఆసరా లేకపోయినా స్థానికంగా సెల్ మరమ్మతులు దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సురేష్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అద్దె ఇంట్లో నివాసముంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏదైనా ఓ కళలో రాణించాలని నిర్ణయించుకున్న సురేష్ 1995లో పట్టణానికి చెందిన జపాన్ షోటోకాన్ కరాటే డూ కనంజూకు ఆర్గనైజేషన్ శిక్షకుడు ధనాని సూర్యప్రకాష్ వద్ద కరాటే శిక్షణ మొదలుపెట్టాడు. సురేష్ పట్టుదల చూసిన శిక్షకుడు ప్రకాష్ ప్రత్యేక శ్రద్ధ కనబర్చి కరాటేలో మెళకువలు నేర్పించారు. అప్పటినుంచి సురేష్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నాడు. విశాఖ, విజయవాడ, ఏలూరు, రాజమండ్రిలో జరిగిన స్టేట్, నేషనల్ కరాటే పోటీల్లో కుమితే విభాగంలో (స్పారింVŠ ) బంగారు పతకాలు, కటా విభాగంలో రజత పతకాలు గెలుచుకున్నాడు. ఖాళీ సమయంలో విద్యార్థులకు కరాటే నేర్పుతున్నాడు. సుమారు 300 మంది విద్యార్థులు అతని వద్ద శిక్షణ పొందారు. దాతల సహకారం ఉంటే.. దాతల సహకారం ఉంటే కాయ్ ఆధ్వర్యంలో వచ్చే నవంబర్‌లో లక్నోలో జరిగే నేషనల్ చాంపియన్ పోటీల్లో పాల్గొంటానని సురేష్ అంటున్నాడు. సర్వశిక్షా అభియాన్ త్వరలో పాఠశాల విద్యార్థులకు కరాటే శిక్షణ ఇప్పించాలనే ఆలోచనలో ఉందని, సురేష్‌కు ఇన్‌స్ట్రక్టర్‌గా అవకాశం ఇప్పించాలని శిక్షకుడు ప్రకాష్ కోరుతున్నారు. సురేష్‌కు స్పారింగ్, కుమితే కిక్‌లలో మంచి ప్రావీణ్యత ఉందంటున్నారు. -
గురూ..! చెయ్యి పప్పుచారూ..!
‘పప్పుచారు అంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పడం తేలిక. ‘చేయడం మాత్రం చాలా కష్టం’ కానే కాదు. కావలసినవి: కాస్త ఆత్మవిశ్వాసం. వినడానికి పాత పాటలు కొన్ని. కందిపప్పు: తగినంత ఉల్లిపాయ: ఒకటి ఎండు మిర్చి: రెండు టొమాటో: ఒకటి పచ్చిమిర్చి: రెండు వెల్లుల్లి: మూడు రేకలు ఉప్పు: తగినంత నూనె: రెండు టేబుల్ స్పూన్లు కారం: ఒక టీ స్పూను ఇంకా కరివేపాకు, తాలింపు దినులు. ఇప్పుడు ఇలా చేయండి: ఆడుతు పాడుతు పని చేస్తుంటే... పాట ప్లే చేయండి. పప్పుని కుక్కర్లో ఉడకబెట్టండి. చింతపండుని ఒక పాత్రలో నాన పెట్టండి. ఒక గిన్నెలో నూనె పోసి స్టవ్ మీద పెట్టండి. నూనె కాస్త కాగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు అందులో వేయండి. ఆ తరువాత రెండు గ్లాసుల నీళ్లు పోయండి చింతపండు నీళ్లని పప్పులో వేసి బాగా కలపాలి. వేగిన ఉల్లిపాయ, టొమాటో ముక్కలను దీనిలో కలపండి తగినంత ఉప్పు, కారం వేసి కలిపి స్టవ్ మీద పెట్టండి. మరోవైపు ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు... మొదలైన వాటితో తాలింపు పెట్టి, దాన్ని ఉడుకుతున్న పప్పులో కలపండి. పప్పుచారు తయారు!