బంగారు తెలంగాణ సాధనే ధ్యేయం | my confidance in golden telangana | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణ సాధనే ధ్యేయం

Published Sat, Sep 24 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

జడ్చర్ల పత్తి మార్కెట్‌లో ప్రసంగిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి

జడ్చర్ల పత్తి మార్కెట్‌లో ప్రసంగిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి

 
  • గ్రూప్‌–2 అభ్యర్థులతో మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల: బంగారు తెలంగాణ సాధనే ద్యేయంగా తమ ప్రభుత్వం చిత్తశుద్దితో కషి చేస్తుందని,ఇందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక పత్తి మార్కెట్‌ యార్డు ఆవరణలో సీఎన్‌ఆర్‌ ఫౌండేషన్,హెటిరో ఫార్మ  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రూప్‌–2 అభ్యర్థుల ఉచిత శిక్షణ కేంద్రం ముగింపు కార్యక్రమానికి మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితెందర్‌రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. మంత్రి లక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్‌ అనేక అభివద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ముఖ్యంగా ప్రజలకు సాగు,తాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపాదికన చర్యలు తీసుకుంటుందన్నారు. మిషన్‌ భగీరథ ద్వార ఇంటింటికి తాగు నీటిని అందించేందుకు కషి చేస్తున్నామన్నారు. బీదలందరికీ మంచి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని,అందులో భాగంగానే ఒక్క ఏడాదిలోనే 200 పైగా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.అదేవిధంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తుందన్నారు.
ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల భర్తీకి చర్యలు
తమ ప్రభుత్వం ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఇటీవలనే కొన్ని ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామన్నారు. జడ్చర్లలో గ్రూప్‌–2 అభ్యర్థులకు మంచి శిక్షణను ఉచింతంగా అందజేయాలన్న సదుద్దేశ్యంతో తాము సీఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పీజేఆర్‌ కోచింగ్‌ సెంటర్,హెటిరో ఫార్మ పరిశ్రమ సౌజన్యంతో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 62 రోజుల పాటు శిక్షణను పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఆయా పోటీ పరీక్షలలో లక్షసాధనకు కషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ జితెందర్‌రెడ్డి మాట్లాడుతు అభ్యర్థులు పోటీ పరీక్షలలో తమ ప్రతిభను కనబరిచి ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. ఉద్యోగాల భర్తీలో పైరవీలకు తావిచ్చే ప్రసక్తి లేదని,ప్రతిభను మాత్రమే నమ్ముకోవాలని ఆయన అభ్యర్థులకు సూచించారు.
మెటీరియల్‌ పంపిణీ...
గ్రూప్‌ సిలబస్‌ శిక్షణ పొందిన 500 మంది అభ్యర్థులకు దాదాపు రూ.12 లక్షల వ్యయంతో హెటిరో ఆధ్వర్యంలో సిలబస్‌ మెటీరియల్‌ను పంపిణీచేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు జయప్రద,ప్రబాకర్‌రెడ్డి,ఎంపీపీలు లక్ష్మి,దీప,శ్రీను,మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ శోభ,టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు శివకుమార్,హెటిరో హెచ్‌ఆర్‌ గ్రూప్స్‌ ఉపాధ్యక్షులు బాస్కర్‌రెడ్డి, హెటిరో ఫైనాన్స్‌ ఏజీఎం చంద్రారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
 
24జేసీఎల్‌01: జడ్చర్ల పత్తి మార్కెట్‌లో ప్రసంగిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement