jupally krishnarao
-
14, 15 తేదీల్లో హైటెక్స్‌లో వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనం
సనత్‌నగర్ (హైదరాబాద్): జాతీయ, అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనం హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ టూరిజం, తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ 3వ ఎడిషన్, 3వ టీసీఈఐ ఎస్ఐడబ్ల్యూయుపీసీ గ్లోబల్ 2024 బియాండ్ ఇమాజినేషన్, 7వ టీసీఈఐ ఈవెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2024 వేడుకలు జరగనున్నాయి.ఈ మేరకు ఆదివారం బేగంపేట పర్యాటక భవన్‌లోని ది ప్లాజా హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ, భారతీయ వివాహ పరిశ్రమలోని నిపుణులను ఇది ఒకచోట చేర్చుతుందని, ఈ ఈవెంట్ ద్వారా వివాహాలకు దక్షిణాది నుంచి ముఖ్యమైన సహకారం, పరిజ్ఞానం, ప్రత్యేక వేదికను అందించడమే లక్ష్యమన్నారు. భారతీయ వివాహ వ్యవస్థలోని వివిధ అంశాలపై జ్ఞానయుక్తమైన సెషన్లు ఉంటాయని, జాతీయ, అంతర్జాతీయ వక్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారని తెలిపారు. ఈ కన్వెన్షన్ కోసం దేశవిదేశాల్లో ఉన్న 20కి పైగా వెడ్డింగ్ ప్లానర్లు, వెడ్డింగ్ డిజైనర్లు, వెడ్డింగ్ స్టైలిస్టులు, డెకరేటర్లు, ఈవెంట్ మేనేజర్లు, ఈవెంట్ ఇండస్ట్రీలోని ఇతర క్రాప్ట్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయన్నారు.ఈవెంట్‌కు సిడ్నీ నుంచి వెండీ ఈఎల్ ఖౌరీ సహా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నిపుణులు హాజరవుతారన్నారు. టెడ్డీ ఇమాన్యుయేల్ (ఫిలిప్పీన్స్), మైఖేల్ రూయిజ్ (ఫిలిప్పీన్స్), బ్రయాన్ టాచీ–మెన్సన్ (ఘనా) తదితరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం దేశవిదేశాల నుంచి 700 మందికి పైగా ప్రతినిధులకు స్వాగతం పలుకుతోందన్నారు. ‘ఈవెంట్ బజార్’గా పిలవబడే ఎక్స్‌పోలో 60కి పైగా స్టాల్స్‌లో గ్రాండ్ డిస్ప్లే ఉంటుందన్నారు. ఈవెంట్ పరిశ్రమలో ఉన్న విభిన్న ఉత్పత్తులు, సేవలు, అత్యాధునిక ట్రెండ్లను ప్రదర్శిస్తుందని చెప్పారు.ప్యానెల్ చర్చలు, వర్క్‌షాప్‌లు, ఈవెంట్ సేప్టీ, టెక్నాలజీ పాత్ర తదితర కీలక అంశాలపై సమాంతర సెషన్లు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ డైరెక్టర్ రమేశ్‌నాయుడు, హైటెక్స్ హెడ్ టీజీ శ్రీకాంత్, టీసీఈఐ అధ్యక్షుడు ఆళ్ల బలరాంబాబు, ప్ర«ధాన కార్యదర్శి రవిబురా, కోశాధికారి ఎండీ తౌఫిక్ ఖాన్, ఎస్ఐడబ్ల్యూయుపీసీ గ్లోబల్ 2024 కన్వీనర్ సాయి శ్రవణ్ మాదిరాజు, టీసీఈఐ ఈవెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2024 కన్వీనర్ రామ్ ముప్పన, కో–కన్వీనర్లు హిరీష్రెడ్డి, కుమార్‌రాజా, సుధాకర్ యారబడి, డాక్టర్ సౌరభ్ సురేఖ తదితరులు పాల్గొన్నారు. -
జూపల్లి కృష్ణ రావు తో సాక్షి స్ట్రెయిట్ టాక్
-
టీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన జూపల్లి కృష్ణారావు!
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రతిష్టాత్మకంగా మారిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్కు సొంత నేతల నుంచే అసమ్మతి సెగ తప్పడం లేదు. పలుచోట్ల రెబెల్ అభ్యర్థులు గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతుండగా.. కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఏకంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రెబెల్స్ తరఫున ప్రచారానికి దిగుతుండటంతో కారులో కలకలం రేపుతోంది. కొల్లాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి వర్గీయులు బీ ఫామ్‌తో పోటీ చేస్తుండగా.. తన వర్గీయులకు ప్రాధాన్యం దక్కకపోవడంతో నేరుగా మాజీ మంత్రి కృష్ణారావు రంగంలోకి దిగారు. దాదాపు 20 వార్డుల్లో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి తన అనుచరులను బరిలో నిలిపారు. దీంతో హర్షవర్ధన్‌రెడ్డి, జూపల్లి వర్గీయుల మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. మొత్తానికి ఇక్కడ ఇంటిపోరు రచ్చకెక్కడంతో కొల్లాపూర్ రాజకీయం రసవత్తరంగా మారింది. సీనియర్ నేత జూపల్లి ఏకంగా రెబల్స్‌కు అండగా నిలిచి.. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటంతో గులాబీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశాన్ని ఆరా తీసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొల్లాపూర్‌లో అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు త్వరలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అక్కడికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కొల్లాపూర్‌లోని పరిస్థితులను టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకొని.. ఇక్కడ పార్టీ గెలుపు కోసం ప్రతిష్టాత్మకంగా పనిచేయాలని పార్టీ నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది. -
సోమశిల- సంగమేశ్వరం వారధికి సిద్ధం
- ఏపీ ప్రభుత్వం వద్ద ఫైల్ పెండింగ్ - టీఎస్ మంత్రి జూపల్లె కృష్ణారావు ఆత్మకూరురూరల్ : ఆంధ్రప్రదేశ్ ఓకే అంటే ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు అతిముఖ్యమైన సోమశిల-సంగమేశ్వరం అంతరరాష్ట్ర వారధి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లె కృష్ణారావు తెలిపారు. ఆత్మకూరు మండలం కరివేనలో ఆదివారం ఒక శుభకార్యానికి హాజరైన ఆయన పలు అంశాలపై సాక్షితో ముచ్చటించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ హయాంలో ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన జరిగిందన్నారు. సుమారు రూ. 150 కోట్ల వ్యయంతో టెండర్లు కూడా పిలిచారన్నారు. టెండర్ దక్కించుకున్న ఆదాల ప్రభాకరరెడ్డి కంపెనీ అగ్రిమెంట్ చేసుకోకుండా అందులోని కొన్ని షరతులపై కోర్టుకు పోయిందన్నారు. రోశయ్య హయాంలో ఆ కంపెనీ డిపాజిట్ సొమ్ము వాపస్ చేసి ప్రాజెక్ట్ టెండర్లు రద్దుచేశారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో రాయలసీమ, తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రయత్నించినా కుదరలేదన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేయగా ఆయన ఆదేశాల మేరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సంసిద్ధత కోసం ఫైల్ పంపినట్లు తెలిపారు. ఇది ఏపీ ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఓకే చేస్తే వెంటనే టెండర్లు పిలుస్తామన్నారు. -
బ్యాంకు ఖాతాలకే ఆసరా పింఛన్లు
జనవరి 1 నుంచి అమల్లోకి లబ్ధిదారులకు నెలాఖర్లోగా బ్యాంకు ఖాతాలు సాక్షి, హైదరాబాద్: ఆసరా పథకం పరిధి లోని లబ్ధిదారులందరూ ఈ నెలాఖరులోగా బ్యాంకు ఖాతాలు పొందేలా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖాతాలు పొందిన లబ్ధిదారులకు ఏటీఎం కార్డులు సైతం జారీ అయ్యేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీల్లో క్యాష్ లెస్ విధానాన్ని అమలు చేయడంపై సచివాలయంలో కమిషనర్ నీతూ ప్రసాద్, ఇతర అధికారులతో బుధవా రం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహిం చారు. జనవరి 1 నుంచి ఆసరా పింఛన్లు క్యాష్ లెస్ పద్ధతిలోనే పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికి ఆధార్ లింకేజీతో కూడిన బ్యాంక్ అకౌంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏటీఎం కార్డ్ ఇచ్చేలా బ్యాంకింగ్ అధికారులతో మాట్లాడాలని సూచించారు. క్యాష్ లెస్ విధానం వల్ల కలిగే ఉపయోగాలను ప్రజలకు వివరించడంతో పాటు, ఆ దిశగా గ్రామీణ ప్రజలను కూడా సమాయత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు తీసుకుంటున్న 17.81 లక్షల లబ్ధిదారులకు కూడా బ్యాంకు అకౌంట్లు, ఏటీఎం కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్యాష్ లెస్ పంచాయతీల ఏర్పాటుపై చర్చించేం దుకు నాలుగైదు రోజుల్లో బ్యాంకింగ్ , పోస్టల్ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా తెలంగాణ లోని 8,691 పంచాయతీల్లో, మహిళా సంఘాలకు కూడా స్వైపింగ్ మిషన్ల ఏర్పాటు కు పంచాయతీరాజ్ శాఖ ఆలోచన చేస్తోందన్నారు. పంచాయతీ పన్నులన్ని స్వైపింగ్ ద్వారా వసూలు చేయడం వల్ల క్యాష్ లెస్ అవడంతో పాటు, అవకతవకలకు కూడా ఆస్కారం ఉండదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇందులో భాగంగా బ్యాంకులు, పోస్టాఫీసులు లేని గ్రామ పంచాయతీల వివరాలు అందచేయాలని అధికారులను ఆదేశించారు. -
'నామమాత్ర సభల వల్ల నిష్ప్రయోజనమే'
కొత్తూరు: గ్రామసభల్లో ప్రజలు భాగస్వాములయ్యేలా సర్పంచ్, వార్డు సభ్యులు కృషిచేయాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం మంత్రితో పాటు పంచాయతీరాజ్ కమిషనర్ నీతూప్రసాద్, డీపీవో పద్మజారాణి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి పంచాయతీకి ఇంటి పన్నులు, పరిశ్రమల అనుమతులు... వెంచర్ల నుంచి వస్తున్న ఆదాయ వివరాలను తెలుసుకుని, రికార్డులను పరిశీలించారు. గ్రామ సభల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని, తద్వారా వారికి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై అవగాహన పెరిగి సద్వినియోగం చేసుకుంటారని చెప్పారు. నామమాత్రంగా సభలు నిర్వహించడం వల్ల ప్రయోజనం లేదని జూపల్లి పేర్కొన్నారు. -
బంగారు తెలంగాణ సాధనే ధ్యేయం
గ్రూప్–2 అభ్యర్థులతో మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల: బంగారు తెలంగాణ సాధనే ద్యేయంగా తమ ప్రభుత్వం చిత్తశుద్దితో కషి చేస్తుందని,ఇందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక పత్తి మార్కెట్ యార్డు ఆవరణలో సీఎన్ఆర్ ఫౌండేషన్,హెటిరో ఫార్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రూప్–2 అభ్యర్థుల ఉచిత శిక్షణ కేంద్రం ముగింపు కార్యక్రమానికి మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితెందర్‌రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. మంత్రి లక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ అనేక అభివద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ముఖ్యంగా ప్రజలకు సాగు,తాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపాదికన చర్యలు తీసుకుంటుందన్నారు. మిషన్ భగీరథ ద్వార ఇంటింటికి తాగు నీటిని అందించేందుకు కషి చేస్తున్నామన్నారు. బీదలందరికీ మంచి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని,అందులో భాగంగానే ఒక్క ఏడాదిలోనే 200 పైగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామన్నారు. విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.అదేవిధంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తుందన్నారు. ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల భర్తీకి చర్యలు తమ ప్రభుత్వం ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఇటీవలనే కొన్ని ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామన్నారు. జడ్చర్లలో గ్రూప్–2 అభ్యర్థులకు మంచి శిక్షణను ఉచింతంగా అందజేయాలన్న సదుద్దేశ్యంతో తాము సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీజేఆర్ కోచింగ్ సెంటర్,హెటిరో ఫార్మ పరిశ్రమ సౌజన్యంతో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 62 రోజుల పాటు శిక్షణను పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఆయా పోటీ పరీక్షలలో లక్షసాధనకు కషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ జితెందర్‌రెడ్డి మాట్లాడుతు అభ్యర్థులు పోటీ పరీక్షలలో తమ ప్రతిభను కనబరిచి ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. ఉద్యోగాల భర్తీలో పైరవీలకు తావిచ్చే ప్రసక్తి లేదని,ప్రతిభను మాత్రమే నమ్ముకోవాలని ఆయన అభ్యర్థులకు సూచించారు. మెటీరియల్ పంపిణీ... గ్రూప్ సిలబస్ శిక్షణ పొందిన 500 మంది అభ్యర్థులకు దాదాపు రూ.12 లక్షల వ్యయంతో హెటిరో ఆధ్వర్యంలో సిలబస్ మెటీరియల్‌ను పంపిణీచేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు జయప్రద,ప్రబాకర్‌రెడ్డి,ఎంపీపీలు లక్ష్మి,దీప,శ్రీను,మార్కెట్ యార్డు చైర్పర్సన్ శోభ,టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శివకుమార్,హెటిరో హెచ్ఆర్ గ్రూప్స్ ఉపాధ్యక్షులు బాస్కర్‌రెడ్డి, హెటిరో ఫైనాన్స్ ఏజీఎం చంద్రారెడ్డి,తదితరులు పాల్గొన్నారు. 24జేసీఎల్01: జడ్చర్ల పత్తి మార్కెట్లో ప్రసంగిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి -
అదనపు ‘ఉపాధి’కోసం కేంద్రానికి మంత్రి జూపల్లి లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను మరో ఆరు కోట్ల పనిదినాలు మంజూరు నిమిత్తం కేంద్రాన్ని కోరుతూ లేఖ రాయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఆదివారం మంత్రి జూపల్లి అధికారులతో సమీక్షించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 10కోట్ల పనిదినాలు మంజూరు చేయగా, ఇప్పటికే లక్ష్యాన్ని మించి పనులు జరుగుతున్నాయని, సుమారు 1,330కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. మంత్రి జూపల్లి స్పందిస్తూ.. అదనపు పనిదినాల కోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి కూలీలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను, మెటీరియల్ ఖర్చులను వెంటనే చెల్లించాలని, కూలీలకు వేతనం చెల్లింపులో జరుగుతున్న జాప్యం నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇతర అంశాలనూ సమీక్షించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ డెరైక్టర్ అనితా రాంచంద్రన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నేడే జిల్లాల ముసాయిదా
తుది మెరుగులు దిద్దిన రాష్ట్ర సర్కారు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జిల్లాల పునర్విభజన ప్రక్రియలో కీలకమైన ఘట్టం ముగిసిం ది.మొత్తం 27 జిల్లాలతో పునర్విభజన ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన మేరకు సోమవారం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు సీసీఎల్ఏ రేమండ్ పీటర్, రెవెన్యూ అధికారులు జిల్లాల ముసాయిదాకు తుది మెరుగులద్దారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలతో కూడిన జిల్లాల జాబితాను రూపొందించారు. భేటీ కంటే ముందు రూపొందించిన ముసాయిదా ప్రతిలో స్వల్ప మార్పులు చేశారు. మంత్రుల సలహాలు, సూచనలతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫారసులతో కొన్ని మండలాలను పక్కనున్న జిల్లాల్లో సర్దుబాటు చేశారు. దీంతో జిల్లాల వారీగా ప్రతిపాదించిన మండలాల సంఖ్యలో హెచ్చు తగ్గులు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు తొలి ముసాయిదా ప్రకారం వరంగల్ జిల్లాలో.. హన్మకొండలో 14, వరంగల్‌లో 14, భూపాలపల్లిలో 16 మండలాలకు చోటు దక్కింది. చివరకు హన్మకొండలో 18, వరంగల్‌లో 17జిల్లాలు, భూపాలపల్లిలో 15 మండలాలతో తుది ముసాయిదా సిద్ధమైంది. తొలుత హన్మకొండ జిల్లాలో ఉన్న హాసన్పర్తి మండలాన్ని చివరికి పక్కనున్న వరంగల్ జిల్లాలో చేర్చారు. యాదాద్రి జిల్లాలో ప్రతిపాదిత దేవరుప్పుల మండలాన్ని హన్మకొండలో కలిపారు. జయశంకర్(భూపాలపల్లి) జిల్లాలో చేర్చిన శాయంపేట మండలాన్ని వరంగల్‌లో చేర్చారు. కొన్ని జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన కొత్తగా రెవె న్యూ మండలాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రతిపాదిత జిల్లాల స్వరూపం కాస్తా అటుదిటుగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో పది జిల్లాలు, 44 రెవెన్యూ డివిజన్లు, 459 మండలాలున్నాయి. ప్రభుత్వం విడుదల చేయనున్న పునర్విభజన ముసాయిదా ప్రకారం మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లు, 490 మండలాలుగా రాష్ట్ర పరిపాలనా ముఖచిత్రం మారిపోనుంది. తొలుత 74 కొత్త మండలాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ జనాభా ప్రాతిపదికన ఈ సంఖ్యను 31కి కుదించింది. దీంతో మొత్తం మండలాల సంఖ్య 490కి చేరింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల అనంతరం 30 రోజుల వ్యవధిలో ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, అర్జీలను స్వీకరిస్తారు. గడువులోగా వచ్చిన అర్జీలన్నీ పరిశీలించి జిల్లాల తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. మొత్తంగా ఈ ప్రక్రియను సెప్టెంబరు 30 లోగా పూర్తి చేసి.. అక్టోబర్‌లో దసరా పండుగ నుంచి కొత్త జిల్లా కేంద్రాల నుంచి పరిపాలన ప్రారంభించేలా సన్నాహాలు మొదలయ్యాయి. డబుల్.. ట్రిపుల్ రోల్ ఎమ్మెల్యేలు పునర్విభజనతో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు రెండు మూడు ముక్కలవుతున్నాయి. రెండు, మూడు జిల్లాల పరిధిలోకి వెళ్తున్నాయి. దీం తో తమకు ఓటు బ్యాంకు ఉన్న మండలాలు వేర్వేరు జిల్లాలుగా మారితే ఎన్నికల సమయంలో ఆపసోపాలు పడాల్సి వస్తుందని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆందోళన చెందుతున్నా రు. కొందరు ఆఖరి రోజున తమకు పట్టున్న మండలాలను.. తమకు అనువైన జిల్లాల్లో ఉంచేలా ఒత్తిడి పెంచారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పది జిల్లాల్లో విస్తరించిన ఈ సెగ్మెంట్లు ఇప్పుడు 27 జిల్లాల పరిధిలోకి వెళ్లనున్నాయి. దీంతో కొన్ని నియోజకవర్గాలు ఏకంగా మూడు జిల్లాలు, కొన్ని రెండు జిల్లాల్లో కలుస్తాయి. దీంతో అక్కడి ఎమ్మెల్యేలు డబుల్.. ట్రిపుల్ రోల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తనుంది. సీఎం రెండు జిల్లాల ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం అటు మెదక్ జిల్లాలో, ఇటు సిద్దిపేట జిల్లాలో చేరుతోంది. దీంతో ఆయన రెండు జిల్లాలకు ఎమ్మెల్యే పాత్ర పోషిస్తారు. మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, అజ్మీరా చందూలాల్ నియోజకవర్గాల పరిధితో సంబంధం లేకుండా కొత్త జిల్లాలకు రూపకల్పన చేయటంతో కొత్త రాజకీయ చిత్రం ఆవిష్కృతం కానుంది. రెండు జిల్లాల్లో ఉండే నియోజకవర్గాలివే.. ఆసిఫాబాద్, హుజురాబాద్, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, చొప్పదండి, వేములవాడ, మంథని, ములుగు, బాన్సువాడ, మానకొండూరు, సిరిసిల్ల, దేవరకద్ర, మక్తల్, ఆందోల్, దుబ్బాక, గజ్వేల్, నారాయణఖేడ్, నర్సాపూర్, కొల్లాపూర్, మునుగోడు, నకిరేకల్, నర్సాపూర్, తుంగతుర్తి, పాలకుర్తి, భూపాలపల్లి మూడు జిల్లాల్లో ఉండే సెగ్మెంట్లు: ఖానాపూర్, హుస్నాబాద్, జనగాం, ఇల్లందు. కొత్త రెవెన్యూ మండలాలు ఆదిలాబాద్- 2: మావుల, నస్పూర్, కరీంనగర్-3: కొత్తపల్లి, అంతర్గాం, బొమ్మకల్ (కరీంనగర్ రూరల్) వరంగల్-5: ఖిలా వరంగల్, కాజీపేట, ఐనవోలు, చిల్పూరు, వేలేరు నల్లగొండ-3: కొండ మల్లేపల్లి, తిరుమలగిరి సాగర్, మాడుగులపల్లి ఖమ్మం-1: రఘునాథపాలెం మహబూబ్‌నగర్-6: రాజాపూర్, మరికల్, నందిన్నె, పగర, అమరచింత, మహబూబ్‌నగర్ రూరల్ మెదక్-3: గుమ్మడిదల, సిర్గాపూర్, నారాయణ్రావుపేట (సిద్దిపేట రూరల్) నిజామాబాద్-2: నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ రూరల్ రంగారెడ్డి-6: దుండిగల్, జవహర్‌నగర్, గండిపేట, సరూర్‌నగర్, అబ్దుల్లాపూర్, బాలాపూర్ -
ఒకేరోజు కోటి మొక్కల హరితహారం
- 12న నిర్వహించేందుకు ఏర్పాట్లు: మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) ద్వారా ఒకేరోజున కోటి మొక్కలను నాటాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన(సెర్ప్), గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా 2.50 కోట్ల గుంతలను ఉపాధిహామీ కూలీలతో ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లోని ఆయా నర్సరీల నుంచి ఎంపీడీవోల ద్వారా ప్రతి గ్రామానికి మొక్కలను పంపిణీ చే శామని పేర్కొన్నారు. బతుకమ్మ, బోనాల పండుగల మాదిరిగా మొక్కలు నాటే కార్యక్రమంలో మహిళలు పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. గ్రామ ప్రధానకూడలిలో ఉండే మొక్కలను ఊరేగింపుగా తీసికొని ఉత్సాహభరిత వాతావరణంలో గుంతల వద్దకు చేర్చాలని సూచించారు. ఎస్‌హెచ్‌జీల్లోని ప్రతి సభ్యురాలు కనీసం 10 మొక్కలు నాటాలని అన్నారు. కోటి మొక్కల హరితహారాన్ని విజయవంతం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీఆర్డీఏ, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్లు, డీపీవోలు, ఎంపీడీవోలను మంత్రి కృష్ణారావు ఆదేశించారు. -
రూ.3 వేల కోట్లు వస్తున్నాయి: కేసీఆర్
హైదరాబాద్: కేంద్ర నుంచి తెలంగాణ రాష్ట్రానికి రూ.3 వేల కోట్లు వస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. క్యాంప్ ఆఫీసులో ఆదివారం సాయంత్రం ఇరిగేషన్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం టెండర్లు పూర్తయినందున ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేయాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రభుత్వం ఏడాదికి రూ.25వేల కోట్లు సాగునీటికి కేటాయిస్తుందని, కరువు పీడిత జిల్లా రైతులకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తిచేయడం కోసం ప్రతినెల రూ.2వేల కోట్లు విడదుల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్ లో ప్రాజెక్టు పనుల బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు. పాలమూరు పంప్ హౌజ్ లు, రిజర్వాయర్లు 24 నెలల్లో పూర్తిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రెండున్నరేళ్లలో పాలమూరు ప్రాజెక్ట్ పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించారు. సీఎం కేసీఆర్ నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆప్కోలో ‘గోల్మాల్’పై 5న సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ‘ఆప్కోలో గోల్మాల్ రూ.600 కోట్లు..?’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. సంస్థ లావాదేవీలకు సంబంధించిన అన్ని వివరాలను తనకు సమర్పించాల్సిందిగా పరిశ్రమల శాఖ కార్యదర్శి, ఆప్కో జేఎండీ, చేనేత విభాగం డెరైక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి జూపల్లి... ఆప్కో లావాదేవీలపై సమీక్షించేందుకు ఈ నెల 5వ తేదీన సచివాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలతో ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఆప్కో అధికారులకు సూచించారు. అపాయింటెడ్ డే నుంచి జరిగిన ఆప్కో లావాదేవీలపై గతేడాది ఏప్రిల్‌లోనే జూపల్లి సమీక్షించి.. అక్రమాలపై అంతర్గత విచారణకు ఆదేశించారు. అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రదీప్‌చంద్ర ఆ విచారణ బాధ్యతను చేనేత, జౌళి శాఖ డెరైక్టర్ ప్రీతి మీనాకు అప్పగించారు. ప్రీతి మీనా సెలవుపై వెళ్లడంతో అధికారులు దర్యాప్తును అటకెక్కించినట్లు సమాచారం. ప్రణాళిక మేరకే సేకరణ: జేఎండీ సైదా చేనేత, జౌళిశాఖ ఆమోదించిన ఉత్పత్తి ప్రణాళికకు అనుగుణంగా లివరీ వస్త్రాలు కొనుగోలు చేస్తున్నట్లు ఆప్కో తెలంగాణ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ (జేఎండీ) వి.సైదా చెప్పారు. ‘సాక్షి’లో వచ్చిన కథనంలోని అంశాలపై జేఎండీ గురువారం వివరణ ఇచ్చారు. చేనేత సహకార సంఘాల నుంచి లివరీ వస్త్రం సేకరణ, సరఫరాలో నిధుల దుర్వినియోగం జరగలేదన్నారు. సర్వశిక్షా అభియాన్‌తో పాటు, సంక్షేమ శాఖలకు నిర్దిష్ట కాల పరిమితిలో లివరీ వస్త్రం సరఫరా చేయాల్సి రావడంతో చేనేత సంఘాల నుంచి సేకరణ నిరంతరంగా జరుగుతోందని చెప్పారు. వివిధ శాఖలకు అవసరమైన రంగులు, డిజైన్లలో ప్రాసెస్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా నాణ్యత పరీక్షలు చేయించిన తర్వాతే సరఫరా చేస్తున్నామని... నాణ్యత, మన్నిక విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 195 సంఘాల నుంచి రూ.92 కోట్ల విలువ చేసే వస్త్రాన్ని కొనుగోలు చేశామన్నారు. సర్వశిక్షా అభియాన్‌తో పాటు ఇతర శాఖలకు వస్త్రాల సరఫరా ద్వారా ఆప్కోకు లాభం లేకపోయినా.. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సేకరిస్తున్నామని చెప్పారు. నేడు చేనేత సంఘాల సమావేశం ఆప్కోలో అక్రమాలను సాకుగా చూపి కొందరు అధికారులు సంస్థను మూసివేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆప్కో పాలక మండలి సభ్యుడు గడ్డం జగన్నాథం ఆరోపించారు. ఆప్కోలో లావాదేవీలపై విచారణ జరిపేందుకు చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఆప్కోలో నెలకొన్న వివిధ సమస్యలపై చర్చించేందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని నారాయణగూడలో ఆప్కో కార్యాలయం వద్ద చేనేత సంఘాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించాలి
పాన్‌గల్, న్యూస్‌లైన్: సీమాంధ్రకు అనుకూలంగా వ్యవ హరిస్తూ, తెలంగాణపై వివక్ష చూపుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని పదవీ నుంచి తప్పించాలని కొల్లాపూర్ ఎమ్మె ల్యే జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శనివా రం పాన్గల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజలు సామరస్యంతో ఉన్నా... సీమాంధ్ర ప్రాంత నాయకు లు, ప్రజలు తెలంగాణ వారిపై దాడులు చేయడం సరికాదన్నారు. తిరుమలలో కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు వీ.హనుమంతరావుపై దాడి చేయడం అమానుషమన్నారు. సీమాంధ్రులు దాడులు చేస్తున్నా పోలీ సులు పక్షపాతంతో వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. సీమాంధ్ర నేత లు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమన్నారు. వీహెచ్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జూపల్లి డిమాండ్ చేశారు.సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు వెంకటేష్‌నాయుడు, చక్రవెంకటేష్, బాలరాజు పాల్గొన్నారు.