- జనవరి 1 నుంచి అమల్లోకి
- లబ్ధిదారులకు నెలాఖర్లోగా బ్యాంకు ఖాతాలు
సాక్షి, హైదరాబాద్: ఆసరా పథకం పరిధి లోని లబ్ధిదారులందరూ ఈ నెలాఖరులోగా బ్యాంకు ఖాతాలు పొందేలా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖాతాలు పొందిన లబ్ధిదారులకు ఏటీఎం కార్డులు సైతం జారీ అయ్యేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీల్లో క్యాష్ లెస్ విధానాన్ని అమలు చేయడంపై సచివాలయంలో కమిషనర్ నీతూ ప్రసాద్, ఇతర అధికారులతో బుధవా రం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహిం చారు. జనవరి 1 నుంచి ఆసరా పింఛన్లు క్యాష్ లెస్ పద్ధతిలోనే పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికి ఆధార్ లింకేజీతో కూడిన బ్యాంక్ అకౌంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏటీఎం కార్డ్ ఇచ్చేలా బ్యాంకింగ్ అధికారులతో మాట్లాడాలని సూచించారు.
క్యాష్ లెస్ విధానం వల్ల కలిగే ఉపయోగాలను ప్రజలకు వివరించడంతో పాటు, ఆ దిశగా గ్రామీణ ప్రజలను కూడా సమాయత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు తీసుకుంటున్న 17.81 లక్షల లబ్ధిదారులకు కూడా బ్యాంకు అకౌంట్లు, ఏటీఎం కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్యాష్ లెస్ పంచాయతీల ఏర్పాటుపై చర్చించేం దుకు నాలుగైదు రోజుల్లో బ్యాంకింగ్ , పోస్టల్ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా తెలంగాణ లోని 8,691 పంచాయతీల్లో, మహిళా సంఘాలకు కూడా స్వైపింగ్ మిషన్ల ఏర్పాటు కు పంచాయతీరాజ్ శాఖ ఆలోచన చేస్తోందన్నారు. పంచాయతీ పన్నులన్ని స్వైపింగ్ ద్వారా వసూలు చేయడం వల్ల క్యాష్ లెస్ అవడంతో పాటు, అవకతవకలకు కూడా ఆస్కారం ఉండదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇందులో భాగంగా బ్యాంకులు, పోస్టాఫీసులు లేని గ్రామ పంచాయతీల వివరాలు అందచేయాలని అధికారులను ఆదేశించారు.