సోమశిల- సంగమేశ్వరం వారధికి సిద్ధం
సోమశిల- సంగమేశ్వరం వారధికి సిద్ధం
Published Sun, Apr 2 2017 9:47 PM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM
- ఏపీ ప్రభుత్వం వద్ద ఫైల్ పెండింగ్
- టీఎస్ మంత్రి జూపల్లె కృష్ణారావు
ఆత్మకూరురూరల్ : ఆంధ్రప్రదేశ్ ఓకే అంటే ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు అతిముఖ్యమైన సోమశిల-సంగమేశ్వరం అంతరరాష్ట్ర వారధి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లె కృష్ణారావు తెలిపారు. ఆత్మకూరు మండలం కరివేనలో ఆదివారం ఒక శుభకార్యానికి హాజరైన ఆయన పలు అంశాలపై సాక్షితో ముచ్చటించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ హయాంలో ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన జరిగిందన్నారు.
సుమారు రూ. 150 కోట్ల వ్యయంతో టెండర్లు కూడా పిలిచారన్నారు. టెండర్ దక్కించుకున్న ఆదాల ప్రభాకరరెడ్డి కంపెనీ అగ్రిమెంట్ చేసుకోకుండా అందులోని కొన్ని షరతులపై కోర్టుకు పోయిందన్నారు. రోశయ్య హయాంలో ఆ కంపెనీ డిపాజిట్ సొమ్ము వాపస్ చేసి ప్రాజెక్ట్ టెండర్లు రద్దుచేశారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో రాయలసీమ, తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రయత్నించినా కుదరలేదన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేయగా ఆయన ఆదేశాల మేరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సంసిద్ధత కోసం ఫైల్ పంపినట్లు తెలిపారు. ఇది ఏపీ ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఓకే చేస్తే వెంటనే టెండర్లు పిలుస్తామన్నారు.
Advertisement
Advertisement