14, 15 తేదీల్లో హైటెక్స్‌లో వెడ్డింగ్‌ ప్లానర్ల సమ్మేళనం | National And International Wedding Planners Conclave On 14th And 15th At Hitex | Sakshi
Sakshi News home page

14, 15 తేదీల్లో హైటెక్స్‌లో వెడ్డింగ్‌ ప్లానర్ల సమ్మేళనం

Published Mon, Jun 10 2024 5:52 AM | Last Updated on Mon, Jun 10 2024 5:52 AM

National And International Wedding Planners Conclave On 14th And 15th At Hitex

మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్న దేశవిదేశాల వెడ్డింగ్‌ ప్లానర్లు, డిజైనర్లు  

సనత్‌నగర్‌ (హైదరాబాద్‌): జాతీయ, అంతర్జాతీయ వెడ్డింగ్‌ ప్లానర్ల సమ్మేళనం హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ టూరిజం, తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వర్యంలో సౌత్‌ ఇండియన్‌ వెడ్డింగ్‌ ప్లానర్స్‌ కాంగ్రెస్‌ 3వ ఎడిషన్, 3వ టీసీఈఐ ఎస్‌ఐడబ్ల్యూయుపీసీ గ్లోబల్‌ 2024 బియాండ్‌ ఇమాజినేషన్, 7వ టీసీఈఐ ఈవెంట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌ 2024 వేడుకలు జరగనున్నాయి.

ఈ మేరకు ఆదివారం బేగంపేట పర్యాటక భవన్‌లోని ది ప్లాజా హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ, భారతీయ వివాహ పరిశ్రమలోని నిపుణులను ఇది ఒకచోట చేర్చుతుందని, ఈ ఈవెంట్‌ ద్వారా వివాహాలకు దక్షిణాది నుంచి ముఖ్యమైన సహకా­రం, పరిజ్ఞానం, ప్రత్యేక వేదికను అందించడమే లక్ష్యమన్నారు. భారతీయ వివాహ వ్యవస్థలోని వివిధ అంశాలపై జ్ఞానయుక్తమైన సెషన్లు ఉంటాయని, జాతీయ, అంతర్జాతీయ వక్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారని తెలిపారు. ఈ కన్వెన్షన్‌ కోసం దేశవిదేశాల్లో ఉన్న 20కి పైగా వెడ్డింగ్‌ ప్లానర్లు, వెడ్డింగ్‌ డిజైనర్లు, వెడ్డింగ్‌ స్టైలిస్టులు, డెకరేటర్లు, ఈవెంట్‌ మేనేజర్లు, ఈవెంట్‌ ఇండస్ట్రీలోని ఇతర క్రాప్ట్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయన్నారు.

ఈవెంట్‌కు సిడ్నీ నుంచి వెండీ ఈఎల్‌ ఖౌరీ సహా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నిపుణులు హాజరవుతారన్నారు. టెడ్డీ ఇమాన్యుయేల్‌ (ఫిలిప్పీన్స్‌), మైఖేల్‌ రూయిజ్‌ (ఫిలిప్పీన్స్‌), బ్రయాన్‌ టాచీ–మెన్సన్‌ (ఘనా) తదితరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రము­ఖులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం దేశవిదేశాల నుంచి 700 మందికి పైగా ప్రతినిధులకు స్వాగతం పలుకుతోందన్నారు. ‘ఈవెంట్‌ బజార్‌’గా పిలవబడే ఎక్స్‌పోలో 60కి పైగా స్టాల్స్‌లో గ్రాండ్‌ డిస్‌ప్లే ఉంటుందన్నారు. ఈవెంట్‌ పరిశ్రమలో ఉన్న విభిన్న ఉత్పత్తులు, సేవలు, అత్యాధునిక ట్రెండ్లను ప్రదర్శిస్తుందని చెప్పారు.

ప్యానెల్‌ చర్చలు, వర్క్‌షాప్‌లు, ఈవెంట్‌ సేప్టీ, టెక్నాలజీ పాత్ర తదితర కీలక అంశాలపై సమాంతర సెషన్లు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ డైరెక్టర్‌ రమేశ్‌­నాయుడు, హైటెక్స్‌ హెడ్‌ టీజీ శ్రీకాంత్, టీసీఈఐ అధ్యక్షుడు ఆళ్ల బలరాంబాబు, ప్ర«ధాన కార్యదర్శి రవిబురా, కోశాధికారి ఎండీ తౌఫిక్‌ ఖాన్, ఎస్‌ఐడబ్ల్యూయుపీసీ గ్లోబల్‌ 2024 కన్వీనర్‌ సాయి శ్రవణ్‌ మాదిరాజు, టీసీఈఐ ఈవెంట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌ 2024 కన్వీనర్‌ రామ్‌ ముప్పన, కో–కన్వీనర్లు హిరీష్‌రెడ్డి, కుమార్‌రాజా, సుధాకర్‌ యారబడి, డాక్టర్‌ సౌరభ్‌ సురేఖ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement