సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను మరో ఆరు కోట్ల పనిదినాలు మంజూరు నిమిత్తం కేంద్రాన్ని కోరుతూ లేఖ రాయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఆదివారం మంత్రి జూపల్లి అధికారులతో సమీక్షించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 10కోట్ల పనిదినాలు మంజూరు చేయగా, ఇప్పటికే లక్ష్యాన్ని మించి పనులు జరుగుతున్నాయని, సుమారు 1,330కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.
మంత్రి జూపల్లి స్పందిస్తూ.. అదనపు పనిదినాల కోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి కూలీలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను, మెటీరియల్ ఖర్చులను వెంటనే చెల్లించాలని, కూలీలకు వేతనం చెల్లింపులో జరుగుతున్న జాప్యం నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇతర అంశాలనూ సమీక్షించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ డెరైక్టర్ అనితా రాంచంద్రన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అదనపు ‘ఉపాధి’కోసం కేంద్రానికి మంత్రి జూపల్లి లేఖ
Published Mon, Aug 29 2016 2:34 AM | Last Updated on Tue, Nov 6 2018 4:37 PM
Advertisement
Advertisement