కొన్ని సమస్యలు మనిషిని మాములుగా కుంగదీయవు. ఒక పట్టాన నిలువనివ్వవు. ఏం చేయాలో ఎలా పరిష్కరించాలో అర్థకానీ విధంగా ఉంటాయి. కానీ ఇక్కడే అసలు పరిష్కారం దాగుంటుంది. మనకు ఎదురై పది శాతం సమస్యకు తొంభై శాతం నీవెలా స్పందిస్తావు అనే దానిపైనే పరిష్కారం దొరకడం అనేది ఆధారపడి ఉంటుందని చెబుతోంది పారా ఒలింపియన్ దీపా. నిలదొక్కుకోనివ్వకుండా పగబట్టి వెంటాడిని సమస్యను తనదైన శైలిలో నిలువరించి తానేంటన్నది ప్రపంచానికి చాటి చెప్పి స్ఫూర్తిగా నిలించింది. ఎవరీ దీపా..? అంటే..
ఉక్కులాంటి ధృఢ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం పారాలింపియన్ దీపా మాలిక్. ఆమె తండ్రి ఆర్మీ, తల్లి ఎన్‌సీపీ క్యాడెట్‌లో షూటర్. ఆమెకు మూడేళ్ల ప్రాయంలోనే వెనుముక కణితి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. దీని కారణంగా కోలుకోవడానికి మూడేళ్లు పట్టేంది. అంటే ఆమె ఐదు నుంచి ఎనిమిదేళ్ల ప్రాయం వరకు ఆస్పత్రల్లోనే గడిపింది. అంత పెద్ద భయానక పరిస్థిని నుంచి బయటపడిందని జాలి, సానుభూతులతో పెంచలేదు దీపను ఆమె తల్లిదండ్రులు. మన వద్ద ఉన్న వనరులతో సంబంధం లేకుండా సామార్థ్యం మెరుగుపరుచుకోవడం పైనే దృష్టి సారిస్తే విజయం తధ్యం అనే రీతిగా పెంచారు దీపాని.
అంతేగాదు తనకెదురైన సమస్యను పక్కన పెట్టి ఇంకా నువ్వు ఏం చేయగలవు, నీలో ఉన్న శక్తి ఏంటి అన్నదానిపై దృష్టి పెట్టాలని పదే పదే చెప్పేవారు. అదే నినాదంతో పెరిగిన దీపాలో సంకల్పం మెండుగా ఉండేది. అలానే పెరిగింది. సరిగ్గా 19 ఏళ్ల వచ్చేటప్పటికీ తనలానే బైకింగ్ సాహసాల పట్ల ఇష్టం ఉన్న ఆర్మీ అధికారిని వివాహం చేసుకుంది. ఆమె జీవితం హాయిగా సాగిపోతుంది. సరిగ్గా 29 ఏళ్ల వయసులో మళ్లి కణితి వచ్చి ప్రతికారం తీర్చుకుంది. ఈసారి పరిస్థితి సివియర్ అయ్యి తనంతట తాను నడవడానికి ఏడు రోజుల మాత్రమే సమయం ఉందని వైద్యులు తేల్చి చెప్పేశారు వైద్యులు.
దీపా ఇక వీల్‌చైర్‌కి పరిమితం అయిపోతుందని, తనకి సేవ చూస్తున్న వాళ్లను చూసి విసుగుపుట్టి చనిపోతుందని అంతా అనుకునేవారు. తన వైకల్యం భర్తతో మానసిక, శారీరక సాన్నిహిత్యాన్ని దెబ్బతీసింది. ఈ పరిస్థితి ఆమె మల మూత్రాదులపై నియంత్రణ లేకుండా చేసి ఇబ్బందుకులకు గురి చేసింది. ఇలా వీల్‌చైర్‌తో గదికే పరిమితం కావడాన్ని ఇష్టపడక అహ్మద్‌నగర్‌లో రెస్టారెంట్ ప్రారంభించింది. అక్కడకు వచ్చే లాయర్లు, ఆఫీసర్లు, ఇంజీనర్లును కారణంగా తనలాంటి వారు ఎలా పైకి ఎదగొచ్చు అనే విషయాలు తెలుసుకుంది.
అలా ఆమెకు ప్రత్యేక సామర్థ్యం ఉన్న వ్యక్తుల కోసం వచ్చే మోడిఫైడ్ బైక్‌ల గురించి తెలుసుకుని నడపడం నేర్చుకుంది. అలా బైక్‌పై తనకున్న ఇష్టం క్రీడాకారిణిగా ఎదిగేలా చేసింది. అంతేగాదు బైక్ నడిపేలా ఎగువ శరీరాన్ని బలోపేతం చేసేందుకు హైడ్రోథెరపీ తీసుకుంది. అంటే ఇక్కడ దీపా ఈత కొట్టడం ప్రాక్టీస్ చేయాలి. అలా ఆమె వివిద క్రీడల కోసం శిక్షణ పొందింది. చెప్పాలంటే ఇక్కడ దీపా 30 ఏళ్ల వయసులో క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. తన కుమార్తెతో కలిసి ఢిల్లీకి వచ్చి జేఎల్‌ఎన్ స్టేడియం సమీపంలో చిన్నఅపార్టెమెంట్‌లో నివశించడం ప్రారంభించింది. అక్కడ అయితే ఆటలకు సంబంధించిన ప్రాక్టీస్ చేసేది.
చాలామంది ఈ వయసులో ఆడుకుంటుందేంటీ?..టైం వేస్ట్ అనేవారు. అయితే అవేమి ఆమె పట్టించుకోలేదు దీపా. ఏదో ఒకరోజు నేనెంటీ అనేది తెలుసుకుంటారనే కసి దీపాలో అంతకంతకు పెరిగిపోయింది. చివరికీ తాను అనుకున్నట్లే పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి మహిళగా నిలిచింది. అంతేగాదు 42 ఏళ్ల వయసులో ప్రతిష్టాత్మక అర్జున అవార్డును గెలుచుకుంది. పద్మశ్రీ అవార్డు కూడా అందుకుంది. అంతేగాదు షాట్‌పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో వంటి అనేక విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. నాడు ఎవరైతే ఆమెకు చికిత్స ఇవ్వడం వ్యర్థం అంటూ తన కుటుంబానికి సలహాలు ఇచ్చారు వాళ్లే..మా పిల్లలకు నువ్వే స్ఫూర్తి అంటూ ప్రశంసించారని గర్వంగా చెబుతోంది. చివరగా దీపా దయచేసి ఆగస్టు 28, 2024లో జరిగే పారా ఒలింపిక్స్ వీక్షించండి అని ప్రజలను కోరింది.
(చదవండి: వందేళ్లు బతకాలనుకుంటే..ఈ అలవాట్లు తప్పనిసరి అంటున్న పరిశోధకులు!)
Comments
Please login to add a commentAdd a comment