Deepa Malik
-
నిలదొక్కుకోనివ్వని సమస్యను నిలువరించి..స్ఫూర్తిగా నిలిచింది దీపా..!
కొన్ని సమస్యలు మనిషిని మాములుగా కుంగదీయవు. ఒక పట్టాన నిలువనివ్వవు. ఏం చేయాలో ఎలా పరిష్కరించాలో అర్థకానీ విధంగా ఉంటాయి. కానీ ఇక్కడే అసలు పరిష్కారం దాగుంటుంది. మనకు ఎదురై పది శాతం సమస్యకు తొంభై శాతం నీవెలా స్పందిస్తావు అనే దానిపైనే పరిష్కారం దొరకడం అనేది ఆధారపడి ఉంటుందని చెబుతోంది పారా ఒలింపియన్ దీపా. నిలదొక్కుకోనివ్వకుండా పగబట్టి వెంటాడిని సమస్యను తనదైన శైలిలో నిలువరించి తానేంటన్నది ప్రపంచానికి చాటి చెప్పి స్ఫూర్తిగా నిలించింది. ఎవరీ దీపా..? అంటే..ఉక్కులాంటి ధృఢ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం పారాలింపియన్ దీపా మాలిక్. ఆమె తండ్రి ఆర్మీ, తల్లి ఎన్సీపీ క్యాడెట్లో షూటర్. ఆమెకు మూడేళ్ల ప్రాయంలోనే వెనుముక కణితి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. దీని కారణంగా కోలుకోవడానికి మూడేళ్లు పట్టేంది. అంటే ఆమె ఐదు నుంచి ఎనిమిదేళ్ల ప్రాయం వరకు ఆస్పత్రల్లోనే గడిపింది. అంత పెద్ద భయానక పరిస్థిని నుంచి బయటపడిందని జాలి, సానుభూతులతో పెంచలేదు దీపను ఆమె తల్లిదండ్రులు. మన వద్ద ఉన్న వనరులతో సంబంధం లేకుండా సామార్థ్యం మెరుగుపరుచుకోవడం పైనే దృష్టి సారిస్తే విజయం తధ్యం అనే రీతిగా పెంచారు దీపాని. అంతేగాదు తనకెదురైన సమస్యను పక్కన పెట్టి ఇంకా నువ్వు ఏం చేయగలవు, నీలో ఉన్న శక్తి ఏంటి అన్నదానిపై దృష్టి పెట్టాలని పదే పదే చెప్పేవారు. అదే నినాదంతో పెరిగిన దీపాలో సంకల్పం మెండుగా ఉండేది. అలానే పెరిగింది. సరిగ్గా 19 ఏళ్ల వచ్చేటప్పటికీ తనలానే బైకింగ్ సాహసాల పట్ల ఇష్టం ఉన్న ఆర్మీ అధికారిని వివాహం చేసుకుంది. ఆమె జీవితం హాయిగా సాగిపోతుంది. సరిగ్గా 29 ఏళ్ల వయసులో మళ్లి కణితి వచ్చి ప్రతికారం తీర్చుకుంది. ఈసారి పరిస్థితి సివియర్ అయ్యి తనంతట తాను నడవడానికి ఏడు రోజుల మాత్రమే సమయం ఉందని వైద్యులు తేల్చి చెప్పేశారు వైద్యులు. దీపా ఇక వీల్‌చైర్‌కి పరిమితం అయిపోతుందని, తనకి సేవ చూస్తున్న వాళ్లను చూసి విసుగుపుట్టి చనిపోతుందని అంతా అనుకునేవారు. తన వైకల్యం భర్తతో మానసిక, శారీరక సాన్నిహిత్యాన్ని దెబ్బతీసింది. ఈ పరిస్థితి ఆమె మల మూత్రాదులపై నియంత్రణ లేకుండా చేసి ఇబ్బందుకులకు గురి చేసింది. ఇలా వీల్‌చైర్‌తో గదికే పరిమితం కావడాన్ని ఇష్టపడక అహ్మద్‌నగర్‌లో రెస్టారెంట్ ప్రారంభించింది. అక్కడకు వచ్చే లాయర్లు, ఆఫీసర్లు, ఇంజీనర్లును కారణంగా తనలాంటి వారు ఎలా పైకి ఎదగొచ్చు అనే విషయాలు తెలుసుకుంది. అలా ఆమెకు ప్రత్యేక సామర్థ్యం ఉన్న వ్యక్తుల కోసం వచ్చే మోడిఫైడ్ బైక్‌ల గురించి తెలుసుకుని నడపడం నేర్చుకుంది. అలా బైక్‌పై తనకున్న ఇష్టం క్రీడాకారిణిగా ఎదిగేలా చేసింది. అంతేగాదు బైక్ నడిపేలా ఎగువ శరీరాన్ని బలోపేతం చేసేందుకు హైడ్రోథెరపీ తీసుకుంది. అంటే ఇక్కడ దీపా ఈత కొట్టడం ప్రాక్టీస్ చేయాలి. అలా ఆమె వివిద క్రీడల కోసం శిక్షణ పొందింది. చెప్పాలంటే ఇక్కడ దీపా 30 ఏళ్ల వయసులో క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. తన కుమార్తెతో కలిసి ఢిల్లీకి వచ్చి జేఎల్ఎన్ స్టేడియం సమీపంలో చిన్నఅపార్టెమెంట్లో నివశించడం ప్రారంభించింది. అక్కడ అయితే ఆటలకు సంబంధించిన ప్రాక్టీస్ చేసేది. చాలామంది ఈ వయసులో ఆడుకుంటుందేంటీ?..టైం వేస్ట్ అనేవారు. అయితే అవేమి ఆమె పట్టించుకోలేదు దీపా. ఏదో ఒకరోజు నేనెంటీ అనేది తెలుసుకుంటారనే కసి దీపాలో అంతకంతకు పెరిగిపోయింది. చివరికీ తాను అనుకున్నట్లే పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి మహిళగా నిలిచింది. అంతేగాదు 42 ఏళ్ల వయసులో ప్రతిష్టాత్మక అర్జున అవార్డును గెలుచుకుంది. పద్మశ్రీ అవార్డు కూడా అందుకుంది. అంతేగాదు షాట్‌పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో వంటి అనేక విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. నాడు ఎవరైతే ఆమెకు చికిత్స ఇవ్వడం వ్యర్థం అంటూ తన కుటుంబానికి సలహాలు ఇచ్చారు వాళ్లే..మా పిల్లలకు నువ్వే స్ఫూర్తి అంటూ ప్రశంసించారని గర్వంగా చెబుతోంది. చివరగా దీపా దయచేసి ఆగస్టు 28, 2024లో జరిగే పారా ఒలింపిక్స్ వీక్షించండి అని ప్రజలను కోరింది. (చదవండి: వందేళ్లు బతకాలనుకుంటే..ఈ అలవాట్లు తప్పనిసరి అంటున్న పరిశోధకులు!) -
ఇలాంటి కూతురు చచ్చినా పర్లేదు అనేవారు.. నాన్న చనిపోయాక..
ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం తలవంచక తప్పదు అంటున్నారు శతాబ్ది. దివ్యాంగురాలిగా మారిన తాను సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని సగర్వంగా చెబుతున్నారు. బ్యాంక్ మేనేజర్‌గా, క్రీడాకారిణిగా, సామాజిక కార్యకర్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ‘శతాబ్ది’ జీవన ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. అందుకే ఆ పేరు పెట్టారు.. చిన్నతనం నుంచే హైపర్ యాక్టివ్. ఒక్కచోట కూడా కాలు నిలవనే నిలవదు. ఎల్లప్పుడూ ఉరుకులూ.. పరుగులే. అందుకే.. వేగంగా ప్రయాణించే శతాబ్ది ఎక్స్‌ప్రెస్(రైలు) పేరిట.. తమ అమ్మాయికి శతాబ్ది అని నామకరణం చేశారు ఆ తల్లిదండ్రులు. గెంతులు వేస్తూ ఎప్పుడూ సందడి చేసే తమ బిడ్డను చూసుకుంటూ మురిసిపోయారు. కానీ... 21 ఏళ్ల వయస్సులో శతాబ్దికి జరిగిన ప్రమాదం వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. మేడ మీది నుంచి జారిపడ్డ శతాబ్ది.. శాశ్వతంగా చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సిన పరిస్థితి. నా ప్రపంచం మొత్తం కుప్పకూలిపోయింది.. ‘‘ఆరోజు నా కేక విని అమ్మానాన్న పరిగెత్తుకుని వచ్చారు. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సుమారు 5 గంటల తర్వాత నాకు స్పృహ వచ్చింది. నడుము కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. ఇక జీవితంలో నేను నడవలేనని డాక్టర్లు చెప్పారు. అప్పుడే నా ప్రపంచం మొత్తం కూలిపోయినట్లు అనిపించింది. పూర్తిగా విషాదంలో మునిగిపోయాను. ఇతరుల సాయం లేకుండా కనీస అవసరాలు తీర్చుకోలేని దుస్థితి. సిగ్గు అనిపించేది. భయం వేసేది. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. అలాంటి సమయంలో బంధువులు తమ మాటలతో మరింత చిత్రవధ చేసేవారు. ఫొటో: హ్యూమన్స్ ఆఫ్ బాంబే చచ్చిపోవడమే మేలు అనేవారు.. ‘‘ఇలాంటి కూతురి వల్ల ఏం ప్రయోజనం. ఇంత ఘోరమైన పరిస్థితి అనుభవించే కంటే చచ్చిపోవడమే మంచిది’’ అని అమ్మానాన్నలను మరింతగా బాధపెట్టేవారు. అయితే, నా కుటుంబం నాకు అండగా నిలిచింది. ‘‘నా కూతురు కచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తుంది. తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని నాన్న వాళ్లకు సమాధానమిచ్చేవారు. ఆరేళ్లపాటు ఆస్పత్రే నాకు ఇల్లు. నాకు వైద్యం చేయించడానికి నా కుటుంబం చాలా కష్టపడింది. అమ్మ తన పెన్షన్ డబ్బుతో బిల్లు కట్టేది. ఇవన్నీ చూస్తూ నా మీదే నాకే జాలివేసేది. అప్పుడే బలంగా నిర్ణయించుకున్నాను. ‘‘ఈ దుర్ఘటనకు నా జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఇవ్వకూడదు. నాకంటూ గుర్తింపు కావాలి’’ అని అనుకున్నాను. మొదటి ప్రయత్నంలోనే... అందుకు అనుగుణంగానే బ్యాంకు ఉద్యోగం సాధించేలా అహర్నిశలు కృషి చేశాను. మొదటి ప్రయత్నంలోనే ఎగ్లామ్ పాసై జాబ్ తెచ్చుకున్నాను. ‘‘మేనేజర్ తండ్రిని’’ అంటూ నాన్న నన్ను చూసి గర్వపడేవారు. అప్పుడు నా ఆనందం అంతా ఇంతాకాదు. ఎవరైతే నన్ను చచ్చిపో అన్నారో వారికి గట్టిగా సమాధానం ఇచ్చినట్లయింది. కానీ విధికి నా సంతోషం చూడబుద్ధికాలేదేమో! ఆరు నెలల్లోనే నాన్న చనిపోయారు. నా గుండె పగిలింది. నేను మేడ మీది నుంచి కిందపడిపోయినపుడు కూడా అంతటి బాధను అనుభవించలేదు.ఆ బాధాకరమైన ఘటన నుంచి బయటపడేందుకు సామాజిక కార్యక్రమాల్లో భాగమవడం అలవాటు చేసుకున్నాను. ఆర్మీ ఆఫీసర్ అయి దేశానికి సేవ చేయాలన్న చిన్ననాటి కల ఎలాగో నెరవేరలేదు కాబట్టి... సమాజ సేవ చేయాలని ఫిక్సయ్యాను. ఫొటో: హ్యూమన్స్ ఆఫ్ బాంబే 31 వయస్సులో మళ్లీ అయితే, పారాలింపిక్స్‌లో దీపా మాలిక్‌ను చూసిన తర్వాత నాకు కూడా క్రీడల్లో పాల్గొనాలనిపించింది. 31 ఏళ్ల వయస్సులో కోచ్ సహాయంతో షాట్‌పుట్, జావెలిన్ త్రో, డిస్కస్‌త్రో ప్రాక్టీసు చేశాను. బరువులు ఎత్తిన ప్రతీసారీ ప్రాణం పోయినట్టు అనిపించేది. క్రమేణా.. అలవాటైపోయింది. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మూడు విభాగాల్లోనూ స్వర్ణం సాధించాను. అమ్మ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. నాన్నే గనుక ఉండి ఉంటే ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. న్యూస్ పేపర్లలో నా గురించి కథనాలు చూసిన ప్రతిసారి నాన్నే గుర్తుకువస్తారు. ఇలాంటి కూతురి వల్ల ఏం ప్రయోజనం అన్న వారికి వీటిని సమాధానంగా చూపేవారు అనిపిస్తుంది. ప్రస్తుతం కామన్వెల్త్ క్రీడల కోసం సన్నద్ధమవుతున్నాను. కచ్చితంగా పసిడి సాధిస్తాను. ఆరేళ్ల పాటు నరకం అనుభవించిన నేను.. విధిరాత అని సరిపెట్టుకోకుండా ముందడుగు వేశాను కాబట్టే.. వీల్‌చైర్‌లో కూర్చునే నా కలలు నెరవేర్చుకున్నాను’’ అని తన జీవితంలోని విషాదాలు, వాటి నుంచి తేరుకుని ఎదిగిన విధానాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శతాబ్ది పంచుకున్నారు. -వెబ్‌డెస్క్ చదవండి: Shana Parmeshwar: అలాంటప్పుడు నాకు ఎదురయ్యే ప్రత్యేక సవాళ్లు ఏముంటాయి? -
ఇది ఆరంభం మాత్రమే: దీపా మలిక్
టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి స్వదేశానికి తిరిగి వస్తున్నందుకు నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది. తొమ్మిది క్రీడాంశాల్లో కలిపి మొత్తం 54 మంది క్రీడాకారులతో టోక్యోకు బయలుదేరినపుడు ఈసారి మనం చరిత్ర సృష్టిస్తామని పూర్తి విశ్వాసంతో ఉన్నాను. 1968లో తొలిసారి పారాలింపిక్స్‌లో భారత్ అరంగేట్రం చేశాక 2016 రియో పారాలింపిక్స్ వరకు మనం మొత్తం 12 పతకాలు గెలిచాం. అయితే ఈసారి మనం ఏకంగా 19 పతకాలు నెగ్గడం... 162 దేశాలు పాల్గొన్న ఈ దివ్యాంగుల విశ్వ క్రీడల్లో 24వ స్థానంలో నిలువడం ఆనందం కలిగించింది. భారత క్రీడాకారులు పతకాలు గెలిచే క్రమంలో ప్రపంచ, పారాలింపిక్, ఆసియా రికార్డులు సృష్టించడం నా సంతోషాన్ని రెట్టింపు చేసింది. మరికొందరు పతకాలను త్రుటిలో చేజార్చుకున్నా వారి ప్రదర్శనను ప్రశంసించాల్సిందే. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందుండి నడిపించడంతో దేశం మొత్తం మమ్మల్ని అనుసరించి ఆదరించింది. పారాలింపిక్స్‌కు బయలుదేరేముందు ఆయన మాతో రెండు గంటలపాటు మాట్లాడి మాలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. దేశానికి చెందిన అత్యున్నత నాయకుడి నుంచి ఈ తరహా మద్దతు లభిస్తే ఏ క్రీడాకారుడి కెరీర్ అయినా సాఫీగా సాగిపోతుంది. ఈసారి పారాలింపిక్స్‌లో భారత్ పతకాల పంట పండించడం ఎలా సాధ్యమైందని చాలాసార్లు నన్ను అడిగారు. కేంద్ర ప్రభుత్వం, భారత పారాలింపిక్ కమిటీ, ప్రభుత్వేతర సంస్థలు పారా స్పోర్ట్స్‌కు మద్దతు నిలవడంవల్లే ఈసారి మేము అత్యధిక పతకాలు గెలవగలిగాం. 2016 రియో పారాలింపిక్స్‌లో నాలుగు పతకాలు గెలిచిన తర్వాత పారా స్పోర్ట్స్‌ను ప్రత్యేక దృష్టి కోణంలో చూడటం మొదలైంది. వైకల్యం ఉన్నా ఆటల ద్వారా అత్యున్నత వేదికపై సత్తా చాటుకునే అవకాశం ఉందని, తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవచ్చని దివ్యాంగులు ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకవైపు కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టినా క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఈ ప్రదర్శనతో భారత్‌లో పారాలింపిక్స్‌కు సంబంధించి కొత్త శకం మొదలైంది. టోక్యో కేవలం ఆరంభం మాత్రమే! చదవండి: Tokyo Paralympics 2021: కలెక్టర్ సాబ్ కథ ఇదీ.. Viral Video: ఊహించని ట్విస్ట్.. గ్రౌండ్లోకి పోలీసుల రంగప్రవేశం, భయంతో ప్లేయర్స్.. -
అవనికే తొలి ప్రత్యేక ఎస్యూవీ: ఆనంద్ మహీంద్ర ఆఫర్
సాక్షి,ముంబై: టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత మహిళా షూటర్ అవని లేఖరాకు పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. భారత పారా ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ దీపా మాలిక్ అభ్యర్థన మేరకు ప్రత్యేక ఎస్‌యూవీల తయారీకి మొగ్గు చూపిన ఆయన తాజాగా అవనికి బంపర్ ఆఫర్ ప్రకటించారు ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నవారికి తయారు చేయనున్న తమ తొలి ఎస్‌యూవీని ఆమెకే ఇస్తానని ప్రకటించారు. షూటింగ్లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన అవనిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. చదవండి : Avani Lekhara: గోల్డెన్ గర్ల్ విజయంపై సర్వత్రా హర్షం పారా ఒలింపిక్స్ అవని సాధించిన ఘనతపై దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ కురుస్తోంది. మరోవైపు తనకు బంగారు పతకం లభించడంపై అవని సంతోషాన్ని ప్రకటించారు. ఈ అనుభూతిని వర్ణించ లేనిదని ప్రపంచం శిఖరానికి ఎదిగిన భావన కలుగుతోందని పేర్కొన్నారు. కాగా తన లాంటి ప్రత్యేక సామర్థ్యం ఉన్న వారికోసం భారతదేశంలో ప్రత్యేక ఎస్‌యూవీలను తయారు చేయమని భారత ఆటోమొబైల్ పరిశ్రమను దీపా మాలిక్ అభ్యర్ణించారు. తనకు ఎస్యూవీ నడపడం అంటే చాలా ఇష్టమనీ, ఇలాంటి కార్లలో ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేయాలని మహీంద్రా, టాటా మోటార్స్, ఎంజీ ఇండియా లాంటి భారతీయ ఆటోమొబైల్ దిగ్గజాలను కోరారు. ఎవరైనా ప్రత్యేక సీట్లతో కూడిన ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకువస్తే, తప్పనిసరిగా కొనుగోలు చేస్తానని ఆమె ప్రకటించారు.ఈ మేరకు ఆమె ఒక వీడియోను షేర్ చేశారు. దీపా మాలిక్ ట్వీట్‌పై ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఈ సవాలును స్వీకరించి వారికోసం ఎస్‌యూవీలను తయారీపై దృష్టి పెట్టాలని తన ఉద్యోగి వేలును కోరిన సంగతి తెలిసిందే. A week ago @DeepaAthlete suggested that we develop SUV’s for those with disabilities. Like the one she uses in Tokyo.I requested my colleague Velu, who heads Development to rise to that challenge. Well, Velu, I’d like to dedicate & gift the first one you make to #AvaniLekhara https://t.co/J6arVWxgSA — anand mahindra (@anandmahindra) August 30, 2021 Impressed with this technology.Sincerely hope Automobile world in India can give us this dignity and comfort.. I love to drive big SUVs but getting in and out is a challenge, Give me this seat n I buy your SUV @anandmahindra @TataCompanies @RNTata2000 @MGMotorIn #Tokyo2020 pic.twitter.com/0yFGwvl46V — Deepa Malik (@DeepaAthlete) August 20, 2021 -
వీల్ చెయిర్..విల్ చెయిర్
పట్టుదలతో ఏదైనా మార్చుకోవచ్చు అని తన జీవితాన్ని ఉదాహరణగా చూపుతుంది దీపా మాలిక్. దేశంలో పారా ఒలింపిక్ పతకం సాధించిన మొట్టమొదటి మహిళ గా ఘనత సాధించింది. హర్యానాలో పుట్టి పెరిగిన దీప వెన్నెముకలో ఏర్పడిన కణితి కారణంగా చక్రాల కుర్చీకి పరిమితమైంది. అనేక సవాళ్లను ఎదుర్కొని పతకాలు, పురస్కారాలు అందుకుంది. తన సమస్యలతో ఇప్పటికీ పోరాడుతూనే ఆ శక్తిని కుటుంబానికీ ఇస్తూ తనలాంటి వారిలో స్ఫూర్తిని నింపుతోంది. పద్మశ్రీ, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డు, ఆసియా పారా గేమ్స్‌లో 4 పతకాలు, యమునా నది మీదుగా ఈత కొట్టడం ఇవన్నీ సాధించడానికి ఒక జీవితం సరిపోదేమో అనిపిస్తుంది. కానీ, వాటన్నింటినీ సాధించి, ఓడిస్తున్న జీవితం తో పోరాడి గెలిచి చూపించింది. శక్తి పుంజం దీపా మాలిక్ తన చక్రాల కుర్చీలో కూర్చోగానే ఆ కుర్చీకే శక్తి వస్తుందేమో అనిపిస్తుంది. విధికి లొంగని శక్తి పుంజం అక్కడా ప్రకాశిస్తున్నట్టుగా ఉంటుంది. ‘భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని ఎప్పుడూ ఫుల్‌గా ఛార్జ్ చేసి ఉంచండి. పరుగు, ఆట, గెంతడం.. వంటి వాటితో మీలో శక్తిని నింపండి’ అని మహిళలకు చెబుతుంది. దీపా బాల్యమంతా జైపూర్ లో గడిచింది. పెళ్లై ఇద్దరు కూతుళ్లకు తల్లి ఆమె. వారిద్దరూ చదువుకుంటున్నారు. ఆత్మవిశ్వాసాన్ని తగ్గించలేదు దీపా తన కుటుంబానికి వెన్నెముక. జూన్ 3, 1999న వెన్నెముక లో కణితి ఉన్నట్టు వైద్య పరీక్షలో తేలింది. నడుస్తున్న జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. కణితి ఆపరేషన్ తర్వాత, పక్షవాతం బారిన పడింది. కొన్నాళ్లు మంచానికే పరిమితమైన దీప తనకు తాను శక్తిని కూడగట్టుకుంది. రెండు యుద్ధాలను జయించిన వేళ కార్గిల్ యుద్ధ మేఘాలు శివార్లలో ఉరుముతున్న కాలం. ఈ యుద్ధంలో దీప భర్త విక్రమ్ కూడా దేశం కోసం పోరాడుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులు యుద్ధం చేస్తున్నప్పుడు ఇది చాలా కష్టమైన సమయం, ఒకటి దేశ శివార్లలో, మరొకటి శరీర శివార్లలో. ఈ సమయం దీప కుటుంబానికి చాలా సవాల్‌గా మారింది. కానీ చివరికి దీప కుటుంబం రెండు యుద్ధాలను గెలిచింది. ఒక వైపు భారత్ కార్గిల్ యుద్ధంలో విజయం సాధించింది. దీపకు మూడు వెన్నెముక కణితి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి. కానీ, పక్షవాతం రావడంతో మంచానికే పరిమితం అయ్యింది. దీంతో కొన్నిసార్లు దీప విచారంగా ఉండేది. ‘ఆ సమయంలో మా నాన్న ‘చీకటిని శపించడంలో అర్థం లేదు, నువ్వే దీపం కావాలి. అందుకే నీకా పేరు పెట్టాను’ అని చెప్పడంతో ఓ కొత్త శక్తి ఆవరించినట్టు అనిపించింది. అప్పటి నుంచి నాకు నేనుగా నిలదొక్కుకోవడానికి ఎంత ప్రయత్నం చేశానో మాటల్లో చెప్పలేను’ అని వివరించిన దీపా మాలిక్ చేతల్లో తన విజయాన్ని ప్రపంచానికి చాటింది. ఇప్పటికీ చాటుతూనే ఉంది. -
పారాలింపియన్ దీపా మలిక్ వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత పారాథ్లెట్, రియో పారాలింపిక్స్ షాట్‌పుట్ (ఎఫ్53) ఈవెంట్ రజత పతక విజేత దీపా మలిక్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది. అయితే తాను గతేడాది సెప్టెంబర్ 16వ తేదీనే ఆట నుంచి తప్పుకున్నానని, ఈ మేరకు భారత పారాలింపిక్ కమిటీకి లేఖ కూడా అందజేశానని తెలిపింది. నిబంధనల ప్రకారం ఆటకు వీడ్కోలు పలికాకే ఫిబ్రవరిలో జరిగిన భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొని విజేతగా నిలిచి ఆ పదవిని స్వీకరించినట్లు 49 ఏళ్ల దీపా స్పష్టం చేసింది. -
ఆశలకు ఆటగాళ్లు రెక్కలు తొడుగుతున్నారు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారుల ప్రదర్శన పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న ఆటగాళ్లను జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయన అభినందించారు. ‘త్రివర్ణ పతాకాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళుతున్న అథ్లెట్లను ఈ రోజు అభినందిస్తున్నాను. అది బాక్సింగ్‌లో కానివ్వండి లేదా బ్యాడ్మింటన్, టెన్నిస్, లేదంటే మరే క్రీడాంశంలోనైనా సరే... మన ఆశలకు ఆటగాళ్లు కొత్త రెక్కలు తొడుగుతున్నారు. మన దేశం మరింత విశ్వాసంతో ముందుకు వెళుతోందన్న విషయాన్ని క్రీడల్లో సాధిస్తున్న ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ 114వ జయంతి సందర్భంగా ఆయనను మోదీ స్మరించుకొన్నారు. ‘ధ్యాన్చంద్లాంటి గొప్ప వ్యక్తి జన్మించిన రోజు, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అందరికీ నా అభినందనలు. హాకీ స్టిక్‌తో ఆయన ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేశారు. ఆయనకు తలవంచి నమస్కరిస్తున్నాను’ అని ప్రధాని అన్నారు. గురువారం ‘జాతీయ క్రీడా పురస్కారాలు’ అందుకున్న ఆటగాళ్లకు కూడా మోదీ తన అభినందనలు తెలిపారు. కన్నుల పండువగా... క్రీడా పురస్కారాల ప్రదానం రాష్ట్రపతి భవన్లో కన్నులపండువగా జరిగింది. రాజీవ్ ఖేల్‌రత్నతో పాటు అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డులను విజేతలు అందుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులు అందజేశారు. ‘ఖేల్‌రత్న’కు ఎంపికైన వారిలో మహిళా పారా అథ్లెట్ దీపా మాలిక్ వీల్‌చైర్‌లో తన అవార్డును స్వీకరించింది. ట్రోఫీ, ప్రశంసాపత్రంతో పాటు రూ.7.5 లక్షల నగదు ప్రోత్సాహకం కూడా ఆమె అందుకుంది. ఈ ఏడాది మొత్తం 19 మంది ‘అర్జున’కు ఎంపికయ్యారు. తెలుగు కుర్రాడు, ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్ తన ‘అర్జున’ను స్వీకరించాడు. ఈ కార్యక్రమానికి అతని తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. అర్జున విజేతకు రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకం లభిస్తుంది. హైదరాబాద్‌కే చెందిన షూటర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్‌కు చెందిన ‘స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్’కు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ దక్కింది. దీనిని నారంగ్, తన అకాడమీ కోచ్, సహ భాగస్వామి పవన్ సింగ్‌తో కలిసి అందుకున్నాడు. ఇదే విభాగంలో అనంతపురం జిల్లాకు చెందిన ‘రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్’ తరఫున మాంచో ఫెర్రర్ పురస్కారాన్ని స్వీకరించారు. బజరంగ్ గైర్హాజరు... ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఎంపికైన భారత మేటి రెజ్లర్ బజరంగ్ పూనియా తన అవార్డును అందుకోలేకపోయాడు. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సన్నాహాల్లో భాగంగా అతను రష్యాలో ఉన్నాడు. వెస్టిండీస్‌లో ఉన్న క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. అథ్లెట్లు తజీందర్‌పాల్ సింగ్, మొహమ్మద్ అనస్, షూటర్ అంజుమ్ మౌద్గిల్ కూడా గైర్హాజరయ్యారు. వీరందరికి మరో రోజు క్రీడా మంత్రి కిరణ్ రిజిజు చేతుల మీదుగా అవార్డులను అందజేస్తారు. అవార్డు విజేతల జాబితా రాజీవ్ ఖేల్‌రత్న: బజరంగ్ పూనియా (రెజ్లింగ్), దీపా మాలిక్ (పారా అథ్లెటిక్స్) అర్జున: భమిడిపాటి సాయిప్రణీత్ (బ్యాడ్మింటన్), రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ (క్రికెట్), మొహమ్మద్ అనస్, తజీందర్‌పాల్ సింగ్, స్వప్న బర్మన్ (అథ్లెటిక్స్), గుర్ప్రీత్ సింగ్ సంధు (ఫుట్‌బాల్), సోనియా లాథర్ (బాక్సింగ్), చింగ్లెన్సానా సింగ్ (హాకీ), ఎస్.భాస్కరన్ (బాడీ బిల్డింగ్), అజయ్ ఠాకూర్ (కబడ్డీ), అంజుమ్ మౌద్గిల్ (షూటింగ్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), హర్మీత్ దేశాయ్ (టేబుల్ టెన్నిస్), పూజా ధాండా (రెజ్లింగ్), ఫౌద్ మీర్జా (ఈక్వెస్ట్రియన్), సిమ్రన్ సింగ్ షెర్గిల్ (పోలో), సుందర్ సింగ్ గుర్జర్ (పారా అథ్లెటిక్స్), గౌరవ్ సింగ్ గిల్ (మోటార్ స్పోర్ట్స్). ద్రోణాచార్య (రెగ్యులర్): మొహిందర్ సింగ్ ధిల్లాన్ (అథ్లెటిక్స్), సందీప్ గుప్తా (టేబుల్ టెన్నిస్), విమల్ కుమార్ (బ్యాడ్మింటన్). ద్రోణాచార్య (లైఫ్‌టైమ్): సంజయ్ భరద్వాజ్ (క్రికెట్), రామ్‌బీర్ సింగ్ ఖోఖర్ (కబడ్డీ), మెజ్బాన్ పటేల్ (హాకీ). ధ్యాన్‌చంద్ (లైఫ్‌టైమ్ అచీవ్మెంట్): మనోజ్ కుమార్ (రెజ్లింగ్), లాల్రెమ్సంగా (ఆర్చరీ), అరూప్ బసక్ (టేబుల్ టెన్నిస్), నితిన్ కీర్తనే (టెన్నిస్), మాన్యుయెల్ ఫ్రెడ్రిక్స్ (హాకీ). రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ (షూటింగ్), రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ (మాంచో ఫెర్రర్, అనంతపురం), గో స్పోర్ట్స్ ఫౌండేషన్. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ (క్రీడా ప్రదర్శనలో ఉత్తమ విశ్వవిద్యాలయం): పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్). రెజ్లర్ పూజా ధాండ, క్రికెటర్ పూనమ్ యాదవ్, కబడ్డీ ప్లేయర్ అజయ్ ఠాకూర్ ఆర్డీటీ డైరెక్టర్ మాంచో ఫెర్రర్, షూటర్ గగన్ నారంగ్, పవన్ సింగ్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం
భారత హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి యేటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇదే రోజున కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ క్రీడా పురస్కారాల విజేతలకు రాష్ట్రపతి భవన్లో అవార్డులు అందజేస్తారు. నేడు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2018 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలు గెల్చుకున్న ఆటగాళ్లు అవార్డులు స్వీకరించనున్నారు. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా, మహిళా పారాథ్లెట్ దీపా మలిక్లు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ అందుకోనున్నారు. తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ ‘అర్జున అవార్డు’ను పొందనున్నాడు. సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ జాతీయ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
అర్జున జాబితాలో రవీంద్ర జడేజా
గోపీచంద్ అకాడమీ ఆణిముత్యం, తెలుగుతేజం సాయిప్రణీత్‌కు భారత ప్రభుత్వం నుంచి ఘనమైన గుర్తింపు లభించనుంది. యేటికేడు తన రాకెట్ పదును పెంచుకుంటున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్‌కు ‘అర్జున’ అవార్డు ఖాయమైంది. పారాలింపియన్ దీప మాలిక్ రెండో ‘ఖేల్‌రత్న’గా ఎంపిక కాగా... బ్యాడ్మింటన్ గురువు విమల్ కుమార్ ద్రోణాచార్యుడయ్యాడు. క్రికెటర్లు రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ అర్జునలుగా నిలిచారు. అయితే ఎప్పటిలాగే చిన్నపాటి అసంతృప్తుల సమేతంగానే ఈ సారి కూడా క్రీడా పురస్కారాల జాబితా వెలువడింది. న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారానికి మరో తెలుగు షట్లర్ ఎంపికయ్యాడు. భమిడిపాటి సాయిప్రణీత్ ‘అర్జున’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇంటాబయటా నిలకడగా రాణిస్తున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్ ప్రతిభను అవార్డుల కమిటీ గుర్తించింది. 2017లో ప్రణీత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నిలకడైన ప్రదర్శనతో సింగపూర్ ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్లలో టైటిల్స్ గెలిచాడు. సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. పారాలింపియన్ దీపా మాలిక్‌కు భారత అత్యున్నత క్రీడాపురస్కారం దక్కనుంది. రియో పారాలింపిక్స్‌లో రజతం నెగ్గిన ఆమెను ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు నామినేట్ చేశారు. ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఆ అవార్డుకు ఎంపికవగా ఈ ఏడాది సంయుక్తంగా ఇద్దరికి ఆ పురస్కారం లభించనుంది. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్‌లు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. రిటైర్డ్ జస్టిస్ ముకుందకమ్ శర్మ నేతృత్వంలోని అవార్డుల కమిటీ 19 మందిని ‘అర్జున’కు, ఇద్దరిని ‘ఖేల్‌రత్న’కు ఎంపిక చేసింది. మరో ముగ్గురిని ‘ద్రోణాచార్య’కు నామినేట్ చేసింది. దీపకు మూడో పురస్కారం పారా అథ్లెట్ దీప 2012లో అర్జున అవార్డు అందుకుంది. రెండేళ్ల క్రితం 2017లో భారత పౌరపురస్కారం ‘పద్మశ్రీ’ని దక్కించుకుంది. వరుసగా మూడు పారా ఆసియా గేమ్స్ (2010, 2014, 2018)లో పతకాలు గెలిచిన భారత మహిళా అథ్లెట్‌గా ఆమె రికార్డు సృష్టించింది. జకార్తా (2018) ఈవెంట్లో ఆమె డిస్కస్ త్రో, జావెలిన్ త్రోలో కాంస్యాలు గెలిచింది. గడిచిన నాలుగేళ్ల ప్రదర్శన ఆధారంగా ఇచ్చే ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఆమె అర్హురాలని కమిటీ నిర్ణయించింది. పూనియాతో పాటు ఆమెను ఎంపిక చేసింది. మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ ఐసీసీ ఈవెంట్లలో పరుగుల ప్రవాహం సృష్టించడంతో ‘అర్జున’కు ఎంపికైంది. మహిళల భారత జట్టు 2017లో వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్, గతేడాది టి20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. విమల్‌కు ద్రోణాచార్య సైనా నెహ్వాల్ మాజీ కోచ్ విమల్ కుమార్ ‘ద్రోణాచార్య’కు నామినేట్ అయ్యారు. ఆయనతో పాటు సందీప్ గుప్తా (టేబుల్ టెన్నిస్), మొహిందర్ సింగ్ ధిల్లాన్ (అథ్లెటిక్స్) కోచ్‌లకు ఇచ్చే పురస్కారానికి ఎంపికయ్యారు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కోచ్ సంజయ్ భరద్వాజ్, మెర్జ్బన్ పటేల్, రణ్బిర్సింగ్ ఖోఖర్ జీవిత సాఫల్య పురస్కారాలకు నామినేట్ అయ్యారు. కమిటీ నామినీల జాబితాను కేంద్ర క్రీడాశాఖ ఆమోదించిన వెంటనే అధికారికంగా విజేతలను ప్రకటిస్తారు. యేటా హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి (ఆగస్టు 23)ని జాతీయ క్రీడాదినోత్సవంగా నిర్వహిస్తారు. ఆ రోజు రాష్ట్రపతి భవన్లో ఘనంగా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఖేల్‌రత్న విజేతకు పతకంతో రూ.7.5 లక్షలు, అర్జున, ద్రోణాచార్యలకు మెమెంటో, రూ. 5 లక్షలు బహుమతిగా అందజేస్తారు. మేరీ తప్పుకుంది... భారత చాంపియన్ బాక్సర్ మేరీకామ్ అవార్డుల కమిటీలో ప్రధాన సభ్యురాలు. కానీ ఆమె శనివారం ‘ద్రోణాచార్య’ ఎంపికలో పాలుపంచుకోలేదు. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ బాక్సర్ వ్యక్తిగత కోచ్ చోటేలాల్ యాదవ్ కూడా ‘ద్రోణాచార్య’ ప్రతిపాదిత జాబితాలో ఉన్నారు. దీంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు దూరంగా ఉండాలని భావించిన ఆమె ఎంపిక ప్రక్రియ నుంచి స్వయంగా తప్పుకుంది. అవార్డు నామినీల జాబితా రాజీవ్ ఖేల్‌రత్న: బజరంగ్ పూనియా (రెజ్లింగ్), దీపామాలిక్ (పారా అథ్లెట్). అర్జున: సాయిప్రణీత్ (బ్యాడ్మింటన్), రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ (క్రికెట్), తేజిందర్‌పాల్ సింగ్, మొహమ్మద్ అనస్ యాహియా, స్వప్న బర్మన్ (అథ్లెటిక్స్), సోనియా లాతర్ (బాక్సింగ్), చింగ్లేశన సింగ్ (హాకీ), అజయ్ ఠాకూర్ (కబడ్డీ), గౌరవ్‌సింగ్ గిల్ (మోటార్ స్పోర్ట్స్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), సుందర్‌సింగ్ గుర్జార్ (పారా అథ్లెట్), అంజుమ్ మోద్గిల్ (షూటింగ్), హర్మీత్ దేశాయ్ (టేబుల్ టెన్నిస్), పూజ ధండ (రెజ్లింగ్), ఫౌవాద్ మిర్జా (ఈక్వెస్ట్రియన్), గుర్‌ప్రీత్‌సింగ్ సంధు (ఫుట్‌బాల్), సిమ్రన్‌సింగ్ షెర్గిల్ (పోలో). ఆర్డీటీకి పురస్కారం క్రీడలను ప్రోత్సహించడంలో రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) చేస్తున్న కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ సంస్థను అవార్డు కమిటీ ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’కు ఎంపిక చేసింది. ఐదు దశాబ్దాల క్రితం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్’గా మొదలైన ఈ స్వచ్ఛంద సంస్థ మొదట్లో ప్రజల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం శ్రమించింది. కాలక్రమంలో రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్‌గా మారాక గత 20 ఏళ్లుగా క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో 2002లో స్పోర్ట్స్ సెంటర్‌ను ప్రారంభించింది. 32 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పరచింది. సకల సౌకర్యాలతో క్రీడలకు, క్రీడాకారులకు ఎనలేని సేవలందజేస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన నిరుపేద బాలబాలికల్లో ప్రతిభను వెలికితీసి వారిని ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తోంది. ‘‘చాలా సంతోషంగా ఉంది. సరైన సమయంలో ఈ అవార్డుకు ఎంపికయ్యాను. రాబోయే టోర్నీల్లో మరింత పట్టుదలతో రాణించేందుకు ఈ అవార్డు ఊతమిస్తుంది’’ – ‘సాక్షి’తో సాయి ప్రణీత్ ‘‘మన దేశంలో తమవాళ్లకే అవార్డులు ఇచ్చుకుంటారు. అంటే కమిటీలో మనవారుంటే గుర్తిస్తారు. అంతే తప్ప ప్రదర్శనతోనూ, ప్రతిభతోనూ కాదు. ఇండియాలో ఇంతే. ఎవరేం చేయలేరు. మన పని మనం చేసుకోవాల్సిందే’’ – ట్విట్టర్లో హెచ్.ఎస్.ప్రణయ్ ఆవేదన ‘‘ఆటగాళ్ల విజయంలో కోచ్‌ల పాత్ర ఎంతో ఉంటుంది. నేను ఆ కోచ్‌ల వల్లే ఎదిగాను. జస్పాల్రాణా షూటింగ్లో ఉత్తమ కోచ్. మను భాకర్, సౌరభ్ చౌదరి, అనీశ్ భన్వాలాలను ప్రపంచశ్రేణి షూటర్లుగా తీర్చిదిద్దారు. అలాంటి రాణాను విస్మరించడం సరికాదు. ఇలాంటి తప్పటడుగులు టోక్యో ఒలింపిక్స్‌లో ప్రభావం చూపిస్తాయి’’ – ఒలింపిక్స్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా దీప, జడేజా, పూనమ్, అజయ్, బర్మన్ -
ప్రతిష్టాత్మక అవార్డుకు రవీంద్ర జడేజా నామినేట్
నూఢిల్లీ : భారత క్రికెటర్ రవీంద్ర జడేజాను అర్జున అవార్డుకు సెలక్షన్ కమిటీ నామినేట్ చేసింది. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ ఓడిపోయినా, రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌షోతో అందరి మనస్సులు గెలుచుకున్న విషయం తెలిసిందే. హేమాహేమీలు వెనుదిరిగినా తన బ్యాటింగ్ నైపుణ్యంతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 59 బంతుల్లో 77 పరుగులు, రెండు వికెట్లు పడగొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. కానీ ఆఖర్లో జడేజా, ధోనీ ఔటవ్వడంతో ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమించిన విషయం విదితమే. భారత్ తరఫున జడేజా 156 వన్డేలు, 41 టెస్టులు, 42 టీ20లు ఆడాడు. జస్టిస్ (రిటైర్డ్) ముకుందకమ్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జడేజాతో పాటు మరో 18 మంది క్రీడాకారులను అర్జున అవార్డుకు నామినేట్ చేసింది. బీసీసీఐ ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు రవీంద్ర జడేజాతో పాటు, జస్ప్రిత్ బూమ్రాను, మహ్మద్ షమీలను కూడా సిఫార్సు చేసింది. జడేజాతో పాటు, మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టార్స్ తేజేందర్ పాల్సింగ్తూర్, మహ్మద్ అనాస్, స్వప్నా బార్మన్, ఫుట్‌బాల్ క్రీడాకారుడు గుర్ప్రీత్ సింగ్ సంధు, హాకీ ప్లేయర్ చింగ్లెన్సానా సింగ్ కంగుజమ్, షూటర్ అంజుమ్ మోద్గిల్ తదితరులను సెలక్షన్ కమిటీ నామినేట్ చేసింది. మరోవైపు దేశ అత్యున్నత క్రీడా అవార్డు.. రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్నకు దీపా మాలిక్ నామినేట్ అయ్యారు. ఈమె రియో పారాలింపిక్స్‌లో షాట్‌పుట్ విభాగంలో వెండి పతకాన్ని సాధించారు. దీపా మాలిక్ 2017లో పద్మశ్రీ, 2012లో అర్జున అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బాక్సర్ మేరీ కోమ్ తన వ్యక్తిగత కోచ్ చోతేలాల్ యాదవ్‌కు ద్రోణాచార్య అవార్డు రానందున తనంతట తానే ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనలేదు. మరోవైపు రెజ్లర్ బజ్రంగ్ పునియా ఖేల్‌రత్న అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ అవార్డు మార్గదర్శకాల ప్రకారం.. ఓ క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిలో నాలుగు సంవత్సరాలుగా స్థిరమైన ప్రదర్శన కనబరచాలి. అవార్డు సిఫారసు చేసే సంవత్సరంలో అత్యుత్తమంగా రాణించి ఉండాలి. వీటితో పాటు నాయకత్వ లక్షణాలు, క్రీడా నైపుణ్యం, క్రమశిక్షణను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు నామినేట్ చేస్తారు. -
‘ఖేల్‌రత్న’కాలేదని బాధగా ఉంది: దీపా
న్యూఢిల్లీ: ఈ ఏడాది ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఎంపిక కాలేకపోయానన్న బాధ ఇంకా వెంటాడుతోందని రియో పారాలింపిక్స్ రజత పతక విజేత దీపా మలిక్ తెలిపింది. గతేడాది నలుగురికి ఇచ్చినట్లుగా ఈ ఏడాది ఇచ్చివుంటే బాగుండేదని అభిప్రాయపడింది. గతేడాది సింధు, దీపా కర్మాకర్, సాక్షి మలిక్, జీతూ రాయ్‌లను ‘ఖేల్‌రత్న’కు ఎంపిక చేశారు. అయితే ఈ ఏడాది పారాలింపియన్ దేవేంద్ర జజారియా, హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌లకు ఇచ్చారు. ఇందులో తన పేరు లేకపోవడంపై పారా షాట్‌పుటర్ దీప కలత చెందుతోంది. ‘ఏదేమైనా వచ్చే ఏడాది జరిగే పారా ఆసియా గేమ్స్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పితే ఇస్తారేమో చూడాలి’ అని తెలిపింది. రియోలో పతకం గెలిచినప్పుడు ప్రకటించిన నగదు బహుమతులు ఇప్పటికీ అందలేదని వాపోయింది. -
దీపా మలిక్ అప్పీల్...
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తన పేరును ఖేల్‌రత్న అవార్డు కోసం మరోసారి పరిశీలించాలంటూ పారాలింపియన్ దీపా మలిక్ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. ఒలింపిక్స్ జరిగిన ఏడాది ఎక్కవ మందికి ఈ అవార్డు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తాను మళ్లీ అప్పీల్ చేస్తున్నట్లు ఆమె చెప్పింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఆమెకు మద్దతుగా కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పటి వరకైతే అవార్డుల కమిటీ ఇచ్చిన జాబితాకు కేంద్ర క్రీడా శాఖ ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. అయితే దీప పేరును పరిశీలించే అవకాశం లేదని కమిటీలో ఒక సభ్యుడు వెల్లడించినట్లు సమాచారం. రియోలో పతకం సాధించిన పారాలింపియన్లు అందరికీ అవార్డు ఇవ్వలేమని చెప్పిన ఆయన, దేవేంద్ర జజరియాకు ఇది రెండో ఒలింపిక్ స్వర్ణమనే విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు తమకు శిక్షణ ఇచ్చారంటూ ఒకరికంటే ఎక్కువ మంది కోచ్‌ల పేర్లను ద్రోణాచార్య అవార్డుకు సిఫారసు చేసే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాక్సర్ అఖిల్ కుమార్ అభిప్రాయపడ్డాడు. వారిపై 420 కేసు పెట్టాలని అతను ఘాటుగా వ్యాఖ్యానించాడు. మహిళల బాక్సింగ్‌లో ముగ్గురు అర్జున అవార్డీలు ఉండగా, ఐదుగురు ద్రోణాచార్యలు ఎలా ఉంటారని అతను ప్రశ్నించాడు. మారాల్సిందే.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖేల్‌రత్న అవార్డును అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఒక్క ఆటగాడికి మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఇది ముగ్గురు, నలుగురికి ఇస్తున్నారు. మున్ముందు ఆరుగురి దాకా వెళుతుందేమో? గడువు ముగిసిన తర్వాత కూడా ఆటగాళ్ల పేర్లను సిఫారసు చేయడాన్ని క్రీడా శాఖ మానుకోవాలి. 1960 నుంచి 1980 దశకం వరకు అర్జున అవార్డు విజేతలు వీటిని చాలా గొప్పగా భావించేవారు. ఇప్పటి పరిస్థితుల్లో అర్జున, ద్రోణాచార్య అవార్డులకు విలువ లేకుండా పోయింది. త్వరలోనే ఖేల్‌రత్న కూడా ఇదే ఒరవడిలోకి వస్తుందేమో. ‘తమ’వారికి సడలింపులు 2003లో ఖేల్‌రత్న కోసం ముందుగా అంజూ బాబీ జార్జి ఎంపికయ్యింది. అయితే డబుల్ ట్రాప్ షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఏథెన్స్ ఒలింపిక్స్‌లో దేశం నుంచి తొలి వ్యక్తిగత రజతం సాధించడంతో అంజూకు బదులు రాథోడ్‌కు ఈ అవార్డు ఇచ్చారు. నిజానికి నాలుగేళ్ల కోసారి జూలై–ఆగస్టు మధ్య ఒలింపిక్స్ జరుగుతాయి. అయితే అప్పటికే జాతీయ క్రీడా అవార్డుల ప్రతిపాదన గడువు కూడా ముగుస్తుంది. కానీ ప్రభుత్వం అత్యుత్సాహంతో నిబంధనలను పక్కనబెట్టి రాథోడ్‌కు ఇచ్చింది. ఆ తర్వాతి ఏడాదికి అంజూను ఎంపిక చేశారు. తదనంతరం కూడా ఇలాంటి వ్యవహారాలు జరిగాయి. -
అయ్యో..అర్జున!
∙ వివాదాస్పదమవుతున్న జాతీయ క్రీడా పురస్కారాలు ∙ ఎంపికలో లోపించిన పారదర్శకత ∙ నిరాశలో నిజమైన అర్హులు దీపా మలిక్... రియో పారాలింపిక్స్ షాట్‌పుట్‌లో రజతం నెగ్గి వార్తల్లో నిలిచిన అథ్లెట్. అంతేకాదు పారాలింపిక్స్ చరిత్రలో పతకం సాధించిన తొలి భారత మహిళగానూ ఖ్యాతికెక్కింది. అయితే ఇటీవలి రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డుల జాబితాలో తన పేరు లేకపోవడం ఆమెను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఎందుకంటే ఆమెతో పాటే రియోలో పతకం నెగ్గిన దేవేంద్ర జజరియాకు ఇప్పుడు అవార్డు దక్కబోతోంది మరి. ఇక భారత అగ్రశ్రేణి మోటార్ రేసింగ్ డ్రైవర్ గౌరవ్ గిల్ అయితే ఏకంగా ప్రభుత్వంపైనే విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టాడు. అర్జున అవార్డుల కోసం తన క్రీడను పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమంటున్నాడు. ఓ క్రికెటర్ పది మంచి బంతులు వేయగానే అతనికి ‘అర్జున’ దక్కుతుందని.. ఇదో పెద్ద జోక్ అని రెండు సార్లు ఆసియా పసిఫిక్ ర్యాలీ చాంపియన్‌గా నిలిచిన గిల్ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇక టెన్నిస్ డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్న ఎంతగా పేరు గడించినా ఇప్పటికీ అతనికి అర్జున దక్కలేదు. ఈసారి కూడా అతడి పేరును అఖిల భారత టెన్నిస్ సంఘం నామినేట్ చేయకపోవడం అతడిని ఆగ్రహానికి గురిచేసింది. అసలు దేశంలోని ఆటగాళ్లంతా గర్వించదగ్గ స్థాయిలో ఉండాల్సిన ఈ క్రీడా అవార్డులపై ఏడాదికేడాది ఇలా విమర్శలు ఎందుకు పెరుగుతున్నాయి? అవార్డుల కమిటీ తమ ఎంపికలో ఎలాంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటుంది? సాక్షి క్రీడా విభాగం : ప్రతీ ఏడాది జాతీయ క్రీడా అవార్డుల ప్రకటన, వాటితో పాటు వివాదం వెంట రావడం పరిపాటిగా మారిపోయింది. ఈసారి కూడా అదే మళ్లీ జరిగింది. కేంద్ర క్రీడా శాఖ ఓ వైపు ఈ విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకుంటోంది. అయినా ‘ఈ అవార్డులు పూర్తిగా రాజకీయమైపోయాయి.. నీకు అవార్డు రావాలంటే సంబంధాలను పెంచుకోవాల్సిందే’ అనే అభిప్రాయం కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఎందుకంటే ప్రతీసారి అర్జున, రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుల ప్రకటన వెలువడగానే అసంతృప్తుల గళాలు కూడా ఎక్కువవుతున్నాయి. కొందరైతే కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వస్తోంది. దేశం తరఫున ఆడి పతకాలు సాధించేందుకు తమ జీవితాన్ని పణంగా పెడుతున్నా ఎలాంటి గుర్తింపు రాకపోతే ఎలా అనేది వారి ఆవేదన. ప్రభుత్వం నుంచి ఓ చిన్న గుర్తింపు తమ ఇన్నేళ్ల కష్టాన్ని మరిచిపోయేలా చేస్తుందనేది నిరాదరణకు గురవుతున్న అథ్లెట్ల ఆశ. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’ జాబితాలో తన పేరు లేకపోవడంతో దీపా మలిక్ కమిటీ అవార్డుల కమిటీ తీరును విమర్శించింది. ఎందుకంటే పారాలింపిక్స్‌లో దేశానికి వచ్చిన పతకాలు నాలుగు. ఇందులో మరియప్పన్ తంగవేలు, దేవేంద్ర జజరియాలు స్వర్ణం సాధించారు. దీపా రజతం, వరుణ్ భటి కాంస్యం దక్కించుకున్నారు. ఇందులో దేవేంద్రకు అత్యున్నత క్రీడా పురస్కారం దక్కనుంది. ‘నా ప్రతిభ ఎందుకు మిగతా వారికన్నా తక్కువగా కనిపించింది. ఈ క్రీడల్లో పతకం సాధించిన తొలి మహిళగా నేను పేరు తెచ్చుకున్నాను. కనీసం ఆ గొప్పతనాన్ని కూడా గౌరవించకపోతే ఎలా?’ అని దీపా ప్రశ్నించింది. మరోవైపు భారత టాప్ ర్యాలీ డ్రైవర్ గౌరవ్ గిల్ అర్జున అవార్డు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. నిజానికి మోటార్ రేసింగ్‌ను కేంద్రం అసలు ఓ క్రీడగానే భావించడం లేదు. ఇప్పటిదాకా ఒక్క రేసర్ కూడా అర్జునను దక్కించుకోలేదు. కేవలం రెండేళ్ల కిందటే కేంద్రం రేసింగ్‌ను గుర్తించింది. భారత్ నుంచి తొలి ఫార్ములావన్ డ్రైవర్‌గా నిలిచిన నరైన్ కార్తీకేయన్కు మాత్రం 2010లో పద్మశ్రీ దక్కింది. క్రికెటర్లు ఎప్పుడో ఒక్కసారి మెరుగ్గా ఆడినా అతడికి వెంటనే అర్జున దక్కడం ఎంతవరకు సబబని 35 ఏళ్ల గౌరవ్ ప్రశ్నించాడు. నిజానికి క్రికెట్ ఒలింపిక్ క్రీడ కాకపోయినా ప్రతీ ఏడాది వారికి మాత్రం అవార్డులు దక్కుతుంటాయని అన్నాడు. ఇక అర్జున కోసం గడువు లోపల తన పేరును కేంద్రానికి పంపకపోవడంతో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా)పై డబుల్స్ స్టార్ రోహన్న బోపన్న విరుచుకుపడ్డాడు. గతంలోనూ తన విషయంలో ‘ఐటా’ ఇలాగే వ్యవహరించిందని జూన్‌లో ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌ను గెలుచుకున్న బోపన్న తెలిపాడు. అయితే భారత్ తరఫున కనీసం ఆసియా క్రీడలు లేదా కామన్వెల్త్ క్రీడల్లో ఎలాంటి పతకం సాధించని బోపన్న పేరును ప్రతీసారి కమిటీ తిరస్కరిస్తోందని ‘ఐటా’ చెబుతోంది. ఏదేమైనా భారత క్రీడాభిమానుల్లో మాత్రం అవార్డీల ఎంపిక వ్యాపారంగా మారిపోతోందని, దీన్ని సమూలంగా మార్చాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. మిల్కా సింగ్ తిరస్కరణ... 2001లో అథ్లెట్ రచనా గోవిల్, జిమ్నాస్ట్ కల్పనా దేవ్‌నాథ్‌లకు అర్జున అవార్డులు ఇవ్వడాన్ని ఆసియా డిస్కస్ చాంపియన్ అనిల్ కుమార్ కోర్టులో సవాల్ చేశాడు. దీంతో రామనాథన్ కృష్ణన్, ప్రకాశ్ పదుకొనే, సునీల్ గావస్కర్‌లాంటి మేటి క్రీడాకారులు సెలక్షన్ కమిటీలో ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. అదే ఏడాది దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కూడా తనకు ఆలస్యంగా లభించిన జీవితకాల సాఫల్య పురస్కారాన్ని తీసుకునేందుకు నిరాకరించారు. తన స్థాయికి ఏమాత్రం సరితూగని వారితో కలిసి ఆ అవార్డును స్వీకరించలేనని తేల్చి చెప్పారు. కోర్టు కేసులూ ఉన్నాయి గత కొన్నేళ్లుగా కోర్టు కేసులు క్రీడా శాఖను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మనోజ్ కుమార్ పేరుతోనే ఉన్న మరో బాక్సర్ డోపింగ్‌కు పాల్పడితే... కపిల్‌దేవ్ నేతృత్వంలోని కమిటీ పొరపాటు పడి సీనియర్ బాక్సర్ మనోజ్ కుమార్ పేరును అర్జున జాబితా నుంచి తొలగించింది. ఈ విషయంలో మనోజ్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాడు. కానీ మనోజ్ పేరును జాబితాలో చేర్చేందుకు రెండోసారి సమావేశం కావడానికి కమిటీ అంగీకరించలేదు. అయితే కోర్టు మాత్రం అతడికి అవార్డు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. -
మన ఆటకు మంచిరోజులు!
అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత వెలుగులు కాలగమనంలో మరో ఏడాది గడిచిపోయింది. అంతర్జాతీయ క్రీడా వేదికపై ఈ సంవత్సరం కూడా భారత క్రీడాకారులు తమదైన ముద్ర వేశారు. మరీ ముఖ్యంగా క్రీడాకారిణులు అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టారు. రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు, సాక్షి మలిక్, దీపా కర్మాకర్... రియో పారాలింపిక్స్‌లో దీపా మలిక్... టెన్నిస్‌లో సానియా మీర్జా తమ ప్రతిభాపాటవాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈసారి విజయాలతోపాటు వివాదాలు, వైఫల్యాలు కూడా భారత క్రీడాభిమానులను పలుకరించాయి. రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్–నర్సింగ్ యాదవ్ వివాదం... ఒలింపిక్స్‌కు అర్హత పొందిన ఇద్దరు అథ్లెట్స్ డోపింగ్‌లో పట్టుబడటం... మేటి బాక్సర్ మేరీకోమ్ రియో బెర్త్ పొందకపోవడం...2016లో ఇతర విశేషాలు. – సాక్షి క్రీడావిభాగం ‘సూపర్’ సానియా... మహిళల డబుల్స్ టెన్నిస్‌లో హైదరాబాద్ ప్లేయర్ సానియా మీర్జా వరుసగా రెండో ఏడాది సీజన్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించింది. ఈ ఏడాది సానియా ఎనిమిది టైటిల్స్ సాధించింది. హింగిస్‌తో కలిసి బ్రిస్బేన్, సిడ్నీ, ఆస్ట్రేలియన్ ఓపెన్, రోమ్ ఓపెన్, సెయింట్ పీటర్స్బర్గ్ టోర్నీలలో ఆమె విజేతగా నిలిచింది. ఆ తర్వాత కొత్త భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో కలసి సిన్సినాటి ఓపెన్, టోక్యో ఓపెన్లలో, మోనికా నికెలెస్కూ (రొమేనియా)తో కలసి న్యూ హవెన్ ఓపెన్‌లో టైటిల్స్ సాధించింది. రియో ఒలింపిక్స్‌లో రోహన్ బోపన్నతో కలసి సానియా మీర్జా కాంస్య పతక పోరులో ఓడిపోయింది. లియాండర్ పేస్ ఫ్రెంచ్ ఓపెన్‌లో హింగిస్‌తో జతగా టైటిల్ నెగ్గి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ‘కెరీర్ స్లామ్’ పూర్తి చేసుకున్నాడు. రాకెట్ దూసుకెళ్లింది... భారత్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న బ్యాడ్మింటన్ క్రీడలో ఈసారీ మనోళ్లు మెరిశారు. రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు మహిళల సింగిల్స్ విభాగంలో రజత పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అనంతరం చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో విజేతగా నిలిచి తన ఖాతాలో లోటుగా ఉన్న సూపర్ సిరీస్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. హాంకాంగ్ ఓపెన్‌లో రన్నరప్‌గా కూడా నిలిచింది. ఈ ప్రదర్శనతో సింధు సీజన్ ముగింపు టోర్నీ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’కు అర్హత పొందింది. అంతేకాకుండా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ద్వారా ఈ ఏడాది అత్యంత మెరుగైన క్రీడాకారిణి పురస్కారాన్ని కూడా గెల్చుకుంది. మరోవైపు సైనా నెహ్వాల్‌కు ఈ ఏడాది తీపి, చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను నెగ్గిన సైనా... రియో ఒలింపిక్స్‌లో మాత్రం గాయం కారణంగా లీగ్ దశలోనే నిష్క్రమించింది. మరో తెలుగు అమ్మాయి రుత్విక శివాని రష్యా గ్రాండ్‌ప్రిలో, దక్షిణాసియా క్రీడల్లో విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ రియో ఒలింపిక్స్‌కు అర్హత పొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రణయ్ స్విస్ ఓపెన్, సాయిప్రణీత్ కెనడా ఓపెన్, సౌరభ్ వర్మ చైనీస్ తైపీ ఓపెన్ టైటిల్స్ సాధించగా... సమీర్ వర్మ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. సిక్కి రెడ్డి మిక్స్డ్ డబుల్స్‌లో రష్యా గ్రాండ్‌ప్రి, బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టైటిల్స్‌ను దక్కించుకుంది. సుమీత్ రెడ్డి–మనూ అత్రి జంట కెనడా ఓపెన్ టైటిల్ నెగ్గి ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి భారతీయ జోడీగా గుర్తింపు పొందింది. జిగేల్మన్న జాతీయ క్రీడ... ఈ యేడు జాతీయ క్రీడ హాకీ మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో రజతం... ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో స్వర్ణం... సొంతగడ్డపై జూనియర్ ప్రపంచకప్‌ను సాధించడంతో మన హాకీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేసింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా హాకీ ఇండియా చీఫ్ నరీందర్ బాత్రా ఎన్నికయ్యారు. రియో ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో ఓడిపోగా... 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత మహిళల జట్టు అంతగా ఆకట్టుకోలేకపోయింది. హారిక అదే జోరు... గతేడాది ఆన్లైన్ చెస్‌లో విశ్వవిజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఈ ఏడాదీ నిలకడగా రాణించింది. జూన్‌లో వరుసగా రెండు వారాల్లో రెండు అంతర్జాతీయ టోర్నీలు నెగ్గిన హారిక... ఐల్ ఆఫ్ మ్యాన్ టోర్నీలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ హూ ఇఫాన్‌పై సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత చైనాలోని చెంగ్డూలో జరిగిన ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీలో విజేతగా నిలిచి తొలి గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అద్వానీ అదరహో... క్యూ స్పోర్ట్స్ (స్నూకర్, బిలియర్డ్స్)లో భారత స్టార్ పంకజ్ అద్వానీ ఈసారి మళ్లీ సత్తా చాటుకున్నాడు. బెంగళూరులో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్) చాంపియన్‌షిప్‌లో అద్వానీ విజేతగా నిలిచి తన ఖాతాలో 16వ ప్రపంచ టైటిల్‌ను జమచేసుకున్నాడు. భారత్‌కే చెందిన ధ్రువ్ సిత్వాలా ఆసియా బిలియర్డ్స్ టైటిల్ నిలబెట్టుకోగా... ధర్మేందర్ మాస్టర్స్కేటగిరీలో ప్రపంచ చాంపియన్ అయ్యాడు. ఆ నలుగురు... రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజతం, కాంస్యమే లభించినా... అదే వేదికపై జరిగిన పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం దక్కడం విశేషం. మహిళల షాట్‌పుట్‌లో దీపా మలిక్ రజతం... పురుషుల హైజంప్‌లో తంగవేలు మరియప్పన్ స్వర్ణం, వరుణ్ సింగ్ భటి కాంస్యం గెలిచారు. జావెలిన్ త్రోలో దేవేంద్ర జజరియా పసిడి పతకాన్ని సాధించాడు. అజేయ విజేందర్... ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో తనకు ఎదురులేదని భారత స్టార్ విజేందర్ సింగ్ తన పంచ్ పవర్‌తో నిరూపించుకున్నాడు. జులైలో భారత్‌లో జరిగిన బౌట్లో కెర్రీ హోప్ (ఆస్ట్రేలియా)పై గెలిచిన విజేందర్ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ నెలలో టాంజానియా బాక్సర్ ఫ్రాన్సిస్ చెకాను నాకౌట్ చేసి విజేందర్ ఈ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఈ ఏడాది విజేందర్ పోటీపడిన ఐదు బౌట్లలో అజేయంగా నిలువడం విశేషం. ఇక రియో ఒలింపిక్స్‌లో మాత్రం భారత బాక్సర్లకు నిరాశ ఎదురైంది. శివ థాపా, మనోజ్ కుమార్, వికాస్ క్రిషన్ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయారు. ‘పట్టు’ సడలించారు... సాక్షి మలిక్ అద్భుత ప్రదర్శన తప్పిస్తే ఈ ఏడాది భారత రెజ్లింగ్ తమ ‘పట్టు’ను సడలించింది. రియో ఒలింపిక్స్‌లో సాక్షి మలిక్ మహిళల 58 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న యోగేశ్వర్ దత్ (61 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. 74 కేజీల విభాగంలో తనకూ, నర్సింగ్కు ట్రయల్స్ నిర్వహించి... గెలిచిన వారిని రియో ఒలింపిక్స్‌కు పంపించాలని స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ చేసిన అభ్యర్థనను భారత రెజ్లింగ్ సమాఖ్య పట్టించుకోలేదు. అయితే చివరి నిమిషంలో నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికిపోవడంతో ఈ విభాగంలో భారత ప్రాతినిధ్యం లేకుండాపోయింది. ‘కూత’ అదిరింది.... ప్రొ కబడ్డీ లీగ్‌తో గ్రామీణ క్రీడ కబడ్డీకి ఒక్కసారిగా ఆదరణ పెరిగింది. ఈసారి రెండుసార్లు ఈ లీగ్‌ను నిర్వహించారు. డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. అనూప్ కుమార్ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో 38–29తో ఇరాన్‌ను ఓడించింది. ఓవరాల్‌గా భారత జట్టుకిది వరుసగా మూడో ప్రపంచకప్ టైటిల్ కావడం విశేషం. దీపా త్రుటిలో... రియో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఈవెంట్ ఫైనల్లో దీపా కర్మాకర్ 15.066 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. అంతకుముందు రియోలోనే జరిగిన టెస్ట్ ఈవెంట్లో దీపా రాణించి ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. నీరజ్ సంచలనం అథ్లెటిక్స్‌లో హరియాణా యువ సంచలనం నీరజ్ చోప్రా అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణం గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. జావెలిన్‌ను అతను 86.48 మీటర్ల దూరం విసిరి ఈ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రదర్శన మినహా అథ్లెటిక్స్‌లో ఈ ఏడాది మనకు నిరాశే మిగిలింది. రియో బెర్త్ సాధించిన ధరమ్వీర్ సింగ్ (200 మీటర్లు), ఇందర్జీత్ సింగ్ (షాట్‌పుట్) డోపింగ్‌లో పట్టుబడి ఈ మెగా ఈవెంట్‌కు దూరమయ్యారు. అడపాదడపా మెరుపులు... ఫుట్‌బాల్‌లో ఈ సంవత్సరం భారత జట్టు అడపాదడపా మెరిపించింది. ఏఎఫ్సీ కప్‌లో బెంగళూరు ఎఫ్‌సీ జట్టు రన్నరప్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్లబ్‌గా గుర్తింపు పొందింది. సునీల్ చెత్రి నాయకత్వంలోని భారత జట్టు ఏడోసారి దక్షిణాసియా (శాఫ్) చాంపియన్‌గా నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 135వ స్థానానికి చేరుకొని ఆరేళ్ల తర్వాత తమ అత్యుత్తమ ర్యాంక్‌ను సాధించింది. -
దీపకు రూ. 4 కోట్ల నజరానా
గుర్గావ్ (హరియాణా): రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం అందించిన హరియాణా షాట్‌పుట్ క్రీడాకారిణి దీపా మలిక్‌కు రూ. 4 కోట్ల నజరానా అందజేశారు. హరియణా రాష్ట్ర స్వర్ణోత్సవాల్లో భాగంగా మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో దీపా మలిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ భారీ మొత్తాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో హరియాణా గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి, ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, క్రీడల మంత్రి అనిల్ విజ్ పాల్గొన్నారు. రియో పారాలింపిక్స్‌లో దీపా మలిక్ షాట్‌పుట్‌లో ఇనుప గుండును 4.61 మీటర్ల దూరం విసిరి రజతం సాధించింది. తద్వారా ఈ మెగా ఈమెంట్ చరిత్రలో పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. -
నా కల నెరవేర్చుకున్నా..
పారాలింపిక్ పతక విజేత దీపా మలిక్ రియో డి జనీరో: ధైర్యంగా తాను కన్న కలల ఫలితమే తాజా పారాలింపిక్ పతకమని షాట్‌పుటర్ దీపా మలిక్ తెలిపింది. ఎఫ్53 షాట్ పుట్ విభాగంలో తను రజతం సాధించిన విషయం తెలిసిందే. ‘నేను ధైర్యంగా కల కనడమే కాకుండా వాటిని సాకారం చేసుకునేందుకు అమితంగా శ్రమించాను. ఆత్మవిశ్వాసం, పట్టుదల కోల్పోనందువల్లే ఇది సాధ్యమైంది. మహిళలు సాధారణంగా ఈ విషయంలో వెనకడుగు వేస్తారు. ఇదే క్రమంలో నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఈ పతకం గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ విజయం నాలాంటి వారికి ఎంతగానో ప్రేరణగా నిలిచి వారికున్న అడ్డుగోడలను ఛేదించేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సాయ్తో పాటు నా శిక్షకులకు, నాకెంతగానో బలాన్నిచ్చిన భర్త, పిల్లలకు కృతజ్ఞతలు’ అని 45 ఏళ్ల దీప తెలిపింది. -
దీపా మలిక్ కు అభినందనల వెల్లువ
ముంబై: రియో పారాలింపిక్స్ లో రజత పతకం సాధించిన షాట్‌పుట్ క్రీడాకారిణి దీపా మలిక్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినిమా ప్రముఖులు ట్విట్టర్ ద్వారా ఆమె అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్ లో రజత పతకం గెలిచి భారత దేశానికి దీపా మలిక్ గర్వకారణంగా నిలిచిందని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. రియోలో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించిందని వ్యాఖ్యానించారు. పారాలింపిక్స్ లో దీపా మలిక్ చరిత్ర సృష్టించిందని సీనియర్ నటి హేమమాలిని ప్రశంసించారు. ఆమెను చూసి దేశం గర్విస్తోందన్నారు. మహిళల షాట్‌పుట్ (ఎఫ్-53) ఈవెంట్లో దీపా మలిక్ మన దేశానికి రజత పతకం సాధించడం సంతోషం కలిగిస్తోందని హీరో ఇమ్రాన్ హష్మీ పేర్కొన్నాడు. దీపా మలిక్ విజయం స్ఫూర్తిదాయకమని టాలీవుడ్ హీరో మంచు విష్ణు ట్వీట్ చేశాడు. -
మణి దీపం
దీపా మలిక్ కొత్త చరిత్ర రియోలో దీప, మలిక్‌ల విన్యాసాలు మరచిపోకముందే ఈసారి దీపా మలిక్ మన జాతీయ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. భారత్ కీ బేటీలే కాదు... భారత్ కీ ‘మా’ కూడా దేశం గర్వపడేలా చేయగలదని 46 ఏళ్ల ఈ స్ఫూర్తి ప్రదాత నిరూపించింది. పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించి భారత నారి ఘనతను ప్రపంచానికి చాటింది. కాళ్లు కదపలేకపోతేనేమి... ఆత్మస్థైర్యం నిండిన ఆ చేతులు ఇనుప గుండును అల్లంత దూరం విసిరి వెండి వెలుగులు పంచాయి. రియో వేదికగా... తొలిసారి ఓ భారత మహిళ పారాలింపిక్స్ పతకం సాధించింది. ♦ పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయురాలిగా రికార్డు ♦ రియోలో షాట్‌పుట్ ఈవెంట్లో రజతం రియో డి జనీరో: భారత క్రీడాభిమానులకు మరో తీపి కబురు. రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. మహిళల షాట్‌పుట్ (ఎఫ్-53) ఈవెంట్లో భారత క్రీడాకారిణి దీపా మలిక్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో దీపా మలిక్ ఇనుప గుండును 4.61 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది. ఫాతిమా నెధమ్ (బహ్రెయిన్-4.76 మీటర్లు) స్వర్ణం సాధించగా... దిమిత్రా కొరోకిడా (గ్రీస్-4.28 మీటర్లు) కాంస్యం సంపాదించింది. హరియాణాలోని సోనెపట్‌కు చెందిన 46 ఏళ్ల దీపా పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు పతకం అందించిన తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు మూడు పతకాలు లభించాయి. ఇంతకుముందు పురుషుల హైజంప్‌లో మరియప్పన్ తంగవేలు స్వర్ణం, వరుణ్ సింగ్ భటి కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దీప మొత్తం ఆరు ప్రయత్నాలు చేసింది. ఆరో ప్రయత్నంలో ఆమె ఇనుప గుండును అత్యధికంగా 4.61 మీటర్ల దూరం విసిరి రజతాన్ని ఖాయం చేసుకుంది. తొలి మూడు ప్రయత్నాల్లో ఆమె వరుసగా 4.26 మీటర్లు, 4.49 మీటర్లు, 4.41 మీటర్లు దూరం విసిరింది. నాలుగో ప్రయత్నం ఫౌల్ కాగా... ఐదో ప్రయత్నంలో 4.41 మీటర్ల దూరం విసిరింది. ఆల్‌రౌండర్: షాట్పుట్తోపాటు జావెలిన్ త్రో, స్విమ్మింగ్‌లో ప్రవేశమున్న దీపా మలిక్ 2011లో ప్రపంచ చాంపియన్‌షిప్ షాట్‌పుట్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు 2010లో ఆసియా పారాగేమ్స్‌లో జావెలిన్ త్రోలో కాంస్యం సాధించింది. 2012లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున’ పురస్కారాన్ని అందుకుంది. అర్జున అవార్డు పొందిన పెద్ద వయస్కురాలిగా కూడా దీప (42 ఏళ్ల వయసులో) గుర్తింపు పొందింది. హరియాణా రూ.4 కోట్లు: రియో పారాలింపిక్స్‌లో రజతం నెగ్గిన దీపా మలిక్‌కు హరియాణా ప్రభుత్వ క్రీడా పథకం నిబంధనల ప్రకారం రూ. 4 కోట్ల నజరానా లభించనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 50 లక్షలు లభించనున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రూ. కోటి నజరానా ప్రకటించారు. అభినందనల వెల్లువ: దీపా మలిక్ పతకం గెలవడంతో ఆమెపై ప్రశంసల వర్షం కురిసింది. ‘దేశం మొత్తం నిన్ను చూసి గర్విస్తోంది’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేయగా... దేశానికి స్ఫూర్తిని అందించే పతకం ఇదంటూ అభినవ్ బింద్రా అభినందనలు తెలిపాడు. సచిన్‌తో పాటు పలువురు క్రికెటర్లు, సోనియాతో సహా అనేకమంది రాజకీయ నాయకులు దీపను అభినందించారు. ‘నేనెంతో గర్వపడే క్షణం ఇది. వైకల్యంతో బాధపడే మహిళలకు అండగా నిలిచేందుకు ఈ విజయం తోడ్పడుతుంది. భారత జట్టులో పెద్ద వయస్కురాలిగా ఉండి పతకం గెలవడం సంతోషంగా అనిపిస్తోంది. ఇన్నేళ్ల నా ప్రయాణం చాలా గొప్పగా సాగింది. ఇందులో నా కుటుంబం మొత్తం తోడుగా నిలిచింది‘ - దీపా మలిక్ ‘విల్ ఆన్ వీల్స్’ దీపా మలిక్ స్ఫూర్తిదాయక గాథ అథ్లెటిక్స్.. బైక్ రైడింగ్.. స్విమ్మింగ్... అడ్వెంచరస్ స్పోర్ట్స.. నడుము కింది భాగం అంతా చచ్చుబడిపోరుు చక్రాల కుర్చీకే పరిమితమైపోరుున 46 ఏళ్ల మహిళ ఈ అన్ని అంశాల్లో అసాధారణ ప్రతిభ చూపడాన్ని కనీసం ఊహించగలమా..! వైకల్యాన్ని అధిగమించి ఎన్నో ఘనతలు సాధించిన స్ఫూర్తి ప్రదాత దీపా మలిక్. పారాలింపిక్స్ పతకంతో దీపా మలిక్ అద్భుతాల జాబితాలో మరో కోహినూర్ చేరింది. చిన్ననాటినుంచి ఆమె జీవితమే ఒక పోరాటంగా బతికింది. మూడేళ్లు ఆస్పత్రిలో..: తండ్రి బీకే నాగ్‌పాల్ ఆర్మీలో ఉన్నతాధికారి. సరదాగా గడిచిపోతున్న బాల్యానికి ఐదేళ్ల వయసులోనే దేవుడు అడ్డుకట్ట వేశాడు. పారాప్లెజిక్ డిసెబిలిటీతో దీప కాళ్లూ, చేతులూ ఒక్కసారిగా బలహీనంగా మారిపోయాయి. కనీసం నిలబడటం కూడా సాధ్యం కాకపోయేది. వెన్నెముక సమస్య అని తేల్చిన డాక్టర్లు చివరకు సుదీర్ఘ వైద్యం చేశారు. మూడేళ్ల పాటు ఆస్పత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు ఎలాగో కోలుకొని మళ్లీ ఈ ప్రపంచంలోకి వచ్చింది. బైక్‌ల పిచ్చి: చిన్నప్పటినుంచి దీప స్నేహితుల్లో అబ్బాయిలే ఎక్కువగా ఉన్నారు. దాంతో మోటార్ బైక్‌లు అంటే పిచ్చి. ఇంటర్ పూర్తయ్యే సరికే ఇదీ, అదని లేకుండా అన్ని రకాల బైక్‌లను నడిపేసింది. బైక్‌ల మీద వ్యామోహమే ఇంటికి పెళ్లి సంబంధాన్ని తెచ్చింది. ఒక రోజు తెల్లవారుజామునే ఇంటి ముందు ఏదో పని మీద నిలబడి ఉన్న సైనికుడి వద్ద బైక్ తీసుకొని అక్కడికక్కడే భిన్నమైన విన్యాసాలు చేసేసింది. దాంతో మనసు పారేసుకున్న ఆ కుర్రాడు కల్నల్ విక్రమ్ సింగ్ పెళ్లి చేసుకుంటానంటూ ఇంటికొచ్చేశాడు. కూతురికి కూడా..: దీప హెల్త్ రిపోర్ట్లు అన్నీ చూపించి ఇదీ పరిస్థితి అని చెప్పినా ఆ సైనికుడు వెనుకడుగు వేయలేదు. దాంతో 19 ఏళ్లకే పెళ్లయిపోయింది. కొన్నాళ్లు మళ్లీ సంతోషాలు విరబూసాయి. ఒక పాప (దేవిక)పుట్టింది. అయితే 13 నెలల వయసులో ఆ చిన్నారికి కూడా తల్లిలాగానే సమస్య రావడంతో అమ్మ గుండె తరుక్కుపోయింది. అయితే చివరకు కోలుకున్న ఆ చిన్నారి నిలబడగలిగింది. ఆ తర్వాత రెండో పాప (అంబిక) కూడా పుట్టి కుటుంబంలో సంతోషాన్ని పంచింది. ఒక్కసారి నడుస్తాను ప్లీజ్: అది 1999లో కార్గిల్ వార్ జరుగుతున్న సమయం... భర్త విక్రమ్ యుద్ధ భూమిలో ఉన్నాడు. ఇక్కడ దీప ఒక్కసారిగా అనారోగ్యం పాలైంది. చికిత్స కోసం వెళితే చిన్ననాటి సమస్య మళ్లీ వచ్చిందని తెలిసింది. ఆపరేషన్ చేసి ట్యూమర్‌ను తొలగిస్తామని డాక్టర్లు చెప్పారు. అయితే జీవితంలో మళ్లీ నడవలేవని పిడుగులాంటి మాట కూడా చెప్పారు. కన్నీళ్లు జలపాతాలై కారుతుండగా శాటిలైట్ ఫోన్లో భర్తతో మాట్లాడింది. అచ్చమైన సైనికుడిలా ‘నీకు నేనున్నాను, మరేం భయం లేదంటూ’ భర్త ధైర్యం నూరిపోశాడు. ఆపరేషన్‌కు అంతా సిద్ధమైంది. థియేటర్లోకి వెళ్లే ముందు డాక్టర్‌తో ‘చివరిసారిగా నడుస్తాను’ అని చెప్పి అక్కడి వరకు దీప నడుస్తూ పోయింది. చక్రాల కుర్చీలోనే విజయాలు... తనకు ఇలాంటి జీవితం ఇచ్చినందుకు దేవుడిని తిట్టుకోలేదు. తన ఆరోగ్య పరిస్థితి ఆమెలో మరింత స్థైర్యాన్ని, పట్టుదలను పెంచింది. ముందుగా కుటుంబ సభ్యుల సహకారంతో రెస్టారెంట్ నడిపి సక్సెస్ అయింది. స్విమ్మింగ్ ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోయిన వారికి యమునా నదిలో ఏటికి ఎదురీది చూపించింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో హిమాలయాల వద్ద రైడింగ్ చేసింది. తర్వాత అథ్లెటిక్స్‌లోకి వచ్చింది. వీల్‌చైర్‌తోనే అంతా ముగిసిపోదని, జీవితమంటే ప్రతి రోజూ చేసుకునే పండగలాంటిదని నమ్మిన దీపా మలిక్ తనలాంటి వారి కోసం ఇప్పుడు ‘విల్ ఆన్ వీల్స్’ అనే సంస్థను కూడా నడిపిస్తోంది. -
నడవలేదన్నారు.. పరుగెడుతోంది!
ఆమెకు పరుగంటే ఇష్టం.. ఆగకుండా జీవితాన్ని పరుగుపెట్టించడమంటే ఇష్టం.. కాళ్లున్నా లేకున్నా సరే..! నాలుగు గోడల మధ్యా కాలక్షేపం చేయడం ఆమెకు అలవాటు లేనిపని. బయటి ప్రపంచాన్ని చూడాలి. వీధుల్లో తిరగాలి. కాళ్లరిగేలా నడవాలి. అప్పటికీ అలసటొస్తే తనివితీరా పరుగెత్తాలి.. ఇదీ ఆమె తీరు. కానీ, ఓ దురదృష్టకర క్షణాన ఆమె నడవడం సాధ్యం కాదన్నారు. ఆమె వైపు జాలిగా చూశారు. అంతే.. ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. శక్తులు కూడదీసుకుంది. విధి వెక్కిరిస్తేనేం..? కాళ్లు పనిచేసినన్ని రోజులూ ఆమె జింకపిల్ల, పనిచేయనంటూ అవి మొండికేసిన రోజున ఆమె చిరుతపులి. కొన్ని వందల పుస్తకాలు చదివినా దొరకని స్ఫూర్తి, ప్రేరణ.. దీపా మాలిక్‌ను చూడగానే కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. ఎనలేని ఉత్తేజం ఆమె సొంతం. దీపా మాలిక్ దేశంలోనే అత్యుత్తమ మహిళా బైక్‌రేసర్, స్విమ్మర్, అంతర్జాతీయ స్థాయి అథ్లెట్, సాహస క్రీడాకారిణి. జాతీయ, అంతర్జాతీయ పతకాలు, లిమ్కా బుక్ రికార్డులు ఆమె స్థాయి ఏంటో చెబుతాయి. క్రమశిక్షణకు మారుపేరైన ఆర్మీ కుటుంబ నేపథ్యంలో పెరిగిన దీపా ఈ ఘనతలు సాధించడం పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కానీ, ఆమె ఓ వికలాంగురాలు అని తెలిస్తే మాత్రం చిరు విజయం కూడా కొండంతగా కనిపిస్తుంది. అయితే, ఆమె చిరు విజయాలతో సంతృప్తి చెందే రకం కాదు. శిఖర సమాన ఘనతలు సాధించనిదీ నిద్రను కూడా దరిచేయనీయని మొండిఘటం. సాహసమే ఊపిరి.. 45 ఏళ్ల దీపా మాలిక్ చిన్ననాటి నుంచీ సాహసాలే ఊపిరిగా బతికింది. అందరు చిన్నారులూ ఊయలపై కూర్చొని ఆనందిస్తే.. దీపా మాత్రం వేగంగా ఊగే ఊయలపై నిల్చొని కేరింతలు కొట్టేది. బైక్‌లంటే ఆమెకు ఎనలేని ఆసక్తి. ఆ ఆసక్తితోనే పెళ్లికి ఒప్పుకున్నారామె. 20 ఏళ్ల వయసులో ఆమె తండ్రి ఓ పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. దీపా మొదలే చిచ్చరపిడుగు. పెళ్లికి అంత ఈజీగా అంగీకరించే రకం కాదు. అయితే, వరుడు కూడా బైక్ ప్రియుడే. దీపా ఆసక్తిని తెలుసుకుని ఆమెను ఉత్సాహపరిచాడు. ఓ బైక్ కూడా కొనిస్తానని చెప్పాడు. దీంతో ఆమెకు నో చెప్పడానికి పెద్దగా కారణాలు దొరకలేదు. తన తండ్రిలాగే అతడూ సైన్యంలో పనిచేయడం దీపాకు నచ్చింది. ఇంకేముంది పెళ్లి బాజా మోగింది. అనుకున్నట్టుగానే బైక్ కొనిచ్చాడు ఆమె భర్త. కొత్త దంపతులు అన్యోన్యంగా జీవించారు. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. కుదుపు.. ప్రేమ, సాహసాల సంగమంగా సాగుతోన్న వారి జీవితంలో 1999లో పెద్ద కుదుపు వచ్చినట్టయింది. దీపాకు వెన్నుముక సంబంధ కణితి ఉన్నట్టు తెలిసింది. వైద్యులు మూడుసార్లు శస్త్రచికిత్స నిర్వహించి దాన్ని తొలగించారు. అయితే, ఆమె నడుం కిందిభాగం మాత్రం చచ్చుబడిపోయింది. ఆమె కాళ్లు పూర్తిగా స్పర్శరహితంగా మారిపోయాయి. ఓ వైపు ఆమె భర్త కార్గిల్ యుద్ధంలో శత్రువులతో పోరాడుతున్నాడు. మరోవైపు దీపా అనారోగ్యంతో..! ఆమె కన్న కలలు నీరుగారిపోయాయి. తనకిష్టమైన బైకింగ్, స్విమ్మింగ్, సాహస క్రీడలు.. ఏవీ ఇకపై చేయలేవంటూ వైద్యులు తెలిపారు. ఈ సమయంలో మరణమే శరణ్యమనుకుంది. కానీ, పసితనంలో ఉన్న తన ఇద్దరు బిడ్డలు ఆమెకు గుర్తుకువచ్చారు. యుద్ధక్షేత్రంలోని భర్త ప్రాణాలతో తిరిగివస్తాడో, లేదో తెలీదు. తను కూడా దూరమైతే వారేమైపోతారోనని భయపడింది. ఆ భయమే ఆమెను ధైర్యంగా బతికేలా చేసింది. అథ్లెటిక్స్‌లో.. బైకింగ్ మాత్రమే కాక, స్విమ్మింగ్‌లోనూ ప్రతిభ కనబర్చిన ఆమె మనదేశం తరఫున పారా ఒలింపిక్ ప్లేయర్‌గా ఎంపికైంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ వికలాంగ మహిళగా గుర్తింపు పొందింది. 2012లో రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డునూ అందుకుంది. స్విమ్మింగ్, జావెలిన్ త్రో, షాట్‌పుట్ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనలు చేసింది. వైకల్యం అనేది ఓ మానసిక అడ్డంకి మాత్రమేనని నిరూపించింది. మరీ ముఖ్యంగా నాలుగు పదుల వయసులో సాధారణ రేసర్లతో సమానంగా ఆమె పోటీ పడేతీరు నిజంగా ఓ అద్భుతమే. ప్రస్తుతం 2016 రియో పారా ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతోన్న దీపా.. వారాంతాల్లో బైక్ రేసింగ్, సాహస క్రీడల్లోనూ పాల్గొంటోంది. తనలాగే వైకల్యంతో బాధపడేవారందరికీ వారందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. 36 ఏళ్ల వయసులో.. కార్గిల్ యుద్ధం ముగిసింది. దీపా మానసిక సంఘర్షణ కూడా..! భార్యాభర్తలిద్దరూ గెలిచారు. క్షేమంగా ఇంటికి చేరుకున్న భర్త.. దీపా మాలిక్‌కు అండగా నిలిచాడు. అంతులేని ప్రేమ కురిపించాడు. దీంతో మానసికంగా కుదుటపడింది. అయితే, వీల్‌చైర్‌కే పరిమితం కావడం ఆమెకు ఎంతమాత్రమూ నచ్చలేదు. బైక్‌పైన రువ్వుమంటూ దూసుకెళ్లాలని కోరుకునేది. అదే విషయాన్ని భర్తకు చెప్పింది. ఎన్నో కష్టాలు, వ్యయప్రయాసలకు ఓర్చి నాలుగు చక్రాల బైక్‌ను సొంతం చేసుకుంది. రేసింగ్ లెసైన్స్ కూడా సంపాదించింది. అలా 36 ఏళ్ల వయసులో కెరీర్ ప్రారంభించింది. అప్పటి నుంచీ ప్రమాదకర పర్వత ప్రాంతాలు, కొండలోయలు, హైవేలు.. ఇలా ప్రతిచోటా రేసుల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే నాలుగు లిమ్కా బుక్ రికార్డులు తన ఖాతాలోకి వేసుకుంది.