
న్యూఢిల్లీ: భారత పారాథ్లెట్, రియో పారాలింపిక్స్ షాట్‌పుట్ (ఎఫ్53) ఈవెంట్ రజత పతక విజేత దీపా మలిక్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది. అయితే తాను గతేడాది సెప్టెంబర్ 16వ తేదీనే ఆట నుంచి తప్పుకున్నానని, ఈ మేరకు భారత పారాలింపిక్ కమిటీకి లేఖ కూడా అందజేశానని తెలిపింది. నిబంధనల ప్రకారం ఆటకు వీడ్కోలు పలికాకే ఫిబ్రవరిలో జరిగిన భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొని విజేతగా నిలిచి ఆ పదవిని స్వీకరించినట్లు 49 ఏళ్ల దీపా స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment