
న్యూఢిల్లీ: ఈ ఏడాది ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఎంపిక కాలేకపోయానన్న బాధ ఇంకా వెంటాడుతోందని రియో పారాలింపిక్స్ రజత పతక విజేత దీపా మలిక్ తెలిపింది. గతేడాది నలుగురికి ఇచ్చినట్లుగా ఈ ఏడాది ఇచ్చివుంటే బాగుండేదని అభిప్రాయపడింది. గతేడాది సింధు, దీపా కర్మాకర్, సాక్షి మలిక్, జీతూ రాయ్‌లను ‘ఖేల్‌రత్న’కు ఎంపిక చేశారు. అయితే ఈ ఏడాది పారాలింపియన్ దేవేంద్ర జజారియా, హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌లకు ఇచ్చారు.
ఇందులో తన పేరు లేకపోవడంపై పారా షాట్‌పుటర్ దీప కలత చెందుతోంది. ‘ఏదేమైనా వచ్చే ఏడాది జరిగే పారా ఆసియా గేమ్స్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పితే ఇస్తారేమో చూడాలి’ అని తెలిపింది. రియోలో పతకం గెలిచినప్పుడు ప్రకటించిన నగదు బహుమతులు ఇప్పటికీ అందలేదని వాపోయింది.
Comments
Please login to add a commentAdd a comment