rajiv Khel Ratna
-
రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పేరు మార్పు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో క్రీడాకారులకు అందించే అత్యుత్తమ క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు. ఈ పురస్కారం పేరు మారింది. ఈ అవార్డును ఇకపై మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా శుక్రవారం మార్చారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్లో ప్రకటించారు. దేశ ప్రజలందరి నుంచి వచ్చిన విజ్ఞప్తులతో వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ పేరు మీదుగా ఖేల్‌రత్న పురస్కారం 1991-92లో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం క్రీడాకారులకు అవార్డులు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు రాజీవ్ పేరు తొలగించి ధ్యాన్‌చంద్ పేరు పెట్టారు. ధ్యాన్‌చంద్ భారత హకీ దిగ్గజం. ధ్యాన్‌చంద్ కెప్టెన్సీలో హకీ జట్టు మూడుసార్లు వరుసగా ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. అంతటి గొప్ప వ్యక్తి జయంతిని (ఆగస్టు 29) జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. తాజాగా టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో మళ్లీ భారత హాకీ జట్టు పతకం పొందింది. మహిళల జట్టు సెమీ ఫైనల్ వరకు వెళ్లి అద్భుత ప్రదర్శన చేసినా నిరాశ చెందారు. అయినా వారి పోరాటాన్ని దేశం కీర్తించింది. వీటన్నింటినీ చూస్తుంటే హాకీకి పూర్వ వైభవం వచ్చిందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే హాకీ దిగ్గజంగా ఉన్న ధ్యాన్‌చంద్ పేరు పెట్టడంతో మళ్లీ హాకీ క్రీడకు మంచి రోజులు రానున్నాయి. I have been getting many requests from citizens across India to name the Khel Ratna Award after Major Dhyan Chand. I thank them for their views. Respecting their sentiment, the Khel Ratna Award will hereby be called the Major Dhyan Chand Khel Ratna Award! Jai Hind! pic.twitter.com/zbStlMNHdq — Narendra Modi (@narendramodi) August 6, 2021 -
ఖేల్‌రత్న రేసులో తెలుగు తేజాలు
చెన్నై: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ కోసం ఈసారి భారీగానే దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తులు స్వీకరించేందుకు మరో మూడు రోజులు ఉన్నందున ఆయా జాతీయ క్రీడా సంఘాలు, సమాఖ్యలు తమ అత్యుత్తమ క్రీడాకారుల పేర్లను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కోసం నామినేట్ చేస్తున్నాయి. తాజాగా అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) భారత మహిళా చెస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి పేరును ‘ఖేల్‌రత్న’ కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 34 ఏళ్ల హంపి 2019 డిసెంబర్లో ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్ షిప్లో విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా గతేడాది అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్‌లోనూ టైటిల్ సాధించింది. మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో భాగంగా 2019లో రష్యాలో జరిగిన తొలి టోర్నీలో చాంపియన్‌గా, మొనాకో లో జరిగిన రెండో టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఓవరాల్‌గా గ్రాండ్‌ప్రి సిరీస్‌లో రెండో స్థానంలో నిలిచి వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించింది. ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించిన భారత జట్టులోనూ హంపి సభ్యురాలిగా ఉంది. హంపికి 2003లోనే అర్జున అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబుతోపాటు ఇతర ప్లేయర్లు విదిత్ గుజరాతి, ఆధిబన్, సేతురామన్, భక్తి కులకర్ణి, పద్మిని రౌత్ పేర్లను ‘అర్జున అవార్డు’ కోసం ఏఐసీఎఫ్ గౌరవ కార్యదర్శి భరత్ సింగ్ చౌహాన్ నామినేట్ చేశారు. బ్యాడ్మింటన్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్... తెలంగాణకు చెందిన భమిడిపాటి సాయిప్రణీత్ పేర్లను ‘ఖేల్‌రత్న’ కోసం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సిఫారసు చేసింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాయిప్రణీత్ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో సాయిప్రణీత్ ఒక్కడే అర్హత సాధించాడు. మరోవైపు 2017లో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన శ్రీకాంత్ ఆ తర్వాత చెప్పుకోతగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. హెచ్ఎస్ ప్రణయ్, ప్రణవ్ చోప్రా, సమీర్ వర్మ పేర్లను ‘అర్జున అవార్డు’ కోసం ‘బాయ్’ ప్రతిపాదించింది. ‘ధ్యాన్‌చంద్ అవార్డు’ కోసం ఒలింపియన్ పీవీవీ లక్ష్మి, లెరాయ్ డిసా పేర్లను... ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం భాస్కర్ బాబు, మురళీధరన్ పేర్లను ‘బాయ్’ పంపించింది. అవార్డీల కమిటీ మొత్తం దరఖాస్తులను పరిశీలించి ఆగస్టు తొలి వారంలో తుది అవార్డులు గెల్చుకున్న వారి జాబితాను ప్రకటించే అవకాశముంది. -
‘ఖేల్‌రత్న’ బరిలో మిథాలీ
న్యూఢిల్లీ: భారత అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ కోసం భారత మహిళల టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ల పేర్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కేంద్ర క్రీడా శాఖకు ప్రతిపాదించింది. ‘అర్జున’ అవార్డు కోసం సీనియర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రాలను సిఫారసు చేసింది. గతేడాది కూడా ధావన్‌ను ప్రతిపాదించినప్పటికీ చివరకు అవార్డుల కమిటీ అతన్ని పక్కన బెట్టింది. హైదరాబాద్‌కు చెందిన 38 ఏళ్ల మిథాలీ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆమె మొత్తం 11 టెస్టుల్లో (669 పరుగులు), 215 వన్డేల్లో (7,170 పరుగులు), 89 టి20 మ్యాచ్‌ల్లో (2,364 పరుగులు) భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. మిథాలీతో పాటు అశ్విన్ ఇదివరకే ‘అర్జున’ పురుస్కారం పొందారు. 34 ఏళ్ల అశ్విన్ 79 టెస్టుల్లో 413 వికెట్లు, 111 వన్డేల్లో 150 వికెట్లు, 46 టి20 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు పడగొట్టాడు. ఫుట్‌బాల్ స్టార్ సునీల్ ఛెత్రి... భారత ఫుట్‌బాల్ స్టార్, కెప్టెన్ సునీల్ ఛెత్రి కూడా ‘ఖేల్‌రత్న’ ప్రతిపాదిత జాబితాలో ఉన్నాడు. ఈసారి కూడా ఈ జాబితా చాంతాడంత ఉంది. భారత అథ్లెటిక్స్ సమాఖ్య జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను సిఫారసు చేస్తే... ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్ప్రింటర్ ద్యుతీచంద్‌ను అత్యున్నత పురస్కారానికి నామినేట్ చేసింది. రెండుసార్లు యూరోపియన్ టూర్ టైటిల్స్ నెగ్గిన గోల్ఫర్ శుభాంకర్ శర్మ, నాలుగోసారి ఒలింపిక్స్‌కు అర్హత పొందిన టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ శరత్ కమల్... ‘షూటింగ్’ డబుల్ ట్రాప్‌లో ప్రపంచ టైటిల్ గెలిచిన అంకుర్ మిట్టల్, అంజుమ్ మౌద్గిల్‌లను వారి క్రీడా సమాఖ్యలు ‘ఖేల్‌రత్న’కు సిఫారసు చేశాయి. అన్ని ప్రతిపాదనలు స్క్రూటినీ చేశాక కేంద్ర ప్రభుత్వం నియమించిన అవార్డుల కమిటీ పురస్కార విజేతలను ఎంపిక చేస్తుంది. తెలుగమ్మాయి జ్యోతి సురేఖ కూడా... తెలుగమ్మాయి, మేటి ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ కూడా ‘రాజీవ్ ఖేల్‌రత్న’ జాబితాలో ఉంది. భారత ఆర్చరీ సంఘం సురేఖ ప్రతిభను గుర్తించి అత్యున్నత క్రీడాపురస్కారానికి సిఫారసు చేసింది. కాంపౌండ్ విభాగంలో పోటీపడే 24 ఏళ్ల సురేఖ ప్రపంచకప్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కలిపి మొత్తం 12 పతకాలు సాధించింది. -
ఎన్ని సాధించినా అవార్డులు ఎందుకివ్వరు?!
క్రీడా పురస్కారాల సమయంలో ప్రతీసారి వివాదాలు, విమర్శలు సర్వ సాధారణమైపోయాయి. ఈసారీ సెలెక్షన్ కమిటీ ఏకంగా ఐదుగురు ‘రాజీవ్ ఖేల్‌రత్న’లను, 27 మంది ‘అర్జున’ విజేతల్ని ఎంపిక చేసింది. ఇంత మందిని ఎంపిక చేసినా నిఖార్సయిన అర్హుల్ని మరోసారి అవార్డులకు దూరం చేయడమే తీవ్ర విమర్శలకు దారితీసింది. –సాక్షి క్రీడా విభాగం యేటా జాతీయ క్రీడా అవార్డులంటేనే ఓ ప్రహసనంలా మారింది. దీనికి ఓ కమిటీ... ఓ కొలమానం అంటూ అన్నీ ఉన్నా... మరీ అర్హులు, అంతర్జాతీయ వేదికల్లో విజేతలు భారత క్రీడా పురస్కారాలకు ఎందుకు దూరమవుతున్నారో ఎవరికీ అంతుచిక్కని సమస్యలా మారింది. అందరూ ఆర్జీలు పెట్టుకున్నా... కొందరైతే సులభంగానే అవార్డులు కొట్టేస్తున్నారు. కానీ... ముఖ్యంగా విశేష ప్రతిభ కనబరిచిన వారైతే ఎందుకు ఖేల్‌రత్నాలు, అర్జున అవార్డీలు కాలేకపోతున్నారో? సమధానం లేని ప్రశ్నలా ఎందుకు మిగులుతున్నారో అర్థం కావడం లేదు. ‘జావెలిన్ త్రోయర్’ నీరజ్ చోప్రా కొన్నేళ్లుగా ‘ప్రపంచ పతకాలు’ సాధిస్తున్నాడు. కానీ భారత్‌లో ‘ఖేల్‌రత్న’ం కాలేదు. హాకీ ప్లేయర్ రూపిందర్ పాల్ సింగ్... ‘ట్రిపుల్ జంపర్’ అర్పిందర్ సింగ్ అంతర్జాతీయ వేదికలపై మెరుస్తున్నారు. అయినా అర్జునకు అనర్హులే! దివ్యాంగ షట్లర్ మానసి జోషి కాలు లేకపోయినా కదన కుతూహలంతో రాణిస్తోంది. ఎందుకనో అవార్డుల కమిటీనే మెప్పించలేకపోతోంది. వీళ్ల పతకాలు, ప్రదర్శన తెలిసిన వారెవరైనా సరే... ‘అర్హుల జాబితాలో ఉండాల్సింది వీరే కదా’ అనే అంటారు. కానీ వీళ్లు మాత్రం లేరు. (చదవండి: నా కష్టానికి దక్కిన ఫలం) ముమ్మాటికి చోప్రా ‘రత్న’మే... ఈ ఏడాది ఐదుగురు క్రీడాకారులు ప్రతిష్టాత్మక ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఎంపికయ్యారు. చరిత్రలో ఐదుమందికి ఒకేసారి ‘ఖేల్‌రత్న’ లభించడం ఇదే మొదటిసారి. అయితే టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ మనిక బత్రా కంటే చాంపియన్ అథ్లెట్ నీరజ్ జోప్రా ఈ పురస్కారానికి ఎన్నో రెట్లు అర్హుడు. ప్రపంచ రికార్డుతో జూనియర్ చాంపియన్‌షిప్ (2016)లో స్వర్ణం నెగ్గాడు. అదే ఏడాది దక్షణాసియా క్రీడల్లోనూ చాంపియన్. 2017లో ఆసియా చాంపియన్‌షిప్ విజేత, ఆ మరుసటి ఏడాది 2018 కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్. వరుసగా మూడేళ్లు అంతర్జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన చోప్రా ఖేల్‌రత్నకు అనర్హుడు ఎలా అవుతాడో కమిటీనే చెప్పాలి. దీనిపై భారత అథ్లెటిక్స్ సమాఖ్య చీఫ్ అదిల్ సమరివాలా తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. మరో అథ్లెట్, ట్రిపుల్ జంపర్ అర్పిందర్ సింగ్ 2018 ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచాడు. కామన్వెల్త్ గేమ్స్, కాంటినెంటల్ కప్ ఈవెంట్లతో పతకాలు నెగ్గి త్రివర్ణాన్ని రెపరెపలాడించాడు. కానీ అవార్డుల కమిటీ ముందు డీలా పడిపోయాడు. (చదవండి: నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే... ) రూపిందర్కూ అన్యాయమే... హాకీలో రూపిందర్ పాల్ సింగ్ స్టార్ ఆటగాడు. కానీ అవార్డుల విషయంలో ఆ ‘స్టార్’ తిరగబడింది. భారత హాకీలోనే అత్యుత్తమ డ్రాగ్ ఫ్లికర్లలో రూపిందర్ కూడా ఒకడు. మైదానంలో హాకీ స్టిక్‌తో చెమటలు కక్కే ఒంటితో ప్రత్యర్థులతో ముందుండి తలపడే ధీరుడు... అవార్డుల రేసులో మాత్రం వెనుకబడిపోయాడు. 2018 ఆసియా క్రీడల్లో భారత్ కాంస్యం గెలుపొందడంలో అతను కీలకపాత్ర పోషించాడు. కానీ పురస్కారం విషయంలో తిరస్కారానికి గురయ్యాడు. మానసి మెరిసినా... దివ్యాంగ షట్లర్ మానసి జోషి కూడా అర్జున కోసం దరఖాస్తు పెట్టుకున్నా... కమిటీ అనుగ్రహానికి దూరమైంది. 31 ఏళ్ల మానసి గత మూడు ప్రపంచ పారా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించింది. 2019లో స్వర్ణం నెగ్గి విశ్వవిజేతగా అవతరించిన మానసి 2017లో కాంస్యం, 2015లో రజతం గెలిచింది. అంతేకాకుండా 2018 ఆసియా పారా గేమ్స్‌లో కాంస్యం, 2016 ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం సొంతం చేసుకుంది. -
నేడే జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం
భారత జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం నేడు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరుగనుంది. సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ (డీడీ) నేషనల్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ను ఈసారి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, మేటి వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను అందుకోనున్నారు. ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే ‘అర్జున అవార్డు’ కోసం 20 మందిని ఎంపిక చేశారు. ఈ జాబితాలో తెలంగాణ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నేలకుర్తి సిక్కి రెడ్డి కూడా ఉంది. -
కోహ్లికి ఖేల్ రత్న.. ద్రవిడ్‌కు ద్రోణాచార్య
కోల్కత్తా: రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి పేరును, భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పేరు ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డుకు, ధ్యాన్‌చంద్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డుకు లెజెండరీ ఓపెనర్ సునీల్ గావస్కర్ పేరును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సిఫార్సు చేసింది. భారత క్రికెట్ టీంలో విరాట్ కొంతకాలం నుంచి ముఖ్యభూమిక పోషిస్తున్నాడు. క్రికెట్లో బ్యాట్‌తో రాణిస్తూ దిగ్గజ ఆటగాడు సచిన్‌ను మరిపిస్తున్నాడు. దీన్ని పరిగణలోనికి తీసుకుని ఈ అవార్డుకు కోహ్లి అర్హుడని భావించి ఆయన పేరును ప్రతిపాదించారు. రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న అండర్-19 టీం ఇటీవల ప్రపంచ కప్ నెగ్గిన సంగతి తెల్సిందే. భారత క్రికెట్‌కు గావస్కర్ చేసిన సేవలకు గానూ, 70,80వ దశలకాల్లో బ్యాట్‌తో రాణించి భారత్‌కు పేరు ప్రఖ్యాతులు తెచ్చింనందకు గానూ ఆయన పేరును ధ్యాన్‌చంద్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డుకు ప్రతిపాదించారు. -
‘ఖేల్‌రత్న’కాలేదని బాధగా ఉంది: దీపా
న్యూఢిల్లీ: ఈ ఏడాది ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఎంపిక కాలేకపోయానన్న బాధ ఇంకా వెంటాడుతోందని రియో పారాలింపిక్స్ రజత పతక విజేత దీపా మలిక్ తెలిపింది. గతేడాది నలుగురికి ఇచ్చినట్లుగా ఈ ఏడాది ఇచ్చివుంటే బాగుండేదని అభిప్రాయపడింది. గతేడాది సింధు, దీపా కర్మాకర్, సాక్షి మలిక్, జీతూ రాయ్‌లను ‘ఖేల్‌రత్న’కు ఎంపిక చేశారు. అయితే ఈ ఏడాది పారాలింపియన్ దేవేంద్ర జజారియా, హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌లకు ఇచ్చారు. ఇందులో తన పేరు లేకపోవడంపై పారా షాట్‌పుటర్ దీప కలత చెందుతోంది. ‘ఏదేమైనా వచ్చే ఏడాది జరిగే పారా ఆసియా గేమ్స్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పితే ఇస్తారేమో చూడాలి’ అని తెలిపింది. రియోలో పతకం గెలిచినప్పుడు ప్రకటించిన నగదు బహుమతులు ఇప్పటికీ అందలేదని వాపోయింది. -
సానియాకు ఖేల్ రత్న, శ్రీకాంత్ కు అర్జున
న్యూఢిల్లీ: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. క్రీడా అత్యున్నత పురస్కారం 'రాజీవ్ ఖేల్ రత్న'ను ఆమె దక్కించుకుంది. బ్యాడ్మింటన్ తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ కు అర్జున అవార్డు దక్కింది. 17 మందికి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అర్జున అవార్డులు ప్రకటించింది. అర్జున అవార్డు పొందిన క్రీడాకారులు వీరే... కిదాంబి శ్రీకాంత్ (బ్యాడ్మింటన్) రోహిత్ శర్మ (క్రికెట్) పి.ఆర్. శ్రీజేష్ (హాకీ) దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్) జీతూ రాయ్ (షూటింగ్) సందీప్ కుమార్ (విలువిద్య) మన్దీప్ జంగ్రా (బాక్సింగ్) బబిత (రెజ్లింగ్) బజరంగ్ (రెజ్లింగ్) స్వర్ణ్ సింగ్ విర్క్ (రోయింగ్) సతీష్ శివలింగం (వెయిట్ లిఫ్టింగ్) యుమ్నమ్ సంతోయి దేవి (వుషు) శరత్ గైక్వాడ్ (పారా సైలింగ్) ఎంఆర్ పూర్వమ్మ (అథ్లెటిక్స్) మన్జీత్ చిల్లర్ (కబడ్డీ) అభిలాషా మాత్రే (కబడ్డీ) అనూప్ కుమార్ యామా (రోలర్ స్కేటింగ్) -
సానియాకు రాజీవ్ ఖేల్ రత్న!
-
సానియాకు రాజీవ్ ఖేల్ రత్న
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం వరించింది. మంగళవారం కేంద్రం ప్రభుత్వం ఈ అవార్డును సానియాకు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కెరీర్లో తొలిసారి వింబుల్డన్ డబుల్స్ టైటిల్ సాధించిన సానియా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లోనూ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. టెన్నిస్‌లో సానియా సాధించిన గొప్ప విజయాలకు గుర్తింపుగా క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ ఆమె పేరును సిఫారసు చేశారు. అవార్డు విషయంలో స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ తదితరులు పోటీపడినా సానియాకే దక్కింది. -
ఖేల్ రత్న అవార్డుకు సానియా పేరు
న్యూఢిల్లీ: రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు వింబుల్డన్ డబుల్స్ చాంపియన్ సానియా మీర్జా పేరును ప్రతిపాదిస్తూ క్రీడాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్‌లో నెగ్గిన గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి మహిళగా రికార్డు సాధించారు. ఆటల్లో ఎక్కువ పతకాలు సాధించిన క్రీడాకారిణి కనుకనే సానియా పేరును ప్రతిపాదిస్తున్నామని క్రీడా శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్, కార్యదర్శి అజిత్ శరణ్ అన్నారు. ప్రస్తుతానికి పేరును ప్రతిపాదించామని ఇంకా తుది నిర్ణయం వెలువడలేదని ఆయన తెలిపారు. సానియా ఇప్పటికే మూడు మిక్స్డ్ డబుల్స్ నెగ్గింది. పోటీకి అర్హురాలే అని వారు తెలిపారు. అదే విధంగా ఈ పోటీలో స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ ఉన్నారు.