సానియాకు రాజీవ్ ఖేల్ రత్న
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం వరించింది. మంగళవారం కేంద్రం ప్రభుత్వం ఈ అవార్డును సానియాకు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్ డబుల్స్ టైటిల్ సాధించిన సానియా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లోనూ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. టెన్నిస్‌లో సానియా సాధించిన గొప్ప విజయాలకు గుర్తింపుగా క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ ఆమె పేరును సిఫారసు చేశారు. అవార్డు విషయంలో స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ తదితరులు పోటీపడినా సానియాకే దక్కింది.