sania mirja
-
ఆమె భారత పౌరసత్వాన్ని రద్దు చేయండి.. సానియా మీర్జాపై నెటిజన్ల ఆగ్రహం
Sania Mirza Faces Backlash on Twitter For Supporting Pakistan: టీ20 ప్రపంచకప్2021లో పాకిస్తాన్ పోరాటం ముగిసింది. ఈ టోర్నమెంట్లో ఒక్క ఓటమి కూడా ఎరగని పాకిస్తాన్.. ఆస్ట్రేలియాతో గురువారం( నవంబర్11) జరిగిన రెండో సెమీఫైనల్లో అనుహ్యంగా ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని సపోర్ట్ చేయడానికి స్టేడియం వెళ్లిన సానియా మీర్జాపై నెటజన్లు మండిపడుతున్నారు. ఆమె భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేయాలని, అంతేగాక ఆమెపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం (ఉపా) కేసు పెట్టి దేశ పౌరసత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడు.. ఆసీస్ ఆటగాళ్ల వికెట్లు తీసినప్పుడు చప్పట్లు కొడుతూ మద్దతు పలికింది. కాగా..సానియా మీర్జా వివాదాలకు గురి కావటం..ట్రోలింగ్ కు గురి కావటం కూడా కొత్తేమీ కాదు. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లోను షోయబ్ మాలిక్ సిక్సర్లు కొడుతుంటే..స్టాండ్స్‌లో కూర్చుని సానియా మీర్జా చప్పట్లు కొడుతూ కనిపించింది. అప్పుడు కూడా ఆమె ట్రోల్స్‌కు గురైంది. మరో వైపు పాక్ పేసర్ హసన్ అలీ భార్యని, ఆమె కుటుంబ సభ్యులను కూడా పాకిస్తాన్ అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. చదవండి: అత్యాచారం కేసులో హార్దిక్ పాండ్యా.. ? గ్యాంగ్‌స్టర్ భార్య సంచలన ఆరోపణలు..! -
అందరి ఆకాంక్షలు నెరవేరుస్తాం
నా కెరీర్లో నాలుగో ఒలింపిక్స్ ఆడుతుండటం ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. మెగా ఈవెంట్ కోసం చక్కగా ప్రాక్టీస్ చేశాను. మధ్యలో కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టింది. అయితే గత కొంతకాలంగా పోటీల్లో పాల్గొంటుండటం, అంకిత రైనాతో కలిసి చేసిన ప్రాక్టీస్ చూస్తుంటే అంతా బాగానే ఉందనిపిస్తోంది. కోవి డ్తో కఠినమైన సవాళ్లు ఎదురవడంతో ఈ ఒలింపిక్స్ నిర్వహణకు కచ్చితమైన ప్రొటోకాల్ చేపట్టారు. అథ్లెట్లు సురక్షితంగా పాల్గొనేలా ఎన్నో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. భారత ప్రభుత్వం కూడా ఈ విశ్వక్రీడలకు అర్హత సంపాదించిన అథ్లెట్లకు టీకాలు, బయో బబుల్ శిక్షణ ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేసింది. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో ప్రత్యేక విమానంలో నేరుగా టోక్యో చేర్చింది. ఇది అథ్లెట్ల ప్రయాణ బడలికను తగ్గించింది. నిజానికి ప్రభుత్వం చేయాల్సిన దానికంటే ఎక్కువే చేసింది. ఒలింపిక్స్‌లో రాణించేందుకు ఎన్నో సమకూర్చింది. బృందాలకే కాదు వ్యక్తిగతంగా కూడా అథ్లెట్ల ప్రయాణాలు సజావుగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నా వరకైతే ముందుగా వింబుల్డన్‌లో ఆడేందుకుగానీ, అక్కడి నుంచి ఇక్కడికి చేరేందుకుగానీ క్రీడాశాఖ, విదేశీ వ్యవహారాల శాఖల చొరవ అంతా ఇంతా కాదు. ఇలాంటి ఏర్పాట్ల వల్లే నేను రెండేళ్ల కుమారుడిని వెంటేసుకొని యూరోప్ టూర్లో ప్రాక్టీస్, టోర్నీలు స్వేచ్ఛగా ఆడగలిగాను. ఇప్పు డు మరోసారి విశ్వక్రీడల్లో ఆడటం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కూడా కోవిడ్ రిస్క్‌ను దాదాపు తగ్గించేందుకు కృషిచేస్తున్నారు. దీంతో టోక్యో చేరిన అథ్లెట్లందరూ ఏ బెంగా లేకుండా అత్యుత్తమ ప్రదర్శనపై దృష్టి పెట్టొచ్చు. మేమంతా కలిసి జట్టుగా 130 కోట్ల భారతీయుల ఆకాంక్షలు నేరవేర్చేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం. -
ట్రక్కును ఢీకొట్టిన షోయబ్ మాలిక్ కారు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన నడుపుతున్న స్పోర్ట్స్ కారు అదుపుతప్పింది. లాహోర్‌లో జాతీయ రహదారికి సమీపంలోని ఓ రెస్టారెంటు వద్ద ఆగి ఉన్న ట్రక్కును ఆదివారం ఢీకొట్టింది. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)- 2021 టీర్నీకి సంబంధించిన సన్నాహకాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై తిరిగి వస్తున్న అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో తాను స్వల్ప గాయాలతో బయటపడినట్లు షోయబ్ మాలిక్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ మేరకు... ‘‘రోడ్డు ప్రమాదం జరిగింది. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. కానీ భగవంతుడి దయ వల్ల అంతా సవ్యంగానే ఉంది. నాకోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న ప్రేమకు నేను కృతజ్ఞుడినై ఉంటాను’’ అని షోయబ్ ట్వీట్ చేశారు. కాగా సానియా మీర్జా- షోయబ్ మాలిక్ ఏప్రిల్ 12, 2008న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2018లో కుమారుడు ఇజహాన్ జన్మించాడు.(చదవండి: 'ఛీ.. స్కూల్ లెవల్ కన్నా దారుణం' ) ఇక షోయబ్ కెరీర్ విషయానికొస్తే.. పాకిస్తాన్ తరఫున 35 టెస్టులు, 287 వన్డేలు, 116 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచన తనకు లేదని ఇటీవలే వెల్లడించిన అతడు.. పీఎస్ఎల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 20- మార్చి 22 వరకు కరాచీలో ఈ టోర్నీ నిర్వహించనున్నారు. కరాజీ కింగ్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. - "I am perfectly all right everybody. It was just a happenstance accident and Almighty has been extremely Benevolent. Thank you to each one of you who've reached out. I am deeply grateful for all the love and care..." ~ Shoaib Malik — Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 10, 2021 -
టీవీ సిరీస్‌లో సానియా మీర్జా
ముంబై : ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మొట్టమొదటిసారి టీవీ సిరీస్‌లో నటించబోతున్నారు. క్షయ వ్యాధి (టిబి) పట్ల అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఎమ్‌టివి నిషేద్ అలోన్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సిరీస్‌లో సానియా మీర్జాగానే ఆమె కనిపించనున్నారు. దీనిపై సానియా మీర్జా మాట్లాడుతూ.. ‘టీబీ మన దేశంలో అత్యంత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ మహ్మరి బారినపడ్డ వారిలో సగానిపైగా 30 ఏళ్లలోపు వారే ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దాని చుట్టూ ఉన్న అవాస్తవాలను పరిష్కరించడానికి, అవగాహన కల్పించటానికి, ప్రజల్లో మార్పును తీసుకురావాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. కాగా, ఐదు ఎపిసోడ్ల ఈ సిరీస్ ఎమ్‌టీవీ ఇండియా, ఎమ్‌టీవీ నిషేద్ ఆధ్వర్యంలోని సోషల్ మీడియా వేదికల్లో విడుదల కానుంది. నవంబర్ చివరి వారంలో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది నాకు తెలిసిన అత్యంత నిస్వార్థమైన ప్రేమ: సానియా -
సానియా మీర్జా ఫాంహౌస్ ఇంచార్జీ అరెస్ట్
సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ అడవుల్లో ఇటీవలె జరిగిన కాల్పుల ఘటనలో పురోగతి లభించింది. ఈ కేసులో ప్రముఖ క్రీడాకారిణి సానియా మీర్జా ఫాంహౌస్ ఇంచార్జీ ఉమర్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం ఫాంహౌస్‌లో మేతకు వచ్చిన ఆవును కాల్చి చంపినట్లు ఉమర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి తుపాకీ ఎలా వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
దేశానికి ఎంత గర్వకారణం.. అయినా వివక్ష
ఒక కుండలో నీళ్లు ఉన్నాయి. ఇద్దరు ఎండనపడి వచ్చారు. ఒక స్త్రీ.. ఒక పురుషుడు. నడిచొచ్చింది సమాన దూరం. మోసుకొచ్చింది సమాన భారం. పురుషుడికి గ్లాసు నిండా నీళ్లిచ్చి.. స్త్రీకి అరగ్లాసు ఇస్తే ఏమిటర్థం?! ఆమెది నడక కాదనా? ఆమెది బరువు కాదనా? ఆమెసలు మనిషే కాదనా? ఎండ ఈక్వల్ అయినప్పుడు.. కుండా ఈక్వల్ అవాలి కదా! ఇప్పుడు కొంచెం నయం. ఉండండి, 83 శాతం అంటే కొంచెం కాకపోవచ్చు. చాలా నయం. ఎనభై మూడు శాతం క్రీడాంశాలలో స్త్రీ, పురుషులన్న వ్యత్యాసం చూపకుండా ‘ఈక్వల్ పేమెంట్’ ఇస్తున్నారు! బి.బి.సి. రిపోర్ట్ ఇది. బి.బి.సి. మీడియాలో కూడా ఆమధ్య ఒకరిద్దరు పైస్థాయి మహిళా ఉద్యోగులు జాబ్‌ని వాళ్ల ముఖాన కొట్టేసి బయటికి వచ్చేశారు. జార్జికి వంద పౌండ్లు ఇస్తూ, అదే పనికి ఒలీవియాకు 60 పౌండ్లు ఇస్తుంటే ఎవరైనా అదే పని చేస్తారు. ఇదిగో, ఇలా అడిగేవాళ్ల వల్లనే ఎప్పటికైనా మహిళలకు సమాన ప్రతిఫలం వస్తుంది. ఫురుషులతో సమానంగా. మన దేశంలో ఇలా అడిగినవాళ్లు.. స్పోర్ట్‌లో.. ఐదుగురు మహిళలు ఉన్నారు. తక్కినవాళ్లూ ‘పేమెంట్‌లో ఏంటీ పక్షపాతం!’ అని అంటూనే ఉన్నా.. ప్రధానంగా సానియా మీర్జా, దీపికా పల్లికల్, అతిది చౌహన్, అపర్ణా పపొట్, మిథాలీరాజ్ ఎప్పటికప్పుడు ఈ ఎక్కువతక్కువల్ని గుర్తు చేస్తూ వస్తున్నారు. ఐపీఎల్‌నే తీస్కోండి. పురుషులు ఆడేదీ అదే ఆట, స్త్రీలు ఆడేదీ అదే ఆట. వచ్చే క్యాష్ మాత్రం స్త్రీలకు తక్కువ. టెన్నిస్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, స్క్వాష్.. ఏదైనా వీళ్లకు వచ్చేది వాళ్లకు ఇచ్చే దాంట్లో నాలుగింట ఒక వంతు తక్కువే! ‘‘మీకు న్యాయంగా అనిపిస్తోందా.. తక్కువ చేసి ఇవ్వడానికి’’ అని ఉమెన్ ప్లేయర్స్ అడిగితే.. ‘‘స్పాన్సరర్స్ రాకుంటే మేమైనా ఏం చేస్తాం. పురుషులు ఆడితే చూసినంతగా, స్త్రీలు ఆడితే చూడరు. ఉమెన్ ఈవెంట్లకు ఖర్చు తప్ప, లాభం ఎక్కడిది!’’ అని సమాధానం. నిజమే కదా పాపం అనిపించే అబద్ధం ఇది. డబ్బులు బాగానే వస్తాయి. డబ్బులు ఇవ్వడానికే మనసు రాదు. ∙∙ మార్చిలో ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. అదీ బి.బి.సి. వాళ్లదే. పురుషులతో సమానంగా మహిళలకూ పారితోషికం, ఇతరత్రా బెనిఫిట్స్ ఇవ్వాలని ఎక్కువమంది ఇండియన్ క్రీడాభిమానులు అంటున్నారట. అంటే వాళ్లు స్పోర్ట్స్‌ని చూస్తున్నారు కానీ, స్పోర్ట్స్ ఉమన్ అని స్పోర్ట్మన్ అనీ చూడ్డం లేదు. పైగా పద్నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ సర్వేలో నాలుగింట మూడొంతుల మంది.. ఆటల్ని ఇష్టపడేవాళ్లే. సినిమాలు, పొలిటికల్ న్యూస్ లేకున్నా బతికేస్తాం కానీ, కళ్లముందు ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ లేకుంటే ఆ పూటకు బతికినట్లే ఉండదని కూడా చెప్పారట. వాళ్లకు కోహ్లీ అని, మిథాలీ అని కాదు. క్రికెట్ కావాలి. సెరెనా అనీ, జకోవిచ్ అని కాదు. టెన్నిస్ కావాలి. ‘కోహ్లీనే కావాలి’ అని వాళ్లు అడిగినా మిథాలీకి రెమ్యునరేషన్ తగ్గించడం కరెక్టు కాదు. గెలిచేందుకు పెట్టే ఎఫర్ట్.. ఆ కష్టం.. వాటికి మనీని తగ్గించి ఇవ్వడం క్రీడాకారిణుల ప్రతిభను, తపనను, శ్రమను తక్కువగా చూడటమే. ఈ అసమానత్వాన్ని ప్రశ్నించకుండా రిటైర్ అయిపోతే, తమకు తాము అన్యాయం చేసుకోవడం మాత్రమే కాదు, కొత్తగా వచ్చేవాళ్లకూ అన్యాయం చేసినట్లే. అందుకే క్రీడాకారిణులు గళం విప్పుతున్నారు. తమ స్వరం వినిపిస్తున్నారు. ఇప్పటికే విదేశీ క్రీడా క్లబ్బులు, ఆసోసియేషన్లు, ఫెడరేషన్లు, కౌన్సిళ్లు, లీగ్‌లు, బోర్డులు, కమిటీలు.. ‘ఈక్వల్ పే’ అమలు చెయ్యడానికి అతి కష్టం మీదనైనా ఒళ్లొంచుతున్నాయి. నాలుగేళ్లు నిరసన భారతదేశపు అత్యుత్తమస్థాయి స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్.. ప్రైజ్ మనీలోని అసమానతలకు నిరసనగా 2012 నుంచి 2015 వరకు వరుసగా నాలుగేళ్లు ‘నేషనల్ స్క్వాష్ చాంపియన్ షిప్’ను బాయ్‌కాట్ చేశారు. ‘స్పోర్ట్స్‌మ్యాన్ స్పిరిట్ లేదు. డబ్బే ముఖ్యమా!’ అని ఆమెపై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ తన నిర్ణయం మీద తను ఉన్నారు. స్త్రీ పురుషులిద్దరికీ ప్రైజ్ మనీ సమానంగా ఉండేంత వరకు నేషనల్స్ ఆడేది లేదని కూడా స్పష్టంగా చెప్పారు. ఆమె ర్యాంకింగ్ పురుషుల కంటే కూడా ఎక్కువగా ఉండేది! నేటికీ తక్కువే మేరీ కోమ్, సైనా నెహ్వాల్, పి.వి.సింధు.. దేశానికి ఎంత గర్వకారణం! అయినా వివక్ష ఉంటోంది. స్త్రీ పురుష సమానత్వం, సాధికారత అని ఎంత మాట్లాడుకున్నా మనమింకా పురుష ప్రపంచంలోనే జీవిస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది నాకు. మన క్రీడా ప్రతిభ మెరుగైంది కానీ, క్రీడాకారిణులకు ఇచ్చే ప్రైజ్ మనీ పురుషులకు వచ్చే మొత్తం కన్నా తక్కువగానే ఉంటోంది. – సానియా మీర్జా, టెన్నిస్ స్టార్ (నిరుడు ‘ఫిక్కీ’ చర్చా వేదికపై) ఆటతో సాధించొచ్చు ఈక్వల్ పే ఉండాలి. ఈక్వల్ ప్రైజ్ మనీ ఉండాలి. ఆట తీరుతో కూడా వీటిని సాధించవచ్చు. గుడ్ బ్రాండ్ క్రికెట్ ఆడితే మంచి మార్కెటింగ్ జరుగుతుంది. మ్యాచిల వల్ల ఆదాయం వస్తుంది. పురుషుల ఆటల్లో వచ్చే లాభాల్లోంచి మాకేం పంచి పెట్టనక్కర్లేదు. మా విజయాల్లోని షేర్‌ను తీసుకోడానికే మేము ఇష్టపడతాం. మొత్తానికైతే పారితోషికాల విషయంలో మునుపటి కన్నా కొంత బెటర్ అయ్యాం. – మిథాలీ రాజ్, స్టార్ క్రికెటర్ (ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో) నమ్మకంగా చెప్పలేం ఆర్థికంగా కొంచెం మెరుగయినట్లే ఉంది. అయితే ఈక్వల్ ప్లేకి ఈక్వల్ పే ఉందా అని నమ్మకంగా చెప్పగలిగిన పరిస్థితి అయితే లేదు. పురుషులకు సమానంగా స్త్రీలకు ప్రైజ్ మనీ ఇవ్వాలి. – అపర్ణా పొపట్, బాడ్మింటన్ (గత ఏడాది ఎకనమిక్ టైమ్స్ ‘పనాచ్’ రౌండ్ టేబుల్ చర్చలో) పోలికే లేదు ప్రైజ్ మనీలోనే కాదు, అన్నిట్లోనూ మహిళా జట్లు, మహిళా క్రీడాకారులకు వివక్ష ఎదురౌతోంది. పురుషుల ఫుట్‌బాల్‌తో మహిళల ఫుట్‌బాల్‌ను పోల్చనే లేము. వాళ్ల లీగ్‌తో మా లీగ్‌ను పోల్చలేం. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్‌ని (సక్సెస్ అయ్యేందుకు ఉండే అవకాశం) కూడా కంపేర్ చెయ్యలేం. ప్రతి దాంట్లోనూ ఇంతని చెప్పలేనంత అసమానత్వం ఉంది. – అదితి చౌహాన్, ఫుట్‌బాల్ గోల్ కీపర్ -
సానియా వస్తోంది!
న్యూఢిల్లీ: భారత సంచలన టెన్నిస్ స్టార్‌గా వెలుగువెలిగిన హైదరాబాదీ సానియా మీర్జా మళ్లీ బరిలోకి దిగేందుకు రాకెట్ పట్టింది. ఓ పండంటి కుమారుడికి తల్లయ్యాక కూడా తనలో టెన్నిస్ ఆడే తపన తగ్గలేదని చెబుతోంది. ఆట కోసం ఏదో ఆదరబాదరగా సిద్ధమైపోలేదు. ప్రసవం వల్ల సహజంగానే ఆమె కాస్తా లావెక్కారు. బరిలో దిగడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ సీనియర్ డబుల్స్ ప్లేయర్ ఓ క్రమపద్ధతిలో కసరత్తులు చేసింది. రోజు 5 గంటలపాటు ట్రెయినింగ్‌లో చెమటోడ్చింది. జనవరికి ముందే ఇలా లక్ష్యాన్ని పెట్టుకున్న హైదరాబాదీ స్టార్ 4 నెలలు క్రమం తప్పకుండా శ్రమించి ఏకంగా 26 కేజీల బరువు తగ్గింది. టెన్నిస్ ఫిట్‌నెస్‌కు సరిపోయే క్రీడాకారిణిగా మారింది. 2017లో చైనా ఓపెన్ ఆడుతున్న సమయంలో మోకాలు గాయంతో ఆటకు దూరమైన సానియా తదనంతరం గర్భం దాల్చడంతో పూర్తిగా రాకెట్‌ను అటక ఎక్కించింది. తనకిష్టమైన టెన్నిస్ తనకు దూరమైన బాధ కలుగుతుందనే ఉద్దేశంతో ఆమె ఈ రెండేళ్లు టీవీల్లో కూడా టెన్నిస్ మ్యాచ్‌లు చూడలేదని చెప్పింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోంది. ఆరు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ సాధించిన సానియా ఒకానొక దశలో ప్రపంచ నంబర్‌వన్ డబుల్స్ క్రీడాకారిణిగా నిలిచింది. ఈ నెల 11 నుంచి జరిగే డబ్ల్యూటీఏ హోబర్ట్ ఓపెన్ టోర్నమెంట్లో ఆమె పాల్గొంటుంది. మహిళల డబుల్స్‌లో నదియా కిచెనక్ (ఉక్రెయిన్)తో మిక్స్‌డ్‌లో రాజీవ్ రామ్ (అమెరికా)తో కలిసి బరిలోకి దిగనుంది. ‘నేను మళ్లీ రాకెట్ పట్టడానికి ప్రధాన కారణం... నేను టెన్నిస్ ఆడటం, గెలవటం, పోటీపడటం వీటన్నింటిని మిస్ అవుతున్నానన్న భావన నన్ను నన్నులా ఉండనివ్వడం లేదు. నిజం చెప్పాలంటే గత రెండేళ్లుగా నా కిట్‌ను పక్కన బెట్టేశాను. నేను అనుకున్న ఫలితాలు సాధించాననే తృప్తితో ఉన్నాను. అయితే అప్పుడే నాలో ఇంకా టెన్నిస్ ఆడే సత్తా మిగిలే ఉందని అనిపించింది. ఇలా అనిపించడం వల్లే మళ్లీ బరిలోకి రాగలుగుతున్నాను’ అని వివరించింది. పెళ్లితో ఓ గృహిణిగా మారాక తనలో ఎన్నో మార్పులొచ్చేవని... ఇక నా ఆట నా నుంచి పూర్తిగా దూరమవుతుందనే బెంగకూడా ఉండేదని సానియా చెప్పింది. -
గ్రాండ్‌గా ప్రియానిక్ రిసెప్షన్
పెళ్లి తర్వాత ఇప్పటికే రెండు రిసెప్షన్స్ ఏర్పాటు చేశారు ప్రియానిక్ (ప్రియాంకా చోప్రా– నిక్ జోనస్). సినీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కోసం ముచ్చటగా మూడో రిసెప్షన్ గురువారం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన ఈ వేడుకకి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. హీరో వెంకటేశ్, రామ్‌చరణ్ సతీమణి ఉపాసన, టెన్నిస్ స్టార్ సానియామీర్జా హాజరై సందడి చేశారు. -
లవ్ ప్రెగ్నెన్సీ!
ఇండియన్ టెన్నిస్‌కు ఒక తిరుగులేని క్రేజ్ తెచ్చిన సూపర్‌స్టార్ సానియా మీర్జా త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను 2010లో పెళ్లాడిన ఆమె, కెరీర్ కోసం ఇంతకాలం పిల్లలకు దూరంగా ఉంటూ వచ్చింది. షోయబ్, సానియా దంపతులు అక్టోబర్ నెలలో తల్లిదండ్రులయ్యే అవకాశాలున్నాయి. సానియా చివరి మూడు నెలల ప్రెగ్నెన్సీకి వచ్చేయడంతో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారట! ‘మనందరికీ ఇదొక గొప్ప అదృష్టం. డైట్ విషయంలో గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఆకుకూరలు, గ్రీన్ జ్యూస్ బాగా తీసుకుంటున్నా’ అని ప్రెగ్నెంట్‌గా ఉన్న మహిళలకు సూచనలు ఇస్తున్నారు సానియా. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే కుటుంబ సభ్యులతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రెగ్నెన్సీ టైమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారామె. దీనికి ‘లవ్ ప్రెగ్నెన్సీ’ అని ట్యాగ్ పెట్టుకొని ఉత్సాహంగా పుట్టబోయే బిడ్డకోసం ఎదురుచూస్తున్నారు. అలాగే బిడ్డ పుట్టాక అందరూ అనుకునేట్టు టెన్నిస్‌కు దూరం కానని కూడా చెప్పేశారు. ‘2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొంటా. ప్రెగ్నెన్సీ తర్వాత, బేబీ పుట్టాక రెండే రెండేళ్ల గ్యాప్‌లో మళ్లీ ఆటంటే, అదీ ఇంతకుముందు ఉన్న ఫామ్‌లో అంటే కష్టమే. అయినా సాధిస్తా’ అని ధీమాగా చెబుతున్నారు సానియా. -
అమ్మ కానున్న సానియా
న్యూఢిల్లీ: సానియా ఓ టెన్నిస్ స్టార్... ఇన్నాళ్లూ రాకెట్‌తో ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడిన ఆమె త్వరలో తన సంతానంతో ముద్దుగారే ఆటలాడేందుకు సిద్ధమవుతోంది. 31 ఏళ్ల ఈ హైదరాబాదీ స్టార్ ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. అక్టోబర్‌లో ఆమె అమ్మతనాన్ని ఆస్వాదించనుంది. అక్టోబర్ నెలలో ప్రసవం అయ్యే అవకాశముందని కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. సుదీర్ఘ కెరీర్లో టైటిళ్లతో, ర్యాంకులతో కుస్తీ పట్టిన ఆమె మోకాలు గాయంతో గత అక్టోబర్ నుంచి ఆటకు దూరంగా ఉంది. తీరిక దొరికిన ఆమె ఈ నెల 12న తన భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో కలిసి 8వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. సోమవారం సానియా తాను గర్భవతినంటూ ట్విటర్లో పోస్ట్ చేసింది. దీనిపై ఓ వార్తా సంస్థ ప్రతినిధి ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జాను సంప్రదించగా... ఆ ట్వీట్ నిజమేనని ధ్రువీకరించారు. అక్టోబర్‌లో ప్రసవం జరిగే అవకాశముందని కూడా చెప్పారు. ఇటీవల ‘గోవా ఫెస్ట్’ సందర్భంగా ఆమె తనకు సంతానం కలిగితే వారి ఇంటి పేరులో ‘మీర్జామాలిక్’ జోడిస్తామని, ఇదే విషయాన్ని తన భర్త షోయబ్తోనూ చర్చించినట్లు చెప్పింది. ఈ ఏడాది ఆరంభంలో సానియా... వచ్చే నెలలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ ద్వారా పునరాగమనం చేస్తానంది. తాజా పరిణామంతో ఇక ఈ ఏడాదంతా ఆమె టెన్నిస్‌కు దూరమైనట్లే! 31 ఏళ్ల సానియా ఇప్పటివరకు సింగిల్స్ విభాగంలో ఒకటి... డబుల్స్ విభాగంలో 41 టైటిల్స్ సాధించింది. ఇందులో మహిళల డబుల్స్‌లో మూడు... మిక్స్డ్ డబుల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. సింగిల్స్‌లో 2007లో కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ 27కు చేరుకున్న సానియా... 2011 నుంచి డబుల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. 2015 ఏప్రిల్‌లో డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. గతేడాది అక్టోబర్‌లో షుయె పెంగ్ (చైనా) భాగస్వామిగా బీజింగ్ ఓపెన్‌లో ఆడి సెమీఫైనల్ చేరింది. ఆ తర్వాత గాయం కారణంగా ఆమె మళ్లీ బరిలోకి దిగలేదు. -
‘పాకిస్తానీని పెళ్లి చేసుకున్న మీరు..’
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కతువా గ్యాంగ్‌రేప్, హత్య, ఉనావో అత్యాచార కేసు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ ఘటనలను ఖండిస్తూ ఫర్హాన్ అక్తర్, రితేశ్ దేశ్‌ముఖ్, జావేద్ అక్తర్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు ట్వీట్ చేస్తున్నారు. తాజాగా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ఈ దురాగతాలను ఖండిస్తూ ట్వీట్ చేయగా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ‘ఇదేనా మనం కోరుకున్న దేశం. ఎనిమిదేళ్ల బాలికకు కుల, మత, లింగ, వర్ణ భేదాలకు అతీతంగా మనం అండగా నిలబడలేకపోతే మనం ఇంకే విషయంపైనా పోరాడలేం. అది మానవత్వం అనిపించకోదు కూడా’ అంటూ భావోద్వేగంతో సానియా ట్వీట్ చేశారు. సానియా ట్వీట్‌కు స్పందించిన ఓ నెటిజన్.. ‘గౌరవనీయులైన మేడమ్.. మీరు ఏ దేశం గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసి మీరు ఒక పాకిస్తానీని పెళ్లాడారు కదా. మీకు భారత్‌తో ఇంకా సంబంధం ఉందా. పాకిస్తాన్ టెర్రరిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్న అమాయక ప్రజల గురించి మీరు ట్వీట్ చేస్తే బాగుంటుంది అంటూ వ్యంగంగా ట్వీట్ చేశారు. అయితే సానియా మీర్జా కూడా ఏమాత్రం తగ్గలేదు. ఎవరిని పెళ్లి చేసుకున్నామనేది ముఖ్యం కాదు. నేను భారత్ కోసం ఆడతాను. నేను భారతీయురాలిని. జీవితాంతం అలాగే ఉంటాను. నేను మీలాగా స్పందించకుండా ఉండలేను. మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరు ఇలాంటి సమయాల్లో మతాల గురించి, మరే ఇతర అంశాల గురించి మాట్లాడరని’ దీటుగా సమాధానమిచ్చారు. Is this really the kind of country we we want to be known as to the world today ?? If we can’t stand up now for this 8 year old girl regardless of our gender,caste,colour or religion then we don’t stand for anything in this world.. not even humanity.. makes me sick to the stomach pic.twitter.com/BDcNuJvsoO — Sania Mirza (@MirzaSania) April 12, 2018 With all respect madam which country are you talking abt.Last time I checked u had married into Pakistan. You no longer are a Indian. And if u must tweet thn also tweet for the innocents killed by Pak terror outfits.. — Kichu Kannan Namo (@Kichu_chirps) April 12, 2018 -
‘మొదటి’ మహిళలకు నేడు పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశేష కృషి చేసి అరుదైన విజయాలు నమోదు చేసిన మహిళలను కేంద్రం పురస్కారాలతో సత్కరించనుంది. క్రీడా, వైద్య, ఆరోగ్య, రక్షణ, విమానయాన, పరిశ్రమ, సినీ రంగాల్లో సాధించిన విజయాలను గుర్తించి మొత్తం 112 మంది మహిళలను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అవార్డులకు ఎంపిక చేసింది. రాష్ట్రపతి భవన్లో శనివారం నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా వీరంతా అవార్డులను అందుకోనున్నారు. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి మహిళ పీవీ సింధు, ప్రపంచ టెన్నిస్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానం సాధించిన మొదటి భారత క్రీడాకారిణి సానియా మిర్జా, ప్రపంచ మహిళా క్రికెట్లో తొలిసారిగా 6000 పరుగులు పూర్తిచేసిన తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్, ఒలింపిక్ పతకం గెలిచిన మొదటి భారత వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) తొలి మహిళా అధ్యక్షురాలు, శోభన కామినేని, బ్రిటీష్ పార్లమెంటు ద్వారా హౌస్ ఆఫ్ కామన్స్ గౌరవాన్ని పొందిన తొలి భారతీయ గాయకురాలు కేఎస్ చిత్ర, హైదరాబాద్‌కు చెందిన తొలి మహిళా మ్యూజిక్ టెక్నీషియన్ సాజిదా ఖాన్ పురస్కారాలు అందుకోనున్నారు. -
మరింత ఎత్తుకు...
ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారుల మెరుపులు అడపాదడపా కనిపించేవి. కానీ కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. వేదిక ఏదైనా... ప్రత్యర్థులు ఏ స్థాయి వారైనా... దీటుగా బదులిస్తూ... వారిని బోల్తా కొట్టిస్తూ...అద్వితీయ ప్రదర్శనతో అదరగొడుతూ...మనోళ్లు నిలకడగా పతకాలు కొల్లగొడుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు సృష్టించారు. భారత క్రీడారంగాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. తొలిసారి భారత్ అండర్–17 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఈవెంట్‌ను సమర్థంగా నిర్వహించడం మరో విశేషం. – సాక్షి క్రీడావిభాగం ‘రాకెట్’లా దూసుకెళ్లారు... గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక విజయాలు, అద్వితీయ పురోగతి సాధించిన క్రీడాంశం బ్యాడ్మింటన్. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఒకరిని మించి మరొకరు తమ ప్రదర్శనతో అబ్బురపరిచారు. శ్రీకాంత్ ఏకంగా నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ (ఇండోనేసియా ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) సాధించి భారత్ తరఫున ఒకే ఏడాది అత్యధిక సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గొప్ప వేదికలపై టైటిల్ సాధించే సత్తా తనకూ ఉందని సాయిప్రణీత్ చాటుకున్నాడు. సింగపూర్ ఓపెన్ ఫైనల్లో శ్రీకాంత్‌ను ఓడించి సాయిప్రణీత్ కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఈ విజయం సాధించిన ఆరు వారాల తర్వాత సాయిప్రణీత్ థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్‌ను గెలిచాడు. మరోవైపు ప్రణయ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను నెగ్గాడు. ఇండోనేసియా ఓపెన్‌లో వరుస మ్యాచ్‌ల్లో మేటి ఆటగాళ్లు లీ చోంగ్ వీ (మలేసియా), చెన్ లాంగ్ (చైనా)లపై గెలిచిన ప్రణయ్ డెన్మార్క్ ఓపెన్‌లో మరోసారి లీ చోంగ్ వీని బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో పదో స్థానానికి చేరుకొని కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు జోరు కొనసాగించింది. సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్, కొరియా ఓపెన్, ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. 110 నిమిషాలపాటు జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఒకుహారా (జపాన్) చేతిలో ఓడినప్పటికీ సింధు తన ఆటతీరుతో అందరి మనసులు గెల్చుకుంది. హాంకాంగ్ ఓపెన్, సీజన్ ముగింపు టోర్నీ దుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో రన్నరప్‌గా నిలిచి ఈ ఏడాదిని గొప్పగా ముగించింది. మరో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ గెలిచి పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించిన తర్వాత సైనా హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో మళ్లీ చేరింది. జూనియర్ స్థాయిలో హైదరాబాద్ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖి ఆసియా అండర్–15 బాలికల సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. మీరా ‘గోల్డెన్ లిఫ్ట్’... కొన్నేళ్లుగా డోపింగ్ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న భారత వెయిట్‌లిఫ్టింగ్‌ను ఈ ఏడాది మీరాబాయి చాను తన ప్రదర్శనతో తలెత్తుకునేలా చేసింది. అమెరికాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ మణిపూర్ లిఫ్టర్ 48 కేజీల విభాగంలో ఓవరాల్‌గా 194 కేజీల బరువెత్తి విజేతగా నిలిచింది. 1995లో కరణం మల్లీశ్వరి తర్వాత ఈ మెగా ఈవెంట్లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన లిఫ్టర్‌గా మీరాబాయి గుర్తింపు పొందింది. ‘ఆనంద’మానందమాయె... కొంతకాలంగా ఫామ్‌లో లేని భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో అంచనాలను తారుమారు చేస్తూ విశ్వవిజేతగా అవతరించాడు. ఈ మెగా ఈవెంట్లో ఆనంద్ 15 గేముల్లోనూ అజేయంగా నిలువడం విశేషం. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడో సారి కాంస్యం సాధించింది. మేరీకోమ్ మెరిసె... మూడు పదుల వయసు దాటినా తనలో పంచ్ పవర్ తగ్గలేదని భారత మేటి బాక్సర్ మేరీకోమ్ నిరూపించుకుంది. వియత్నాం వేదికగా జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో మేరీకోమ్ 48 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఐదోసారి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల తర్వాత మేరీకోమ్ ఖాతాలో చేరిన తొలి అంతర్జాతీయ స్వర్ణ పతకం ఇదే. ఇక భారత్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ యూత్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఐదు స్వర్ణాలు నెగ్గి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. నీతూ (48 కేజీలు), జ్యోతి గులియా (51 కేజీలు), సాక్షి చౌదరి (54 కేజీలు), శశి చోప్రా (57 కేజీలు), అంకుశిత బోరో (64 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ (49 కేజీలు) రెండు అంతర్జాతీయ టోర్నీల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. ఇక ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో విజేందర్ సింగ్ పోటీపడిన రెండు బౌట్లలో విజేతగా నిలిచి రెండో ఏడాదీని అజేయంగా ముగించాడు. గురి తప్పలేదు... గతేడాది రియో ఒలింపిక్స్‌లో వైఫ ల్యం నుంచి తేరుకున్న భారత షూటర్లు ఈ ఏడాది నిలకడగా రాణించారు. ‘డబుల్ ట్రాప్’లో అంకుర్ మిట్టల్ రూపంలో కొత్త స్టార్ అవతరించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన అంకుర్... రెండు ప్రపంచకప్‌లలో ఒక్కో స్వర్ణం, రజతం సాధించాడు. ఆసియా షాట్‌గన్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం నెగ్గాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించాడు. ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు 20 పతకాలు... జపాన్‌లో జరిగిన ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో 21 పతకాలు సాధించారు. స్వదేశంలో జరిగిన సీజన్ ముగింపు టోర్నీ ప్రపంచ కప్ ఫైనల్స్‌లో జీతూ రాయ్–హీనా సిద్ధూ ద్వయం ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో స్వర్ణం గెలిచింది. హాకీ... చలాకీ... జాతీయ క్రీడలో భారత జట్లు ఈ ఏడాది అంచనాలకు అనుగుణంగా రాణించాయి. అజ్లాన్ షా కప్ టోర్నీలో కాంస్యం సాధించి సీజన్‌ను మొదలుపెట్టిన భారత పురుషుల జట్టు పదేళ్ల విరామం తర్వాత ఆసియా కప్‌లో స్వర్ణం నెగ్గింది. అంతేకాకుండా వరల్డ్ హాకీ లీగ్ ఫైనల్స్ టోర్నీలో కాంస్య పతకాన్ని గెలిచింది. మరోవైపు మహిళల జట్టు 13 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌లో పసిడి పతకం గెలిచి వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించింది. ఈ విజయంతో మహిళల జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి సారి పదో స్థానానికి చేరుకుంది. అద్వానీ అదరహో... ప్రపంచ టైటిల్స్ సాధించడం ఇంత సులువా అన్నట్లు భారత క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ ఈ ఏడాది తన ఫామ్ కొనసాగించాడు. స్నూకర్, బిలియర్డ్స్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచి తన ప్రపంచ టైటిల్స్ సంఖ్యను 18కి పెంచుకున్నాడు. ఈ రెండింటితోపాటు ఆసియా స్నూకర్ టీమ్ చాంపియన్‌షిప్‌లో, ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు గెలిచాడు. ఒక్క టైటిలే... గత ఏడాది ఏకంగా ఎనిమిది డబుల్స్ టైటిల్స్ సాధించి వరుసగా రెండో ఏడాదిని టాప్ ర్యాంక్‌తో ముగించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఈ ఏడాది కలిసిరాలేదు. సీజన్ ఆరంభంలో బెథానీ (అమెరికా)తో కలిసి బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సానియా ఆ తర్వాత మరో టైటిల్‌ను గెల్చుకోలేకపోయింది. స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో రెండు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచిన ఈ హైదరాబాద్ క్రీడాకారిణి ఆ తర్వాత తడబడింది. స్ట్రికోవా నుంచి విడిపోయాక సానియాకు సరైన భాగస్వామి లభించలేదు. ఫలితంగా వరుస పరాజయాలు ఎదుర్కొన్న సానియా సీజన్ చివరికొచ్చేసరికి 12వ ర్యాంక్‌కు పడిపోయింది. చిగురించిన ఆశలు... ప్రపంచస్థాయి ప్రమాణాలకు ఇంకా ఆమడ దూరంలో ఉన్నా... ఆసియా స్థాయిలో మాత్రం భారత అథ్లెట్స్ తమ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. స్వదేశంలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్స్ 12 స్వర్ణాలు, ఐదు రజతాలు, 12 కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. లండన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో దవీందర్ సింగ్ జావెలిన్ త్రోలో ఫైనల్‌కు చేరుకున్నాడు. ఓవరాల్‌గా 12వ స్థానంలో నిలిచాడు. మరోవైపు గోపీ థోనకల్ ఆసియా మారథాన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. చైనాలో జరిగిన ఈ ఈవెంట్లో గోపీ 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 15 నిమిషాల 48 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సుశీల్ వచ్చాడు... మూడేళ్లుగా రెజ్లింగ్‌కు దూరంగా ఉన్న భారత స్టార్ సుశీల్ కుమార్ ఈ ఏడాది పునరాగమనం చేశాడు. జాతీయ చాంపియన్‌షిప్‌లో 74 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన అతను కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. -
సానియా జంట ఓటమి
న్యూఢిల్లీ: వుహాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమి యర్–5 టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–షుయె పెంగ్ (చైనా) జంట పోరాటం ముగిసింది. శుక్రవారం చైనాలో జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా–షుయె పెంగ్ ద్వయం 6–7 (5/7), 4–6తో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)–యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది. సెమీస్‌లో ఓడిన సానియా–షుయె పెంగ్ జోడీకి 34,880 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 22 లక్షల 79 వేలు) లభించింది. -
భర్తకు మద్దతిస్తా... భారత్‌కూ జై కొడతా
బర్మింగ్‌హామ్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ సమరంలో భర్త షోయబ్ మాలిక్ (పాక్ క్రికెటర్)కు మద్దతిస్తానని... అదే సమయంలో స్వదేశానికి జై కొడతానని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేర్కొంది. ప్రస్తుతం వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సన్నద్ధమవుతున్న ఆమె.. తనను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న విమర్శలు బాధాకరమని చెప్పింది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు ఆమె ఇరుజట్లకు శుభాకాంక్షలు తెలిపింది. దీనిపై భారత నెటిజన్లు మండిపడ్డారు. ఆమె 60 లక్షల ఫాలోయర్స్‌లో కొందరు విమర్శలతో ట్వీట్స్ చేశారు. దీనిపై డబుల్స్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సానియా స్పందిస్తూ ‘అలాంటి విమర్శల్ని నేను పట్టించుకోను. బయటెక్కడో కూర్చుని తమకిష్టమొచ్చినట్లు అనడం సులభమే. అదృష్టం కొద్దీ అలాంటి విమర్శకులు చాలా తక్కువ మందే ఉన్నారు. అదేంటో ఏమో నేనంటే ఏమాత్రం తెలియనివాళ్లు కూడా విపరీతంగా స్పందించడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. నిజానికి 80 శాతం మంది నన్ను మంచిగానే అర్థం చేసుకుంటే, కేవలం 20 శాతం మందే ప్రతిదానికీ పెడర్థాలు తీస్తారు. కానీ మెజారిటీ ప్రజలు నన్ను బాగానే రిసీవ్ చేసుకోవడం సంతోషంగా ఉంది’ అని చెప్పింది. ఆటను ఆటగానే చూడాలి ఇండో, పాక్‌ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరుగుతున్నా తనకు ఇలాంటి ఇబ్బందులు తప్పట్లేదని ఆమె చెప్పింది. మన దేశంతో ఆడుతున్నపుడు ప్రత్యర్థి జట్టులో ఉన్న భర్తను తాను శత్రువుగా చూడాలనుకోవడం తగదని ఆమె హితవు పలికింది. ‘ఒక్క విషయం గుర్తుంచుకోండి.. ఇది కేవలం క్రీడ. ప్రతి అథ్లెట్ ఆటను ఆటగానే చూడాలనుకుంటాడు. పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడితే అది ఆటలో భాగమే.. కానీ అదేమీ యుద్ధం కాదు. జీవన్మరణ పోరు అంతకన్నా కాదు’ అని సానియా వివరించింది. క్రీడాస్ఫూర్తి అంటే అదే.. దాయాది ఆటగాళ్లు కేవలం మైదానంలోనే ప్రత్యర్థులని చెప్పింది. ‘ఫైనల్ మ్యాచ్ ముగిశాక తన భర్త షోయబ్ మాలిక్, భారత ఆటగాళ్లు కోహ్లి, యువరాజ్‌లతో సరదాగా మాట్లాడుకున్నారు. బహుమతి ప్రదానోత్సవానికి ముందు ఓ పది నిమిషాల పాటు ఇది సాగింది. క్రీడాస్ఫూర్తి అంటే ఇదే. మైదానంలోనే ప్రత్యర్థులు. అది ముగిశాక అందరు స్నేహితులే. నిజానికి ఇరు దేశాల ప్రజలు మాట్లాడే భాష, తినే తిండి ఒకలాగే ఉంటుంది. సంస్కృతి కూడా ఒకలాగే అనిపిస్తుంది. కానీ ఇదేది విమర్శకులకు పట్టదు. బహుశా ఎలాంటి ఆట ఆడకపోవడం వల్లేనేమో!’ అని సానియా చురక వేసింది స్థిరమైన భాగస్వామి లేకపోతే... గత ఆగస్టు దాకా మార్టినా హింగిస్‌తో కలిసి పలు టైటిల్స్ నెగ్గిన ఆమె గత సీజన్‌ను నంబర్‌వన్ (డబుల్స్‌లో)తో ముగించింది. కానీ ఇటీవల తరచూ డబుల్స్ భాగస్వామిని మార్చడం పెద్ద సమస్యని పేర్కొంది. గత ఆగస్టు తర్వాత స్ట్రికోవాతో జతకట్టిన ఆమె... తదనంతరం ష్వెదోవాతో కలిసి ఆడింది. అయితే గాయం కారణంగా ష్వెదోవా కొన్ని వారాలపాటు ఆటకు దూరమైంది. ఈ నేపథ్యంలో వింబుల్డన్ సన్నాహక టోర్నీలో కొకొ వాండెవెగె (అమెరికా)తో సానియా బరిలోకి దిగింది. తాజాగా 48వ ర్యాంకర్ కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్ (బెల్జియం)తో కలిసి వింబుల్డన్ టోర్నీలో ఆడనుంది. -
సానియాకు రాజీవ్ ఖేల్ రత్న!
-
సానియాకు రాజీవ్ ఖేల్ రత్న
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం వరించింది. మంగళవారం కేంద్రం ప్రభుత్వం ఈ అవార్డును సానియాకు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కెరీర్లో తొలిసారి వింబుల్డన్ డబుల్స్ టైటిల్ సాధించిన సానియా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లోనూ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. టెన్నిస్‌లో సానియా సాధించిన గొప్ప విజయాలకు గుర్తింపుగా క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ ఆమె పేరును సిఫారసు చేశారు. అవార్డు విషయంలో స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ తదితరులు పోటీపడినా సానియాకే దక్కింది. -
ర్యాంప్‌వాక్‌తో సానియా హల్చల్
-
ఇస్రో శాస్త్రవేత్తలకి అభినందనలు తెలిపిన పార్లమెంట్