సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ అడవుల్లో ఇటీవలె జరిగిన కాల్పుల ఘటనలో పురోగతి లభించింది. ఈ కేసులో ప్రముఖ క్రీడాకారిణి సానియా మీర్జా ఫాంహౌస్ ఇంచార్జీ ఉమర్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం ఫాంహౌస్‌లో మేతకు వచ్చిన ఆవును కాల్చి చంపినట్లు ఉమర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి తుపాకీ ఎలా వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment