సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ని వికారాబాద్ అడవుల్లో జరుపుతున్నారు. అక్కడి అనంతగిరి కొండల్లో ఇటీవల చిత్రీకరణ జరుగుతుండగా భారీ వర్షం కారణంగా షూటింగ్‌కి బ్రేకులుపడ్డాయి. దీంతో చిత్రబృందం అక్కడి నుంచి వెనుదిరిగింది. ఈ బ్రేక్‌లో రకుల్ తన స్వస్థలం ఢిల్లీకి వెళ్లి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ప్రస్తుతం వర్షం లేకపోవడంతో మళ్లీ చిత్రీకరణ మొదలుపెట్టారు. దీంతో రకుల్ ఢిల్లీ టు వికారాబాద్ అడవుల్లోకి వెళ్లిపోయారు. వైష్ణవ్ తేజ్, రకుల్‌తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు క్రిష్.
Comments
Please login to add a commentAdd a comment