అడవుల్లో హ్యాపీగా..! | Rakul Preet Singh and Vaishnav Tej pair up | Sakshi
Sakshi News home page

అడవుల్లో హ్యాపీగా..!

Published Sat, Aug 22 2020 2:06 AM | Last Updated on Sat, Aug 22 2020 2:06 AM

Rakul Preet Singh and Vaishnav Tej pair up - Sakshi

కరోనా వల్ల ఊహించని రీతిలో బ్రేక్‌ వచ్చింది అందరికీ. సినిమా చిత్రీకరణలకు పూర్తిగా బ్రేక్‌ పడింది. ఈ బ్రేక్‌లో షూటింగ్స్‌ని బాగా మిస్సయ్యాను అంటున్నారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇప్పుడు మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు రకుల్‌. క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్, రకుల్‌ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఇటీవలే ముహూర్తం జరిపారు. తాజాగా వికారాబాద్‌ అడవుల్లో షూటింగ్‌ ప్రారంభించారు.

ఏకధాటిగా 45 రోజులు షూట్‌ చేసి, ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా షుటింగ్‌లో పాల్గొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో మేకప్‌ వేసుకుంటున్న ఓ చిన్న వీడియోను షేర్‌ చేసి, ‘ఇన్నాళ్లూ షూటింగ్స్‌ను బాగా మిస్సయ్యాను’ అని రాసుకొచ్చారు రకుల్‌. ఈ సినిమాతో పాటు మరో హిందీ సినిమా షూటింగ్‌ కూడా స్టార్ట్‌ చేయనున్నారామె. అర్జున్‌ కపూర్‌తో ఆమె నటిస్తున్న హిందీ సినిమా చిత్రీకరణ ఈ నెల 25న ప్రారంభం కాబోతోంది. నాలుగైదు నెలల తర్వాత ఇలా బిజీ కావడం హ్యాపీగా ఉందంటున్నారు రకుల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement