‘‘కొన్ని సన్నివేశాలకో, పాటలకే పరిమితం అయ్యే పాత్రలు చేయాలనుకోవడం లేదు. ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనుకుంటున్నాను.. అందుకే సెలెక్టివ్‌గా ఉంటున్నాను. ఓబులమ్మ పాత్ర నన్ను ఎగై్జట్ చేయడంతో ‘కొండపొలం’ సినిమా చేశాను’’ అని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్‌రెడ్డి, జె.సాయిబాబు నిర్మించిన ఈ సినిమా రేపు(8న) విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రకుల్ ప్రీత్‌సింగ్ పంచుకున్న విశేషాలు...
► ‘కొండపొలం’ కథ చెప్పేందుకు క్రిష్‌గారు ఇంటికి వచ్చినప్పుడు నేను షార్ట్, టీషర్ట్‌లో ఉన్నాను. ‘చాలా యంగ్‌గా ఉన్నావ్.. వైష్ణవ్ తేజ్ పక్కన యంగ్ గర్ల్ కావాలనుకున్నా.. అలాగే ఉన్నావ్’ అంటూ క్రిష్‌గారు ఎగై్జట్ అయ్యారు. ఆయన కథ చెబుతున్నప్పుడే వెంటనే ఓకే చెప్పేశాను. గొర్రెల కాపర్ల గురించి ‘కొండపొలం’ లాంటి చిత్రం ఇంత వరకూ ఇండియాలో రాలేదు.
► ‘కొండపొలం’ లో పూర్తిస్థాయిలో గొర్రెలు కాసే పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను. అడవిలో గొర్రెలను కంట్రోల్ చేయడానికి నేను, వైష్ణవ్ మొదట్లో చాలా కష్టపడ్డాం. అయితే షూటింగ్ స్టార్ట్ చేసిన నాలుగైదు రోజుల్లోనే ఎలా కంట్రోల్ చేయాలో తెలిసింది.
► ‘కొండపొలం’ చూడటానికి ఈజీగా ఉంటుంది. కానీ, షూట్ చేయడం చాలా కష్టమైంది. కీరవాణిగారి సంగీతం అద్భుతంగా ఉంది.
► ఈ నెల 10న నా పుట్టినరోజు. అయితే ఆ రోజు ఎటువంటి సెలబ్రేషన్స్ చేసుకోవడం లేదు. షూటింగ్‌లో ఉంటాను. ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఏదీ అంగీకరించలేదు. ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు కూడా చేయాలని ఉంది. కరణం మల్లీశ్వరీ బయోపిక్ చేస్తున్నాననే వార్తల్లో వాస్తవం లేదు.
► నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదు. కానీ మనం ఒక్క సినిమా చేస్తే అది జీవితాంతం ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవాలి. ఒక డీడీఎల్‌జే (దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే), ఒక
‘బాహుబలి’ లాంటి సినిమాలు చేస్తే చాలనిపిస్తోంది. అలాంటి కేటగిరిల్లో ‘కొండపొలం’ కూడా ఉంటుందని నమ్ముతున్నాను.
సాయి తేజ్‌తో నేరుగా మాట్లాడలేదు. వైష్ణవ్ తేజ్ నుంచి తేజు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాను.
Comments
Please login to add a commentAdd a comment