shooting starts
-
సూర్య @ 45
హీరో సూర్య 45వ చిత్రం బుధవారం ఉదయం పొల్లాచ్చి సమీపంలోని ఆనైమలై ప్రాంతంలో గల ప్రసిద్ధి చెందిన మాసానీ అమ్మన్ ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఇందులో నటి త్రిష హీరోయిన్గా నటించనున్నారు. నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో నటుడు సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీల కుటుంబ సభ్యులు, నిర్మాత ఎస్ఆర్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.– సాక్షి, తమిళ సినిమా -
లక్కీ భాస్కర్ షురూ
‘మహానటి, సీతారామం’ వంటి హిట్ చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్’ షూరూ అయింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘‘ఒక సాధారణ మనిషి ఉన్నత శిఖరాలకు చేరిన అసాధారణమైన ప్రయాణంగా ‘లక్కీ భాస్కర్’ రూపొందుతోంది. ‘సార్’(తమిళంతో ‘వాతి’) చిత్రం తర్వాత వెంకీ అట్లూరితో మేము నిర్మిస్తున్న రెండో పాన్ ఇండియా చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నిమిష్ రవి, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘మిస్టరీ’..షూటింగ్ షురు
తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, సుమన్, అలీ, తనికెళ్ల భరణి, సత్య శ్రీ, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక పాత్రల్లో ‘మిస్టరీ’ సినిమా షురూ అయింది. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో పీవీ ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ నెల 21 వరకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్‌ని పూర్తి చేస్తాం. సెప్టెంబర్ చివరి వారంలో ‘మిస్టరీ’ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్ తవ్వ, కెమెరా: సుధాకర్, శివ రాథోడ్. పవర్ ఫుల్ పోలీస్‌గా రవిరెడ్డి ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటుడు ‘రవి రెడ్డి’ చేస్తున్నట్లు టీం సభ్యులు తెలిపారు. గతంలో వి, విరాటపర్వం, గాలోడు లాంటి సినిమా లలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు రవిరెడ్డి. ఈ చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నానని, రిలీజ్ తర్వాత మంచి గుర్తింపుతో పాటు అవకాశాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. -
నవ్వుల ఇంద్రజాలం
‘శాసనసభ’ ఫేమ్ ఇంద్రసేన హీరోగా ‘ఇంద్రజాలం’ సినిమా షురూ అయింది. జై క్రిష్ మరో ప్రధాన ΄ాత్రలో నటిస్తున్నారు. పూర్ణాస్ మీడియా సమర్పణలో నిఖిల్ కె. బాల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి న్యాయమూర్తి ఆర్. మాధవరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా ఇంద్రసేన మాట్లాడుతూ– ‘‘శాసనసభ’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా చూసిన నిఖిల్‌గారు ‘ఇంద్రజాలం’కి చాన్స్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘క్రైమ్ థ్రిల్లర్‌తో కూడిన ప్రేమకథ ఇది. వినోదంతో ΄ాటు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా స్క్రీన్‌ప్లే ఉంటుంది’’ అన్నారు దర్శక–నిర్మాత నిఖిల్ కె. బాల. చిత్ర సహ నిర్మాత పూర్ణ శైలజ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్ కుమార్. -
జిందగీ షురూ
రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, నీల ప్రియా, ‘మిర్చి’ కిరణ్, హర్ష వర్ధన్ ప్రధాన పాత్రల్లో ‘డియర్ జిందగి’ అనే సినిమా షురూ అయింది. ఈ చిత్రం ద్వారా పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) దర్శకునిగా పరిచయమవుతున్నారు. రాజా రవీంద్ర సమర్పణలో ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభంఅయింది. తొలి సీన్‌కి దర్శకుడు కల్యాణ్ కృష్ణ కెమెరా స్విచ్చాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించగా, డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. రాజా రవీంద్ర మాట్లాడుతూ– ‘ఇందులో ముగ్గురు పిల్లల తండ్రి పాత్రలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేస్తున్నాను’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు మంచి కాన్సెప్ట్ సినిమాలను అందించాలనే ఉద్దేశంతో స్నేహితులతో కలిసి ఈ బ్యానర్‌ని స్థాపించాను’’ అన్నారు శరత్ చంద్ర చల్లపల్లి. ‘‘మధ్య తరగతి వారికి మా సినిమా కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు పద్మారావ్ అబ్బిశెట్టి (పండు). -
ఎమోషనల్ కానిస్టేబుల్
వరుణ్ సందేశ్ హీరోగా ‘ది కానిస్టేబుల్’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ‘బలగం’ జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహూర్తపు సన్నివేశానికి బి. నిఖితా జగదీష్ కెమెరా స్విచ్చాన్ చేయగా బీజే రిథిక క్లాప్ కొట్టారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో ఎమోషనల్ కానిస్టేబుల్‌గా నటిస్తున్నాను. దర్శకుడు చెప్పిన కథ, కథనం నాకు బాగా నచ్చాయి’’ అన్నారు. ‘‘సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు ఆర్యన్ సుభాన్, ‘బలగం’ జగదీష్. దువ్వాసి మోహన్, సూర్య, కల్పలత తదితరులు పధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : సుభాష్ ఆనంద్, కెమెరా: హజరత్ షేక్ (వలి). -
రొమాంటిక్ రెయిన్బో
హీరోయిన్ రష్మికా మందన్నా లీడ్ రోల్లో నటిస్తున్న ‘రెయిన్బో’ చిత్రం షురూ అయింది. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో నటుడు దేవ్ మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటి అమల అక్కినేని క్లాప్ కొట్టారు. నిర్మాత సురేష్‌బాబు స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు. రష్మికా మందన్నా మాట్లాడుతూ– ‘‘రెయిన్బో’ చేస్తు్తన్నందుకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 7న ప్రారంభం అవుతుంది’’ అన్నారు ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్. ప్రభు. ‘‘రొమాంటిక్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు శాంతరూబన్. ఈ ప్రారంభోత్సవానికి నిర్మాతలు కేకే రాధామోహన్, దామోదర్ ప్రసాద్, పి. కిరణ్, శరత్ మరార్, సుప్రియ అక్కినేని, దర్శకులు వెంకీ కుడుముల, శశికిరణ్, హీరో సందీప్ కిషన్ తదితరులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కేఎం భాస్కరన్, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: తంగ ప్రభాకరన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అరవేంద్రరాజ్ భాస్కరన్. -
యాక్షన్ ఎంటర్టైనర్ షురూ
విశ్వక్ సేన్ హీరోగా కొత్త సినిమా (వీఎస్10 వర్కింగ్ టైటిల్) షురూ అయింది. ఈ చిత్రం ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకునిగా పరిచయమవుతున్నారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్. ఎస్ఆర్టీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత, దర్శకుడు మచ్చ రవి కెమెరా స్విచ్చాన్ చేయగా, రామ్ తాళ్లూరి సతీమణి రజనీ క్లాప్ ఇచ్చారు. రవితేజ ముళ్లపూడి తొలి షాట్‌కి దర్శకత్వం వహించగా, రామ్ తాళ్లూరి స్క్రిప్ట్‌ను డైరెక్టర్‌కి అందించారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘రామ్ తాళ్లూరిగారు నాకు ఇష్టమైన నిర్మాత. ఇది నా పదో చిత్రం. కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘నాకు అవకాశం ఇచ్చిన విశ్వక్ సేన్, రామ్ తాళ్లూరిగార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు రవితేజ ముళ్లపూడి. ‘‘ఈ సినిమా ప్రేక్షకులు, విశ్వక్గారి అభిమానుల అంచనాలకు తగ్గకుండా ఉంటుంది’’ అన్నారు రామ్ తాళ్లూరి. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మనోజ్ కాటసాని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్యం రాజేష్, విద్యాసాగర్. జె. -
యాక్షన్ ఎంటర్టైనర్ షురూ
సత్యదేవ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం షురూ అయింది. ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘పుష్ప’తో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు డాలీ ధనంజయ ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు. బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ‘‘క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రమిది. సత్యదేవ్, ధనంజయల కెరీర్లో ఈ సినిమా ఇరవై ఆరవది కావడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మణికంఠన్ కృష్ణమాచారి, సంగీతం: చరణ్ రాజ్. ∙™డాలీ ధనంజయ, సత్యదేవ్ -
మాస్ యాక్షన్ స్టార్ట్
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం (ప్రచారంలో ఉన్న టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’) షెడ్యూల్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. హీరో రవితేజ కీలక పాత్ర చేస్తున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. తాజా షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. చిరంజీవిగారిని మునుపెన్నడూ చూడని మాస్, పవర్ ప్యాక్డ్ పాత్రలో చూపించనున్నారు బాబీ. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే ఇచ్చారు. 2023 సంక్రాంతికి చిత్రం విడుదల కానుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆర్థర్ ఎ విల్సన్. -
సెట్స్‌పైకి రజనీ ‘జైలర్’.. కొత్త పోస్టర్ రిలీజ్
‘అన్నాత్తే’ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించనున్న చిత్రం ‘జైలర్’. బీస్ట్ మూవీఫేం నెల్సన్ దర్శకత్వంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవల మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ వదిలిన చిత్ర బృందం తాజాగా మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఈ రోజు సోమవారం(ఆగస్ట్ 22న) జైలర్ షూటింగ్ ప్రారంభమైందని చెబుతూ తలైవా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ అందించారు మేకర్స్. చదవండి: ‘మెగాస్టార్’ అంటే ఓ బ్రాండ్.. మరి ఈ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా? ఈ సందర్భంగా రజనీకి లుక్కు సంబంధించిన పోస్టర్‌ను వదిలారు. ఇందులో రజనీ ఫార్మల్ డ్రెస్‌లో సీరియస్ లుక్‌తో కనిపించారు. దీంతో ఈ సినిమాలో రజనీ లైటిల్ రోల్ పోషించనున్నాడని అర్థమవుతోంది. ప్రస్తుతం ఆయన లుక్కు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించన్నాడు. #Jailer begins his action Today!@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/6eTq1YKPPA — Sun Pictures (@sunpictures) August 22, 2022 -
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘నైన్త్ అవర్’ చిత్రం
విశ్వ కార్తికేయ, రిషికా కపూర్ జంటగా ఆనంద్ కొలగాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నైన్త్ అవర్’. రాజు గుడిగుంట్ల నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సీన్‌కి నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత దామోదర్ ప్రసాద్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత ఏయం రత్నం టైటిల్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఆనంద్ కొలగాని మాట్లాడుతూ.. ‘‘వినూత్నమైన అడ్వెంచర్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. సెప్టెంబర్ 6న మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘ఈ చిత్ర కథ వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు రాజు గుడిగుంట్ల. ‘‘హీరోగా అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విశ్వ కార్తికేయ. ‘‘ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయం కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు రిషికా కపూర్. నిర్మాతలు అచ్చిరెడ్డి, ప్రసన్న కుమార్, డీయస్ రావు పాల్గొన్నారు. -
హీరో మోహన్ రీఎంట్రీ, ఈసారి యాక్షన్‌తో..
ఒకప్పుడు ప్రేమకథా చిత్రాల కథానాయకుడిగా రాణించిన మోహన్ చాలా గ్యాప్ తర్వాత హరా అనే చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. గురువారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభం అయ్యింది. దాదా 87 ఫేమ్ విజయ్ శ్రీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్పీ మోహన్‌రాజ్, జీ స్టూడియోస్ జయశ్రీ విజయ్ కలిసి నిర్మిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు గుడ్‌టచ్, బ్యాడ్ టచ్‌ల గురించి బోధించినట్లే ఐపీసీ చట్టం రూల్స్ గురించి కూడా భోధించాలని చెప్పే కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం అని దర్శకుడు తెలిపారు. ఇప్పటి వరకు ప్రేమకథా చిత్రాల్లో నటించిన మోహన్ ఈ చిత్రంలో యాక్షన్ హీరోగా కనిపించబోతున్నారు. చెన్నైలో తొలి షెడ్యూల్ పూర్తి చేసి అనంతరం కోయంబత్తూరు, ఊటీ ప్రాంతాల్లో చిత్రీకరణ చెస్తామని దర్శకుడు తెలిపారు. -
స్టార్ట్..కెమెరా..యాక్షన్ : వరుసగా షూటింగులు
తెలుగు చిత్ర పరిశ్రమలో సోమవారం ‘యాక్షన్.. స్టార్ట్’ అంటూ షూటింగ్స్ సందడి నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన చిత్రాలతో పాటు కొత్త సినిమాల షూటింగ్స్ కూడా మొదలయ్యాయి. అఖిల్ ‘ఏజెంట్’ లుక్ విడుదల చేసి, షూటింగ్ ఆరంభించారు. రవితేజ ‘రామారావు: ఆన్ డ్యూటీ’ లుక్‌ని విడుదల చేయడంతో పాటు షూటింగ్ షురూ చేశారు. ఇక మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’, బాలకృష్ణ ‘అఖండ’ చిత్రాల షూటింగ్ పునః ప్రారంభమైంది. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్ కూడా ఆరంభమైంది. ► అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమాతో సాక్షీ వైద్య హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సరెండర్–2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అఖిల్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ‘కిక్, రేసుగుర్రం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రచయిత వక్కంతం వంశీ కాంబినేషన్లో ‘ఏజెంట్’ రూపొందుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అజయ్ సుంకర, పత్తి దీపా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి. ► రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘రామారావు: ఆన్ డ్యూటీ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. దివ్యాంశా కౌశిక్ కథానాయిక. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. రవితేజ, దివ్యాంశా కౌశిక్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ► మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ఆరంభమైంది. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, సీఈఓ: చెర్రీ. ► బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా తెరకెక్కుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్, శ్రీకాంత్ ముఖ్య పాత్రధారి. ► రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్. ఈ చిత్రానికి సమర్పణ: పవన్ కుమార్. -
హైదరాబాద్‌లో నాని కొత్త సినిమా షూటింగ్
సాక్షి, హైదరాబాద్: ట్యాక్సివాలా ఫేం రాహుల్ సంక్షిర్త్యన్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ షూటింగ్ సెట్స్‌పై వచ్చింది. ఇటీవల షూటింగ్ ప్రారంభ వేడుకను ఘనంగా జరుపుకున్న ఈ మూవీ సోమవారం నుంచి హైదరాబాద్‌లో రెగ్యూలర్ షూటింగ్ జరపుకోనున్నట్లు నిహారిక ఎంటటైన్మెంట్ ట్విటర్ వేదికగా ప్రకటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: హీరో నాని కొత్త మూవీ షురూ) ‘రాయ్ స్టార్ట్స్ రోల్’ అంటూ షేర్ చేసిన ఈ ట్వీట్లో ఓ వ్యక్తి కుర్చీలో కుర్చుని అటూవైపు చూస్తున్నట్లు కనిపించగా టెబుల్‌పై ఓ టీ కప్పు, డైరీ ఉంది. దీంతో ఇది చూసిన నెటిజన్లు సెట్స్‌లో నాని అయింటాడని అభిప్రాయం వ్యక్తం చేస్తు కామెంట్ చేస్తున్నారు. కోల్‌కతా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. (చదవండి: మొదటిసారి తెలుగులో.. సంతోషంగా ఉంది: నజ్రియా) Roy Starts Rolling 🎥 Beginning the First Leg Shooting of our Special one #ShyamSinghaRoy starring Natural 🌟@NameisNani 😎 from today with all Safety Measures😷 A film by @Rahul_Sankrityn 🎬@Sai_Pallavi92 @IamKrithiShetty @MadonnaSebast14 @vboyanapalli @SVR4446 pic.twitter.com/OMa4j7Boxi — Niharika Entertainment (@NiharikaEnt) December 21, 2020 -
స్టార్స్ స్టార్ట్ అయ్యారు
షూటింగ్ లొకేషన్ అంటేనే సందడి. వందల మంది సవ్వడి. కరోనా వల్ల మొన్నటి వరకూ ఇండస్ట్రీని నిశ్శబ్దం ఆవహించింది. మెల్లిగా చిత్రీకరణలు ప్రారంభం అవుతున్నాయి. స్టార్స్ అందరూ సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. గత సోమవారం నుంచి శనివారం వరకూ చిత్రీకరణలు ఎక్కువ ప్రారంభం అయ్యాయి. చాలామంది స్టార్స్ కూడా షూటింగ్‌కి స్టార్ట్ అయ్యారు... ఉత్సాహంగా సెట్లోకి అడుగుపెట్టారు. ఆ వివరాలు. కరోనా వల్ల విదేశీ చిత్రీకరణలు సాధ్యమేనా? అనే సందేహం అందరిలోనూ ఉంది. కానీ ప్రభాస్ అండ్ టీమ్ షూటింగ్‌కి ఇటలీ వెళ్లి సాధ్యమే అన్నారు. అటు బాలీవుడ్లో లాక్డౌన్ తర్వాత తొలిసారి విదేశాలకు వెళ్లిన టీమ్ అక్షయ్ కుమార్ ‘బెల్‌బాటమ్’. తెలుగు నుంచి ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ విదేశాలు వెళ్లింది. ప్రభాస్, పూజా హెగ్డే చిత్రీకరణ ప్రారంభించారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ కూడా ఈ వారంలోనే ప్రారంభం అయింది. ఏడు నెలల గ్యాప్ తర్వాత సెట్స్ దుమ్ము దులిపి షూటింగ్ షురూ చేశారు దర్శకుడు రాజమౌళి అండ్ టీమ్. ఈ చిత్రీకరణతో మళ్లీ సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్, రామ్‌చరణ్. ఏకధాటిగా రెండు నెలలు ఈ చిత్రీకరణ జరుగుతుందని తెలిసింది. ‘క్రాక్’తో మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయ్యారు రవితేజ. ఆయన కూడా విలన్స్‌ను రఫ్ఫాడించడం ఈ వారం నుంచే మొదలుపెట్టారు. సినిమా పూర్తయ్యేవరకూ చిత్రీకరణ జరపనున్నారట ‘క్రాక్’ టీమ్. టక్ చేసుకుని మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టారు నాని. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టక్ జగదీష్’. ఈ సినిమా షూట్‌లోకి ఈ మధ్యే జాయిన్ అయ్యారు నాని. తన రెండు చిత్రాలు తిరిగి ప్రారంభించారు శర్వానంద్. ఆయన నటిస్తున్న తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం, ‘శ్రీకారం’ సినిమాలు మొదలయ్యాయి. సంక్రాంతికి ‘శ్రీకారం’తో థియేటర్స్‌లో కలుస్తారట శర్వా. కాంట్రవర్శీలకు కాస్త బ్రేకిచ్చి తిరిగి పనిలో పడ్డారు కంగనా రనౌత్. జయలలిత బయోపిక్ ‘తలైవి’లో ఆమె నటిస్తున్నారు. చెన్నైలో కంగనా మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కత్రినా కైఫ్ కూడా షూటింగ్ మొదలుపెట్టారు. ‘ఫోన్ బూత్’ అనే కొత్త సినిమాను మొన్నే ప్రారంభించారు. రష్మికా మందన్నా కూడా ‘సుల్తాన్’ సినిమా సెట్లో ఈ మధ్యే జాయిన్ అయి, పూర్తి చేశారు. సంజయ్ లీలా భన్సాలీ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘గంగూభాయ్ కతియావాడీ’ని పునః ప్రారంభించారు. గంగూభాయ్‌గా ఆలియా భట్ చిత్రీకరణతో బిజీ అయ్యారు. కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూనే సినిమాలన్నీ చిత్రీకరిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా పనులు జరగాలి. ఇండస్ట్రీ పరిగెత్తాలి. అందరికీ విజయం లభించాలి. -
షూటింగ్‌కి రెడీ
కరోనా బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్స్‌తో బిజీ కాబోతున్నారు శ్రుతీహాసన్. ఇటీవలే కొన్ని యాడ్స్ చిత్రీకరణల్లో పాల్గొన్నారామె. తాజాగా సినిమా చిత్రీకరణలకు కూడా సిద్ధమయ్యారు. అక్టోబర్ నుంచి ‘వకీల్ సాబ్’ చిత్రీకరణలో పాల్గొంటారట శ్రుతీహాసన్. పవన్ కల్యాణ్, అంజలి, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ ‘పింక్’కి రీమేక్. ఇందులో పవన్ కల్యాణ్ భార్యగా శ్రుతీహాసన్ నటించనున్నారు. అయితే ఇందులో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని సమాచారం. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాతో పాటు రవితేజ ‘క్రాక్’లోనూ నటిస్తున్నారు శ్రుతి. ఆ సినిమా చిత్రీకరణ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. -
ఎయిట్ ప్యాక్ కష్టాలు
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగశౌర్య ఆర్చర్‌గా (విలుకాడు) కనిపించనున్నారు. లాక్‌డౌన్‌తో ఈ చిత్రం షూటింగ్‌కి బ్రేకులు పడ్డాయి. ఇటీవలే హైదరాబాద్‌లో మళ్లీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఈ సన్నివేశాల్లో నాగశౌర్య షర్ట్ లేకుండా 8 ప్యాక్ బాడీని ప్రదర్శించాల్సి ఉంది. దీంతో ఎయిట్ ప్యాక్ యాబ్స్ పొందడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు శౌర్య. కచ్చితమైన డైట్ ఫాలో అవుతుండటంతో పాటు ప్రతి రోజూ జిమ్‌లో చెమట చిందిస్తున్నారు. ఐదు రోజులుగా ఆయన నీళ్లు కూడా తాగడం లేదు. ఆఖరుకి లాలాజలాన్ని కూడా మింగడం లేదంటే ఫిట్నెస్ కోసం ఆయన ఎంతగా శ్రమిస్తున్నారో అర్థం చేసుకోవాల్సిందే. ఇది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ నిజం’’ అన్నారు. ఈ చిత్రంలో కేతికా శర్మ కథానాయికగా నటిస్తున్నారు. -
భాయ్ బరిలో దిగుతున్నారు
బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆమిర్ ఖాన్ లొకేషన్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు. షారుక్ ఖాన్ స్క్రిప్ట్ ఫైనల్ చేస్తున్నారు. మరి సల్మాన్ ఖాన్? సల్మాన్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అని సల్మాన్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ మొదటివారం నుంచి భాయ్ బరిలో దిగనున్నారని తెలిసింది. అక్టోబర్ 1 నుంచి ‘బిగ్‌బాస్’ షో చిత్రీకరణలో పాల్గొంటారు సల్మాన్ ఖాన్. ఆ తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో చేస్తున్న ‘రాధే’ చిత్రానికి సంబంధించిన మిగిలిన చిత్రీకరణ పూర్తి చేస్తారట. పదిరోజులు పాటు సాగే ఈ షెడ్యూల్లో ఓ పాట కూడా చిత్రీకరించనున్నారు. చిత్రీకరణ ప్రారంభమయ్యేలోగా ప్రభుదేవా ముంబై చేరుకొని కొన్ని రోజులు క్వారంటైన్లో ఉంటారట. ‘రాధే’ చిత్రాన్ని ఈ క్రిస్మస్ లేదా వచ్చే గణతంత్ర దినోత్సవానికి విడుదల చేయాలనుకుంటున్నారు. -
అడవుల్లో హ్యాపీగా..!
కరోనా వల్ల ఊహించని రీతిలో బ్రేక్ వచ్చింది అందరికీ. సినిమా చిత్రీకరణలకు పూర్తిగా బ్రేక్ పడింది. ఈ బ్రేక్‌లో షూటింగ్స్ని బాగా మిస్సయ్యాను అంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు రకుల్. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఇటీవలే ముహూర్తం జరిపారు. తాజాగా వికారాబాద్ అడవుల్లో షూటింగ్ ప్రారంభించారు. ఏకధాటిగా 45 రోజులు షూట్ చేసి, ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా షుటింగ్‌లో పాల్గొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో మేకప్ వేసుకుంటున్న ఓ చిన్న వీడియోను షేర్ చేసి, ‘ఇన్నాళ్లూ షూటింగ్స్‌ను బాగా మిస్సయ్యాను’ అని రాసుకొచ్చారు రకుల్. ఈ సినిమాతో పాటు మరో హిందీ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నారామె. అర్జున్ కపూర్‌తో ఆమె నటిస్తున్న హిందీ సినిమా చిత్రీకరణ ఈ నెల 25న ప్రారంభం కాబోతోంది. నాలుగైదు నెలల తర్వాత ఇలా బిజీ కావడం హ్యాపీగా ఉందంటున్నారు రకుల్. -
షూటింగ్‌కు ప్రభాస్ రెడీ
ప్రభాస్ మళ్లీ షూటింగ్ చేయడానికి ప్లాన్ సిద్ధం అయిందట. అక్టోబర్ నుంచి ‘రాధే శ్యామ్’ చిత్రీకరణలో పాల్గొనాలని ప్రభాస్ అనుకుంటున్నారని సమాచారం. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 60 శాతం పూర్తయిందని సమాచారం. లాక్డౌన్ ముందు వారమే జార్జియాలో ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని వచ్చింది చిత్రబృందం. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో షూట్ చేయడం ఇబ్బందే అని హైదరాబాద్‌లోనే వీలైనంత భాగాన్ని సెట్స్ వేసి చిత్రీకరించనున్నారని తెలిసింది. అక్టోబర్ మధ్యలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుందట. ఈ ఏడాది చివరి కల్లా ఈ సినిమాను పూర్తి చేయాలన్నది ప్లాన్. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
నో బ్రేక్
లాక్డౌన్ సమయాన్ని భర్త నిక్ జోనస్‌తో కాలిఫోర్నియాలోనే గడిపారు ప్రియాంకా చోప్రా. ఈ మూడు నెలల బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్‌కి సిద్ధమయ్యారామె. ‘మ్యాట్రిక్స్ 4’ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇందులో ప్రియాంక కీలక పాత్ర చేస్తున్నారు. కీయాను రీవెస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ‘మ్యాట్రిక్స్’ ఫ్రాంచైజీలో నాలుగో భాగం. ఆల్రెడీ లాక్డౌన్ ముందు నటీనటులందరూ యాక్షన్ సన్నివేశాల వర్క్‌షాప్‌లో పాల్గొని శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుత షెడ్యూల్ జర్మనీలో జరగనుందని సమాచారం. చిత్రబృందమంతా జర్మనీ చేరుకున్నట్టు తెలిసింది. -
రజనీ రెడీ
మెల్లిగా ఒక్కో సినిమా షూటింగ్‌లు స్టార్ట్ అవుతున్నాయి. రజనీకాంత్ కూడా తన తదుపరి చిత్రం ప్రారంభించడానికి రెడీ అయ్యారని సమాచారం. శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అన్నాత్తే’’. మీనా, కుష్బూ, కీర్తీ సురేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ లో ప్లాన్ చేశారు.. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రంలో ఎక్కువ షూటింగ్ చేయడం కరెక్ట్ కాదని, చాలా రిస్క్ తో కూడుకున్నదని భావించిన చిత్రబృందం చెన్నైలోనే ఓ భారీ సెట్ ను నిర్మిస్తోందట. మిగతా భాగాన్ని అక్కడే పూర్తి చేయాలన్నది ప్లాన్ . త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సన్ పిక్చర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బాలయ్య కొత్త చిత్రం షూటింగ్ స్టార్ట్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా కొత్త సినిమా పట్టాలెక్కింది. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం ఆర్ఎఫ్సీలో ప్రారంభమైంది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలతో సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. బాలకృష్ణ షూటింగ్లో పాల్గొంటున్న ఈ షెడ్యుల్ ఏకధాటిగా సాగనుంది. ఈ చిత్రం కోసం బాలకృష్ణ బరువు కూడా తగ్గారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సింహా, లెజెండ్స్ వంటి హిట్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ తెరకెక్కుతున్న మూడో చిత్రమిదే. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నటీనటులకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: థమన్ ఎస్.ఎస్, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్.ప్రకాష్. -
వెంటనే ఓకే చెప్పేశా!
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి ఒంగోలులో ప్రారంభమైంది. అర్జున్ జంధ్యాలని దర్శకునిగా పరిచయం చేస్తూ, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలిమ్స్ పతాకాలపై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఆర్ఎక్స్ 100’ తర్వాత చాలా కథలు విన్నాను. అర్జున్ జంధ్యాల చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశా. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘బోయపాటి శ్రీనుగారి దగ్గర దర్శకత్వశాఖలో పనిచేశాను. ఆయన నాకు గురువుగారు మాత్రమే కాదు. సోదర సమానులు. కార్తికేయగారి వల్లే ఈ చిత్రం ఇంత త్వరగా పట్టాలెక్కింది. కథానుగుణంగా ఒంగోలులో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు అర్జున్ జంధ్యాల. ‘‘ఈ చిత్రంతో సినిమా రంగంలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. గురువారం నుంచి ఫిబ్రవరి 8 వరకు ఒంగోలు పరిసరాల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరిస్తాం. ఈ షెడ్యూల్లోనే కీలక సన్నివేశాలు, రెండు పాటలను తెరకెక్కిస్తాం. ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. టైటిల్ త్వరలోనే వెల్లడిస్తాం’’ అని అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్య భరద్వాజ్, కెమెరా: ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ రామ్, ఆర్ట్ డైరెక్టర్: జీయమ్ శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మల్లాల.