వెంటనే ఓకే చెప్పేశా! | Kartikeya's new movie to shoot in Ongole | Sakshi
Sakshi News home page

వెంటనే ఓకే చెప్పేశా!

Jan 18 2019 1:01 AM | Updated on Jan 18 2019 1:01 AM

Kartikeya's new movie to shoot in Ongole - Sakshi

కార్తికేయ

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ గురువారం నుంచి ఒంగోలులో ప్రారంభమైంది. అర్జున్‌ జంధ్యాలని దర్శకునిగా పరిచయం చేస్తూ, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ పతాకాలపై అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత చాలా కథలు విన్నాను. అర్జున్‌ జంధ్యాల చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశా. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘బోయపాటి శ్రీనుగారి దగ్గర దర్శకత్వశాఖలో పనిచేశాను. ఆయన నాకు గురువుగారు మాత్రమే కాదు. సోదర సమానులు.

కార్తికేయగారి వల్లే ఈ చిత్రం ఇంత త్వరగా పట్టాలెక్కింది. కథానుగుణంగా ఒంగోలులో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు అర్జున్‌ జంధ్యాల. ‘‘ఈ చిత్రంతో సినిమా రంగంలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. గురువారం నుంచి ఫిబ్రవరి 8 వరకు ఒంగోలు పరిసరాల్లో తొలి షెడ్యూల్‌ చిత్రీకరిస్తాం. ఈ షెడ్యూల్లోనే కీలక సన్నివేశాలు, రెండు పాటలను తెరకెక్కిస్తాం. ప్రస్తుతం హీరోయిన్‌ ఎంపిక జరుగుతోంది. టైటిల్‌ త్వరలోనే వెల్లడిస్తాం’’ అని అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్య భరద్వాజ్, కెమెరా: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌: జీయమ్‌ శేఖర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శివ మల్లాల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement