అప్పుడే నటనపై ఆసక్తి పెంచుకున్నా: టాలీవుడ్‌ హీరోయిన్‌ | Bhaje vayu Vegan Actress Iswarya Menon Talks about Her Film Goes Viral | Sakshi
Sakshi News home page

Iswarya Menon: ఆ సినిమాతో తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి: ఐశ్వర్య మీనన్

Published Mon, May 27 2024 8:00 PM | Last Updated on Mon, May 27 2024 8:26 PM

Bhaje vayu Vegan Actress Iswarya Menon Talks about Her Film Goes Viral

యంగ్ హీరో కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా నటించిన చిత్రం "భజే వాయు వేగం". ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సినిమా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హీరోయిన్ ఐశ్వర్య మీనన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అదేంటో తెలుసుకుందాం. 

ఐశ్వర్య మాట్లాడుతూ..' సినిమాలో ఇందు అనే బ్యూటీషియన్ క్యారెక్టర్ చేశా. ఇందులో ట్రెడిషనల్ దుస్తులు వేసుకుంటా. నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం ఇష్టం. ఎందుకంటే రియల్ లైఫ్‌లో కూడా నాకు ట్రెడిషనల్ దుస్తులు ధరించడానికే ఇష్టపడతా. స్పై సినిమా తర్వాత నాకు తెలుగులో ఆఫర్స్ వచ్చాయి. తెలుగులోనే కాదు తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తున్నా. తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు ఇష్టం. ఇక్కడే ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నా. ఈ సినిమాలో నా పాత్ర స్పై సినిమాలోని క్యారెక్టర్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది. కార్తికేయతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది.' అని అన్నారు. 

ఐశ్వర్య మాట్లాడుతూ..'తమిళనాడులో ఈరోడ్ అనే చిన్న పట్టణం మాది. మధ్య తరగతి కుటుంబం. నేను ఇంజినీరింగ్ చేశా. స్కూల్లో చదువుకుంటున్న కమర్షియల్ యాడ్స్‌లో నటించడం, స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడంతో చేయడంతో బాగా పేరొచ్చింది. ఇంజినీరింగ్ అయ్యాక నటన మీద ఫోకస్ చేశా. ఇప్పటివరకు తెచ్చుకున్న గుర్తింపు పట్ల గర్వంగా ఉంది. తెలుగులో ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నా. ఒక సినిమాకు సైన్ చేశా. తమిళంలో ఓ లవ్ స్టోరీ చేస్తున్నా' అని వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement