![Abhishek Bachchan Begins Shooting for Manmarziyan - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/2/Abhishek%20Bachchan.jpg.webp?itok=sTO1ymF0)
అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన అభిషేక్ బచ్చన్.. హీరోగా ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. కెరీర్ లో ఒకటి రెండు హిట్ సినిమాలు ఉన్నా.. టాప్ స్టార్ ట్యాగ్‌ను సాధించలేకపోయాడు. దీంతో నటనతో పాటు ఇతర వ్యాపారాల మీద దృష్టి పెట్టిన అభిషేక్ వ్యాపార వేత్తగా దూసుకుపోతున్నాడు.
తాజాగా మరో బాలీవుడ్ సినిమా ‘మన్‌మర్జాయన్’ కు అంగీకరించాడు అభిషేక్. ఈ రోజు(శుక్రవారం) ఈ సినిమా ప్రారంభమవుతున్న సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘నేను కెమెరా ముందుకు వచ్చి రెండేళ్లు గడిచిపోయింది. ఓ కొత్త ప్రయాణం, ఓ కొత్త సినిమా ఈ రోజే ప్రారంభమవుతుంది. మీ శుభాకాంక్షలు ఆశీర్వాదం కావాలి’ అంటూ ట్వీట్ చేశాడు అభిషేక్. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాఘవేంద్రరావు కోడలు కనిక ధిల్లాన్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు అభిషేక్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
It’s been just over 2 yrs since I faced a film camera… A new journey, a new film begins today. Need your good wishes and blessings. #Manmarziyaan #TakeTwo 🎬
— Abhishek Bachchan (@juniorbachchan) 2 March 2018
Comments
Please login to add a commentAdd a comment