సూర్య @ 45 | Suriya, Trisha new movie shooting starts | Sakshi
Sakshi News home page

సూర్య @ 45

Nov 28 2024 5:29 AM | Updated on Nov 28 2024 5:29 AM

Suriya, Trisha new movie shooting starts

హీరో సూర్య 45వ చిత్రం బుధవారం ఉదయం పొల్లాచ్చి సమీపంలోని ఆనైమలై ప్రాంతంలో గల ప్రసిద్ధి చెందిన మాసానీ అమ్మన్  ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఇందులో నటి త్రిష హీరోయిన్‌గా నటించనున్నారు. నటుడు ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌. ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో నటుడు సూర్య, దర్శకుడు ఆర్‌జే బాలాజీల కుటుంబ సభ్యులు, నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

– సాక్షి, తమిళ సినిమా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement