నవ్వుల ఇంద్రజాలం | Indrajalam movie shooting starts | Sakshi
Sakshi News home page

నవ్వుల ఇంద్రజాలం

Published Thu, Jun 15 2023 1:16 AM | Last Updated on Thu, Jun 15 2023 1:16 AM

Indrajalam movie shooting starts - Sakshi

‘శాసనసభ’ ఫేమ్‌ ఇంద్రసేన హీరోగా ‘ఇంద్రజాలం’ సినిమా షురూ అయింది. జై క్రిష్‌ మరో ప్రధాన ΄ాత్రలో నటిస్తున్నారు. పూర్ణాస్‌ మీడియా సమర్పణలో నిఖిల్‌ కె. బాల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి న్యాయమూర్తి ఆర్‌. మాధవరావు కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

ఈ సందర్భంగా ఇంద్రసేన మాట్లాడుతూ– ‘‘శాసనసభ’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా చూసిన నిఖిల్‌గారు ‘ఇంద్రజాలం’కి చాన్స్‌ ఇచ్చారు’’ అన్నారు. ‘‘క్రైమ్‌ థ్రిల్లర్‌తో కూడిన ప్రేమకథ ఇది. వినోదంతో ΄ాటు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా స్క్రీన్‌ప్లే ఉంటుంది’’ అన్నారు దర్శక–నిర్మాత నిఖిల్‌ కె. బాల. చిత్ర సహ నిర్మాత పూర్ణ శైలజ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కుమార్‌ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్‌ కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement