indrasena
-
నవ్వుల ఇంద్రజాలం
‘శాసనసభ’ ఫేమ్ ఇంద్రసేన హీరోగా ‘ఇంద్రజాలం’ సినిమా షురూ అయింది. జై క్రిష్ మరో ప్రధాన ΄ాత్రలో నటిస్తున్నారు. పూర్ణాస్ మీడియా సమర్పణలో నిఖిల్ కె. బాల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి న్యాయమూర్తి ఆర్. మాధవరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా ఇంద్రసేన మాట్లాడుతూ– ‘‘శాసనసభ’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా చూసిన నిఖిల్‌గారు ‘ఇంద్రజాలం’కి చాన్స్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘క్రైమ్ థ్రిల్లర్‌తో కూడిన ప్రేమకథ ఇది. వినోదంతో ΄ాటు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా స్క్రీన్‌ప్లే ఉంటుంది’’ అన్నారు దర్శక–నిర్మాత నిఖిల్ కె. బాల. చిత్ర సహ నిర్మాత పూర్ణ శైలజ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్ కుమార్. -
‘శాసనసభ’ మూవీ రివ్యూ
టైటిల్ : శాసనసభ నటీనటులు: ఇంద్రసేన, డా.రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్య రాజ్ బకుని, సోనియా అగర్వాల్, హెబ్బా పటేల్, వేణు మండికంటి తదితరులు నిర్మాతలు: తులసీరామ్సాప్పని, షణ్ముగం సాప్పని కథ, స్రీన్‌ప్లే, డైలాగ్స్: రాఘవేంద్రరెడ్డి దర్శకత్వం: వేణు మడికంటి సంగీతం: రవి బసూర్ విడుదలతేది: డిసెంబర్ 16, 2022 అసలు కథేంటంటే: ఓ ఫిక్షనల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగ్గా.. ఏ పార్టీకి మెజారిటీ రాదు. ఎలాగైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న అనీష్ కురువిల్లా ప్రయత్నించగా.. ఈ సారి తానే సీఎం అవ్వాలని ప్రతిపక్ష పార్టీ నాయకురాలు సోనియా అగర్వాల్ పావులు కదుపుతుంది. ఈ క్రమంలో స్వతంత్ర ఎమ్మెల్యేలకు డిమాండ్ ఏర్పడుతుంది. వారిని కొనడం కోసం రెండు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటాయి. అందులో భాగంగా బేరసారాల్లో ఆరితేరిన దుర్గా(అమిత్ తివారి)ని జైలులో చంపాలని ఒకరు.. కాపాడాలని మరొకరు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో దుర్గాని సూర్య(ఇంద్రసేన) కాపాడుతాడు. అసలు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? సూర్య ఎవరు? స్వతంత్ర ఎమ్మెల్యేలను సూర్య ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? ప్రజలకు మంచి చేయాలనే తపన ఉన్న నారాయణ స్వామి( రాజేంద్రప్రసాద్)తో సూర్యకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. శాసనసభ గొప్పతనాన్ని తెలియజేసే సినిమా ఇది. జర్నలిస్ట్‌గా, శాటిలైట్ కన్సల్టెంట్‌గా ఎంతో అనుభవం ఉన్న రాఘవేంద్రరెడ్డి పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఈ కథను రాసుకున్నాడు. రాఘవేంద్రరెడ్డి ఎంచుకున్న పాయింట్ బాగున్నా.. దానిని అనుకున్న విధంగా తెరపై చూపించడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. సినిమా ఫస్టాఫ్ బాగానే ఉంటుంది కానీ అక్కడక్కడ సాగదీతగా అనిపిస్తుంది. ఇక కీలకమైన సెకండాఫ్ నిరాశపరుస్తుంది. కథనం అంతా రొటీన్‌గా సాగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో కొన్ని అంశాలు ఎలా నష్టాలు చేకూరుస్తున్నాయి వాటి వల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. రాఘవేంద్రరెడ్డి రాసిన డైలాగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ‘ఓటేసే రోజునే వాడు రాజు..ఆ తర్వాత ఐదేళ్లు నేనే రాజు..నేనే మంత్రి’, డబ్బులు తీసుకొని ఓటు అమ్ముకున్న ఓటర్ని ప్రశ్నించే అధికారం ఎక్కడుంది’ ప్రతి వాడు యుద్దంలో గెలవాలనే చూస్తాడు. కానీ ఎవరో ఒకడు మాత్రమే గెలుస్తాడు..వాడినే వీరుడు అంటారు’లాంటి డైలాగ్స్ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఫస్టాఫ్ మాదిరే సెకండాఫ్‌ని కూడా కాస్త ఆసక్తికరంగా, ల్యాగ్ లేకుండా తీర్చిదిద్ది ఉంటే.. శాసన సభ ఓ మంచి పొలిటికల్ థ్రిల్లర్‌గా నిలిచేది. ఎవరెలా చేశారంటే: ఇక నటీనటులు విషయానికొస్తే.. సూర్య పాత్రలో ఇంద్రసేన మెప్పించాడు. యాక్షన్ సీక్వెన్స్ లలో కానీ ఇతర కీలక సన్నివేశాల్లో బాగా నటించాడు. రాజేంద్రప్రసాద్ ఎప్పటిలాగే తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. నారాయణ స్వామి పాత్రకి ఆయన జీవం పోశాడు. ముఖ్యమంత్రిగా అనీష్ కురువిల్లా, ప్రతిపక్ష నాయకురాలుగా సోనియా అగర్వాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. రవి బసూర్ సంగీతం, రాఘవేంద్రరెడ్డి స్క్రీన్‌ప్లే,మాటలు బాగున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాన విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
సొట్టబుగ్గలున్న అగ్గిపెట్టే నేను..
‘నన్ను పట్టుకుంటే జారిపోతుంటాను... ఒంపుసొంపులున్న పాదరసమే నేను.. నన్ను ముట్టుకుంటే నిప్పునవుతుంటాను.. సొట్టబుగ్గలున్న అగ్గిపెట్టే నేను..’ అంటూ అదిరిపోయే స్టెప్పులు వేశారు హెబ్బా పటేల్. ఇంద్రసేన హీరోగా నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘శాసనసభ’. ఇందులో ఐశ్వర్యారాజ్ భకుని, రాజేంద్ర ప్రసాద్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు. తులసీరామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మాతలు. రవి బసూర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నన్ను పట్టుకుంటే..’పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ స్పెషల్ సాంగ్‌లో హెబ్బాపటేల్ మంచి స్టెప్పులు వేశారు. కాసర్లశ్యామ్ సాహిత్యం అందించగా, మంగ్లీ, సంతోష్ వెంకీ, ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బసూర్ పాడారు. ప్రేమ్‌రక్షిత్ నృత్యరీతులు సమకూర్చారు. -
ఈ అభిమానం ఇలాగే కొనసాగాలి – విజయ్ ఆంటోనీ
‘‘ఇంద్రసేన’ సినిమాకి తెలుగు ప్రేక్షకుల స్పందన బాగుంది. నా ప్రతి సినిమాకి ఈ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరు కుంటున్నా’’ అని విజయ్ ఆంటోనీ అన్నారు. ఆయన హీరోగా జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ ‘అన్నాదురై’ తెలుగులో ‘ఇంద్రసేన’ పేరుతో ఇటీవల విడుదలైంది. ‘‘నా పాత్ర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. చాలామంది ప్రత్యేకంగా ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు మరిన్ని చేయాలని ఆశిస్తున్నా’’ అన్నారు కథానాయిక మహిమ. ‘‘ఇంద్రసేన’ విజయం సాధించడం హ్యాపీగా ఉంది. సినిమా చూసిన వారందరూ బాగుందని అభినందిస్తున్నారు’’ అని తెలుగులో చిత్రాన్ని విడుదల చేసిన నీలం కృష్ణారెడ్డి అన్నారు. రచయిత భాషాశ్రీ పాల్గొన్నారు. -
'ఇంద్రసేన' మూవీ రివ్యూ
టైటిల్ : ఇంద్రసేన జానర్ : ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తారాగణం : విజయ్ ఆంటోని, డయానా చంపికా, మహిమా, జ్యువెల్ మేరి, రాధా రవి, సంగీతం : విజయ్ ఆంటోని దర్శకత్వం : జి. శ్రీనివాసన్ నిర్మాత : రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో తెలుగు నాట సంచలన విజయం సాధించిన విజయ్ ఆంటోని ఆ తరువాత విడుదలైన సినిమాలతో ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో మరోసారి తనకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సెంటిమెంట్ నే నమ్ముకొని ఇంద్రసేన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి మరోసారి విజయ్ ఆంటోని మ్యాజిక్ రిపీట్ అయ్యిందా,,.? అమ్మ సెంటిమెంట్ లాగే తమ్ముడు సెంటిమెంట్ కూడా సక్సెస్ సాధించిందా..? కథ : ఇంద్ర సేన (విజయ్ ఆంటోని) తను ప్రేమించిన అమ్మాయి తన కళ్లముందే ప్రమాదంలో చనిపోవటంతో తాగుబోతుగా మారిపోతాడు. ఎప్పుడు తను ప్రేమించిన అమ్మాయి సమాధి మీదే పడుకొని తాగుతూ ఉంటాడు. పెళ్లి చేస్తే బాగుపడతాడని తల్లిదండ్రులు ప్రయత్నించినా.. తాగుబోతు అన్న ముద్ర పడటంతో ఎవరు అమ్మాయిని ఇచ్చేందుకు ఒప్పకోరు. అదేసమయంలో అచ్చు ఇంద్రసేనలా ఉండే అతని తమ్ముడు రుద్రసేనకు పెళ్లి కుదురుతుంది. (సాక్షి రివ్యూస్) కానీ ఇంద్రసేన చేసిన ఓ చిన్నపోరపాటు వాళ్ల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. హ్యతకేసులో ఇంద్రసేనకు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. రుద్రసేన ఉద్యోగం పోగొట్టుకుంటాడు.. పెళ్లి ఆగిపోతుంది. వాళ్ల వ్యాపారాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఏడేళ్ల తరువాత ఇంద్రసేన జైలు నుంచి బయటకు వచ్చేసరికి పరిస్థితులన్ని మారిపోతాయి. రుద్రసేన రౌడీగా మారతాడు. తన వల్లే తన కుటుంబం ఇలా ఇబ్బందుల్లో పడిందని భావించిన ఇంద్రసేన ఎలాగైన తమ్ముడికి తిరిగి మామూలు జీవితం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఇంద్రసేన ఏం చేశాడు..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన విజయ్ ఆంటోని, ఇంద్రసేనగా మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ద్విపాత్రాభినయం చేసిన విజయ్, లుక్ విషయంలో వేరియేషన్ చూపించినా.. నటన పరంగా రెండు క్యారెక్టర్లలో పెద్దగా వేరియేషన్ ఏమీ లేదు. హీరోయిన్ల పాత్రలకు అంతగా ఇంపార్టెన్స్ లేకపోవటం, వారు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న తారలు కూడా కాకపోవటంతో పెద్దగా కనెక్ట్ కాలేరు. రాధ రవిలాంటి ఒకరిద్దరు నటులు తప్ప తెలుగు ఆడియన్స్ గుర్తు పట్టగలిగే వారు లేకపోవటంతో డబ్బింగ్ సినిమ ఆచూస్తున్నామన్న భావనే కలుగుతుంది. తన ప్రతీ సినిమాను డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించే విజయ్ ఈ సినిమా విషయంలో కూడా అదే ఫాలో అయ్యాడు. అన్నదమ్ముల కథను ఆకట్టుకునే కథనంతో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. (సాక్షి రివ్యూస్)దర్శకుడు శ్రీనివాసన్ సినిమాను పూర్తిగా తమిళ ప్రేక్షకులను దృష్టిలోపెట్టుకొని తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా.. సెకండ్ హాఫ్ యాక్షన్ మోడ్ లో సాగటం ఆకట్టుకుంటుంది. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ తెలుగు ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటాయన్న దాని మీదే సినిమా విజయం ఆదారపడి ఉంటుంది. ప్లస్ పాయింట్స్ : ఎమోషనల్ సీన్స్ సినిమా నిడివి మైనస్ పాయింట్స్ : తమిళ నేటివిటి - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
ప్రేక్షకులకు నచ్చేది... హిట్టయ్యేదే కమర్షియల్ సినిమా!
‘‘నేను మంచి నటుణ్ణి కాదు. కానీ, మంచి కథలు ఎంచుకుని అందుకు తగ్గట్టు భావోద్వేగాలు పలికిస్తా. నా దృష్టిలో కమర్షియల్ సినిమా అంటూ ప్రత్యేకంగా ఉండదు. ప్రేక్షకులకు నచ్చేది... హిట్టయ్యేదే కమర్షియల్ సినిమా. ‘బిచ్చగాడు’ నచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు విజయ్ ఆంటోని. ఆయన హీరోగా జి. శ్రీనివాసన్ దర్శకత్వంలో రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ ‘అన్నాదొరై’. తెలుగులో ‘ఇంద్రసేన’గా రేపు విడుదలవుతోందీ సినిమా. విజయ్ ఆంటోని చెప్పిన విశేషాలు... ► తమిళనాడు రాజకీయాల నేపథ్యంలో తీసిన సినిమా కాదిది. దర్శకుడు శ్రీనివాసన్‌కు ఓ కవల సోదరుడు ఉండేవాడు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీశాడు. ► అన్నాతమ్ముళ్ల కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇంద్రసేన, రుద్రసేన అన్నదమ్ములు. ప్రేమించిన అమ్మాయిని కోల్పోయిన ఇంద్రసేన వ్యసనాలకు బానిస అవుతాడు. పీఈటీ టీచర్ అయిన రుద్రసేనకు అనుకోని సమస్య వస్తుంది. ఆయా పరిస్థితుల్లో అన్నాతమ్ముళ్లు తీసుకున్న నిర్ణయాలు ఏంటన్నదే కథ. ► అందంగా కట్ చేస్తే... టీజర్ బాగుంటుంది. ప్రేక్షకులను మోసం కూడా చేస్తుంది. అందుకే, పది నిమిషాల సినిమాని చూపించాం. దీని ద్వారా ప్రధాన కథ తెలిసే అవకాశం ఉండదు. కానీ, ప్రేక్షకుల్లో సినిమాపై ఉత్సుకత, క్రేజ్ పెంచొచ్చు. ‘భేతాళుడు’కీ ఇలాగే చేశాం. ► భారతదేశం చాలా పెద్దది. జనాభా కూడా ఎక్కువే. అందువల్ల జీఎస్టీపై అభిప్రాయాన్ని ఒక్కసారి చెప్పలేం. ఏడెనిమిదేళ్లు పడుతుంది. మా సినిమాలో జీఎస్టీపై ఓ పాట ఉంది. అందులో ఎవర్నీ విమర్శించకున్నా సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో జీఎస్టీ పదం వినిపించకుండా చేశాం. ► నేను చేసే ప్రతి పనిని ఓ ప్రేక్షకుడిగా ఆలోచిస్తా. నా పని సిన్సియర్‌గా చేయాలనుకుంటాను. అంతేకానీ, ఇంకా ఇంకా ఏదో కావాలంటూ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయను. నా లిమిట్స్ నాకు తెలుసు. బయటి నిర్మాతలైతే ఒత్తిడి ఉంటుందన్నది నా ఆలోచన. అందుకే నా సంస్థలో చేస్తా. ► తెలుగులో కథలు వింటున్నా. త్వరలో డైరెక్ట్ సినిమా చేయబోతున్నా. నాకు యాక్టింగ్ అంటేనే ఇష్టం. దర్శకులు మంచి కథలతో నా వద్దకొస్తున్నారు. నిర్మాణంపైన శ్రద్ధ వహిస్తున్నా. నా చిత్రాలకు సంగీతం కూడా అందిస్తున్నా. ఇతర సినిమాలకు సంగీతం అందించాలనో... డైరెక్టర్ అవ్వాలనో ఆలోచన లేదు. ప్రస్తుతం తమిళ్లో రెండు సినిమాలు చేస్తున్నా. -
నో జీఎస్టీ ప్లీజ్!
సామాన్య ప్రజల రిక్వెస్ట్ కాదిది... సెన్సార్ బోర్డు సినిమా జనాల ముందుకు తెచ్చిన అబ్జక్షన్! సినిమాల్లో ‘జీఎస్టీ’ అనే పదం వినిపించడానికి సెన్సార్ బోర్డు ఒప్పుకోవడం లేదని సమాచారమ్. సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని హీరోగా నటించిన ‘ఇంద్రసేన’ సినిమాలో ‘జీఎస్టీలా నువ్వే వచ్చి ఎంత పని చేస్తివే...’ అనే పాట ఒకటుంది. ఇటీవలే వీడియోతో సహా ఆ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి పాటకు మంచి స్పందన వస్తోంది. అయితే... సెన్సార్ ముందుకు సినిమాను తీసుకు వెళ్లేసరికి ‘జీఎస్టీ’ పదాన్ని తీసేయమని చెప్పారట! దాంతో ‘జీఎస్టీ’ని ఈఎమ్ఐ’గా మార్చి పాటను మళ్లీ రాసి, సింగర్స్‌తో రికార్డ్ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఇదంతా తమిళ హీరో విజయ్ ‘మెర్సల్’ ఎఫెక్ట్ ఏమో! తెలుగులో ‘అదిరింది’గా విడుదలైన ‘మెర్సల్’లో జీఎస్టీకి వ్యతిరేకంగా రెండు మూడు డైలాగులున్నాయి. సినిమా విడుదలైన తర్వాత తమిళనాట రాజకీయ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో నిర్మాతలు స్వచ్ఛందంగా జీఎస్టీ డైలాగులను మ్యూట్ చేశారు. తెలుగులో మూడు వారాలు ఆలస్యంగా విడుదలైన ‘అదిరింది’లోనూ జీఎస్టీ డైలాగులు లేవు. ఇకపై, ఏ సినిమాలోనూ ‘జీఎస్టీ’ అనే పదం వినబడదేమో!! -
కథ విని శరత్‌కుమార్‌గారు ఏడ్చారు – రాధిక
‘‘విజయ్ ఆంటోని సినిమాలు చూడలేదు కానీ, ఆయన నటించిన ‘పిచ్చైకారన్’ను తెలుగులో రీమేక్ చేయాలను కుంటుండగానే ‘బిచ్చగాడు’ పేరుతో అనువాదమై, హిట్ అయింది. అప్పుడు ‘మంచి సినిమా వదులుకున్నామే’ అనుకున్నా’’ అని హీరో రాజశేఖర్ అన్నారు. విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమ, జ్యువెల్ మేరీ ప్రధాన పాత్రల్లో జి. శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంద్రసేన’. ఈ చిత్రాన్ని తెలుగులో నీలం కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. విజయ్ ఆంటోని స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో రాజశేఖర్, జీవిత రిలీజ్ చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘నేను మిస్ చేసుకున్న ‘బిచ్చగాడు’ సినిమా చూస్తే ఇంకా బాధపడతానని చూడలేదు. ఆ సినిమాలో అమ్మ పాట నాకు ఎంతో నచ్చుతుంది. దాని కోసమైనా సినిమా చూస్తా. ‘ఇంద్రసేన’ మంచి హిట్ అవ్వాలి’’ అన్నారు. నటి–నిర్మాత రాధిక మాట్లాడుతూ– ‘‘మంచి సినిమా లను ఆదరించే ప్రేక్షకుల్లో మొదటి స్థానం తెలుగు వారిదే. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మంచి సినిమాలను ఆదరిస్తారు. నన్ను ఆదరిస్తున్న తెలుగువారికి రుణపడి ఉంటా. ఈ కథ విని, శరత్‌కుమార్‌గారు ఏడ్చారు. నేను అడగ్గానే సినిమా చేయడానికి ఓకే అన్నారు విజయ్ ఆంటోని. ‘ఇంద్రసేన’ తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘నేనీ రోజు ఇక్కడ నిలబడటానికి కారణం విజయ్ ఆంటోనిగారు. ఈ అవకాశాన్నిచ్చిన రాధిక, ఫాతిమా ఆంటోనిలకు థ్యాంక్స్’’ అన్నారు జి. శ్రీనివాసన్. ‘‘పదిహేనేళ్ల క్రితం రాధికగారు నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేశారు. ఇప్పుడు నటించే అవకాశం ఇచ్చినందుకు రాధిక, శరత్‌కుమార్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు విజయ్ ఆంటోని. నటి జీవిత, చిత్రనిర్మాత నీలం కృష్ణారెడ్డి, ‘బిచ్చగాడు’ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, రచయిత భాష్యశ్రీ, సినిమాటోగ్రాఫర్ దిల్‌రాజ్, నిర్మాత సురేశ్ కొండేటి పాల్గొన్నారు. -
ఘనంగా ఇంద్రసేన ఆడియో ఫంక్షన్
-
రిలీజ్‌కు ముందే చూస్తారా!
సినిమా విడుదలకు పదిహేను రోజుల ముందు అందులో మొదటి పది నిమిషాల వీడియోను ప్రేక్షకులకు చూపించడమంటే సాహసమే. ఈ సాహసానికి ‘సై’ అంటున్నారు విజయ్ ఆంటోని. ఆయన హీరోగా నటించిన తాజా సిన్మా ‘ఇంద్రసేన’ పాటల్ని ఈరోజు హైదరాబాద్‌లో రిలీజ్ చేయనున్నారు. ఈ వేడుకలో సిన్మాలోని పది నిమిషాల నిడివి గల వీడియోను, ఓ ఫుల్ వీడియో సాంగును ప్రదర్శించనున్నారు. జి. శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ఎన్.కె.ఆర్. ఫిల్మ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే విడుదలైన ‘ఇంద్రసేన’ టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అంచనాలకు తగ్గట్టు ఉంటుందీ సిన్మా. కంటెంట్‌పై నమ్మకంతో పది నిమిషాల వీడియోను విడుదల చేస్తున్నాం. అలాగే, ఫుల్ వీడియో సాంగును రవితేజ విడుదల చేస్తారు. మా సంస్థ నుంచి విడుదలైన గత సినిమాలు ‘ఇంకొక్కడు, జయమ్ము నిశ్చయమ్మురా’ తరహాలో ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది’’ అన్నారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోని స్వరకర్త. -
అప్పుడు మదర్.. ఇప్పుడు బ్రదర్
‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ మార్క్ సంపాదించుకున్నారు విజయ్ ఆంటోని. వైవిధ్యమైన సినిమాలతో వరుస కమర్షియల్ సక్సెస్‌లు అందుకుంటున్న ఆయన నటించిన తాజా చిత్రం ‘ఇంద్రసేన’. జి. శ్రీనివాసన్ దర్శకత్వంలో రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘బిచ్చగాడు’ సినిమాలో మదర్ సెంటిమెంట్‌కు తన నటనతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షాన్ని కురిపించారు విజయ్. ‘ఇంద్రసేన’ చిత్రంలో బ్రదర్ సెంటిమెంట్‌తో ఆకట్టుకోనున్నారు. బ్రదర్ సెంటిమెంటే కాదు.. హై ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు–సాహిత్యం: భాష్యశ్రీ, సంగీతం–కూర్పు: విజయ్ ఆంటోని, కెమెరా: కె.దిల్‌రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్. -
లోకంపై దండెత్తే ఇంద్రసేన
‘లెఫ్ట్‌కి వెళితే పెద్ద నమ్మకద్రోహం కనిపిస్తుంది. స్ట్రయిట్‌గా వెళ్లి రైట్ తీసుకుంటే ఒక ఓటమి ఎదురవుతుంది. దాన్నుండి ఇంకొంచెం ముందుకెళ్లి యూ టర్న్ తీసుకుంటే నువ్వు తీసుకున్న అప్పు అనే ఒక లోయ కనిపిస్తుంది. ఆ లోయలో పడి ముక్కు, మొహం పగులగొట్టుకుని లేచి ముందుకెళితే మనం మోసపోయామని ఒక సిగ్నల్ పడుతుంది. ఆ సిగ్నల్‌ని కూడా టాప్ గేర్‌లో దాటి వెళితే ఆ తర్వాత వచ్చే ఇల్లే నువ్వు కోరుకున్న విజయం. ఆ విజయాన్ని అందుకుని వెనక్కి తిరిగి చూస్తే యముడు మనకన్నా ముందొచ్చి మనకోసం వేచి ఉంటాడు’ ఇదీ ‘ఇంద్రసేన’ డైలాగ్. లోకంలోని దుర్మార్గాన్ని నిశితంగా అర్థం చేసుకున్నవాడి డైలాగ్. ఈ డైలాగ్ సారంతో రాబోతున్న విజయ్ ఆంటోని సినిమాయే ‘ఇంద్రసేన’. విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమా ముఖ్యపాత్రలు. జి.శ్రీనివాసన్ దర్శకుడు. రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘అన్నాదురై’ ని ‘ఇంద్రసేన’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘ఇది సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ. భాషాశ్రీ అద్భుతమైన డైలాగులు, పాటలు రాశారు. డిసెంబర్ 1న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఆ తర్వాత తెలుగులో స్ట్రైట్ ఫిలిం చేయబోతున్నా’’ అన్నారు. ‘‘ఇంద్రసేన’ లోగోని చిరంజీవిగారు రిలీజ్ చేయ డంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మంచి హిట్టవు తుందని నమ్ము తున్నా’’ అన్నారు దర్శకుడు. -
ఇంద్ర చేతుల మీదుగా ఇంద్రసేన ఫస్ట లుక్ లాంచ్
-
తెలుగు నేర్చుకుంటున్న తమిళ హీరో
ప్రస్తుతం కోలీవుడ్ హీరోలు తెలుగు మార్కెట్ మీద దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ న్యూ సెన్సేషన్ విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా భారీ కలెక్షన్లు సాధించటంతో తన ప్రతీ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు తన సినిమాలను డబ్ చేసి మాత్రమే రిలీజ్ చేసిన విజయ్, నెక్ట్స్ సినిమాను బైలింగ్యువల్ తెరకెక్కిస్తున్నాడు. ఇంద్రసేన పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ ఆంటోని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. శ్రీనివాసన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తొలిసారిగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్న విజయ్, ఈ సినిమాలోనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాడట. అందుకే స్పెషల్‌గా టైం కేటాయించి తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో అలరించిన విజయ్ ఆంటోని స్ట్రయిట్ సినిమాతో ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
భార్యతో సినిమా హీరో గొడవ: విమానాశ్రయంలో కలకలం!
-
భార్యతో సినిమా హీరో గొడవ: విమానాశ్రయంలో కలకలం!
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ సినిమా హీరో భార్యతో గొడవపడిన ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం 'కుర్కురే' సినిమా హీరో ఇంద్రసేన విమానంలో ఇక్కడికి వచ్చారు. అతనిని రిసీవ్ చేసుకోవడానికి అతని భార్య విమానాశ్రయానికి వచ్చింది. ఆ హీరో, అతని భార్య మధ్య ఇంతకు ముందే మనఃస్పర్ధలున్నట్లు ఉన్నాయి. విమానాశ్రయంలోనే వారు ఇద్దరు గొడవపడ్డారు. వారు గొడవ పడటం చూసినవారు పోలీసులకు ఫోన్ చేసి ఒక మహిళను కిడ్నాప్ చేస్తున్నట్లు చెప్పారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వచ్చిన తరువాత అసలు విషయం తెలిసింది. అది కిడ్నాప్ కాదని, వారు ఇద్దరూ భార్యాభర్తలేనని, గొడవ పడుతున్నారని అర్ధమైంది.