
‘లెఫ్ట్‌కి వెళితే పెద్ద నమ్మకద్రోహం కనిపిస్తుంది. స్ట్రయిట్‌గా వెళ్లి రైట్ తీసుకుంటే ఒక ఓటమి ఎదురవుతుంది. దాన్నుండి ఇంకొంచెం ముందుకెళ్లి యూ టర్న్ తీసుకుంటే నువ్వు తీసుకున్న అప్పు అనే ఒక లోయ కనిపిస్తుంది. ఆ లోయలో పడి ముక్కు, మొహం పగులగొట్టుకుని లేచి ముందుకెళితే మనం మోసపోయామని ఒక సిగ్నల్ పడుతుంది. ఆ సిగ్నల్‌ని కూడా టాప్ గేర్‌లో దాటి వెళితే ఆ తర్వాత వచ్చే ఇల్లే నువ్వు కోరుకున్న విజయం. ఆ విజయాన్ని అందుకుని వెనక్కి తిరిగి చూస్తే యముడు మనకన్నా ముందొచ్చి మనకోసం వేచి ఉంటాడు’ ఇదీ ‘ఇంద్రసేన’ డైలాగ్.
లోకంలోని దుర్మార్గాన్ని నిశితంగా అర్థం చేసుకున్నవాడి డైలాగ్. ఈ డైలాగ్ సారంతో రాబోతున్న విజయ్ ఆంటోని సినిమాయే ‘ఇంద్రసేన’. విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమా ముఖ్యపాత్రలు. జి.శ్రీనివాసన్ దర్శకుడు. రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘అన్నాదురై’ ని ‘ఇంద్రసేన’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్‌లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘ఇది సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ. భాషాశ్రీ అద్భుతమైన డైలాగులు, పాటలు రాశారు. డిసెంబర్ 1న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఆ తర్వాత తెలుగులో స్ట్రైట్ ఫిలిం చేయబోతున్నా’’ అన్నారు. ‘‘ఇంద్రసేన’ లోగోని చిరంజీవిగారు రిలీజ్ చేయ డంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మంచి హిట్టవు తుందని నమ్ము తున్నా’’ అన్నారు దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment