'ఇంద్రసేన' మూవీ రివ్యూ | INDRASENA Movie review | Sakshi
Sakshi News home page

'ఇంద్రసేన' మూవీ రివ్యూ

Published Thu, Nov 30 2017 6:45 PM | Last Updated on Fri, Dec 1 2017 12:23 PM

INDRASENA Movie review - Sakshi

టైటిల్ : ఇంద్రసేన
జానర్ : ఫ్యామిలీ యాక్షన్ డ్రామా
తారాగణం : విజయ్ ఆంటోని, డయానా చంపికా, మహిమా, జ్యువెల్ మేరి, రాధా రవి, 
సంగీతం : విజయ్ ఆంటోని
దర్శకత్వం : జి. శ్రీనివాసన్
నిర్మాత : రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని


బిచ్చగాడు సినిమాతో తెలుగు నాట సంచలన విజయం సాధించిన విజయ్ ఆంటోని ఆ తరువాత విడుదలైన సినిమాలతో ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో మరోసారి తనకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సెంటిమెంట్ నే నమ్ముకొని ఇంద్రసేన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి మరోసారి విజయ్ ఆంటోని మ్యాజిక్ రిపీట్ అయ్యిందా,,.? అమ్మ సెంటిమెంట్ లాగే తమ్ముడు సెంటిమెంట్ కూడా సక్సెస్ సాధించిందా..?

కథ :
ఇంద్ర సేన (విజయ్ ఆంటోని) తను ప్రేమించిన అమ్మాయి తన కళ్లముందే ప్రమాదంలో చనిపోవటంతో తాగుబోతుగా మారిపోతాడు. ఎప్పుడు తను ప్రేమించిన అమ్మాయి సమాధి మీదే పడుకొని తాగుతూ ఉంటాడు. పెళ్లి చేస్తే బాగుపడతాడని తల్లిదండ్రులు ప్రయత్నించినా.. తాగుబోతు అన్న ముద్ర పడటంతో ఎవరు అమ్మాయిని ఇచ్చేందుకు ఒప్పకోరు. అదేసమయంలో అచ్చు ఇంద్రసేనలా ఉండే అతని తమ్ముడు రుద్రసేనకు పెళ్లి కుదురుతుంది. (సాక్షి రివ్యూస్) కానీ ఇంద్రసేన చేసిన ఓ చిన్నపోరపాటు వాళ్ల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. హ్యతకేసులో ఇంద్రసేనకు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. రుద్రసేన ఉద్యోగం పోగొట్టుకుంటాడు.. పెళ్లి ఆగిపోతుంది.  వాళ్ల వ్యాపారాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఏడేళ్ల తరువాత ఇంద్రసేన జైలు నుంచి బయటకు వచ్చేసరికి పరిస్థితులన్ని మారిపోతాయి. రుద్రసేన రౌడీగా మారతాడు. తన వల్లే తన కుటుంబం ఇలా ఇబ్బందుల్లో పడిందని భావించిన ఇంద్రసేన ఎలాగైన తమ్ముడికి తిరిగి మామూలు జీవితం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఇంద్రసేన ఏం చేశాడు..? అన్నదే మిగతా కథ.
 

విశ్లేషణ :
బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన విజయ్ ఆంటోని, ఇంద్రసేనగా మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ద్విపాత్రాభినయం చేసిన విజయ్, లుక్ విషయంలో వేరియేషన్ చూపించినా.. నటన పరంగా రెండు క్యారెక్టర్లలో పెద్దగా వేరియేషన్ ఏమీ లేదు. హీరోయిన్ల పాత్రలకు అంతగా ఇంపార్టెన్స్ లేకపోవటం, వారు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న తారలు కూడా కాకపోవటంతో పెద్దగా కనెక్ట్ కాలేరు. రాధ రవిలాంటి ఒకరిద్దరు నటులు తప్ప తెలుగు ఆడియన్స్ గుర్తు పట్టగలిగే వారు లేకపోవటంతో డబ్బింగ్ సినిమ ఆచూస్తున్నామన్న భావనే కలుగుతుంది. తన ప్రతీ సినిమాను డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించే విజయ్ ఈ సినిమా విషయంలో కూడా అదే ఫాలో అయ్యాడు. అన్నదమ్ముల కథను ఆకట్టుకునే కథనంతో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. (సాక్షి రివ్యూస్)దర్శకుడు శ్రీనివాసన్ సినిమాను పూర్తిగా తమిళ ప్రేక్షకులను దృష్టిలోపెట్టుకొని తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా.. సెకండ్ హాఫ్ యాక్షన్ మోడ్ లో సాగటం ఆకట్టుకుంటుంది. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ తెలుగు ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటాయన్న దాని మీదే సినిమా విజయం ఆదారపడి ఉంటుంది. 

ప్లస్ పాయింట్స్ :
ఎమోషనల్ సీన్స్
సినిమా నిడివి

మైనస్ పాయింట్స్ :
తమిళ నేటివిటి


- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement