‘‘ఇంద్రసేన’ సినిమాకి తెలుగు ప్రేక్షకుల స్పందన బాగుంది. నా ప్రతి సినిమాకి ఈ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరు కుంటున్నా’’ అని విజయ్ ఆంటోనీ అన్నారు. ఆయన హీరోగా జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ ‘అన్నాదురై’ తెలుగులో ‘ఇంద్రసేన’ పేరుతో ఇటీవల విడుదలైంది. ‘‘నా పాత్ర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. చాలామంది ప్రత్యేకంగా ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు మరిన్ని చేయాలని ఆశిస్తున్నా’’ అన్నారు కథానాయిక మహిమ. ‘‘ఇంద్రసేన’ విజయం సాధించడం హ్యాపీగా ఉంది. సినిమా చూసిన వారందరూ బాగుందని అభినందిస్తున్నారు’’ అని తెలుగులో చిత్రాన్ని విడుదల చేసిన నీలం కృష్ణారెడ్డి అన్నారు. రచయిత భాషాశ్రీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment