Mahima
-
Mahima Mehra: స్వచ్ఛందాల మహిమాలయం
హిమాలయాలు అంటే మంచు అందాలు గుర్తు రావచ్చు. ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరియవచ్చు. మరోవైపు చూస్తే... అందమైన హిమాలయప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలలో పేదరికరం ఉంది. నిరక్షరాస్యత ఉంది. నిరుద్యోగం ఉంది. వ్యసనాలు ఉన్నాయి. చుట్టపు చూపుగా హిమాలయాలకు వెళ్లాలనుకోలేదు మహిమ మెహ్ర.వారిలో ఒకరిగా బతకాలనుకుంది. వారి బతుకు బండికి కొత్త దారి చూపాలనుకుంది.పుణె, దుబాయ్‌లలో బోధన రంగంలో దశాబ్దకాలం పనిచేసింది మహిమ మెహ్ర. పుణెలోని ‘స్పెక్ట్రమ్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, క్యాన్సర్ రోగులు, నిరుపేద ప్రజల కోసం పనిచేసిన మహిమ తన సేవాకార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలనుకుంది. స్కిల్ ట్రైనింగ్, కెరీర్ గైడెన్స్, పర్యావరణ స్పృహకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. భిన్నమైన సంస్కృతి, భిన్నమైన వాతావరణం మధ్య పనిచేయాలనే ఆసక్తి మహిమను లద్దాఖ్‌కు తీసుకువెళ్లింది. ఈ హిమాలయప్రాంతానికి రావడంతో ఆమె జీవితమే మారి΄ోయింది.‘ఇది నా జీవితాన్ని మార్చిన ప్రయాణం. ఇక్కడ నేను అవసరమైన వారికి అవసరమైన సహకారం అందిస్తున్నాను’ అంటుంది మహిమ. సేవాకార్యక్రమాలు చేయడానికి పట్టణాలు లేదా పల్లెలను ఎంపిక చేసుకుంటారు. హిమాలయప్రాంతం మారుమూలలో నివసిస్తున్న వారిపై తక్కువమంది దృష్టి పడుతుంది. వీరి గురించి తెలుసుకున్న తరువాత మార్పు తీసుకురావాలనే తపన మహిమలో మొదలైంది. ఆ తపనే వందలాది మంది జీవితాల్లో వెలుగు తీసుకువచ్చింది.‘నగరానికి చెందిన వారు గ్రామీణ్రపాంత ప్రజలతో కలిసి పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పుడు ఎన్నో మార్పులు చోటుచేసుకుంటారు. గ్రామీణ ప్రజలు తమలోని సామర్థ్యాన్ని గుర్తించడం ఆ మార్పులో ఒకటి’ అంటుంది మహిమ మెహ్ర.హిమాలయప్రాంతంలో నివసిస్తున్న ప్రజలతో పనిచేయాలనుకున్నప్పుడు వారి గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంది మహిమ. ఒక ఆన్లైన్ సెషన్లో మహిమకు పంకీ సూద్ పరిచయం అయ్యాడు. సూద్ ద్వారా హిమాలయప్రాంత ప్రజల గురించి మహిమకు కొంత అవగాహన వచ్చింది.‘కులు లోయలోని పిల్లల కోసం మీరు కొన్ని వర్క్‌షాప్‌లు నిర్వహిస్తే బాగుంటుంది’ అని సూచించాడు సూద్. వెంటనే అక్కడికి వెళ్లి వర్క్‌షాప్‌లు మొదలు పెట్టింది. ఈ వర్క్‌షాప్‌లకు 30 నుంచి 40 మంది వరకు పిల్లలు వచ్చేవాళ్లు. ఆ తరువాత ‘సన్‌షైన్ లెర్నింగ్ సెంటర్’ను మొదలుపెట్టింది. ఈ సెంటర్ కోసం ఉపాధ్యాయుల సహకారం అవసరం కావడంతో ఫేస్బుక్ పేజీ ్రపారంభించింది.వాలంటీర్లను ఆహ్వానించింది. మొదట్లో 10 ఆ తరువాత... 15...ఆ తరువాత 50 నుంచి 500 వరకు వాలెంటీర్ల సంఖ్య పెరిగింది. ఇప్పుడు ‘సన్‌షైన్ లెర్నింగ్’ తరఫున పనిచేయడానికి 24,500 పైగా వాలెంటీర్లు ఉన్నారు.ఈ అనూహ్యమైన స్పందనే ‘హిమాలయన్ వాలంటీర్ టూరిజం’ ఏర్పాటుకు దారి తీసింది. హిమాలయప్రాంతంలో విద్య, నైపుణ్య అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ స్పృహ, కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేవి హిమాలయన్ వాలంటీర్ టూరిజం(హెచ్విటీ) లక్ష్యాలు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు లోయలో ‘హెచ్విటీ’ మొదటి ్రపాజెక్ట్ మొదలైంది. నాలుగు గ్రామాల నుంచి ఎంతోమంది ‘హెచ్విటీ’ వర్క్‌షాప్‌లకు హాజరయ్యారు. లెర్నింగ్ యాక్టివిటీస్‌లో భాగం అయ్యారు.డిగ్రీ చేసిన అమ్మాయిలు ‘సన్‌షైన్ లెర్నింగ్ సెంటర్’ ద్వారా ఒక సంవత్సరం పాటు శిక్షణ తీసుకొని నామమాత్రం వేతనంతో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ‘హెచ్విటీ’ హిమాలయాలలోని ఎన్నోప్రాంతాలలో స్వచ్ఛంద సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 50 పాఠశాలలతో కలిసి పనిచేస్తుంది. పది టాయ్ లైబ్రరీలను, 35కి పైగా పుస్తక లైబ్రరీలను ఏర్పాటు చేసింది. విద్యకు సంబంధించిన వర్క్‌షాప్‌లు మాత్రమే కాకుండా వైద్యశిబిరాలు నిర్వహిస్తోంది. మాదకద్రవ్యాల బారిన పడిన వారిని ఆ వ్యసనం నుంచి బయటికి తీసుకురావడానికి, వృత్తి విద్యకు సంబంధించిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలు హిమాలయప్రాంతంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చాయి.అరుణాచల్‌ప్రదేశ్‌లో కూడా ఇలాంటి కార్యక్రమాలే చేపడుతున్నారు. చదువుపైనే కాదు రివర్స్ మైగ్రేషన్, ఆర్థిక స్థిరత్వం, రెవెన్యూ జెనరేషన్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. హిమాలయప్రాంతాల్లో పనిచేయాలనే తన ఆలోచన విన్న కొందరు.... ‘అంత దూరం వెళతావా!’ అని ఆశ్చర్య΄ోయారు. అలా ఆశ్చర్య΄ోయిన వారే ఇప్పుడు ‘ఇంత మార్పు తీసుకువచ్చావా’ అని మహిమ మెహ్రను అభినందిస్తున్నారు. -
Mahima Makwana: పదేళ్ల వయసులోనే నటిగా మారింది! ఇప్పుడు తనొక..
మహిమా మక్వానా.. తెలుగు సినీ అభిమానులకు కొత్తేం కాదు. ‘వెంకటాపురం’, ‘మోసగాళ్లు’ చిత్రాలతో ఆమె తెలుగు తెరకు ఎప్పుడో పరిచయమైంది! ఇప్పుడు వెబ్ సిరీస్‌లతో మరింత చేరువైంది.మహిమా పుట్టిపెరిగిందంతా ముంబైలోనే! మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ చేసింది. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న తండ్రి చనిపోవడంతో.. మహిమా చిన్నప్పుడే ఆర్థిక బాధ్యతలను మోయాల్సి వచ్చింది.పదేళ్ల వయసులోనే నటిగా మారింది.. టీవీ సీరియల్స్, కమర్షియల్స్‌లో నటిస్తూ! ‘బాలికా వధు’, ‘మిలే జబ్ హమ్ తుమ్’ వంటి సీరియల్స్ బాలనటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.మహిమా .. టీవీ సీరియల్స్ సెట్స్ మీదే చదువుకుంది. ఆమె తల్లి మాటల్లో చెప్పాలంటే మహిమాకు ఇల్లు, బడి, గుడి అన్నీ అవే! ఇంకా చెప్పాలంటే ఆమె సీరియల్స్ సెట్స్ మీదే పెరిగింది.కథానాయికగా మహిమా కనిపించిన తొలి సీరియల్ ‘సప్నే సుహానే లడక్పన్ కే’. దీంతో ఆమె దేశమంతా పాపులర్ అయింది. ఎన్నో అవార్డులు అందుకుంది. తర్వాత ‘సీఐడీ’, ‘ఆహత్’, ‘కోడ్ రెడ్’, ‘ప్యార్ తూనే క్యా కియా’, అధూరీ కహానీ హమారీ’, ‘శుభారంభ్’ వంటి సీరియల్స్‌లోనూ నటించింది. తన పాపులారిటీని వెండితెర కూడా గమనించేలా చేసుకుంది.మొదటి అవకాశంలోనే సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అదే ‘అంతిమ్’ మూవీ. ఆమె ‘ధడ్కనే మేరీ’, ‘తేరా బాత్ ఔర్ హై’ వంటి మ్యూజిక్ వీడియోస్‌లోనూ అభినయించింది.‘ఫ్లెష్’ అనే సిరీస్‌తో వెబ్ దునియాలోకీ అడుగుపెట్టింది. ప్రస్తుతం ‘షో టైమ్’ అనే సిరీస్‌తో అలరిస్తోంది. నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హష్మీ నటించిన ఈ సిరీస్‌లో మహిమా కూడా ప్రధాన భూమిక పోషించింది. ఇది డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.'టీవీ, సినిమా.. ఇప్పుడు ఓటీటీ.. ఇవే నా లోకం! గ్లామర్.. పర్ఫార్మెన్స్.. రెండూ ఇష్టమే. రెండిటికీ స్కోప్ ఉన్న రోల్స్ చేయాలి.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలి.. ఇదే నా గోల్!’ – మహిమా మక్వానా -
రాజసమంద్ బరిలో మేవార్ రాజ కుటుంబీకురాలు
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం రాజస్థాన్‌లో బీజేపీ తన అభ్యర్థుల ఐదో జాబితాను ప్రకటించింది. ఇందులో రాజసమంద్ సీటు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి మహిమా విశేష్వర్ సింగ్‌ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. గతంలో ఈ స్థానం నుంచి దియా కుమారి ఎంపీగా ఉన్నారు. 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఈ స్థానానికి సుదర్శన్ రావత్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. ఎవరీ మహిమా విశేష్వర్ సింగ్? మేవార్ రాజు మహారాణా ప్రతాప్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవార్ సతీమణే ఈ మహిమా విశేష్వర్ సింగ్. మహిమా సింగ్ భర్త విశ్వరాజ్ సింగ్ మేవార్ నాథ్‌ద్వారా బీజేపీ ఎమ్మెల్యే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో మహిమ తన భర్త విజయానికి విశేష కృషి చేశారు. రాజ్‌సమంద్ పార్లమెంటరీ సీటులో 2019లో జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారిని పోటీకి దింపిన బీజేపీ ఇప్పుడు మేవార్ రాజకుటుంబానికి మహిమా సింగ్ బరిలోకి దించింది. జగదీశ్వరి ప్రసాద్ సింగ్ ఇంట్లో 1972 జూలై 22న జన్మించిన మహిమా సింగ్ మేవార్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పాఠశాల విద్యను అభ్యసించారు. తరువాత మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో ఉన్న సింధియా కన్యా విద్యాలయంలో చదివారు. కాలేజీ విద్యను ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో పూర్తి చేశారు. ఆమె మనస్తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. -
తెలుగు రాష్ట్రాల్లో రిచెస్ట్ ఉమన్! ఎవరీ మహిమా?
హైదరాబాద్‌కు చెందిన మహిమా దాట్ల, ఆమె కుటుంబం రూ.8,700 కోట్ల సంపదతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్నులుగా అవతరించారు. ఇంతకీ ఎవరీమె? వారి కుటుంబం చేస్తున్న వ్యాపారం ఏంటి? ఏ సంస్థకు వారు అధినేతలు? వంటి విషయాలు తెలుసుకుందాం... ఇదీ చదవండి: Prerna Jhunjhunwala: రూ. 330 కోట్ల యాప్.. ఈమె స్టార్టప్ పిల్లల కోసమే.. స్ఫూర్తిదాయకమైన యువ వ్యాపారవేత్త మహిమా దాట్ల ఐఐఎఫ్ఎల్ (IIFL) వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అత్యంత సంపన్న మహిళగా అవతరించారు. మహిమా దాట్ల, ఆమె కుటుంబ నికర విలువ రూ. 8,700 కోట్లుగా అంచనా. ఏపీ, తెలంగాణలోని సంపన్నుల జాబితాలో ఆమె 10వ స్థానంలో నిలిచారు. ఐఐఎఫ్ఎల్ 2021 వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో ఆమె నెట్‌వర్త్ రూ. 7,700 కోట్లు ఉండగా 2022లో ఆమె సంపద విలువ రూ. 1,000 కోట్లు పెరిగింది. ఫార్మా రంగంలో తిరుగులేని నాయకత్వం హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం బయోలాజికల్-ఈ లిమిటెడ్ (Biological E Ltd)కి మహిమా దాట్ల ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్. వారి కుటుంబంలో మూడవ తరం వ్యాపారవేత్త. వ్యాక్సిన్ వ్యాపారంలో ఆమె తనదైన ముద్రను చూపించారు. కరోనా మహమ్మారి సమయంలో Corbevax కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ద్వారా మహిమా నాయకత్వంలోని బయోలాజికల్-ఈ సంస్థ అప్పట్లో వార్తలో నిలిచింది. ఆమె కుటుంబం 1948లో ఫార్మా వ్యాపారాన్ని స్థాపించింది. హెపారిన్ ఔషధాన్ని భారతదేశానికి తీసుకువచ్చింది వీరి సంస్థే. అయితే లండన్‌లో వెబ్‌స్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసిన మహిమా కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. తండ్రి మరణంతో.. 2013లో ఆమె తండ్రి విజయ్ కుమార్ దాట్ల మరణించడంతో ఆమె కంపెనీ పగ్గాలు చేపట్టారు. మహిమా దాట్ల ఆధ్వర్యంలో బయోలాజికల్-ఈ తన వ్యాక్సిన్లను 100 కంటే ఎక్కువ దేశాలకు సరఫరా చేస్తోంది. గత దశాబ్దంలో 200 కోట్లకు పైగా డోస్‌లను అందించింది. దీని పోర్ట్‌ఫోలియోలో మీజిల్స్, టెటానస్, రుబెల్లా వంటి వ్యాధుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రీక్వాలిఫైడ్ వ్యాక్సిన్లు ఏడు ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా టెటానస్ వ్యాక్సిన్ల తయారీలో అతిపెద్ద సంస్థ. ఇలాంటి స్పూర్తివంతమైన పారిశ్రామిక వేత్తల విజయగాథలు, ఆసక్తికరమైన కథనాల కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మహిళా ధనవంతురాలు ఈమే..!
హైదరాబాద్: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 విడుదల చేసిన జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీమంతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉండటం విశేషం. వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం.. బయోలాజికల్ ఈ. లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మాహిమా దట్లా రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత ధనిక మహిళగా అవతరించింది. ఆమె నికర సంపద విలువ రూ.7,700 కోట్లు. మొత్తం భారతదేశంలోని సంపన్నుల జాబితాలో మహిమ 231వ ర్యాంకు సాధించారు. లండన్‌లోని వెబ్ స్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్ మెంట్లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన 44 ఏళ్ల మాహిమా 2001 నుంచి బయోలాజికల్ ఈ భాద్యతలు చేపట్టారు. ఆమె తాతలు 1948లో స్థాపించిన బయోలాజికల్ ప్రొడక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి హెపారిన్ అనే ఔషధాన్ని తయారు చేస్తుంది. ఈ ఇండియా రిచ్ లిస్ట్ జాబితాలో ఉన్న మరో మహిళ ఎన్ ఏసీఎల్ ఇండస్ట్రీస్ చైర్ పర్సన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె లక్ష్మీరాజు రూ.1,000 కోట్ల సంపద కలిగి ఉన్నారు.(చదవండి: 10 నిమిషాల్లో 850 కోట్లు సంపాదించిన ఇండియన్ బిగ్ బుల్) తెలుగు రాష్ట్రాల్లో ధనికుల జాబితాలో ఆమె 41వ స్థానంలో ఉండగా.. దాట్లా & కుటుంబం 15 స్థానాల్లో ఉన్నారు. భారతదేశంలోని సంపన్నుల జాబితాలో లక్ష్మీ రాజు 956వ ర్యాంకు సాధించారు. ఈ ఏడాది హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 69 మంది వ్యక్తులు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న వారి మొత్తం సంపద తెలుగు రాష్ట్రాల నుంచి రూ.3,79,200 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 54 శాతం పెరిగింది. -
ఈ అభిమానం ఇలాగే కొనసాగాలి – విజయ్ ఆంటోనీ
‘‘ఇంద్రసేన’ సినిమాకి తెలుగు ప్రేక్షకుల స్పందన బాగుంది. నా ప్రతి సినిమాకి ఈ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరు కుంటున్నా’’ అని విజయ్ ఆంటోనీ అన్నారు. ఆయన హీరోగా జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ ‘అన్నాదురై’ తెలుగులో ‘ఇంద్రసేన’ పేరుతో ఇటీవల విడుదలైంది. ‘‘నా పాత్ర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. చాలామంది ప్రత్యేకంగా ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు మరిన్ని చేయాలని ఆశిస్తున్నా’’ అన్నారు కథానాయిక మహిమ. ‘‘ఇంద్రసేన’ విజయం సాధించడం హ్యాపీగా ఉంది. సినిమా చూసిన వారందరూ బాగుందని అభినందిస్తున్నారు’’ అని తెలుగులో చిత్రాన్ని విడుదల చేసిన నీలం కృష్ణారెడ్డి అన్నారు. రచయిత భాషాశ్రీ పాల్గొన్నారు. -
కథ విని శరత్‌కుమార్‌గారు ఏడ్చారు – రాధిక
‘‘విజయ్ ఆంటోని సినిమాలు చూడలేదు కానీ, ఆయన నటించిన ‘పిచ్చైకారన్’ను తెలుగులో రీమేక్ చేయాలను కుంటుండగానే ‘బిచ్చగాడు’ పేరుతో అనువాదమై, హిట్ అయింది. అప్పుడు ‘మంచి సినిమా వదులుకున్నామే’ అనుకున్నా’’ అని హీరో రాజశేఖర్ అన్నారు. విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమ, జ్యువెల్ మేరీ ప్రధాన పాత్రల్లో జి. శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంద్రసేన’. ఈ చిత్రాన్ని తెలుగులో నీలం కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. విజయ్ ఆంటోని స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో రాజశేఖర్, జీవిత రిలీజ్ చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘నేను మిస్ చేసుకున్న ‘బిచ్చగాడు’ సినిమా చూస్తే ఇంకా బాధపడతానని చూడలేదు. ఆ సినిమాలో అమ్మ పాట నాకు ఎంతో నచ్చుతుంది. దాని కోసమైనా సినిమా చూస్తా. ‘ఇంద్రసేన’ మంచి హిట్ అవ్వాలి’’ అన్నారు. నటి–నిర్మాత రాధిక మాట్లాడుతూ– ‘‘మంచి సినిమా లను ఆదరించే ప్రేక్షకుల్లో మొదటి స్థానం తెలుగు వారిదే. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మంచి సినిమాలను ఆదరిస్తారు. నన్ను ఆదరిస్తున్న తెలుగువారికి రుణపడి ఉంటా. ఈ కథ విని, శరత్‌కుమార్‌గారు ఏడ్చారు. నేను అడగ్గానే సినిమా చేయడానికి ఓకే అన్నారు విజయ్ ఆంటోని. ‘ఇంద్రసేన’ తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘నేనీ రోజు ఇక్కడ నిలబడటానికి కారణం విజయ్ ఆంటోనిగారు. ఈ అవకాశాన్నిచ్చిన రాధిక, ఫాతిమా ఆంటోనిలకు థ్యాంక్స్’’ అన్నారు జి. శ్రీనివాసన్. ‘‘పదిహేనేళ్ల క్రితం రాధికగారు నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేశారు. ఇప్పుడు నటించే అవకాశం ఇచ్చినందుకు రాధిక, శరత్‌కుమార్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు విజయ్ ఆంటోని. నటి జీవిత, చిత్రనిర్మాత నీలం కృష్ణారెడ్డి, ‘బిచ్చగాడు’ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, రచయిత భాష్యశ్రీ, సినిమాటోగ్రాఫర్ దిల్‌రాజ్, నిర్మాత సురేశ్ కొండేటి పాల్గొన్నారు. -
ఇద్దరి నిర్ణయాలు.. ఆరుగురి జీవితాలు!
అనిల్ మల్లెల, మహిమా జంటగా నందు మల్లెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రెండు రెళ్ళు ఆరు’. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం, డే డ్రీమ్స్ బ్యానర్స్‌పై ప్రదీప్ చంద్ర, మోహన్ అండె నిర్మించారు. శనివారం ఈ సినిమా విడుదల కానుంది. నందు మల్లెల మాట్లాడుతూ– ‘‘మొబైల్లో కావల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించాలంటే కథ బాగుండాలి. అందుకే కథ బాగా రాసుకున్నా. ఇద్దరి నిర్ణయాలతో ఆరుగురు జీవితాలు ఎలా ముడిపడి ఉన్నాయన్నదే కథ. సాయిగారు చూసిన పది నిమిషాలకే ఇంప్రెస్ అయ్యి, సినిమా తీసుకుంటాం అన్నారు. ఆ రోజే టీ–షర్ట్లు మార్చి కాలర్ చొక్కాలు వేసుకున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘హీరో నా బ్రదరే. క్యారెక్టర్‌కు సూట్ అవుతాడని ప్రొడ్యూసర్‌గారే సెలక్ట్ చేశారు. ఊహల్లో విహరించను. విలువలు లేకుండా సినిమాలు తీయను. నాకివ్వాలనుకునే డబ్బుల్ని సినిమాపై ఖర్చు పెట్టమని చెప్పాను. ఫ్రీడమ్ ఇస్తే చాలనుకున్నాను. అది లభించింది. అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అన్నారు. -
రెండు రెళ్లు నాలుగు కాదు
రెండు రెళ్లు ఎంత? అంటే నాలుగని సమాధానం చెబుతారెవరైనా. కానీ, రెండు రెళ్లు ఆరు అంటున్నారు ‘రెండు రెళ్ళు ఆరు’ చిత్రబృందం. కథలో ఉన్న ట్విస్ట్ అదేనట. అనిల్ మల్లెల, మహిమా జంటగా నందు మల్లెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 8న విడుదల కానుంది. సాయి కొర్రపాటి సమర్పణలో ప్రదీప్‌చంద్ర, మోహన్ అందె నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. కుటుంబ సభ్యులందరూ చూసేలా నందు ఈ సినిమా తీశారు. చిన్న సినిమాగా ప్రారంభమైన మా చిత్రం సాయిగారి వల్ల పెద్ద సినిమాగా మారింది. విజయ్ బుల్గానిన్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. -
జూలై 8న 'రెండు రెళ్ళు ఆరు'
అనిల్ మల్లెల, మహిమా హీరోహీరోయిన్లుగా నందు మల్లెల దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం, డే డ్రీమ్స్ బ్యానర్స్ పతాకంపై ప్రదీప్‌చంద్ర, మోహన్ అండె సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'రెండు రెళ్ళు ఆరు'. విజరు బుల్గానిన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక ఇటీవల ప్రముఖ దర్శకులు రాజమౌళి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'చిన్న సినిమాగా ప్రారంభమైన మా 'రెండు రెళ్ళు ఆరు' వారాహి సాయిగారి వల్ల పెద్ద సినిమాగా మారింది. రాజమౌళిగారు ఆడియో విడుదల వేడుకకు విచ్చేసి ఆశీర్వదించడంతో మా సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యి క్లీన్ 'యు' సర్టిఫికెట్ సంపాదించుకొంది. కుటుంబ సభ్యులందరూ కలిసి చూడదగ్గ చిత్రంగా మా డైరెక్టర్ నందు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మా చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్న పూర్తి నమ్మకం మాకుంది' అన్నారు. -
పది లైన్స్‌లో ఈ కథ చెప్పారు... బాగుంది
– రాజమౌళి ‘‘కథ వినగానే బాగా జడ్జ్ చేసే టాలెంట్ సాయిగారికి ఉంది. ‘ఈగ’ చిత్రాన్ని చిన్న సినిమాగా తీద్దామని అంటే, ‘ఇది పెద్ద మాస్ సినిమా సార్.. పెద్దగా తీద్దాం’ అని నన్నెంతో ప్రోత్సహించారు. ప్రేక్షకుల నాడి పట్టుకోగల మంచి అభిరుచి ఉన్న నిర్మాత ఆయన’’ అని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అన్నారు. అనీల్ మల్లెల, మహిమా జంటగా నందు మల్లెల దర్శకత్వంలో సాయికొర్రపాటి సమర్పణలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రెండు రెళ్ళు అరు’. వారాహి చలన చిత్రం, డే డ్రీమ్స్ పతాకాలపై ప్రదీప్ చంద్ర, మోహన్ అండె నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను రాజమౌళి, థియేట్రికల్ ట్రైలర్‌ను సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి విడుదల చేశారు. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘సాయి పది లైన్స్‌లో ‘రెండు రెళ్ళు ఆరు’ కథ నాకు వినిపించారు. ఓపెనింగ్ సీన్ చాలా బావుందనిపించింది. ఇప్పుడున్న ఎంటర్టైన్మెంట్స్ను దాటి ప్రేక్షకులు సినిమాకు రావాలంటే కథలో ఏదో కొత్తదనం ఉండాల్సిందే. అలాంటి ఇంట్రెస్టింగ్, హార్ట్ టచింగ్, హ్యూమర్ ఉన్న సినిమా ఇది. ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి’’ అన్నారు. ‘‘మా టీమ్ కన్న కలలకు నిర్మాతలు ప్రదీప్, మోహన్‌గారు రూపమిస్తే, సాయికొర్రపాటిగారు ప్రాణం పోశారు’’ అన్నారు నందు మల్లెల. ప్రదీప్ చంద్ర, మోహన్ అండె, అనిల్ మల్లెల, మహిమా, విజయ్ బుల్గానిన్, నటులు సీనియర్ నరేశ్, అవసరాల శ్రీనివాస్, సంగీత దర్శకుడు డీజే వసంత్ తదితరులు పాల్గొన్నారు. -
మహిమ పాంచ్ పటాకా
ఒక్క చిత్రంతోనే మంచి ఆదరణ పొందిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి పట్టికలో నటి మహిమ పేరు నమోదవుతుంది. సాట్టై చిత్రంతో కోలీవుడ్‌లో అడుగు మోపిన ఈ మలయాళీ బ్యూటీ తొలి చిత్రంతోనే తమిళ చిత్ర పరిశ్రమను ఆకట్టుకుంది. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీబిజీగా ఉంది. ఈ సందర్భంగా నటిగా తన రంగప్రవేశం గురించి వివరిస్తూ మైనా చిత్రం తరువాత దర్శకుడు ప్రభుసాలమన్, జాన్‌మ్యాక్స్ నిర్మించే చిత్రంలో నలించే అవకాశం లభించిందని తెలిపింది. నవ దర్శకుడు అన్భళగన్ దర్శకత్వంలో, దర్శకుడు సముద్రకణి, తంబి రామయ్య లాంటి సీనియర్ల రేస్‌లో తానూ పరిగెత్తానని చెప్పింది. దానికి మంచి ఫలితమే దక్కిందని పేర్కొంది. తొలి చిత్రంతోనే కనిపించకుండా పోయినవాళ్లున్న ఈ పరిశ్రమలో తనకు మంచి గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నానంది. అదేవిధంగా తాను నటించిన మొసకుట్టి, అగత్తిణై చిత్రాలు వరుసగా విడుదలై మంచి పేరు తెచ్చిపెట్టాయంది. ఆ తరువాత వచ్చిన పలు అవకాశాలను అంగీకరించలేదన్న అపవాదు గురించి అడగ్గా ‘పలు అవకాశాల్ని వదులుకున్న మాట వాస్తవమే. అయితే అందుకు కారణం లేకపోలేదు. అప్పుడు చదువుకుంటున్నాను. ఇప్పుడు చదువు పూర్తి అయ్యింది’ అని వివరణ ఇచ్చింది. ఐదు భాషల్లో చిత్రాలు ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి చెప్పమంటే విజయ్ సేతుపతి సరసన మెల్లిసై, దినేష్‌తో పురళి, లన్ననుక్కుజై చిత్రాలు చేస్తున్నానని తెలిపింది. వీటితో పాటు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, భోజ్‌పురి తదితర ఐదు భాషలలో రూపొందుతున్న చిత్రాల్లోనూ నటిస్తున్నానని చెప్పింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి వినోద్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారని వెల్లడించారు. -
అన్ననుక్కు జై కొట్టిన మహిమ
వర్ధమాన నటి మహిమ అవకాశాలు పెంచుకుంటోంది. సాటై చిత్రంతో కోలీవుడ్‌లో అడుగిడిన ఈ కేరళ కుట్టి తొలి చిత్రంలోనే నటనాపరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ మధ్య నటించిన ఎన్నమో నడక్కుదు చిత్రం ఈమె ఖాతాలో మంచి విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం 150 సీసీ చిత్రంతో పాటు సముద్రకని దర్శకత్వంలో కిట్కా చిత్రంలో నటిస్తోంది. నటి అమలాపాల్ నటించాల్సిన ఈ చిత్రంలో ఆమె వివాహం చేసుకోవడంతో మహిమను ఈ అవకాశం వరిచింది. విశేషం ఏమిటంటే కిట్కా చిత్రంలో మహిమ తొలిసారిగా నాగరిక యువతి, కొండ ప్రాంత అమ్మాయి అంటూ రెండు వైవిధ్యభరిత పాత్రల్ని పోషించనుంది. తాజాగా యువ నటుడు అట్టకట్టై దినేష్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని దర్శకుడు వెట్రిమారన్, నటుడు ధనుష్ కలిసి నిర్మిస్తున్నారు. వెట్రిమారన్ శిష్యుడు రాజ్‌కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిత్రానికి అన్ననుక్కు జై అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇదే పేరుతో చాలా కాలం క్రితం నటుడు అర్జున్ నటించిన చిత్రం తెరపైకి వచ్చింది. దినేష్ ప్రతిమల అన్ననుక్కు జై చిత్రం షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది.