రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం రాజస్థాన్‌లో బీజేపీ తన అభ్యర్థుల ఐదో జాబితాను ప్రకటించింది. ఇందులో రాజసమంద్ సీటు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి మహిమా విశేష్వర్ సింగ్‌ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. గతంలో ఈ స్థానం నుంచి దియా కుమారి ఎంపీగా ఉన్నారు. 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఈ స్థానానికి సుదర్శన్ రావత్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది.
ఎవరీ మహిమా విశేష్వర్ సింగ్?
మేవార్ రాజు మహారాణా ప్రతాప్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవార్ సతీమణే ఈ మహిమా విశేష్వర్ సింగ్. మహిమా సింగ్ భర్త విశ్వరాజ్ సింగ్ మేవార్ నాథ్‌ద్వారా బీజేపీ ఎమ్మెల్యే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో మహిమ తన భర్త విజయానికి విశేష కృషి చేశారు. రాజ్‌సమంద్ పార్లమెంటరీ సీటులో 2019లో జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారిని పోటీకి దింపిన బీజేపీ ఇప్పుడు మేవార్ రాజకుటుంబానికి మహిమా సింగ్ బరిలోకి దించింది.
జగదీశ్వరి ప్రసాద్ సింగ్ ఇంట్లో 1972 జూలై 22న జన్మించిన మహిమా సింగ్ మేవార్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పాఠశాల విద్యను అభ్యసించారు. తరువాత మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో ఉన్న సింధియా కన్యా విద్యాలయంలో చదివారు. కాలేజీ విద్యను ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో పూర్తి చేశారు. ఆమె మనస్తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.
Comments
Please login to add a commentAdd a comment