మహిమ పాంచ్ పటాకా | mahima act in Five languages pictures | Sakshi
Sakshi News home page

మహిమ పాంచ్ పటాకా

Published Sun, Jun 28 2015 3:27 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

మహిమ పాంచ్ పటాకా

మహిమ పాంచ్ పటాకా

ఒక్క చిత్రంతోనే మంచి ఆదరణ పొందిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి పట్టికలో నటి మహిమ పేరు నమోదవుతుంది. సాట్టై చిత్రంతో కోలీవుడ్‌లో అడుగు మోపిన ఈ మలయాళీ బ్యూటీ తొలి చిత్రంతోనే తమిళ చిత్ర పరిశ్రమను ఆకట్టుకుంది. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీబిజీగా ఉంది. ఈ సందర్భంగా నటిగా తన రంగప్రవేశం గురించి వివరిస్తూ మైనా చిత్రం తరువాత దర్శకుడు ప్రభుసాలమన్, జాన్‌మ్యాక్స్ నిర్మించే చిత్రంలో నలించే అవకాశం లభించిందని తెలిపింది. నవ దర్శకుడు అన్భళగన్ దర్శకత్వంలో, దర్శకుడు సముద్రకణి, తంబి రామయ్య లాంటి సీనియర్ల రేస్‌లో తానూ పరిగెత్తానని చెప్పింది.
 
 దానికి మంచి ఫలితమే దక్కిందని పేర్కొంది. తొలి చిత్రంతోనే కనిపించకుండా పోయినవాళ్లున్న ఈ పరిశ్రమలో తనకు మంచి గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నానంది. అదేవిధంగా తాను నటించిన మొసకుట్టి, అగత్తిణై చిత్రాలు వరుసగా విడుదలై మంచి పేరు తెచ్చిపెట్టాయంది. ఆ తరువాత వచ్చిన పలు అవకాశాలను అంగీకరించలేదన్న అపవాదు గురించి అడగ్గా ‘పలు అవకాశాల్ని వదులుకున్న మాట వాస్తవమే. అయితే అందుకు కారణం లేకపోలేదు. అప్పుడు చదువుకుంటున్నాను. ఇప్పుడు చదువు పూర్తి అయ్యింది’ అని వివరణ ఇచ్చింది.
 
 ఐదు భాషల్లో చిత్రాలు
 ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి చెప్పమంటే విజయ్ సేతుపతి సరసన మెల్లిసై, దినేష్‌తో పురళి, లన్ననుక్కుజై చిత్రాలు చేస్తున్నానని తెలిపింది. వీటితో పాటు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, భోజ్‌పురి తదితర ఐదు భాషలలో రూపొందుతున్న చిత్రాల్లోనూ నటిస్తున్నానని చెప్పింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి వినోద్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారని వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement