సామాన్య ప్రజల రిక్వెస్ట్ కాదిది... సెన్సార్ బోర్డు సినిమా జనాల ముందుకు తెచ్చిన అబ్జక్షన్! సినిమాల్లో ‘జీఎస్టీ’ అనే పదం వినిపించడానికి సెన్సార్ బోర్డు ఒప్పుకోవడం లేదని సమాచారమ్. సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని హీరోగా నటించిన ‘ఇంద్రసేన’ సినిమాలో ‘జీఎస్టీలా నువ్వే వచ్చి ఎంత పని చేస్తివే...’ అనే పాట ఒకటుంది. ఇటీవలే వీడియోతో సహా ఆ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి పాటకు మంచి స్పందన వస్తోంది.
అయితే... సెన్సార్ ముందుకు సినిమాను తీసుకు వెళ్లేసరికి ‘జీఎస్టీ’ పదాన్ని తీసేయమని చెప్పారట! దాంతో ‘జీఎస్టీ’ని ఈఎమ్‌ఐ’గా మార్చి పాటను మళ్లీ రాసి, సింగర్స్‌తో రికార్డ్ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఇదంతా తమిళ హీరో విజయ్ ‘మెర్సల్’ ఎఫెక్ట్ ఏమో! తెలుగులో ‘అదిరింది’గా విడుదలైన ‘మెర్సల్’లో జీఎస్టీకి వ్యతిరేకంగా రెండు మూడు డైలాగులున్నాయి. సినిమా విడుదలైన తర్వాత తమిళనాట రాజకీయ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో నిర్మాతలు స్వచ్ఛందంగా జీఎస్టీ డైలాగులను మ్యూట్ చేశారు. తెలుగులో మూడు వారాలు ఆలస్యంగా విడుదలైన ‘అదిరింది’లోనూ జీఎస్టీ డైలాగులు లేవు. ఇకపై, ఏ సినిమాలోనూ ‘జీఎస్టీ’ అనే
పదం వినబడదేమో!!
Comments
Please login to add a commentAdd a comment