
ఇంద్రసేన
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ సినిమా హీరో భార్యతో గొడవపడిన ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం 'కుర్కురే' సినిమా హీరో ఇంద్రసేన విమానంలో ఇక్కడికి వచ్చారు. అతనిని రిసీవ్ చేసుకోవడానికి అతని భార్య విమానాశ్రయానికి వచ్చింది.
ఆ హీరో, అతని భార్య మధ్య ఇంతకు ముందే మనఃస్పర్ధలున్నట్లు ఉన్నాయి. విమానాశ్రయంలోనే వారు ఇద్దరు గొడవపడ్డారు. వారు గొడవ పడటం చూసినవారు పోలీసులకు ఫోన్ చేసి ఒక మహిళను కిడ్నాప్ చేస్తున్నట్లు చెప్పారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వచ్చిన తరువాత అసలు విషయం తెలిసింది. అది కిడ్నాప్ కాదని, వారు ఇద్దరూ భార్యాభర్తలేనని, గొడవ పడుతున్నారని అర్ధమైంది.