pollachi
-
పొల్లాచ్చికి పోదాం
పొల్లాచ్చికి పోదాం అంటున్నారట హీరో వెంకటేశ్. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సిని మాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఓ మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, అతని మాజీ ప్రేయసి... ఇలా మూడు పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ్రపారంభమైంది. అయితే హీరో వెంకటేశ్ పాల్గొనని సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. కాగా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల రెండో వారంలో పొల్లాచ్చిలో ్రపారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో వెంకటేశ్‌తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ కూడా పాల్గొంటారట. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. -
వైరల్ వీడియో: కీచకులకు ఖాకీల అండ..
-
కీచకులకు ఖాకీల అండ.. వీడియో వైరల్ కావడంతో అడ్డంగా బుక్కయ్యారు
సాక్షి, చెన్నై: పొల్లాచ్చి కేసులో నిందితులకు అండగా ఖాకీలు వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. వీడియో వైరల్ కావడంతో ఓ స్పెషల్ ఎస్ఐతో సహా ఏడుగురిని గురువారం సస్పెండ్ చేశారు. మాయ మాటలతో, స్నేహం ముసుగులో విద్యార్థినులను, యువతులను బలవంతంగా లొంగ దీసుకోవడమే కాదు, ఆ దృశ్యాల్ని కెమెరాల్లో బంధించి, తరచూ బెదిరిస్తూ వారి జీవితాలతో చెలాగాటం ఆడుతూ వచ్చిన మృగాళ్ల బండారం పొల్లాచ్చిలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. బాధితులు అనేక మంది గతంలో చేసిన ఫిర్యాదుతో మృగాళ్ల తిరునావుక్కరసు, శబరినాథన్, మణివణ్ణన్, వసంతకుమార్, సతీష్ తొలుత అరెస్టు అయ్యారు. కేసు సీబీఐ చేతికి వెళ్లినానంతరం అన్నాడీఎంకేకు చెందిన అరులానందన్, బాలు, బాబు పట్టుబడ్డారు. ఈ కీచకుల్లో ఐదుగురు సేలం జైల్లో, మరో ముగ్గురు గోబి చెట్టి పాళయం జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మార్గం మధ్యలో సపర్యలు బుధవారం వీరిని కేసు విచారణ నిమిత్తం కోయంబత్తూరు కోర్టుకు హాజరు పరిచారు. సేలం జైల్లో ఉన్న ఐదుగుర్ని ఎస్ఎస్ఐ సుబ్రమణ్యంతో పాటుగా ఏడుగురి పోలీసులు వ్యానులో కోర్టుకు తీసుకొచ్చారు. రిమాండ్ పొడిగించినానంతరం వీరిని మరలా జైలుకు తరలించారు. అయితే, మార్గం మధ్యలో ఈ కీచకులకు అండగా భద్రతకు వెళ్లిన పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో అర్ధరాత్రి వేళ వైరల్‌గా మారింది. గోల్డెన్‌ట్విన్స్ షూటింగ్‌స్పాట్ వద్ద పోలీసుల వాహనం ఆపేశారు. కీచకులు వారి కుటుంబీకులు, బంధువులు వారితో ముచ్చటించడమే కాకుండా, కోర్టు సమర్పించిన చార్జ్‌షీట్ నకలు వారి చేతికి చేరింది. అర్ధగంటకు పైగా కుటుంబంతో నిందితులు గడిపిన వీడియో వెలుగులోకి రావడంతో పోలీసు బాసులు స్పందించారు. ఎస్ఐ సుబ్రమణ్యంతో పాటుగా ఏడుగురు పోలీసుల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కీచకులు, వారి కుటుంబాలతో భద్రతకు వెళ్లిన వారికి ఉన్న సంబంధాలు, వారి నుంచి వీరికి ఏ మేరకు నగదు ముట్టిందో.. అన్న అనుమానాలు బయలు దేరాయి. దీంతో సీబీఐ సైతం సస్పెండైన ఏడుగురి మీద గురి పెట్టడం గమనార్హం. -
పొల్లాచిలో షురూ
‘నిన్ను కోరి’ వంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత మరోసారి కలిశారు హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ. వీరిద్దరి కాంబినేషన్లో ‘టక్ జగదీష్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పొల్లాచిలో నేడు ప్రారంభం కానుంది. సినిమాలోని కీలక సన్నివేశాలను, పాటలను ఈ షెడ్యూల్లో ప్లాన్ చేశారట చిత్రబృందం. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. -
భాగ్యరాజాపై కఠిన చర్యలు తీసుకోండి
అమరావతి: ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజాపై తమిళనాట పెద్ద దుమారం రేగుతోంది. తెలుగు ప్రేక్షకులకు కూడా చిరపరిచితుడైన భాగ్యరాజా మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కూడా భాగ్యరాజా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాగ్యరాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు మహిళా కమిషన్‌కు ఆమె లేఖ రాశారు. రేప్ ఘటనల్లో మహిళలను తప్పుబట్టేలా మాట్లాడటం ఎంతమాత్రం మానవత్వం కాదని, చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు వీరికి కనిపించడం లేదా? అని ఆమె నిలదీశారు. ప్రభుత్వాలు, మహిళా సంస్థలు, పోలీసులు, న్యాయవ్యవస్థ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే కొందరు సెలబ్రిటీలు మాత్రం మహిళలను కించపరచడం, దారుణాలకు మద్దతు పలుకడమేమిటని ఆమె నిలదీశారు. ఈమధ్య తమిళనాడులో ప్రకంపనలు సృష్టించిన పొలాచీ రేప్ కేసు గురించి భాగ్యరాజా ఓ సినీ ఈవెంట్లో ప్రస్తావిస్తూ.. ఆ ఘటన వెనుక మగవాళ్ల తప్పులేదని, వివాహేతర సంబంధాల కోసమే ఈ రోజుల్లో మహిళలు భర్తలను, పిల్లలను చంపుతున్నారని దారుణ వ్యాఖ్యలు చేశారు. సెల్ఫోన్ల వల్లే మహిళలు చెడిపోతున్నారని, రెండేసి సిమ్ కార్డులు వాడుతున్నారని, మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు కూడా సెల్ఫోన్లు కారణమని ఆయన చెప్పుకొచ్చారు. పోలాచీ కేసులో అమ్మాయి అవకాశం ఇచ్చినందువల్లే రేప్ జరిగిందని భాగ్యరాజా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
పొలాచ్చి లైంగిక వేధింపుల కేసులో మరొకరి అరెస్ట్
చెన్నై : దేశవ్యాప్తంగా కలకలం రేపిన పొలాచ్చి లైంగిక వేధింపుల కేసులో సీబీఐ సోమవారం మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ అయిన నిందితుడు మణిని మే 20 వరకూ జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో తమిళనాడు పోలీసులు ఇప్పటివరకూ నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న నలుగురు వ్యక్తులు పొలాచ్చికి సమీపంలోని కారులో మహిళను లైంగిక వేధింపులకు గురిచేసి ఆ దృశ్యాలను వీడియోలో రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఫిబ్రవరి 24న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల బాగోతం బయటపడింది. అనంతరం ఓ ఏఐఏడీఎంకే నేత బాధితురాలి సోదరుడిపై దాడి చేసిన క్రమంలో సదరు నేతను ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరించడంతో ఈ ఉదంతం రాజకీయ రంగు పులుముకుంది. నిందితులను కాపాడేందుకు ఏఐఏడీఎంకే ప్రయత్నిస్తోందని విపక్ష డీఎంకే ఆరోపించింది. కాగా తమిళనాడులో పొలాచ్చి గ్యాంగ్ అకృత్యాలు వెలుగులోకి రావడంతో తమిళనాడులో పెద్దసంఖ్యలో యువతులు, మహిళలను ఈ బృందం లైంగిక వేధింపులకు గురిచేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పొలాచ్చి లైంగిక వేధింపుల కేసు విచారణను ఏప్రిల్‌లో సీబీఐ చేపట్టిన సంగతి తెలిసిందే. -
బార్ నాగరాజ్ బెదిరింపు ఆడియో చర్చ
సాక్షి, చెన్నై: పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసును సీబీఐ తన గుప్పెట్లోకి తీసుకుంది. సీబీఐ ఐజీ విపుల్‌కుమార్, ఏఎస్పీ కలైమణి నేతృత్వంలోని బృందం విచారణకు సిద్ధమైంది. తమ వద్ద ఉన్న వివరాలు, ఆధారాలను ఆ బృందానికి ఎస్పీ నిషా పార్థిబన్ నేతృత్వంలోని సీబీసీఐడీ బృందం అప్పగించింది. ఈ కేసులో ఓ అనుమానితుడిగా ఉన్న బార్ నాగరాజ్ ఓ యువతికి బెదిరింపులు ఇస్తున్న ఆడియో ఆదివారం చర్చకు దారి తీసింది. పొల్లాచ్చిలో స్నేహం ముసుగులో యువతులు, మహిళలను లొంగదీసుకుని లైంగికవేధింపులకు పాల్పడడం, ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించి బెదిరింపులు ఇస్తూ వచ్చిన ముఠా గుట్టు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈకేసులో ఐదుగురు అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలో అధికార పక్షానికి చెందిన నాయకుల పిల్లల హస్తం కూడా ఉన్నట్టుగా వచ్చిన ప్రచారం, ఆరోపణలతో కేసును సీబీఐకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత సీబీఐ నుంచి స్పందన లేనప్పటికి, శనివారం రాత్రి ఎట్టకేలకుఆ విభాగం వర్గాలు స్పందించారు. కేసును తాము విచారించబోతున్నట్టుగా ప్రకటించారు. తమకు లభించిన ప్రాథమిక సమాచారం మేరకు ఐదు రకాల సెక్షన్లతో రెండు కేసుల్ని నమోదు చేశారు. ఇక, కేసును పూర్తిగా తమ పరిధిలోకి తీసుకుని విచారించేందుకు ప్రత్యేక అధికారిగా సీబీఐ ఐజీ విపుల్ కుమార్, ఏఎస్పీ కలైమణిలను రంగంలోకి దించారు. వీరితో పాటు మరో పదిమంది కేసు విచారణకు సిద్ధం అయ్యారు. అప్పగింత .. సీబీసీఐడీ ఎస్పీ నిషా పార్థిబన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ కేసును ఓ సవాల్‌గా తీసుకుని విచారిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ బృందంపై నమ్మకాలు సన్నగిల్లడంతో వ్యవహారం కోర్టు వరకు చేరింది. నిందితుల్ని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, బాధితులకు రక్షణ లేని దృష్ట్యా, మహిళా ఉన్నతా«ధికారులతో ప్రత్యేక సిట్‌కు పట్టుబట్టే వాళ్లు పెరిగారు. ఈ పరిస్థితుల్లో కేసు సీబీఐ గుప్పెట్లోకి చేరడంతో విచారణ ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్న ఎదురుచూపులు పెరిగాయి. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను, ఆధారాలు, రికార్డులు తమ గుప్పెట్లోకి తీసుకునేందుకుగాను సీబీఐ ప్రత్యేక బృందం ఆదివారం సాయంత్రం కోయంబత్తూరుకు చేరుకున్నట్టు సమాచారం. సీబీసీఐడీ ఎస్పీ నిషా పార్థిబన్ నేతృత్వంలోని బృందం సీబీఐ వర్గాలతో సంప్రదింపులు సాగించినట్టు, తమ వద్ద ఉన్న అన్ని వివరాలను ఆ బృందానికి అప్పగించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమ గుప్పెట్లోకి అన్ని వివరాలు రావడంతో, ఎక్కడి నుంచి విచారణ మొదలెట్టాలో అన్న దిశగా సీబీఐ కసరత్తుల్లో ఉన్నట్టు తెలిసింది. సీబీసీఐడీ విచారణపై వస్తున్న అనుమానాలకు బలం చేకూరే రీతిలో ఓ ఆడియో తాజాగా వైరల్ అయింది. ఈ కేసులో అరెస్టుయిన నిందితుల మిత్రుడిగా ఉన్న బార్ నాగరాజ్ ఓ యువతికి బెదిరింపులు ఇవ్వడం అందులో ఉంది. కేసు వెనక్కి తీసుకోవాలని, వీడియో, ఆడియోలు డెలిట్ చేయాలని లేని పక్షంలో కుటుంబం అంతా తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ యువతికి బార్నాగరాజ్ బెదిరింపులు ఇవ్వడం గమనార్హం. టీ.నగర్: పొల్లాచ్చి వీడియో డెలిట్ చెయ్ అంటూ బార్ నాగరాజ్ ఓ మహిళను బెదిరిస్తున్నట్లు గత రెండు రోజులుగా సోషల్‌మీడియాలో ఆడియో వైరల్ అవుతోంది. పొల్లాచ్చిలో విద్యార్థినులపై లైంగిక దాడుల కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పొల్లాచ్చికి చెందిన తిరునావుక్కరసు సహా ఐదుగురు అరెస్టయ్యారు. అంతేకాకుండా బాధిత విద్యార్థిని సోదరుడిపై దాడి చేసినట్లు అన్నాడీఎంకే నేత బార్ నాగరాజ్ సహ ఐదుగురు అరెస్టయ్యారు. ఈ లైంగిక దాడి గురించి సీబీసీఐడీ పోలీసులు విచారణ జరుపుతూ వచ్చారు. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ విచారణకు మారింది. ఇదిలాఉండగా ఫిర్యాదు చేసిన విద్యార్థిని సోదరుడిపై దాడి చేసిన కేసులో అరెస్టయిన బార్ నాగరాజ్ ఒక మహిళతో సెల్ఫోన్లో కేసు వాపసు తీసుకోమని బెదిరింపులు చేస్తున్న ఆడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది. అందులో నాగరాజ్ సదరు మహిళతో వీడియోను డెలిట్ చేయమని, కేసు వాపసు తీసుకోమని బెదిరిస్తున్నట్లుగా ఉంది. -
90 శాతం ఆ వీడియోల తొలగింపు
సాక్షి, చెన్నై : పొల్లాచ్చి లైంగిక దాడి వ్యవహారంలో 90 శాతం వీడియోలను తొలగించినట్లు యూట్యూబ్ సంస్థ సీబీసీడీ పోలీసులకు శనివారం వివరణ ఇచ్చింది. ఈ కేసుపై సీబీసీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇలావుండగా బాధిత యువతుల వీడియోలు ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో వీడియోల వ్యాప్తిని అడ్డుకోవాలని సీబీసీఐడీ పోలీసులు యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ సంస్థలకు లేఖలు పంపారు. రెండు రోజుల క్రితం యూట్యూబ్‌లో మరో ఆడియో విడుదలైంది. అందులో పొల్లాచ్చి ముఠా దాడికి గురైన బాధితురాలినంటూ ఒక యువతి గళం వినిపించింది. అందులో ముఠా ఒక బాలికపై రాత్రంతా లైంగికదాడి జరపగా మృతిచెందిందని, ఆ బాలిక మృతదేహం తిరునావుక్కరసు ఇంటి వెనుక భాగంలో పాతిపెట్టి ఉన్నట్లు తెలిపింది. ఇది ఈ కేసులో మళ్లీ సంచలనం కలిగించింది. ఈ వీడియోలో వాస్తవాల గురించి సీబీసీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు మళ్లీ యూట్యూబ్ సంస్థకు లేఖ రాశారు. ఈ ఆడియో పోస్టు చేసిన వ్యక్తి వివరాలు తెలపమని కోరారు. ఇలావుండగా పొల్లాచ్చి సంఘటనకు సంబంధించిన వీడియోలను తొలగించాలని కోరడంతో 90 శాతం వీడియోలు తొలగించినట్లు, మార్ఫింగ్ చేసిన కొన్ని వీడియోలు మాత్రం ఉన్నట్లు యూట్యూబ్ సంస్థ సీబీసీఐడీ పోలీసులకు శనివారం వివరణ ఇచ్చింది. మణివన్నన్‌ను విచారించిన సీబీసీఐడీ పొల్లాచ్చి లైంగిక దాడి కేసులో నిందితుడు మణివన్నన్‌ను పోలీసులు శనివారం విచారణ చేశారు. పొల్లాచ్చి లైంగిక దాడి కేసులో బాధిత కళాశాల విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫైనాన్సర్ తిరునావుక్కరసు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా విద్యార్థిని అన్నపై దాడి చేసిన బార్ నాగరాజ్, సెంథిల్, వసంతకుమార్, బాబు అరెస్టయ్యారు. ఈ కేసులో పరారీలో ఉన్న పొల్లాచ్చి అచ్చిపట్టి ప్రాంతానికి చెందిన మణివన్నన్ (28) గత 25వ తేదీన కోయంబత్తూరు కోర్టులో లొంగిపోయాడు. అతన్ని 11 రోజుల కస్టడీలో విచారణ జరిపేందుకు సీబీసీఐడీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మణివన్నన్ వద్ద నాలుగు రోజులపాటు విచారణ జరిపేందుకు న్యాయమూర్తి నాగరాజన్ ఉత్తర్వులిచ్చారు. దీంతో మణివన్నన్‌ను పోలీసులు శనివారం కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. -
వెలుగులోకి పొల్లాచ్చి మృగాళ్ల మరో దారుణం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: పొల్లాచ్చికి చెందిన నలుగురు మృగాళ్లు లైంగికదాడులే కాదు, ఓ చిన్నారిపై వరుసగా సామూహిక అత్యాచారానికి పాల్పడి ప్రాణాలు కూడా తీసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఒక ఆడియో వైరల్ అవుతోంది. పొల్లాచ్చిలో తిరునావుక్కరసర్ సహా నలుగురు యువకులు యువతులు, మహిళలతో ఫేస్బుక్ ద్వారా పరిచయాలు పెంచుకుని, ప్రేమ, మాటలతో లోబరుచుకుని లైంగికదాడులకు పాల్పడడం రాష్ట్రంలో కలకలం రేపింది. అంతేగాక తమ వలలో పడిన యువతుల నగ్నదృశ్యాలను, లైంగికదాడులను సెల్‌ఫోన్ వీడియో దృశ్యాలను చిత్రీకరించి పదే పదే లైంగిక హింసకు పాల్పడడం, భయభ్రాంతులకు గురిచేసి సొమ్ముదోచుకోవడం వంటి రాక్షసకృత్యాలకు పాల్పడ్డారు. (చదవండి: భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు) ఇలా వందమందికి పైగా యువతులు తమ ధన, మానాలను కోల్పోగా ఓ చిన్నారి ప్రాణాలను కూడా కోల్పోయిన సమాచారం బాధిత యువతి ఆడియో ద్వారా సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘తిరునావుక్కరసర్ నలుగురు యువకులతోపాటు ఈ ముఠాలో మరో 8 మంది ఉన్నారు. బాధిత యువతుల్లో ఆరుగురు నా వద్ద తలదాచుకుని ఉండేవారు. వారిలోని ఒక చిన్నారిపై ఆ యువకులు పదేపదే లైంగిక దాడులకు పాల్పడడంతో ప్రాణాలు కోల్పోయింది. ఆ చిన్నారి మృతదేహాన్ని వారి పైశాచికత్వానికి సాక్ష్యంగా నిలిచిన ఇంటికి సమీపంలో పూడ్చిపెట్టారు. ఈ ఘోరాన్ని ఎలా బైటపెట్టాలో తెలియక ఇన్నాళ్లు తపించాను. ఇప్పటికి ధైర్యం తెచ్చుకుని ఆడియో ద్వారా వెలుగులోకి తెచ్చాను’ అని ఆమె చెప్పారు. ఈ ఆడియోలోని వివరాలపై ఆరా తీస్తున్నామని సీబీసీఐడీ అధికారి ఒకరు చెప్పారు. మద్రాసు హైకోర్టులో మహిళా న్యాయవాదుల పిటిషన్ రాష్ట్రంలో పెను సంచలనానికి దారితీసిన పొల్లాచ్చి అత్యాచారాల పరంపర కేసును మహిళా పోలీసు ఉన్నతాధికారిచే విచారణ జరిపించేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ మహిళా న్యాయవాదులు మద్రాసు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాదులు అజిత, ఆదిలక్ష్మి లోకమూర్తి, సుధ దాఖలు చేసిన పిటిషన్లో వివరాలు ఇలా ఉన్నాయి. పొల్లాచ్చి లైంగికవేధింపులకు గురైన యువతి పేరును బైటపెట్టడం ద్వారా బాధితులకు రక్షణ కల్పించే విషయంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైంది. అంతేగాక బాధిత యువతి కేసు విషయంలో విశ్వాసాన్ని కోల్పోయింది. అంతేగాక బాధిత యువతులు, వారి కుటుంబీకులకు తగిన రక్షణ కల్పించడంలో కూడా తగిన హామీని ఇవ్వలేకపోయింది. ఈ కారణాల వల్ల సీబీఐలోని ఉన్నత మహిళాఅధికారిచే కేసు విచారణ చేపట్టేలా ఆదేశించాలి. బాధిత యువతులకు మానసిక స్థైర్యంకల్పించేలా మానసిక నిపుణులచే కౌన్సెలింగ్, వైద్య సదుపాయం, న్యాయపరమైన తోడ్పాటు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి. బాధిత యువతులకు సాక్షులకు భద్రత చట్టం కింద రక్షణ కల్పించాలి. విద్యాసంస్థల్లో అవగాహనా శిబిరాలు నిర్వహించాలని వారు కోరారు. ఈ పిటిషన్‌పై ఈనెల 29న విచారణను చేపట్టనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి తహీల్ రమణి, న్యాయమూర్తి దురైస్వామిలతో కూడిన బెంచ్ ప్రకటించింది. చదవండి...(పొల్లాచ్చి కేసు : మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు) డీఎంకే నేత కుమారుడికి సీబీసీఐడీ సమన్లు ఇదిలా ఉండగా, పొల్లాచ్చి ఘటనపై డీఎంకే నేత కుమారుడికి సీబీఐ సమన్లు జారీచేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు తిరునావుక్కరసర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని అనుసరించి ఈనెల 28వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా డీఎంకే పొల్లాచ్చి నగర ఇన్చార్జ్ తెన్రల్ సెల్వరాజ్ కుమారుడు మణిమారన్‌కు సీబీసీఐడీ పోలీసులు మంగళవారం సమన్లు జారీచేశారు. బాధిత యువతి అన్నపై దాడిచేసిన కేసులో అరెస్టయి బెయిల్‌పై బైటకువచ్చిన బార్ నాగరాజ్ సైతం ఆదేరోజున విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు పంపారు. -
మనిషనే వాడు అలాంటి అఘాయిత్యాలకు పాల్పడతారా?
సాక్షి, పెరంబూరు: తమిళనాట రెండు ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటూ బురద జల్లుకుంటున్నారే కానీ, ప్రజల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని సీనియర్ నటి గౌతమి విమర్శించారు. నటుడు కమల్‌హాసన్‌తో సహజీవనం చేసిన గౌతమి కొంతకాలం తరువాత భేదాభిప్రాయాల కారణంగా విడిపోయిన విషయం తెలిసిందే. ఆమె ఇటీవల వివిధ సేవలతో ప్రజాక్షేత్రంలో ఎక్కువగా ఉంటున్నారు. ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి వార్తల్లోకి ఎక్కారు. దీంతో గౌతమి రాజకీయ రంగప్రవేశం చేయనున్నారనే ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి గౌతమి పేర్కొంటూ ఇటీవల పొల్లాచ్చిలో జరిగిన సంఘటన మనసును కలచి వేసిందన్నారు. అసలు మనిషనే వాడు అలాంటి అఘాయిత్యాలకు ఎలా పాల్పడతాడో అని వ్యాఖ్యలు చేశారు. ఆ సంఘటన బాధితులతో పాటు వారి తల్లిదండ్రులను జీవితాంతం బాధిస్తుందన్నారు. ఆ యువతులు త్వరగా కోలుకుని ధైర్యంగా బాహ్య ప్రపంచంలోకి రావాలన్నారు. ఇలాంటి అరాచకానికి పాల్పడ్డ వారికి కఠిన శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. (తమిళనాడులో ఓ భారీ సెక్స్ రాకెట్ ముఠాను పోలీసులు ఛేదించారు. సుమారు 10 సభ్యుల గల ఈ ముఠా అయిదు వందలమందికి పైగా అమ్మాయిలను, మహిళలను వేధింపులకు గురి చేస్తోంది. వారిపై అత్యాచారాలు చేసి, వీడియోలు చిత్రీకరించి వారిపై బెదిరింపులకు, వేధింపులకు పాల్పడుతోంది. గత ఏడేళ్లుగా వీళ్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. అయితే ఓ విద్యార్థిని ధైర్యంగా ముందుకొచ్చి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టు రట్టయింది.) మీరు ఆ మధ్య ప్రధానిని కలవడంతో రాజకీయ రంగప్రవేశం చేస్తారనే ప్రచారం జరిగిందని, మీకు అలాంటి ఆసక్తి ఉందా? అన్న ప్రశ్నకు తనకు రాజకీయాల కంటే చేయాల్సిన ఇతర కార్యక్రమాలు చాలా ఉన్నాయని అన్నారు. అందుకే పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రాలేకపోతున్నట్లు గౌతమి బదులిచ్చారు. ప్రధానిని కలిసింది తన ఫౌండేషన్ కార్యక్రమాల గురించి వివరించడానికి, సలహాలు, సూచనలు తెలుసుకోవడానికేనని చెప్పారు. మోదీమంచి పథకాలను అమలు చేస్తున్నారని, అయితే వాటిని సరిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారని గౌతమి అన్నారు. తమిళ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఇక్కడ డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ, ఆరోపణల బురద జల్లుకుంటున్నారేగానీ ప్రజల గురించి పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎన్నో రాజకీయ సవాళ్లను ఎదుర్కొని జయించిన వనితగా ఆమె తనకు చాలా నచ్చిన వ్యక్తి అని పేర్కొన్నారు. అయితే జయలలిత మృతిపై తనకే కాకుండా కోట్లాది మంది ప్రజలకు పలు అనుమానాలు ఉన్నాయన్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని నటి గౌతమి అన్నారు. చదవండి.... భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు పొల్లాచ్చి కేసు : మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు మృగాళ్లను కాల్చిచంపాలి పొల్లాచ్చి ఘటనపై మండిపడుతున్న విద్యార్థిలోకం -
మత్తు మందు ఇచ్చి.. వీడియోలు చిత్రీకరించి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి మంటలు ఇంకా ఆరకముందే అదే తరహాలో మరో దారుణం బైటపడింది. నాగపట్టినం జిల్లాకు చెందిన మరో దుర్మార్గుడు యువతుల జీవితాలతో చెలగాటమాడిన వైనం బాధిత ప్రియురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా, పొల్లాచ్చి దోషులను బహిరంగంగా ఉరితీయాలంటూ విద్యార్థినుల ఆందోళనలు శనివారం కూడా కొనసాగాయి. ఇక తాజా సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నాగపట్టినం జిల్లా వెల్లిపాళయంపేట్టై వీధికి చెందిన సుందర్ అనే కారు డ్రైవరు, అదే ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ప్రియురాలిని కారైక్కాల్‌లోని ఒక లాడ్జీకి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకోగానే లైంగికదాడికి పాల్పడుతూ తన సెల్‌ఫోన్ ద్వారా వీడియో చిత్రీకరించాడు. స్పృహలోకి వచ్చిన తరువాత తనపై లైంగికదాడి జరిగినట్లు తెలుసుకున్న యువతి అతనితో గొడవపెట్టుకుంది. తన సెల్‌ఫోన్‌లోని దృశ్యాలను ఆమెకు చూపించి బైటకు చెప్పావో వీటిని బహిర్గతం చేసి చంపేస్తానని బెదిరించాడు. అంతటితో వదిలిపెట్టక పదేపదే లైంగికవేధింపులకు పూనుకున్నాడు. దీంతో విసిగిపోయిన యువతి కీల్వేలూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుందర్‌ను అరెస్ట్ చేసి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా అనేక మంది యువతులను లోబరుచుకున్నట్లు అతడు అంగీకరించాడు. యువతులకు ఆయుధమే శరణ్యం: పొల్లాచ్చి ఘటన బాధిత యువతులనే కాదు రాష్ట్రంలోని ప్రజలను, ముఖ్యంగా ఇతర యువతులను తీవ్రంగా కలచివేసింది. యువకులంటేనే భయపడేస్థితికి చేరుకున్నారు. ఏ మగాడి ముసుగులో ఎలాంటి మృగాడు ఉన్నాడోనని భీతిల్లితున్నారు. రాష్ట్రంలో యువతులు ఎంతగా భయభ్రాంతులకు గురవుతున్నారో తెలిపేందుకు ఇద్దరు యువతులు ఉదాహరణగా నిలిచారు. ధనమాన ప్రాణాల రక్షణకు తుపాకీలు చేతబూనడానికి సిద్ధమయ్యారు. కోయంబత్తూరుకు చెందిన 20, 14 ఏళ్ల వయసుగల యువతులు తండ్రితో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఒక వినతిపత్రం సమర్పించారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. పొల్లాచ్చిలో చోటుచేసుకున్న దారుణాల గురించి వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాం. రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకమైపోయింది. కాబట్టి మా ధనమాన ప్రాణాలను మేమే రక్షించుకునేలా తుపాకీలు ఇచ్చి సహకరించండని కలెక్టరుకు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఆ సోదరీమణులు మీడియాతో మాట్లాడుతూ పొల్లాచ్చి ఘటనలో బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా అని తెలియదు. ఈ వ్యవహారంలో మొదట 1500 వీడియోలు, వందకు పైగా యువతులు బాధింపులకు గురైనట్లు ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం నాలుగు వీడియోలు, కొద్దిమంది యువతులు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. ఈ దశలో తమకు పరిచయం ఉన్న మగాళ్లలో మరో తిరునావుక్కరసు లేదా సబరిరాజన్ ఉంటాడేమోననే భయం కలుగుతోంది. కాబట్టి మా రక్షణ కోసం తుపాకులు సిద్దం చేసుకోకతప్పదు అని చెప్పారు. యువతుల తండ్రి మాట్లాడుతూ, ఫిర్యాదు చేసిన యువతి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయడం వల్ల విచారణపై నమ్మకాన్ని కోల్పోయామని వ్యాఖ్యానించారు. బాధిత యువతులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదుచేసే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాల్సి ఉందని ఆయన అన్నారు. పొల్లాచ్చి నిందితులు 20 మంది : ఇదిలా ఉండగా, పొల్లాచ్చి దుర్మార్గాల్లో ప్రధాన నిందితుడు తిరునావుక్కరసును పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండగా గగుర్పొడిచే మరిన్ని వివరాలను తన వాంగ్మూలంలో అతడు బైటపెట్టినట్లు తెలుస్తోంది. కోవై జైల్లో ఉన్న తిరునావుక్కరసును సీబీసీఐడీ పోలీసులు విచారణ నిమిత్తం శనివారం పొల్లాచ్చికి తీసుకెళ్లారు. రహస్య ప్రదేశంలో ఉంచి వాంగ్మూలం తీసుకుంటున్నారు. తనకున్న ధనబలం, స్నేహితుల తోడ్పాటులో ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు చెప్పాడు. పోలీసులతో కూడా పరిచయాలు ఉన్నకారణంగా తమ నేరాలను ధైర్యంగా కొనసాగించామని తెలిపాడు. నకిలీ పేర్లతో ఫేస్బుక్ అకౌంట్లు తెరవడం, యువతులను వల్లో వేసుకోవడం, లైంగికదాడులకు పాల్పడటం చేశామని అన్నాడు. చెన్నైలోని ఒక మహిళా డాక్టర్‌ను తమ గుప్పిట్లో పెట్టుకుని రూ.1.50 కోట్లు కాజేసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. సుమారు 8 నెలల క్రితం ఒక యువతిని బెదిరించి జల్సా చేయగా అతని సోదరుడు తమపై దాడిచేసి సెల్‌ఫోన్‌లోని సుమారు 100 వీడియోలను తొలగించాడని, పోలీసులకు ఫిర్యాదు కూడా చేయగా రాజీచేసి పంపారని చెప్పాడు. తమ అకృత్యాల వెనుక మరో 20 మంది యువకులు కూడా ఉన్నట్లు పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలుస్తోంది. పోలీస్‌శాఖకు న్యాయస్థానం హెచ్చరిక : బాధిత యువతి వివరాలను కోయంబత్తూరు ఎస్పీ పాండియరాజన్ బైటపెట్టిన వ్యవహారంపై మధురై న్యాయస్థానం మండిపడింది. శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా, తిరునెల్వేలీ, తూత్తుకూడి, కన్యాకుమారీ, విరుదునగర్ జిల్లాల్లో చోటుచేసుకున్న మానవహక్కుల ఉల్లంఘనలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ శనివారం తిరునెల్వేలీలో విచారణ చేపట్టింది. పొల్లాచ్చి సంఘటనలో పోలీసుశాఖ సరైన రీతిలో వ్యవహరించకుంటే మానవహక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని కమిషన్ న్యాయమూర్తి జయచంద్రన్ హెచ్చరించారు. పొల్లాచ్చి, చెన్నై జిల్లా కలెక్టర్ కార్యాలయం తదితర ప్రాంతాల్లో శనివారం కూడా ఆందోళనలు కొనసాగాయి. యువతుల దృశ్యాలు బహిర్గతమైనట్లే నిందితులను బహిరంగంగా ఉరితీయాలి, తాము చూడాలని యువతులు నినాదాలు చేశారు. కోవైలో 180 మంది విద్యార్దులపై పోలీసులు కేసుపెట్టారు. -
పొల్లాచ్చి కేసు : మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు
తమిళనాట కలకలం రేపిన పొల్లాచ్చి లైంగిక దాడి, బెదిరింపుల కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. లైంగిక వేధింపుల బాధితురాలి పేరు, తదితర వివరాలను బహిర్గతం చేసిన ప్రభుత్వ అధికారులకు భారీ షాక్ ఇచ్చింది. ఈ విషయంలో పోలీసులు బాధ్యతా రహితంగా వ్యవహరించారని , ఇది అత్యంత తీవ్రంగా ఖండించదగిన అంశమని వ్యాఖ్యానించింది. అందుకే క్రమశిక్షణా చర్యగా జరిమానా విధించడం సముచితమని భావించింది. తిరుచ్చికి చెందిన ఇలాముగిల్ దాఖలు చేసిన పిల్‌ను విచారించిన కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. బాధితురాలి గోప్యత, గుర్తింపు, గౌరవానికి విఘాతం కలిగించినందుకుగాను రూ.25 లక్షల మధ్యంతర నష్టపరిహారం చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని న్యాయమూర్తులు కిరుబకరాన్, ఎస్ఎస్ సుందర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కోయంబత్తూరు పోలీసు సూపరింటెండెంట్ ఆర్ పండియారాజన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే లైంగిక నేరాల కేసుల విచారణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించేలా దర్యాప్తు బృందానికి ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతోపాటు ఈ కేసుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, ఆడియోలు సోషల్ మీడియాలో రాకుండా చూడాలని కోరింది. -
‘జేబులో ‘అమ్మ’ ఫోటో సరే మరి రక్షణ మాటేంటి‘
చెన్నై : అమ్మ(జయలలిత) ఫోటోలను పాకెట్లో పెట్టుకు తిరిగే మీరు మహిళల రక్షణకు తీసుకునే చర్యలేంటని తమిళనాడు మంత్రులను ప్రశ్నిస్తున్నారు కమల్ హాసన్. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పొల్లాచ్చి సెక్స్ రాకెట్ కేసు విషయంలో అధికార పార్టీ మంత్రులు మౌనంగా ఉంటడం పట్ల కమల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కేసులో ఫిర్యాదు చేసిన మహిళ పేరును కోయంబత్తూరు ఎస్పీ వెల్లడించారు. కానీ ప్రభుత్వం సదరు ఎస్పీ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాధితులకు సంబంధించిన వీడియోలు ఎలా లీక్ అయ్యాయి. వీటన్నింటికి సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా ఉందం’టూ కమల్ ప్రశ్నించారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం బాధితుల పేర్లను వెల్లడించి వారిని అవమానిస్తుందంటూ కమల్ హాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసులో అరెస్టయిన వారిలో అధికార పార్టీకి చెందిన నాగరాజు అనే వ్యక్తి బెయిల్ మీద విడుదలవ్వడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ కేసులో డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి జయరామన్ కుటుంబీకులకు సంబంధాలు ఉన్నాయంటూ గత మూడు రోజులుగా వార్తాచానళ్లలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలను జయరామన్ ఖండించారు. ఇదిలా ఉండగా ఈ భారీ సెక్స్ రాకెట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆమోదం తెలిపారు. ప్రసుత్తం ఈ కేసును సీబీసీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక పొల్లాచ్చి అత్యాచారాలకు నిరసనగా విద్యార్థి లోకం గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఆందోళనలు గురువారం తీవ్రరూపం దాల్చాయి. చెన్నై, పొల్లాచ్చి, కోయంబత్తూరు, కరూరు, తంజావూరు, వేలూరు తదితర నగరాల్లో విద్యార్థులు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు జరిపారు. విద్యార్థి సంఘాలన్నీ ధర్నాలు, రాస్తారోకో జరపటంతో ఆ నగరాలన్నీ దద్దరిల్లిపోయాయి. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి పరిసర ప్రాంతాల్లో మాయమాటలతో మోసపుచ్చి 200లకు పైగా పాఠశాల, కళాశాల విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడిన నలుగురు సభ్యులున్న ముఠాను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
కాల్చి చంపాలి.. నడి రోడ్డులో ఉరి తీయ్యాలి
సాక్షి, చెన్నై: పొల్లాచ్చిలో యువతుల జీవితాలతో చెలగాటమాడిన మృగాళ్లను కఠినంగా శిక్షించాలన్న నినాదం మిన్నంటుతోంది. వీరితో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్లందర్నీ అరెస్టు చేసి నడి రోడ్డులో ఉరి తీయడమే కాక, ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం తరగతుల్ని బహిష్కరించిన విద్యార్థులు రాస్తారోకోలు, ధర్నాలతో ముందుకు సాగారు. ఇక, ఈ కేసు విచారణను సీబీసీఐడీ తమ గుప్పెట్లోకి తీసుకుంది. ఐజీ శ్రీధర్ నేతృత్వంలోని బృందం విచారణను వేగవంతం చేసింది. కాగా ప్రజల్లో ఈ వ్యవహారంపై ఆగ్రహం పెల్లుబిక్కుతుండడంతో కేసును సీబీఐకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. (అన్నా నన్ను వదిలేయి, నిన్ను నమ్మికదా వచ్చాను) మాయమాటలతో స్నేహం ముసుగులో విద్యార్థినులను, యువతులను బలవంతంగా లొంగదీసుకోవడమే కాదు, ఆ దృశ్యాల్ని కెమెరాల్లో బంధించి, తరచూ బెదిరిస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతూ వచ్చిన మృగాళ్ల బండారం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో తిరునావుక్కరసర్, శబరి, సతీష్, వసంతకుమార్‌లను అరెస్టు చేశారు. వీరితో పాటు తెర వెనుక మరెందరో ఉన్నారని, రాజకీయనాయకుల వారసులు సైతం ఉన్నట్టుగా ఆరోపణలు, ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ రాక్షసుల్ని కాల్చి చంపాల్సిందేనన్న నినాదం తెరపైకి రావడంతో కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది. దీంతో ఐజీ శ్రీధర్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. విచారణ వేగవంతం ఐజీ శ్రీధర్ నేతృత్వంలోని బృందం పొల్లాచ్చి పోలీసుల చేతిలో ఉన్న కేసును బుధవారం తమ గుప్పెట్లోకి తీసుకుంది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లను కోర్టులో సమర్పించి ఉండడంతో అందులోని వివరాలను తెలుసుకునేందుకు ఐజీ బృదం చర్యలు చేపట్టింది. అలాగే కొన్నేళ్లుగా ఈ మృగాళ్లు సాగిస్తూ వచ్చిన వ్యవహారంలో ఎందరో యువతులు తీవ్ర కష్టాల్ని అనుభవించి ఉండడం వెలుగులోకి రావడంతో ఆ అంశంపై సీబీసీఐడీ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. లైంగిక దాడికి గురైన యువతులు మరెందరో ఆత్మహత్యలు సైతం చేసుకున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. దీంతో నాలుగైదేళ్లుగా ఆత్మహత్యలు చేసుకున్న యువతుల జాబితాను సేకరించి, అందుకు గల కారణాల అన్వేషణపై పడ్డారు. అలాగే, ఆనమలైలోని తిరునావుక్కరసర్ నివాసం, చిన్నమ్మపాళయంలోని ఫామ్‌హౌస్‌లలో తనిఖీలు సాగాయి. గూండా చట్టంలో అరెస్టుయిన ఈ నిందితుల్ని తమ కస్టడీకి తీసుకుని విచారించేందుకు తగ్గ కసరత్తుల్లో సీబీసీఐడీ ఉంది. అలాగే, తిరునావుక్కరసర్‌కు సేలంలో ఆశ్రయం కల్పించి ఉన్న యువతి కోసం వేట మొదలెట్టారు. ఓ డాక్టరు ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు స్పందించలేదన్న సమాచారంతో, ఆ డాక్టరు వివరణ తీసుకునేందుకు నిర్ణయించారు. నిందితుల అరెస్టు, గూండా చట్టం నమోదు అన్నీ కపటనాటకాలేనని, తక్షణం విచారణ సాగాలని, నడిరోడ్డులో ఉరి తీయాలన్న నినాదంతో రాష్ట్రంలో విద్యార్థినుల ఆక్రోశం కట్టలు తెంచుకుంది. నిరసనల హోరు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం అనేక ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని విద్యార్థులు తరగతుల్ని బహిష్కరించారు. ఎక్కడిక్కడ ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. చెన్నై మధురవాయిల్, పూందమల్లి హైరోడ్డు పరిసరాల్లో విద్యార్థులు కదం తొక్కడంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు కష్టంగా మారింది. ఇక పొల్లాచ్చిలో సాగిన భారీ నిరసన పోలీసులకు ముచ్చెమటలు పట్టించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు రోడ్డుపై భీష్మించుకుని కూర్చోవడంతో బలవంతంగా వారిని అరెస్టు చేసే క్రమంలో ఉద్రిక్తత తప్పలేదు. ఇక, పొల్లాచ్చిలో నిందితులకు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన, తిరునావుక్కరసర్ మిత్రుడు నాగరాజన్‌పై స్థానికులు కన్నెర్ర చేశారు. కోట్టూరు రోడ్డులోని నాగరాజన్‌కు చెందిన బార్‌ను ధ్వంసం చేశారు. నిరసనలు ఓ వైపు ఉద్రిక్తం కావడంతో ఎన్నికల వేళ విద్యార్థుల రూపంలో ఏదేని కొత్తసమస్యలు తప్పదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణించినట్టున్నది. కేసును ఆగమేఘాలపై సీబీఐకు సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు వివరాలను తెలియజేస్తూ సమగ్ర విచారణ చేపట్టాలంటూ సీబీఐకు సిఫారసు చేసినా, అక్కడి నుంచి ఏ మేరకు స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వ హడావుడిపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తీవ్రంగానే స్పం దించారు. బాధిత యువతులకు న్యాయం జరిగే రీతిలో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. వీసీకే నేత తిరుమావళవన్ ప్రత్యేక సిట్ విచారణ సాగాలని డిమాండ్ చేశారు. వైరల్‌గా వీడియోలు ఈ లైంగిక వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రోజుకో వీడియో, ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. యువతులను వేధిస్తున్న వ్యవహారాలు వైరల్‌గా మారడంతో తాము బాధితులం అంటూ ఆడియోలను పంపించే యువతుల సంఖ్య పెరుగుతుంది. అలాగే, ఓ యువతి అయితే, ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి తొలి కేసు పెట్టింది తానేనని, ఈ వ్యవహారంలో ప్రస్తుతం రాజకీయ శక్తులు ప్రవేశించి ఉన్నాయని విమర్శించారు. ఈ వ్యవహారంలో రాజకీయ పెద్దలకు చెందిన వాళ్లెవ్వరూ లేరని, హఠాత్తుగా ఈ వ్యవహారంలోకి రాజకీయ ముసుగు ప్రవేశించి ఉండడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం. అలాగే, తిరునావుక్కరసర్, శబరిలను కొందరు వ్యక్తులు పోలీసులకు అప్పగించే ముందు చితక్కొట్టి వాంగ్మూలం తీసుకుని ఉన్న వీడియో విచారణకు మరింత బలాన్ని చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. తల్లిపై శివాలు.. తన కుమారుడు ఏ తప్పు చేయలేదని, అతడికి బెయిల్ ఇప్పించేందుకు ముందుకు రావాలని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తిరునావుక్కరసర్ తల్లి లత న్యాయవాదుల్ని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులు ఎవ్వరూ నిందితుల తరఫున కోర్టుల్లో హాజరు కాకూడదని నిర్ణయించి ఉన్నారు. అలాగే, నిందితుల్ని కఠినంగా శిక్షించాలన్న నినాదంతో ఆందోళనలు సైతం పొల్లాచ్చి, కోయంబత్తూరు కోర్టుల పరిసరాల్లో సాగాయి. ఈ పరిస్థితుల్లో నిందితుడు తిరునావుక్కరసర్ తల్లి లత పొల్లాచ్చి కోర్టు వద్దకు వచ్చారు. ఈ సమయంలో అక్కడున్న న్యాయవాదులు ఆమెపై శివాలెత్తారు. తిరునావుక్కరసర్ చేసిన పనికి పొల్లాచ్చి ప్రజానీకం దేశం ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని.. అలాంటి కొడుకును వెనకేసుకు రావడానికి సిగ్గులేదా అని మండిపడ్డారు. దీంతో అక్కడి నుంచి లత జారుకోక తప్పలేదు. లైంగిక దాడి వ్యవహారంలో మరొకర్ని పోలీసులు అరెస్టు చేశారు. పొల్లాచ్చికి చెందిన బాలన్‌కు సైతం ఈ వేధింపుల్లో ప్రమేయం ఉన్నట్టు తేలడంతో బాలన్ అనే యువకుడ్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. (అన్నా నన్ను వదిలేయి, నిన్ను నమ్మికదా వచ్చాను) -
భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
సాక్షి, చెన్నై: తమిళనాడులో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ భారీ సెక్స్ రాకెట్ ముఠాను పోలీసులు ఛేదించారు. సుమారు 10 సభ్యుల గల ఈ ముఠా 5 వందలమందికి పైగా అమ్మాయిలను, మహిళలను వేధింపులకు గురిచేస్తోంది. వారిపై అత్యాచారాలు చేసి, వీడియోలు చిత్రీకరించి వారిపై బెదిరింపులకు, వేధింపులకు పాల్పడుతోంది. గత ఏడేళ్లుగా వీళ్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. అయితే ఓ విద్యార్థిని ధైర్యంగా ముందుకొచ్చి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టు రట్టయింది. విచారణలో నిందితులు చెప్పిన వివరాలు విని పోలీసులే నివ్వెర పోయారు. ఈ రాకెట్‌ను నడిపించిన ముఠాలోని ఒకరు అధికార పార్టీకి చెందిన ఓ యువనేత కావడం రాజకీయాల్లో కలకలం రేపింది. ఫేస్బుక్లో అమ్మాయిలతో పరిచయం ఏర్పరచుకోవడం, ఆపై ప్రేమిస్తున్నానంటూ వారిని నమ్మించి అత్యాచారాలకు తెగబడటం, ఈ దృశ్యాలను వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడటం వీరి మోడస్ ఒపరాండీ. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం పొల్లాచిలో జ్యోతి నగరలో ఉండే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌తో శబరీ రాజన్ (25) అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా స్నేహం చేశాడు. మొబైల్నంబరు తీసుకుని..బాగానమ్మబలికి..తనతో బయటికి రావాలని కోరాడు. అలా ఆ అమ్మాయిని తన స్నేహితులు సతీష్, వసంతకుమార్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. దీన్ని వీడియో కూడా తీశారు. అనంతరం కారులో ఆమెను తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేసి పారిపోయారు. అక్కడితో ఆగకుండా, డబ్బులు ఇవ్వాలని లేదంటే.. వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ ఫోన్ ద్వారా వేధింపులకు దిగారు. ఈ టార్చర్‌తో ప్రియా తొలుత తన సోదరుడికి విషయాన్ని చెప్పింది. అతను నిందితులతో ఘర్షణకు దిగాడు. దీంతో నిందితులు అతనిపై తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక విసిగిపోయి బాధితురాలు తల్లిదండ్రుల సాయంతో ఫిబ్రవరి 24న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకోకుంటే చంపేస్తామంటూ మరింత బెదిరింపులకు పాల్పడింది నాగరాజు బృందం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన కూపీ లాగగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. పదిమందికి పైగా ఉన్న ముఠా ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల వేస్తారు. చిన్నాపాలయం దగ్గర ఉన్న ఫామ్‌హౌస్‌కు తరలించి అక్కడ వారిని లైంగికంగా వేధించడం, వీడియోలు తీయడం, బెదిరించడం చేసేవారు. ఈ ఫాం హౌస్ "బార్" నాగరాజన్ గా పిలిచే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. ఇతను ఎఐడీఎంకే యువనేతగా ఉన్నాడు. బాధితులు బయటికొచ్చి ఫిర్యాదు చేయకపోవడంతో ఏడేళ్లుగా ఈ రాకెట్ యథేచ్ఛగా సాగించినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో పొల్లాచ్చికి చెందిన శబరి రాజన్, సతీష్, వసంతకుమార్ అనే కీచకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అమ్మాయిల అశ్లీల చిత్రాలు, వీడియోలు గుర్తించారు. అంతేకాదు నిందితుల వద్ద ఉన్న సెల్ఫోన్లలో వెయ్యికిపైగా అసభ్యకర వీడియోలు గుర్తించారు పోలీసులు. సోదరుడిని చంపేస్తామంటూ బాధితురాలిని కొందరు బెదిరించారని..ఈ వ్యవహారంలో శబరి రాజన్, సతీష్, నాగరాజ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా కీలక నిందితుడు తిరువునక్కరసును నిన్న తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. అయితే నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఈ గ్యాంగ్‌పై తొలిసారి స్పందించారు. అధికార పార్టీ అండ ఉండటంతో ఈ ముఠా చెలరేగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో మహిళలకు, యువతులకు రక్షణ లేకుండా పోయిందని డీఎంకె ఛీప్ ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. కీలక నిందితులను ఏఐడీఎంకె పార్టీ వెనకేసుకొస్తోందని ధ్వజమెత్తారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధితురాలికి రక్షణ కల్పించాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. అటు దీనిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. సీబీసీఐడీ దర్యాప్తును డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఏఐడీఎంకే స్పందించింది. బార్ నాగరాజును పార్టీలోని అన్ని పదవులనుంచి తొలగిస్తున్నట్టు అన్నాడీఎంకే అధిష్ఠానం సోమవారం ప్రకటించింది. కాగా కేవలం నలుగురు మాత్రమే నిందితులుగా ఉన్నారనీ, నాలుగు వీడియోలు మాత్రమే లభించాయని జిల్లా ఎస్పీ తాజాగా ప్రకటించారు. నిందితులపై గూండా యాక్ట్ ప్రయోగించినట్టు చెప్పారు. -
లొకేషన్ చేంజ్
కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోనే షూటింగ్ చేస్తున్న మహేశ్‌బాబు నెక్ట్స్ షెడ్యూల్‌కు లొకేషన్ చేంజ్ చేయనున్నారట. ఆ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయిక. అశ్వనీ దత్, ‘దిల్’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్ షెడ్యూల్ ఆదివారం ముగిసిందని సమాచారం. సుమారు 2 కోట్ల వ్యయంతో రూపొందించిన విలేజ్ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. నెక్ట్స్ ‘మహర్షి’ టీమ్ పొల్లాచికి షిఫ్ట్ అవ్వనున్నారట. ఈ నెలాఖరి నుంచి పొల్లాచి షెడ్యూల్ స్టార్ట్ కానుంది. మహేశ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణమంతా అందులో పాల్గొంటారట. ఈ చిత్రంలో మహేశ్ స్నేహితుడిగా ‘అల్లరి’ నరేశ్ కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది. పూర్తి స్థాయి ప్రొడ్యూసర్‌గా? ఇన్ని రోజులు కేవలం తాను నటించిన సినిమా నిర్మాణంలో భాగమయ్యారు మహేశ్‌బాబు. తాజాగా నిర్మాణ రంగంలోనూ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలనుకుంటున్నారట. అందులో భాగంగానే వెబ్ సిరీస్‌లు, చిన్న బడ్జెట్ సినిమాలను నిర్మించాలనుకుంటున్నారట మహేశ్. దానికి సంబంధించిన చర్చలను కూడా జరుపుతున్నట్టు సమాచారం. కొత్త టాలెంట్, సరికొత్త ఐడియాలను ప్రేక్షకులకు అందించాలని భావిస్తున్నారట. జనవరి నుంచి మహేశ్ నిర్మించే వెబ్ సిరీస్ స్టార్ట్ కానుందని టాక్. ఆల్రెడీ థియేటర్స్ బిజినెస్‌లోకి మహేశ్ ఇటీవలే అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. -
కూతురు వేరే కులం వాడితో పారిపోయిందని..
కోయంబత్తూర్ : కూతురు తక్కువ కులం వాడితో పారిపోయిందని మనస్తాపం చెంది తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కోయంబత్తూర్ జిల్లలో పొల్లాచికి చెందిన ఓ వృద్ధ జంటకు ఏకైక కుమార్తె(24) కలదు. ఆమె తన కాలేజీలో ఓ అబ్బాయిని ప్రేమించింది. అతను వారి వర్గానికి చెందిన వ్యక్తి కాకపోవడంతో అతన్ని మరిపోవాలని తల్లిదండ్రులు ఆమెను బెదిరించారు. అయినప్పకి ఆమె అతనితో సంబంధాన్ని కొనసాగించింది. విషయంతో తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను మరోసారి బెదిరించారు. దీంతొ ఆమె ఆ ప్రేమించిన యువకుడితో పారిపోయింది. ఒక్కగానుఒక్క కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపం చెందారు. పరువు పోతుందని భావించి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తమ బంధువులకు ఫోన్ చేసి చెప్పి ఇద్దరు పురుగుల మందు తాగారు. బంధువులు ఇంటికి వచ్చి చూసే సరికి అపస్మారక స్థితిలో పడిఉన్నారు. వారిని వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి వారు మృతి చెందారని తెలిపారు. దీంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా ఈ విషయం వారి కూతురుకు తెలియలేదు. ఆమె ఫోన్ స్విచ్ఆప్ వస్తుందని బంధువులు తెలిపారు. -
పొల్లాచ్చి పోదాం
లండన్ నుంచి పొల్లాచ్చికి షిఫ్ట్ అయ్యారు సూర్య. లండన్‌లో ఆపేసిన ఆపరేషన్‌ను పొల్లాచ్చిలో తిరిగి స్టార్ట్ చేయనున్నారట. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. మోహన్‌లాల్, ఆర్య కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో సాయేషా కథానాయిక. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లండన్‌లో స్టార్ట్ అయింది. లేటెస్ట్ షెడ్యూల్‌ను పొల్లాచ్చిలో జరపనున్నారు. ఈ షెడ్యూల్లో సూర్యతో పాటు మిగతా చిత్రబృందం కూడా పాల్గొననున్నారు. -
పొల్లాచ్చిలో పాటల సందడి
అరవింద సమేతంగా పొల్లాచ్చి వెళ్లిపోనున్నారట రాఘవ. ఎందుకు? క్లైమెట్ ఆహ్లాదకరంగా ఉందని డ్యూయెట్ పాడుకోడానికా? అంటే అవును అని సమాధానమిస్తోంది చిత్రబృందం. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. పూజా హెగ్డే కథానాయిక. హారికా హాసినీ క్రియేషన్స్‌పై యస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కేవలం ఆడిపాడటమే కాదట ఎన్టీఆర్, పూజా హెగ్డేపై కొన్ని కీలక సన్నివేశాలను కూడా పొల్లాచ్చిలో చిత్రీకరించనున్నారు దర్శకుడు త్రివిక్రమ్. పొల్లాచ్చి షెడ్యూల్ తర్వాత ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 12న రిలీజ్ కానుంది. -
పొల్లాచ్చిలో ఎన్టీఆర్ ఆటా పాటా
జై లవ కుశ సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ జూన్ 18 నుంచి పొల్లాచ్చిలో ప్లాన్ చేశారు చిత్రయూనిట్. ఈ షెడ్యూల్లో హీరో హీరోయిన్లతో పాటు కీలక నటీనటులు పాల్గొననున్నారు. మూడు వారాల పాటు జరగనున్న ఈ షెడ్యూల్లో ఒక పాటతో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే మరో భారీ షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధకృష్ణ నిర్మిస్తున్నారు. -
పొల్లాచ్చిలో ‘సై రా’ సెకండ్ షెడ్యూల్
ఖైదీ నంబర్ 150తో ఘన విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రంగా సై రా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా తనయుడు రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. డిసెంబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించిన చిత్రయూనిట్, ప్రస్తుతం షూటింగ్ కు గ్యాప్ ఇచ్చింది. ఇది సమయంలో మెగాస్టార్ కొత్త లుక్ లో కనిపించటం, సినిమా యూనిట్ నుంచి పలువురు సాంకేతిక నిపుణులు తప్పుకున్నారంటూ వార్తలు రావటంతో సై రా ఆగిపోయిందా అన్న అనుమానాలు కూడా కలిగాయి. అయితే ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ సై రా టీం నెక్ట్స్ షెడ్యూల్ ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఫిబ్రవరి రెండో వారంలో సై రా రెండో షెడ్యూల్ షూటింగ్ పొల్లాచ్చిలో ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్ లో నయనతార కూడా పాల్గొననుందన్న టాక్ వినిపిస్తోంది. -
ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం
చెన్నై: కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చిలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి జరిగిన ఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. పొల్లాచ్చిలోని లూథరన్ చర్చి ఆవరణలో ఉన్న హాస్టల్ లోకి ప్రవేశించిన ఇద్దరు గుర్తు తెలియని యువకులు ఇద్దరు బాలికలను అపహరించి అత్యాచారానికి ఒడగట్టారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆ యువకులు వారు ఉంటున్న హాస్టల్లోకి ప్రవేశించి తలుపు తట్టారు. దీంతో ఓ విద్యార్థిని తలుపు తీయగా, దాహం వేస్తోందంటూ ఓ యువకుడు చెప్పడంతో ఆ బాలిక వారికి నీళ్లు తెచ్చేందుకు వెళ్లింది. ఈక్రమంలోనే అక్కడకు ప్రవేశించిన మరో యువకుడు నిద్రిస్తున్న ఇద్దరు విద్యార్థినులను తమ భుజాన వేసుకుని ఓ పాడుబడ్డ భవనంలో తీసుకువెళ్లారు. అనంతరం వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. హాస్టల్ వద్ద జరిపిన విచారణలో చర్చ్‌కు సంబంధించిన ఆ హాస్టల్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడం, అక్కడ విద్యార్థినుల భద్రతకు కనీసం వార్డెన్ కూడా లేకపోవడం గమనార్హం. ఈ ఘటనను ముఖ్యమంత్రి జయలలిత తీవ్రంగా పరిగణించారు. సాయంత్రం మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఘటన వివరాలను సేకరించారు. బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని పేర్కొంటూ, మూడు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియూ ప్రకటించారు. -
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. నలుగురు మృతి
-
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు:నలుగురు మృతి
తమిళనాడు:రాష్ట్రంలోని పొలాచ్చి సమీపంలో అంగలాకురిచీ బాణాసంచా ఫ్యాక్టరీలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా, 10 మందికి పైగా గాయాలైయ్యయి. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. బాణాసంచా ఫ్యాక్టరీలో ఉన్న గ్యాస్ స్టౌ నుంచి నిప్పురవ్వలు చెలరేగి మందుగుండ సామాగ్రిలో పడటంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ పేలుడుకు ఆ భవనం పూర్తిగా ధ్వంసమైంది. నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అసలు ఆ ఫ్యాక్టరీకి లైసెన్సు కలిగియుందా?లేదా అనే కోణంలో విచారణ చేపట్టారు. -
కుటుంబాన్ని ఒక్కటి చేసే విజేత!
కృష్ణంవంశీ సినిమాల్లో కుటుంబ సన్నివేశాలంటే... సందడి సందడిగా ఉంటాయి. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రానిది కూడా కుటుంబ నేపథ్యమే. ఈ సినిమా షూటింగ్ కేరళలోని పొల్లాచ్చిలో జరుగుతోంది. చరణ్, కాజల్, శ్రీకాంత్, కమలినీముఖర్జీలపై కథకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు కృష్ణవంశీ. ఈ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, పచ్చదనాన్ని పట్టుచీరలా చుట్టుకున్న పొల్లాచ్చి లొకేషన్ అందాలు ఈ కథకు ఆభరణంగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ నెల 26 వరకూ అక్కడే జరిగే ఈ షెడ్యూల్లో... కీలక సన్నివేశాలతో పాటు ఒక పాట కూడా చిత్రీకరించనున్నారు. ఇప్పటివరకూ యాక్షన్ కథాంశాలతో మెరిపించిన చరణ్... ఈ సినిమాలో ‘దూరాలు మనుషులకే కానీ... మనసులకు కాదు’ అని కుటుంబానికి తెలియజెబుతూ... తెగిన బంధాలను ఒక్కటి చేసే విజేతగా కనిపిస్తారని సమాచారం. ఈ నెలాఖరులో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నారు నిర్మాత బండ్ల గణేష్. కథకు తగ్గ టైటిల్‌ను త్వరలోనే ఖరారు చేయనున్నారు.