చెన్నై : దేశవ్యాప్తంగా కలకలం రేపిన పొలాచ్చి లైంగిక వేధింపుల కేసులో సీబీఐ సోమవారం మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ అయిన నిందితుడు మణిని మే 20 వరకూ జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో తమిళనాడు పోలీసులు ఇప్పటివరకూ నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 12న నలుగురు వ్యక్తులు పొలాచ్చికి సమీపంలోని కారులో మహిళను లైంగిక వేధింపులకు గురిచేసి ఆ దృశ్యాలను వీడియోలో రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఫిబ్రవరి 24న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల బాగోతం బయటపడింది.
అనంతరం ఓ ఏఐఏడీఎంకే నేత బాధితురాలి సోదరుడిపై దాడి చేసిన క్రమంలో సదరు నేతను ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరించడంతో ఈ ఉదంతం రాజకీయ రంగు పులుముకుంది. నిందితులను కాపాడేందుకు ఏఐఏడీఎంకే ప్రయత్నిస్తోందని విపక్ష డీఎంకే ఆరోపించింది. కాగా తమిళనాడులో పొలాచ్చి గ్యాంగ్ అకృత్యాలు వెలుగులోకి రావడంతో తమిళనాడులో పెద్దసంఖ్యలో యువతులు, మహిళలను ఈ బృందం లైంగిక వేధింపులకు గురిచేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పొలాచ్చి లైంగిక వేధింపుల కేసు విచారణను ఏప్రిల్‌లో సీబీఐ చేపట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment