
నాని
‘నిన్ను కోరి’ వంటి సక్సెస్‌ఫుల్ సినిమా తర్వాత మరోసారి కలిశారు హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘టక్ జగదీష్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పొల్లాచిలో నేడు ప్రారంభం కానుంది. సినిమాలోని కీలక సన్నివేశాలను, పాటలను ఈ షెడ్యూల్‌లో ప్లాన్ చేశారట చిత్రబృందం. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment