పొల్లాచ్చికి పోదాం అంటున్నారట హీరో వెంకటేశ్. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సిని మాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
ఓ మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, అతని మాజీ ప్రేయసి... ఇలా మూడు పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ్రపారంభమైంది. అయితే హీరో వెంకటేశ్ పాల్గొనని సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. కాగా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల రెండో వారంలో పొల్లాచ్చిలో ్రపారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో వెంకటేశ్‌తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ కూడా పాల్గొంటారట. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment