‘‘నా లైఫ్‌లోనున్న ఆ ప్రేమ పేజీ తీయనా... పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా..’ అంటూ మొదలవుతుంది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘మీనూ...’ పాట. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఇందులో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేశ్ భార్యగా ఐశ్వర్యా రాజేశ్, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటించారు. ఈ ట్రయాంగిల్ క్రైమ్ కామెడీ సినిమాను ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు.
ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘మీనూ...’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘చిరు చిరు జల్లుల్లో పెదవులు తడిశాయే... తడిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిశాయే... ఉరుముల చప్పుడులో ఉరకలు మొదలాయే...’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ వహించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను ప్రణవీ ఆచార్యతో కలిసి ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాడారు.
Comments
Please login to add a commentAdd a comment