
హీరో వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ యూనిట్ నుంచి శుభాకాంక్షలు చెబుతూ రెండో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..' అనే పాట బాగా పాపులర్ అయింది. సోషల్‌మీడియాలో భారీగా రీల్స్ రూపంలో వైరల్ కూడా అవుతుంది. ఇప్పుడు మీను.. అంటూ సాగే పాట నుంచి ప్రోమో రిలీజ్ అయింది. పూర్తి సాంగ్ త్వరలో విడుదల కానుంది.
వెంకటేష్ తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో ఈ చిత్రంలో నటిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌తో సంక్రాంతి రేసులో ఉన్న ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment