
ఎన్టీఆర్
అరవింద సమేతంగా పొల్లాచ్చి వెళ్లిపోనున్నారట రాఘవ. ఎందుకు? క్లైమెట్ ఆహ్లాదకరంగా ఉందని డ్యూయెట్ పాడుకోడానికా? అంటే అవును అని సమాధానమిస్తోంది చిత్రబృందం. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. పూజా హెగ్డే కథానాయిక.
హారికా హాసినీ క్రియేషన్స్‌పై యస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కేవలం ఆడిపాడటమే కాదట ఎన్టీఆర్, పూజా హెగ్డేపై కొన్ని కీలక సన్నివేశాలను కూడా పొల్లాచ్చిలో చిత్రీకరించనున్నారు దర్శకుడు త్రివిక్రమ్. పొల్లాచ్చి షెడ్యూల్ తర్వాత ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 12న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment