
భారీ అంచనాల నడుమ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం అరవింద సమేత. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అరవింద సమేతకు లీకుల బాధలు ఎక్కువయ్యాయి. అయినా సరే చిత్ర బృందం మాత్రం షూటింగ్‌ను నిర్విరామంగా షూటింగ్‌ను చేస్తోంది. ఆగస్టు 15కు టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అదే నిజం కానుంది. ఆగస్టు 15 ఉదయం 9 గంటలకు టీజర్ రిలీజ్ చేయనున్నామని ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో.. రాజసం ఉట్టిపడేలా ఉన్న ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా పూజాహెగ్డే నటిస్తోన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment