బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు:నలుగురు మృతి | Four killed in explosion in cracker manufacturing unit | Sakshi
Sakshi News home page

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు:నలుగురు మృతి

Published Thu, May 29 2014 2:29 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM

Four killed in explosion in cracker manufacturing unit

తమిళనాడు:రాష్ట్రంలోని పొలాచ్చి సమీపంలో అంగలాకురిచీ బాణాసంచా ఫ్యాక్టరీలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా, 10 మందికి పైగా గాయాలైయ్యయి. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. బాణాసంచా ఫ్యాక్టరీలో ఉన్న గ్యాస్ స్టౌ నుంచి నిప్పురవ్వలు చెలరేగి మందుగుండ సామాగ్రిలో పడటంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ పేలుడుకు ఆ భవనం పూర్తిగా ధ్వంసమైంది. 

 

నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అసలు ఆ ఫ్యాక్టరీకి లైసెన్సు కలిగియుందా?లేదా అనే కోణంలో విచారణ చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement