ఎమోషనల్‌ కానిస్టేబుల్‌ | Varun Sandesh constable movie opening | Sakshi
Sakshi News home page

ఎమోషనల్‌ కానిస్టేబుల్‌

Published Thu, Jun 1 2023 1:14 AM | Last Updated on Thu, Jun 1 2023 1:14 AM

Varun Sandesh constable movie opening - Sakshi

వరుణ్‌ సందేశ్‌ హీరోగా ‘ది కానిస్టేబుల్‌’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ఆర్యన్‌ సుభాన్‌ దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్‌ పతాకంపై ‘బలగం’ జగదీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహూర్తపు సన్నివేశానికి బి. నిఖితా జగదీష్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా బీజే  రిథిక క్లాప్‌ కొట్టారు.

వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో ఎమోషనల్‌ కానిస్టేబుల్‌గా నటిస్తున్నాను. దర్శకుడు చెప్పిన కథ, కథనం నాకు బాగా నచ్చాయి’’ అన్నారు. ‘‘సస్పెన్స్, క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు ఆర్యన్‌ సుభాన్, ‘బలగం’ జగదీష్‌. దువ్వాసి మోహన్, సూర్య, కల్పలత తదితరులు పధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : సుభాష్‌ ఆనంద్, కెమెరా: హజరత్‌ షేక్‌ (వలి).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement